సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 772వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎంతో పెద్ద ఉపద్రవం నుండి మా కుటుంబాన్ని కాపాడిన సాయినాథుడు
  2. మా అబ్బాయిపై బాబా దయ


ఎంతో పెద్ద ఉపద్రవం నుండి మా కుటుంబాన్ని కాపాడిన సాయినాథుడు


హైదరాబాదు నుండి సాయిభక్తుడు కుమార్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు కుమార్. నా వయసు 40 సంవత్సరాలు. నేను హైదరాబాదులో ఉంటాను. మా తల్లిదండ్రులు మా స్వగ్రామంలో మా సొంత ఇంటిలో వుంటారు. ఆ ఇల్లు 2000 సంవత్సరంలో కట్టించినది. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటికి సంబంధించిన కొన్ని పనులను (ప్రహరీ గోడ కట్టకుండా, బయటి గోడలు ప్లాస్టరింగ్ చేయకుండా) పూర్తి చేయకుండా అలాగే వదిలివేశాము. 2021, ఏప్రిల్ నెలలో ఆ ఇంటికి సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేయించడానికి కట్టుబడి పనిచేసే మేస్త్రీని పిలిపించాము. ఆయన వచ్చి చూసి, పని పూర్తిచేయడానికి ఒప్పుకుని, మరుసటిరోజు పనివాళ్ళని పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు ఐదుగురు పనివాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఒకతను దగ్గరుండి మిగిలిన వాళ్ళందరిచేత పని చేయించడం మొదలుపెట్టాడు. అతను ఆ మిగిలిన పనివాళ్ళందరికీ మేస్త్రీలాగా వున్నాడు. ఉదయం 9 గంటలకు పని ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు పని మొత్తం పూర్తిచేశారు. సామాన్లన్నీ సర్దుకొని ఇంక వాళ్ళందరూ బయలుదేరడానికి సిద్ధంగా వున్నారు. ఇంతలో ఆ మేస్త్రీ మా నాన్న దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని ఇంట్లోనుంచి అలా బయటికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతూ మాట్లాడుతూనే స్పృహతప్పి క్రింద పడిపోయాడు. మిగిలిన పనివాళ్ళందరూ అతని మీద నీళ్ళు చల్లి లేపడానికి ప్రయత్నించినా అతను లేవలేదు. వెంటనే వాళ్ళందరూ అతనిని ఆటోలో పడుకోబెట్టి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. జరిగినదంతా చూసి, ‘అతనికేమవుతుందో, మా మీదకి ఏమైనా వస్తుందేమో’ అని మా నాన్నగారు మరియు మా ఇంట్లోవాళ్ళందరం చాలా భయపడిపోయాము. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి మనల్ని కాపాడే దైవం మన సాయినాథుడే కాబట్టి, వెంటనే మేమందరమూ బాబా పటం ముందు నిలబడి బాబాకు నమస్కరించుకొని, అతనికి ఎటువంటి ఆపదా రాకుండా అతనికి మంచి జరిగేలా చూడమని ప్రార్థించాము. ఆరోజు రాత్రంతా భయపడుతూనే నేను, మా ఇంట్లోవాళ్ళందరం సాయినాథుని స్మరించుకుంటూ గడిపాము. ఆ మరుసటి ఉదయాన్నే అతను చనిపోయాడనే వార్త తెలిసింది మాకు. ఇలా జరిగినందుకు అందరం ఎంతో బాధపడ్డాము. తరువాత ఆ చనిపోయిన అతని మామగారు మా ఇంటికి వచ్చి, “ఏదైనా మీకు తోచినంత సహాయం చేయండి” అని అడిగారు. మా నాన్నగారు అతనికి కొంత డబ్బు ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బు తీసుకుని ఇంక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాబా మా కుటుంబాన్ని ఎంతో పెద్ద ఉపద్రవం నుండి కాపాడారు. ‘వాళ్ళు వచ్చి ఎంతో గొడవచేస్తారు, మా పరువు పోతుంది’ అని మేమంతా ఎంతో భయపడ్డాము. కానీ ఆ సాయినాథుని దయవలన మేము ఇచ్చినంత డబ్బు తీసుకొని వాళ్లు ఏ గొడవా చేయకుండా వెళ్ళిపోయారు. “బాబా! మీకు వేవేల ధన్యవాదాలు. అనుక్షణం మమ్మల్నందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము బాబా. ధన్యవాదాలు ప్రభూ, సాయినాథా!”


మా అబ్బాయిపై బాబా దయ


సాయిభక్తురాలు శ్రీమతి అనురాధ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. నేను చిన్నతనంనుండి బాబా భక్తురాలిని. బాధైనా, సంతోషమైనా ముందుగా నాకు గుర్తుకువచ్చేది బాబానే. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇదివరకు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.


మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. తను డిజేబుల్డ్ పర్సన్. చిన్నప్పటినుంచి తన విషయంలో పాకడం, నడవడం వంటి ముఖ్యమైనవన్నీ ఆలస్యం అయ్యాయి. నాకు ఎప్పుడూ తన గురించే బెంగ. అయితే నేను ఎప్పుడూ బాబానే నమ్ముకున్నాను. ఆయన దయవలన బాబు నడవడం, నెమ్మదిగా స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాడు. మేము తనని ప్రత్యేకమైన స్కూల్లో జాయిన్ చేశాము. మన సాయితండ్రి దయవలన తన చదువు సక్రమంగా సాగుతూ వచ్చింది. 2019లో తను ఎవరి సహాయం లేకుండా సొంతంగా అన్ని పరీక్షలు వ్రాసి పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. 2020లో కరోనా కారణంగా ఇంటర్ చదవలేదు. తను ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాస్తాడు. హఠాత్తుగా 2021, ఏప్రిల్ రెండవ వారం చివరిలో తనకి జ్వరం వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నాకు చాలా భయం వేసింది. దయామయుడైన సాయితండ్రిని ప్రార్థించి ఆయన ఊదీని నీళ్లలో వేసి, ఆ తీర్థాన్ని బాబు చేత త్రాగించాను. తరువాత, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా అనుగ్రహించండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాన"ని ప్రార్థించి, భారమంతా బాబా మీద వేశాను. మనస్ఫూర్తిగా వేడుకుంటే బాబా నెరవేర్చనిదంటూ ఉండదు కదా! బాబా ఆశీస్సులతో బాబుకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మా కుటుంబంపై, ఇంకా మీ బిడ్డలందరిపై ఉండాలి. ఈ కరోనా మహమ్మారిని తరిమివేసి మాకు ప్రశాంతతను చేకూర్చండి బాబా".


9 comments:

  1. Today's leelas are very simple nice.sai blesses very one.today lock down starts.please bless all your devotees.please remove virus from the world.you have that power. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. సాయి రామ్ మాకు 7 to 11 office ఉంటుంది, office కి వెళ్ళాలి అంటే నా parents కి భయం గా ఉంది, ఎలాగైనా మీరే మాకు లీవ్స్ వచ్చేలా చేయండి.pls sai it's request Sai

    ReplyDelete
  5. Kothakonda SrinivasMay 12, 2021 at 10:15 AM

    ఓం సాయిరాం

    ReplyDelete
  6. Jaisairam

    Salary hike ippinchadi. Na anubavam ni blog lo post cheatanu.

    Jai sairam

    ReplyDelete
  7. Om sai ram baba me daya valla amma ki negative report vachindhi meku shathakoti vandanalu thandri thank u so much thandri alage urine problem kuda solve cheyandi baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo