- నాన్న ప్రాణాలు కాపాడిన బాబా
- నిజంగా బాబా ఉన్నారు, మనల్ని కాపాడుతున్నారు
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు వీరేంద్ర చౌదరి. నా జీవితంలో బాబా ఇచ్చిన రెండు మిరాకిల్స్ గురించి ఈరోజు మీతో చెప్పబోతున్నాను. నేను బి.టెక్ పూర్తిచేశాను. మా నాన్నగారు విరిగిన ఎముకలకు వైద్యం చేస్తారు. 3 తరాల నుండి మా కుటుంబంలోని వారు ఈ వైద్యం చేస్తున్నారు. నా చదువు పూర్తయ్యాక నేను మా నాన్న దగ్గర ఆ వైద్యం నేర్చుకున్నాను. కానీ మా అన్నయ్య నన్ను ఆ వృత్తిలోకి రానివ్వకుండా మోసం చేసి బయటికి పంపించేశాడు. తరువాత మా నాన్న నాకోసం మినపగుండ్లు మిల్లు కట్టించారు. ఆ పని జరుగుతుండగా మా నాన్నకి చాలా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అది రియాక్షన్ ఇచ్చింది. డాక్టర్లు మా నాన్న పరిస్థితి చూసి తను మాకు దక్కరని చెప్పారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా నాన్నను కాపాడు. నా జీవితానికి ఒక మార్గం చూపించు బాబా” అని ఎంతో ఆర్తిగా వేడుకున్నాను. తరువాత డాక్టర్లు, “మా ప్రయత్నం మేము చేస్తాము” అని చెప్పి నాన్నకు ఆపరేషన్ చేశారు. బాబా దయవల్ల ఆపరేషన్ విజయవంతమై మా నాన్న మాకు దక్కారు. నాన్నని కాపాడినందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నాన్నకి ఆపరేషన్ జరిగిన అనంతరం నేను నా దగ్గరున్న బాబా ఊదీ, ఫోటోలను మా నాన్న పడుకున్న మంచం మీద పెట్టాను. దాదాపు 5 రోజుల వరకు బాబా ఫోటో అక్కడే ఉన్న తర్వాత ఒకరోజు ఆ ఫోటో కనిపించలేదు. నేను మొత్తం వెతికాను, కానీ దొరకలేదు. బాబా ఫోటో పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఆరోజు ఉగాది పండుగ. నేను మనసులోనే, “బాబా! ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు? మీరు ఉన్నారని ధైర్యంగా ఉన్నాను. మీరు ఇప్పుడు నన్ను ఇలా ఏడిపించొద్దు. నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. ఈరోజు సాయంత్రం లోపు వేరే రూపంలో అయినా మీరు నా దగ్గరకు మళ్ళీ రండి” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. తరువాత నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఆ సాయంత్రం హాస్పిటల్‌కి వచ్చేసరికి పోయిందనుకున్న నా బాబా ఫోటో మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయింది. బాబా ఫోటో చూసి నేను చాలా సంతోషించాను. నా ప్రార్థన మన్నించి మళ్ళీ నా దగ్గరకు వచ్చినందుకు మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నిజంగా బాబా ఉన్నారు, మనల్ని కాపాడుతున్నారు
ఓం రాజాధిరాజాయ విద్మహే
తత్పురుషాయ ధీమహి
తన్నో సాయి ప్రచోదయాత్
నేను ఒక సాయి భక్తురాలిని. 'నిజంగా బాబా ఉన్నారు, మనల్ని కాపాడుతున్నారు' అని చెప్పడానికి నిదర్శనంగా నా ఈ చిన్న అనుభవాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒకసారి మా అబ్బాయివాళ్ళు ఉగాదికి మా ఊరు వచ్చారు. మంగళవారం పండుగ అయిపోగానే బుధవారం వాళ్ళు వాళ్ళ డ్యూటీలకి వెళ్ళిపోతారని నేను ఆదివారంనాడే వాళ్లకోసం మాంసాహారం, దానితో పాటు వాళ్ళకి ఇష్టమైన వంటలు వండాను. పిల్లలంతా సంతోషంగా తిన్నారు. అయితే ఎందుచేతనో తెలియదుగానీ పండుగరోజున హఠాత్తుగా మా చిన్నబ్బాయికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నాకు చాలా భయం వేసింది. రాత్రి రెండు, మూడు గంటలవుతున్నా వాడు నిద్రపోక బాధపడుతుంటే తన పరిస్థితి చూసి నా మనసుకు చాలా బాధగా అనిపించింది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, "బాబు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమ"ని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. భయంభయంగా 'బాబా, బాబా' అనుకుంటూ, 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 108 సార్లు జపించాను. ఇంకా, "మా అబ్బాయికి మళ్ళీ విరోచనాలు గానీ, వాంతులు గానీ కాకూడదు" అని బాబాను వేడుకున్నాను. విచిత్రంగా, అంతవరకు నిద్రపోకుండా బాధపడుతున్న మా అబ్బాయి, బాబాను ప్రార్థించిన తరువాత మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. వాంతులు, విరోచనాలు ఇక లేవు, పూర్తిగా తగ్గిపోయాయి. ఇదంతా బాబా దయ కాకుంటే మరి ఏమిటి? స్మరించినంతనే తన సహాయాన్ని అందించిన బాబాకు కృతజ్ఞతలు. "బాబా! ఎల్లప్పుడూ మమ్మల్ని, మా పిల్లల్ని చల్లగా కాపాడు. నేను మిమ్మల్ని కోరిన కోరికలేమిటో మీకు తెలుసు. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఆ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్లుగా చూడండి. నాకు అన్నీ మీరే బాబా".
Om Sairam
ReplyDelete🙏🙏🙏
ఓం సా౦ుు తండ్రి ఈ రోజు రాసిన అనుభవాలు చాలా బాగా రాసారు.సా౦ుు మనలను రక్షించి కాపాడుతున్న దేవునికి నమస్కారములు చేసుకుని రాసుకుంటే బాగా వుంటుంది. ఓం సా౦ుు బాబా నమస్కారము�� ❤❤❤
ReplyDeleteJi sairam
ReplyDeleteJi sairam
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
720 days
ReplyDeleteSairam
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteఓం సాయిరాం
ReplyDelete