తారాబాయి తన కుటుంబంతో ముంబాయిలోని గిర్గాఁవ్‌లో నివసిస్తుండేది. ఆమె మామయ్య మహాదేవ్ కృష్ణాజీ చావటె బాబాపట్ల భక్తిప్రపత్తులు కలిగి ఉండేవారు, తరచూ బాబాను దర్శిస్తుండేవారు. 1914లో ఒకసారి అతను శిరిడీ వెళ్ళినప్పుడు తారాబాయిని తనతోపాటు తీసుకొని వెళ్లారు.
ఆమె తన స్మృతుల గురించి ఇలా చెప్పారు: "బాబా ద్వారకామాయిలో నివాసముండేవారు, వేపచెట్టు క్రింద కూర్చునేవారు. ఆయన చిలిమ్ త్రాగేవారు. బాబా భగవంతుడని, తినడానికి ఏది కావాలంటే అది ఖచ్చితంగా నాకు ఇస్తారని నాకు తెలుసు. అందువలన నేను పేడాల కోసం తరచూ బాబా దగ్గరకు వెళ్లి ఆయనతో ఆడుకునేదాన్ని. బాబా నన్ను "బేటా, ఇలా రా!" అని పిలిచి పేడాలు ఇచ్చేవారు. అందుకు బదులుగా నేను వారికి బంతిపూలు ఇచ్చేదాన్ని. వారికి పూలంటే చాలా ఇష్టం. అందులోనూ బంతిపూలంటే మరీ ఇష్టం. ఆయన వేపచెట్టు దగ్గర పెద్ద తోట నిండుగా బంతిపూల మొక్కలు పెంచుతుండేవారు. బాబా 'తమ గురువు సమాధి' అని చూపించిన సమాధిని నేను చూశాను. ఒకరోజు ఆ సమాధి దగ్గర సమృద్ధిగా పెరుగుతున్న బంతి మొక్కల నుండి కొన్ని బంతిపూలు కోయడానికి నేను దొంగచాటుగా వెళ్ళాను. బాబా అది గమనించి, "బేటా, గురువు సమాధి దగ్గరకు వెళ్లవద్దు" అని అన్నారు. బాబా నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపడానికి కారణం నాకు అప్పుడు అర్థం కాలేదు. 'ఆ రోజుల్లో సమాధి దగ్గర ఒక దీపం వెలుగుతుండేది. నేను అప్పట్లో ఒకరకమైన దుస్తులు వేసుకునేదాన్ని. అవి ఎక్కడ ఆ దీపానికి తగిలి అంటుకుంటాయో అని అక్కడికి వెళ్లేందుకు, అక్కడ ఆడుకునేందుకు బాబా నన్ను ఆక్షేపించేవార'ని నేను తరువాత అర్థం చేసుకున్నాను. సమాధి దగ్గరలో ఒక మట్టిదిబ్బ ఉండేది. సాధారణంగా గ్రామాలలో పక్కపొలానికి సరిహద్దుగా కనిపించేటటువంటిది అది. బాబా దానిమీద కూర్చుని చిలిం త్రాగుతుండేవారు. వివాహమైన తర్వాత నేను నా భర్త, అతని కుటుంబంతో కలిసి మరోసారి శిరిడీ సందర్శించాను".
Source:బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalani kshamam ga chusukondi vaallani anni vidaala kshamam ga chusukondi vaalla badyata meede tandri, anta prashantam ga unde la chudandi e roju pls tandri. Meere kada andariki tandri andari badyata meede.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi manchivarini manchivarini rent ki pampandi
ReplyDelete