- పసిపాపడై పాలు త్రాగి రోగం నయం చేసిన బాబా
- సమస్య ఏదైనా బాబా దయ ఉంటే చాలు
పసిపాపడై పాలు త్రాగి రోగం నయం చేసిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
“బాబా! నీకు నా సాష్టాంగ నమస్కారాలు. నేను నీ పాదపూజ చేసుకునే ఒక భక్తురాలిని. నాకు నువ్వు ఎన్నో అనుభవాలు (నిదర్శనాలు) ప్రసాదించావు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు నా సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను”.
నా మేనకోడలికి ఇటీవల కరోనా సోకింది. కరోనా సోకడం వలన పాత జబ్బులన్నీ పైకి వస్తాయని అందరూ అన్నారు. అదే నా మేనకోడలి విషయంలో జరిగింది. తను సంవత్సరం క్రితం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతోంది. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా తనకు అర్థరాత్రి సమయంలో గుండె దడదడలాడటం, ఛాతీలో నొప్పి రావడం వల్ల తను కంటినిండా నిద్ర కూడా పోయేది కాదు. తన పరిస్థితి చూసి నేను చాలా బాధపడేదాన్ని. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గటానికి డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నప్పటికీ తనకు ఏమాత్రం ఉపశమనం కలగడంలేదు. తన ట్రీట్‌మెట్ కోసం 1,50,000 రూపాయల వరకు డబ్బు ఖర్చయింది. తన బాధ చూడలేక నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీ అనుగ్రహంతో నా మేనకోడలికి నొప్పి తగ్గిపోయి గుండెదడ రాకుండా ఉంటే నేను నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఇక బాబా నా మేనకోడలిని ఎలా అనుగ్రహించారో చూడండి.
ఒకరోజు రాత్రి బాబా నా మేనకోడలికి స్వప్నదర్శనం ఇచ్చారు. ఆ స్వప్నంలో బాబా ఒక ముసలితాతగా నా మేనకోడలి ఇంటికి వచ్చి, తనకు పాలు ఇమ్మని అడిగారట. అది అర్థరాత్రి అవడం వలన ఇంట్లో పాలు లేవు. అందువల్ల నా మేనకోడలు, “మా ఇంట్లో పాలు లేవు. నేను ఎలా ఇవ్వగలను?” అని బదులిచ్చింది. అందుకు బాబా, “నీ దగ్గర పాలు ఉన్నాయి కదా!” అని అంటూ తానొక చంటిపిల్లవానిలా మారి నా మేనకోడలి రొమ్ము నుండి పాలు త్రాగారు. అద్భుతం! ఆ తరువాత నుండి నా మేనకోడలు ఏనాడూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడలేదు. తన రొమ్ము నుండి పాలను త్రాగి తన జబ్బును బాబా పూర్తిగా తగ్గించేశారు. “బాబా! నా మేనకోడలి ఆరోగ్యం విషయంలో మేము చాలా బాధను అనుభవించాము. నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు. చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ! ఇలానే మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు బాబా! మాకు నీ పాదాల దగ్గర చోటు ఇవ్వు స్వామీ! నీకు శతకోటి వందనాలు సాయీ!"
నీ భక్తురాలు..
సమస్య ఏదైనా బాబా దయ ఉంటే చాలు
ఓం సాయిరాం! శ్రీ సాయినాథ చరణం శరణం. బాబా పాదపద్మాలకు నా శతకోటి నమస్కారాలు. నేను బాబా బిడ్డను. బాబా ఎన్నో విషయాలలో నన్ను కాపాడారు. ఎన్నో కోరికలు తీర్చారు. నా విషయంలో జరిగిన రెండు అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాకు ఒక్కటే అమ్మాయి. బాబా దయవల్ల మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. మేము చాలా సంతోషించాము. అబ్బాయివాళ్ళింట్లో వయసుమళ్ళిన పెద్దమ్మ ఉన్నారు. పెళ్ళికి మూడు నెలల ముందు ఆవిడకి ఆరోగ్యం బాగలేక చాలా సీరియస్ అయింది. అప్పటికే పెళ్ళి తేదీ నిశ్చయించాము, పెళ్ళిమంటపం కూడా బుక్ చేసుకున్నాము. ఈ సమయంలో ఆవిడకి సీరియస్ కావడంతో మేము చాలా ఆందోళనపడ్డాము. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్ళి చక్కగా జరిగేలా అనుగ్రహించమని మేము బాబాను వేడుకున్నాము. బాబా దయవల్ల అన్ని సమస్యలు పరిష్కారమై, మా అమ్మాయి పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
మరో అనుభవం:
ఇటీవల నాకు, మావారికి, మా అత్తమ్మగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మేమంతా చాలా భయపడ్డాము. మెరుగైన చికిత్స కోసం అందరం హాస్పిటల్లో చేరాము. మేము హాస్పిటల్లో చేరినరోజు బుధవారం. నేను మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరే మమ్మల్ని కాపాడాలి. మీ అనుగ్రహంతో మేమంతా ఆరోగ్యంగా ఉండి, వచ్చే గురువారానికల్లా మా ఇంట్లో ఉండాలి బాబా!” అని వేడుకున్నాను. బాబా దయవల్ల మా అందరి ఆరోగ్యం మెరుగుపడటంతో సరిగ్గా బుధవారం రాత్రి మమ్మల్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. “తండ్రీ! మీరే మాకు రక్ష. మా భారం, బాధ్యత మీదే తండ్రీ! తెలిసిగానీ, తెలియకగానీ ఏమైనా తప్పు చేస్తే ఈ బిడ్డను శిక్షించకుండా క్షమించి రక్షించు తండ్రీ!”
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఓం సాయి రామ్ దయ చూపించండి
ReplyDeleteJai sairam
ReplyDeleteSai thandri maku manchi arogyani prasadinchandi thandri saiiiiii please
ReplyDeleteSai ram be with us
ReplyDeleteOm Sai ram
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏