సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 591వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. చాలా సహాయం చేసిన బాబా
  2. బాబా లీలలు అలానే ఉంటాయి

చాలా సహాయం చేసిన బాబా

ముందుగా ఈ బ్లాగులోని బాబా లీలలను చదువుతున్న తోటి సాయిభక్తులకు నా ధన్యవాదాలు. నా పేరు శ్రీకాంత్. మాది ఒంగోలు దగ్గర కొప్పోలు గ్రామం. 2020, అక్టోబరు 6వ తేదీన మా నాన్నకి తీవ్రమైన తలనొప్పితో పాటు లో-ఫీవర్ కూడా వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో తనకు కరోనా సోకిందేమోనని చాలా భయపడ్డాము. అప్పటికప్పుడు నాన్నని మా ఊరిలో ఉన్న ఆర్.ఎం.పి. డాక్టరుకి చూపించాము. ఆయన నాన్నని పరీక్షించి, “కాలికి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, అందువల్లనే ఇలా జ్వరం వస్తోంది” అన్నారు. మా నాన్నని అడిగితే, “ఆ గాయం ఎప్పుడో తగిలింది, అది చిన్నదే అనుకున్నాను” అన్నారు. అలా చిన్నది అనుకున్న గాయం వల్లనే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. ఇంక నేను ఆరోజు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, “ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, ఇంకా కొన్నిరోజులు ఆలస్యమైతే కాలు అంతవరకు తీసేయాల్సి వచ్చేది” అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. సర్జరీ చేసే సమయానికి నాన్నకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై, ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవటం ప్రారంభమైంది. “ఈ పరిస్థితిలో ఇక్కడ సర్జరీ చేయటం చాలా కష్టం. పెద్ద హాస్పిటల్స్లో ఎక్కువ మిషనరీ ఉంటుంది, మీ నాన్నని అక్కడికి తీసుకువెళ్ళండి” అన్నారు డాక్టర్లు. అందువల్ల అప్పటికప్పుడు నాన్నని కిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అక్కడ అన్ని పరీక్షలు చేసి సర్జరీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడా అదే సమస్య పునరావృతమైంది. అందువల్ల తప్పనిసరై కాలు వరకు మత్తు ఇచ్చి చిన్న సర్జరీ చేశారు. కానీ అప్పటికే ఇన్ఫెక్షన్ రక్తంలో కలిసిపోయి ఊపిరితిత్తులకి చేరింది. Co2 డైవర్ట్ అయింది. దానిని క్లియర్ చేద్దామని ఆక్సిజన్తో ప్రయత్నించినా అది బైటికి రాలేదు. అప్పుడు రెండవ ప్రయత్నంగా వెంటిలేటర్ మాస్కుతో ఎక్కువగా ఆక్సిజన్ పెట్టారు. ఒక రోజంతా గడిచినా Co2 క్లియర్ అవలేదు. ఇంక చివరి ప్రయత్నంగా నాన్నని నేరుగా వెంటిలేటర్ మీదకి పంపించారు. మా నాన్న కాస్త బరువు ఎక్కువగా ఉంటారు. అందువల్ల డాక్టర్లు నాన్న కోలుకోవటం కష్టమని చెప్పారు. ఇంక నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీరు ఏమి చేస్తారో ఏమో నాకు తెలియదు. నాన్న కోలుకోవాలి” అని ఆర్తిగా బాబాను వేడుకుని, బాబా నామజపం చేస్తూ ఉన్నాను. మరుసటిరోజు ఉదయానికి వెంటిలేటర్ పైన ఉన్నప్పటికీ నాన్న కళ్ళు తెరచి చూసి అందరినీ గుర్తుపట్టసాగారు. అది చూసి బాబా మిరాకిల్ చేస్తున్నారని అనుకున్నాము. అయినప్పటికీ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంది. “ఏంటి బాబా, ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా? మీ అనుగ్రహంతో నాన్న కోలుకోవాలి” అని బాబాకు చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్నప్పటినుంచి ఇన్ఫెక్షన్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇంక 12వ తేదీ రాత్రి నాన్నకి సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేశారు. డాక్టర్లు మా నాన్న కోలుకోవటం కష్టమని చెప్పేసరికి 24వ తేదీన జరుపుకోవాలనుకున్న మా క్రొత్త ఇంటి గుణార్ధన(శంకుస్థాపన)ను ఆరోజు రాత్రే జరుపుకున్నాము. ఆ సమయంలో కోరుకోగానే వర్షాన్ని ఆపి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా భూమిపూజ చక్కగా జరిగేలా బాబా అనుగ్రహించారుఆ మరుసటిరోజు నాన్నకు పెట్టిన వెంటిలేటర్ తీసేసినప్పటికీ సులభంగానే ఊపిరితుత్తులకు ఆక్సిజన్ సరఫరా అవటం ప్రారంభమైంది. డాక్టర్ కూడా, “చాలా పెద్ద మిరాకిల్ జరిగింది, మేమైతే ఆయన బయటపడతారని అనుకోలేదు. నిజంగా మీ దేవుడు మీకు చాలా సహాయం చేశారు” అన్నారు. నిజమే! నేను ప్రతిరోజూ నాన్నకి బాబా ఊదీ పెట్టి వస్తున్నాను. తన ఊదీ మహిమతో సర్జరీ విజయవంతమయ్యేలా చేసి బాబా మా నాన్న ఆరోగ్యాన్ని కాపాడారు. “మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”.


బాబా లీలలు అలానే ఉంటాయి

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు ఛత్రపతి. ఒక గురువారంరోజు మా నాన్న హడావిడిగా ఇంటికి వచ్చి, తన ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన దస్తావేజుల కోసం వెతకసాగారు. నాన్న అంత హడావిడిగా వెతకడం చూసి నేను, మా చెల్లి కూడా వాటికోసం తలోవైపు వెతకసాగాము. నేను ‘ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః’ అనే నామాన్ని జపిస్తూ వెతుకుతున్నాను. ఎంత వెతికినా ఆ దస్తావేజులు కనిపించట్లేదు. “ఏంటి బాబా, మీ నామం జపిస్తూ వెతుకుతున్నా దస్తావేజులు దొరకటం లేదు? నాకు చాలా భయంగా ఉంది బాబా” అని బాబాకు చెప్పుకుని ఆ రాత్రికి నిద్రపోయాను. ఆ మరుసటిరోజు బాబాకు నమస్కరించి, ఊదీ పెట్టుకొని, “బాబా! దస్తావేజులు దొరికితే మీకు నైవేద్యం సమర్పించుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకుని వెతకటం ప్రారంభించాను. వెంటనే దస్తావేజులు దొరికాయి. ఎక్కడైతే ముందురోజంతా వెతికినా దొరకలేదో ఆ స్థలంలోనే ఇప్పుడు దస్తావేజులు దొరికాయి. ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా లీలలు అలానే ఉంటాయి. బాబాను నమ్మండి, అంతే! ఇక మీ రక్షణ, శిక్షణ, పాలన, దండన అన్నీ ఆయనే చూసుకుంటారు. మన సాధనలో తప్పు ఉండవచ్చు, కానీ ఆయన అనుగ్రహంలో తప్పు ఉండదు. కాబట్టి ఏదైనా పనులలో జాప్యం జరిగినా, మ్రొక్కుకున్నది అవకపోయినా నిరాశ వద్దు, సాయియే మనకు ముద్దు.



9 comments:

  1. Nenu ippudhu konchem nirasha ga unnanu. Meeku jarigina anubavam chusaka relief ga undhi.om sai ram🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹🌹

    ReplyDelete
  2. ఓం సాయిరామ్!

    ReplyDelete
  3. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  4. Om sai ram baba mamalini karunichu thandri

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo