- బాబా ఉండగా భయం లేదు
- బిడ్డల కోరికను మరవక నెరవేర్చే సాయితండ్రి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి శతకోటి ప్రణామములు. తోటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనములు. మా అబ్బాయి యు.ఎస్.ఏ లో ఉంటున్నాడు. తను ఇటీవల కొంతకాలంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ ప్రక్రియ ముందుకి సాగలేదు. అప్పుడు మేము ఆ విషయమై బాబాను ప్రార్థించాము. తరువాత మా అబ్బాయి మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు. వెంటనే, బాబా ఆజ్ఞగా ఆ పని మొదలైంది. బాబా ఉండగా మనకి భయం లేదు. ఇక అంతా బాబానే చూసుకుంటారు. భారమంతా ఆయనదే. తొందర్లోనే బాబా సాక్షిగా మా అబ్బాయికి గ్రీన్ కార్డు వస్తుందని మేమంతా ఆశిస్తున్నాము. “బాబా! ఇక బాధ్యతంతా మీదే. మీ కృపకోసం ప్రేక్షకులమై నిరీక్షిస్తాము తండ్రీ!”
ఇంకో అనుభవం:
మా మేనకోడలి కాపురంలో కలతలు ఏర్పడి మనశ్శాంతి కరువైంది. ఆ విషయమై మేము బాబాని అడిగితే, "మీరు ఏమీ ఆలోచనలు పెట్టుకోవద్దు" అని ఆయన సందేశమిచ్చారు. అప్పుడు మేము, "వాళ్ళకి పిల్లలున్నారు. అదే మా భయం. కానీ ఇక భయం లేదు బాబా. తొందరలోనే అతని మనసు మార్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించండి బాబా. వాళ్ళు ఆనందంగా ఉంటే అందరమూ సంతోషంగా ఉంటాము" అని బాబాను వేడుకున్నాము. తరువాత మా మేనకోడలు ప్రతిరోజూ బాబా ఊదీని ‘టీ’లో వేసి తన భర్తకు ఇవ్వడం మొదలుపెట్టింది. బాబా దయవల్ల అతని మనసు కొంచెం కొంచెంగా స్థిమితపడసాగింది. 2020, అక్టోబరు రెండవవారం మొదలవుతూనే మా మేనకోడలు ఫోన్ చేసి, తన భర్తకి మంచి ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పింది. మా అందరికీ కూడా ఆనందంగా అనిపించింది.
"బాబా! మీ మీద భారం వేశాము. ఇక మాకు బాధలేదు. ఈ విషయాలన్నీ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. మా కోరికలను వెంటనే నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాబా. మా కుటుంబ బాధ్యత అంతా మీదే తండ్రీ. దయతో మాకు ఏది మంచిదనిపిస్తే అది చేసి మా కుటుంబమంతా ఆనందంగా ఉండేలా చేయండి బాబా! తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసినా, తెలియక ఎవరినైనా బాధపెట్టినా, మనసులో ఏవైనా చెడ్డ ఆలోచనలు వచ్చినా మా తండ్రిగా క్షమించండి బాబా. మీ నీడలో మేము హాయిగా మీ నామజపం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ!"
మీ పాద సేవకురాలు.
బిడ్డల కోరికను మరవక నెరవేర్చే సాయితండ్రి
సాయిభక్తురాలు ప్రసన్న తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పుట్టినరోజు దగ్గర పడుతుండగా ఒకరోజు నేను వెంకటదత్తసాయికి (బాబా) నమస్కరించుకుని, “బాబా! ఈసారి నా పుట్టినరోజుని ఏదైనా పుణ్యక్షేత్రంలో జరుపుకోవాలని ఉంది. నా కోరిక తీర్చండి బాబా” అని కోరుకొన్నాను. తరువాత ఆ విషయం గురించి నేను మరచిపోయాను. కానీ బాబా గుర్తు పెట్టుకున్నారు. మా కుంటుబమంతా తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవాలని చాలా రోజులుగా వేచి ఉంది. అనుకోకుండా సరిగ్గా నా పుట్టినరోజున మాకు శ్రీవారి దర్శనం టికెట్లు లభించాయి. నా పుట్టినరోజునాడు బాబా నన్ను తిరుమల పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి శ్రీవారి దర్శనాన్ని అనుగ్రహించారు. నా సాయిగోవిందుని దయవల్ల నా కోరిక నెరవేరింది. నాకు చాలా అనందం కలిగింది. “నా కోరిక గుర్తుంచుకుని మరీ తీర్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”. అంతేకాకుండా, ఆ మరుసటిరోజు నాకు కలలో సాయిగోవిందుని దర్శనం కూడా కలిగింది. “ఇలానే ఎల్లప్పుడూ మా వెంట ఉండి మా అందర్నీ కాపాడండి బాబా!” నాపై బాబా చూపే ప్రేమను నా సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పించిన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ వారికి నా ధన్యవాదాలు. సాయిగోవిందుడు నాకు ప్రసాదించిన మరిన్ని ఆశీస్సులను (అనుభవాలను) త్వరలోనే మీతో పంచుకుంటాను.
రాజాధిరాజ యోగిరాజ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!
baba please control my bad thougths.please bless my family
ReplyDeleteHi sai
DeleteDo satcharitra or saileelamrutam parayana regularly and see the result in 2 months. If any doubt you may mail me.
Jai sairam
ReplyDeleteOm Sai ram
ReplyDeleteరాజాధిరాజ యోగిరాజ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
547 sairam
ReplyDeleteBaba please reduce my karmas. Please bless my family
ReplyDeleteBaba mamalini kapadu thandri
ReplyDeleteOm srisairam
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏