- నిజంగా బాబా మాతో ఉన్నారు, తమ ఉనికిని మాకు చూపించారు
- క్షణాల్లోనే అనుగ్రహాన్ని చూపిన బాబా
నిజంగా బాబా మాతో ఉన్నారు, తమ ఉనికిని మాకు చూపించారు
హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు సుధారాణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! బాబా మాకు చిన్నవి, పెద్దవి ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. చాలాకాలం క్రితం మేము ఎన్నో అద్భుతాల ద్వారా బాబా ఆశీస్సులను పొందాము. వాటిలో ఒక అనుభవాన్ని ఇదివరకు నేను మీతో పంచుకున్నాను. ఇటీవల నా పని ఒకటి పూర్తయితే ఆ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. బాబా అనుగ్రహించిన ఆ అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. "ఓం సాయిరామ్! దయచేసి సదా మా జీవితమంతా ఆశీర్వదించండి బాబా!"
మా కుటుంబంలో నేను, మావారు, మా అమ్మాయి మొత్తం ముగ్గురు సభ్యులం. వాస్తవానికి మేము మహారాష్ట్రీయులం. నా భర్త ఉద్యోగరీత్యా బదిలీ మీద ముంబాయి నుండి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చాము. ఇటీవల మా అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకుంది. అయితే ప్రస్తుత చిరునామాకు సంబంధించి ఏ గుర్తింపు కార్డులు మాకు లేవు. ఆధార్, పాస్‌పోర్ట్ మొదలైన అన్ని ఐడెంటిటీ కార్డులు మహారాష్ట్రకి చెందినవే. అద్దె ఇంటిలో ఉన్నందువలన విద్యుత్తు బిల్లు కూడా మా పేరు మీద లేదు. ఏమి చేయాలో అర్థం కాకపోయినప్పటికీ విద్యుత్తు బిల్లు ఆధారంగా ఇంటి యజమాని చిరునామాతో ముందైతే లెర్నర్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశాము. కానీ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు శాశ్వత లైసెన్స్‌కు వెళ్ళేటపుడు మాత్రం ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అది కూడా స్థానిక చిరునామాతో ఉండటం తప్పనిసరి అని చెప్పారు. దాంతో మేము ఆధార్ అప్‌గ్రేడ్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌లో చిరునామా మార్పు చేయించాము. వారం రోజులు గడిచిన తరువాత కూడా మాకు UDAI (ప్రభుత్వ ఆధార్) వెబ్‌సైట్ నుండి ఎటువంటి సందేశమూ రాలేదు. అప్పుడు నేను ఆధార్ అప్‌గ్రేడ్ కేంద్రానికి వెళ్లి, "మాకు ఏ సందేశమూ రాలేదు. ఏమి జరిగింది?" అని విచారించాను. అప్పుడు వాళ్ళు వెబ్‌సైట్ చెక్ చేసి, ఏవో కొన్ని సమస్యల కారణంగా ఆధార్ అప్‌గ్రేడ్ కాలేదని, మళ్ళీ వచ్చి అప్‌గ్రేడ్ చేయించుకోమన్నారు. దాంతో నేను, మా అమ్మాయి మళ్ళీ వెళ్లి అన్ని వివరాలూ ఇచ్చి అప్‌లోడ్ చేయించాము. తరువాత కూడా రోజులు గడుస్తున్నా మాకెంటువంటి సందేశమూ రాలేదు. అందువలన మేము చాలా ఆందోళనచెందాము. కారణం, ఆధార్ కార్డు చూపించకుండా మేము పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవేవీ చేయించుకోలేము. నేను నిరంతరం బాబా స్మరణ చేస్తూ ఏదో ఒక మార్గం చూపించమని బాబాని ప్రార్థించసాగాను. ఒక ఉదయం బాబా ఆశీస్సులతో వారి ప్రేరణ వల్ల నాకు 'UDAI హెల్ప్‌లైన్ నెంబరుకి కాల్ చేయాల'న్న ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు 'మీ ఆధార్ ప్రాసెస్‌లో ఉంది. ప్రాసెస్ పూర్తి కావడానికి కనీసం 90 రోజుల సమయం పడుతుంద'ని చెప్పారు. నేను ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాను. ఇక చేసేదిలేక సమస్యను బాబాకే వదిలివేశాము. అయితే బాబా అద్భుతం చేశారు. 10 రోజుల తరువాత మా ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా మాకు చేరింది. అది చూసి మేము ఆశ్చర్యపోయాము. బాబా ఆశీర్వాదంగా భావించి మేము చాలా సంతోషించాము.
రెండవ అనుభవం:
ఆధార్ కార్డు రావడంతో మా అమ్మాయి ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్సుతోపాటు పాన్ కార్డుకి కూడా దరఖాస్తు చేశాము. బాబా కృపవలన పాన్ కార్డు కేవలం 10 రోజుల్లో వచ్చింది. తరువాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మా అమ్మాయి కార్ డ్రైవింగ్ పరీక్షకు హాజరైంది. బాబా దయవల్ల తను తన పరీక్ష విజయవంతంగా పూర్తిచేసింది. తరువాత తను RTO విండో కౌంటర్ వద్దకు వెళ్లి ఆ పరీక్షకు సంబంధించిన రశీదు తీసుకుని వచ్చి, "నేను పాస్ అయ్యాను" అని సంతోషంగా రశీదు నాకు చూపించింది. మరుక్షణంలో ఆఫీసు ప్రాంగణంలోకి వస్తున్న ఒక కారుపై ఉన్న బాబా ఫోటోను మా అమ్మాయి నాకు చూపించింది. నిజంగా బాబా మాతో ఉన్నారు. ఆయన తన ఉనికిని మాకు చూపించారు. నేను చాలా సంతోషించాను. మా అమ్మాయి కూడా చాలా సంతోషించింది. బాబా మా అమ్మాయికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రవేశం కూడా కల్పించారు. తనని ఎప్పుడూ ఇదేవిధంగా ఆశీర్వదించాలని బాబాను కోరుకుంటున్నాను.
చివరిగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. వారు బాబా ఆశీస్సులు పొందినవారు. బాబా ఈవిధమైన భాగ్యాన్ని వారికి ప్రసాదించారు. ఖచ్చితంగా వాళ్ళకి, వాళ్ల కుటుంబానికి బాబా ఆశీస్సులు లభిస్తాయి. నా అనుభవాన్ని ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. "ఓం సాయిరామ్! కోటి కోటి ధన్యవాదాలు బాబా! నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా మీరు నాకు ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. మీ ఆశీస్సులతో రాబోయే మరో ఫలితం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అది మీ చేతిలో ఉంది బాబా. దయచేసి మీ అనుగ్రహాన్ని కురిపించండి బాబా".
క్షణాల్లోనే అనుగ్రహాన్ని చూపిన బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
విజయవంతంగా నడుస్తున్న ఈ బ్లాగ్ వెనుకనున్న నిర్వాహకులకు నా ప్రణామాలు. నా అనుభవానికి వస్తే.. మా అబ్బాయి బెంగళూరులోని ఒక ఎమ్.ఎన్.సి సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా కంపెనీవాళ్ళు ఇంటినుండి పనిచేసే అవకాశం కల్పించడంతో మార్చి నెల నుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నాడు. కానీ కంపెనీ నియమాలు చాలా కఠినమైనవి, పని విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి. మా అబ్బాయి కూడా అంతే నిబద్ధతగలవాడు. తను రోజూ ఎక్కువ గంటలు పనిచేస్తుండేవాడు. అయితే ఈమధ్యకాలంలో తన సిస్టమ్ వలన, ఇంటర్నెట్ వలన తరచూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో తన సమయం వృథా అవడమేకాక, పని పూర్తయ్యేది కాదు. ఒకరోజు నేను బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి, "బాబా! బాబుకి ఎదురవుతున్న సమస్యను పరిష్కరించండి. ఇంకెటువంటి సమస్యలు లేకుండా తను తన రోజువారీ ఆఫీసు పని పూర్తి చేసుకునేలా అనుగ్రహించండి. అలా జరిగితే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అభ్యర్థించాను. అలా ప్రార్థించిన కొన్ని క్షణాల్లోనే సమస్యంతా దానంతటదే సెట్ అయ్యింది. మా అబ్బాయి తన పని సజావుగా చేసుకోగలిగాడు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
సాయిరామ్!
Jai sairam
ReplyDeleteసాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
560 days
ReplyDeletesairam
Om sai ram please bless my son _in-law today is his birthday
ReplyDeleteOm sai ram kapadu sai thandri
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏