సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - శ్రీవామన్ నామ్‌దేవ్ ఆస్తేకర్


శ్రీవామన్ నామ్‌దేవ్ ఆస్తేకర్ 1906 మార్చి 1న మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోల్నేర్ గ్రామంలో జన్మించాడు. 1917లో తనకి 11 సంవత్సరాల వయస్సున్నప్పుడు చాలామంది భక్తులతో కలిసి మొదటిసారి శిరిడీ దర్శనానికి వెళ్ళాడు. వాళ్ళు పవిత్రమైన మకరసంక్రాంతినాడు సాయంకాల సమయంలో శిరిడీ చేరుకున్నారు. ఆ సమయంలో బాబా ధుని ముందు కూర్చొని ఉన్నారు. ఆస్తేకర్‌ను బాబా తమకు దగ్గరగా కూర్చుండబెట్టుకొని ఆశీర్వదించారు. తరువాత అతనిని భగవంతునిపై కీర్తనలు చేయమని ఆదేశించారు. అందుకతను, "బాబా! నాకు కీర్తనలు ఎలా చేయాలో తెలియదు" అని అన్నాడు. అప్పుడు బాబా, "భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు ఆందోళన చెందవద్దు" అని అన్నారు. అప్పుడు ఆస్తేకర్ తన తలకు తలపాగా కట్టుకొని పాడటం మొదలుపెట్టాడు. అతను విఠలునిపై తుకారాం భక్తి, ధ్యానాల గురించి వ్రాసిన అభంగాలను కీర్తనలు చేశాడు. అతని గానానికి ముగ్ధులై జనం భారీసంఖ్యలో అక్కడ గుమిగూడి భక్తిపారవశ్యంతో అతని కీర్తనలను విన్నారు.

1918 అక్టోబరులో నగరాల్లో ప్లేగు త్వరితగతిన వ్యాప్తి చెందుతుండటం వలన ఆస్తేకర్ తన స్వగ్రామమైన అకోల్నేర్‌కు వెళ్ళాడు. ఆ గ్రామస్థులలో చాలామంది దసరా పండుగరోజున ఆచారాన్ననుసరించి సీమోల్లంఘనానికి సంకేతంగా ముందుగా ఖండోబా ఆలయాన్ని సందర్శించి, తరువాత  గ్రామంలోని ఇతర దేవతలను పూజించడానికి వెళ్ళారు. ఆస్తేకర్ కూడా వాళ్లతో వెళ్లాడు గానీ, ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయం మెట్లపైనే కూర్చున్నాడు. తరువాత అతను అక్కడినుండి తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని నడవటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా బాబా అతని ముందు నిలబడ్డారు. అతన్ని ఆపడానికి అన్నట్లు తమ చేతులు ప్రక్కకు చాచి, ‘సాయిబాబా’ అని అరుస్తూ అదృశ్యమయ్యారు. అతనికేమీ అర్థం కాలేదు. అదేసమయంలో బాబా మహాసమాధి చెందినట్లు అతనికి ఆ మరునాడు తెలిసింది.

1924లో ఆస్తేకర్‌కు కొర్హాలాలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. 1925లో శిరిడీలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని పదవి ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో అతన్ని నియమించారు. 1929 వరకు అతడు శిరిడీలో పనిచేస్తూ శ్రీసాయి సన్నిధిలో ఆనందంగా గడిపాడు. ఒకసారి ఆస్తేకర్ ఇలా చెప్పాడు: "బాబా ఎన్నోసార్లు నాకు దర్శనమిచ్చి భరోసా ఇచ్చారు, మార్గనిర్దేశం చేశారు. నేను ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞుడనై ఉంటాను".

సమాప్తం 

Source: సాయిప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1987. డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

5 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏.

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai

    ReplyDelete
  3. om sai ram please save us.sai sai bless us

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. Om Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉❤🙏😊
    Bless me with job
    Bless me with healthy baby

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo