ఈ భాగంలో అనుభవాలు:
- సాయి సందేశం ఎప్పుడూ వృధాపోదు
- పుట్టినరోజునాడు బాబా తీర్చిన చిన్న కోరిక
సాయి సందేశం ఎప్పుడూ వృధాపోదు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాధారణ సాయిభక్తురాలిని. నేను ప్రతిరోజూ బాబా నామం జపిస్తూ ఉంటాను. బాబా నాకెన్నో అద్భుతాలు చూపించారు. బాబా గురించి నాకు నా చిన్నప్పటినుంచి మా నాన్నగారి ద్వారా తెలుసు. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మా నాన్నగారు నాకు, నా సోదరికి చెరొక ఇంటిని బహుమతిగా ఇచ్చారు. నాన్న చనిపోయిన తరువాత వాటికి సంబంధించిన పేపర్లను మా ఇద్దరికీ ఇచ్చారు. నేను వాటిని మా ఇంటిలోని అటకపై ఉంచాను. రెండు నెలల క్రితం వాటిని చూసి నా సోదరికి ఫోన్ చేసి, "ఇల్లు అమ్మడానికి ఆ కాగితాలు సరిపోతాయా?" అని చర్చించాను. తరువాత కొన్నిరోజులకి ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆ ఇంటిని కొనడానికి ఆసక్తి కనబరిచారు. నేను మా అమ్మ సలహా తీసుకుని అమ్మడానికి నిశ్చయించుకున్నాను. వెంటనే నేను అటకమీద పేపర్ల కోసం వెతికాను. అక్కడే చివరిసారిగా పేపర్లు చూసినట్లు నాకు బాగా గుర్తుంది. కానీ అక్కడ ఆ పేపర్లు కనపడలేదు. సాధారణంగా నేను సర్టిఫికెట్లు వంటి ముఖ్యమైన పత్రాలను ఉంచే ఇతర అల్మారాల్లో కూడా వెతికాను కానీ ప్రయోజనం లేదు. పరిస్థితి ఇలా ఉంటే, ఇంటిని తీసుకోవాలని ఆశపడుతున్న అతను ఋణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆ పేపర్ల జిరాక్స్ ఇవ్వమని అడిగారు. సాయి తప్పకుండా నాకు సహాయం చేస్తారన్న నమ్ముకమున్న నేను ఒక వారం సమయం అడిగాను.
గురువారం హోలీ పండుగరోజు నేను సాయివ్రతాన్ని ప్రారంభించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో ఇంటిపేపర్ల విషయం గురించి బాబాను అడిగాను. 'పోగొట్టుకున్న వస్తువు ఆదివారం దొరుకుతుంద'ని సమాధానం వచ్చింది. దాంతో నేను రెండురోజుల్లో దొరుకుతాయన్న నమ్మకంతో సంతోషంగా ఉన్నాను. కానీ నేను వాటికోసం వెతకడం ఆపలేదు. ఆదివారం గడిచిపోయినప్పటికీ ఆ పేపర్లు నాకు దొరకకపోవడంతో నా మనస్సు స్తంభించిపోయింది. పేపర్ల విషయం కన్నా, సాయి ఎందుకు సహాయం చేయటంలేదని ఆలోచనలో పడ్డాను. 'మీరు ఆదివారం దొరుకుతాయని చెప్పి నాకెలా ద్రోహం చేయగలర'ని ఆయనతో మాట్లాడటం ప్రారంభించాను. ఈలోగా నా భర్త ఏదో ఒక ప్రయత్నం చేసి ఇ-సేవా ద్వారా ఫ్లాట్ పేపర్ల ఫోటోకాపీ సంపాదించారు. అయినా నేను సాయి నన్ను మోసం చేశారని అనుకుంటూ సంతోషంగా ఉండలేకపోయాను. నాకేది కావాలన్నా నేను సాయిబాబాను అడుగుతాను, ఆయన నన్నెప్పుడూ బాధపెట్టలేదు. అలాంటిది ఇప్పుడెందుకిలా జరిగిందని మధనపడుతూ ఉండేదాన్ని.
ఇదిలా ఉంటే పిల్లలు పెరిగి పెద్దవుతున్న కారణంతో వేసవి సెలవుల్లోనే మేము ఉంటున్న ఇంటినుండి పెద్ద ఇంటికి మారాలని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాము. హఠాత్తుగా 2019, మార్చి 30న నా భర్త, "మనం వేరే ఇంటికి మారబోతున్నాం. కాబట్టి సామాన్లు ప్యాక్ చేయడం ప్రారంభించాలి" అని చెప్పారు. ఇక ఆ పనులలో పడ్డాం. నేను ఒక స్టూల్ తీసుకొచ్చి మంచంమీద వేసి అటకపైన సామానులు చూడటం మొదలుపెట్టాను. అక్కడ కొన్ని బ్యాగులున్నాయి. వాటిలో రెండవ బ్యాగును చూస్తున్నప్పుడు కనపడకుండా పోయిన ఇంటిపత్రాలు కనిపించడంతో నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే, నేను ఆ స్థలంలో అదివరకు రెండుసార్లు వెతికాను. అప్పుడా బ్యాగ్‌ను చూడటం ఎలా తప్పిపోయిందో నాకు అర్థం కాలేదు. అయితే ఆరోజు కూడా ఆదివారం అని గుర్తించిన మరుక్షణంలో సాయి 'ఆదివారం పేపర్లు దొరకుతాయి' అని చెప్పింది నాకు గుర్తొచ్చింది. దానినిబట్టి నేను ఆ వెంటనే వచ్చిన ఆదివారం అనుకుని, ఆయన నాకు ద్రోహం చేశారని అన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాను. కానీ ఆయన సందేశమెప్పుడూ వృధాపోదని ఆలస్యంగా అర్థం చేసుకుని బాబాకు మనసారా క్షమాపణలు చెప్పుకున్నాను.
"ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నాకు పాఠం నేర్పి, సమయం వచ్చేవరకు సహనంతో, నమ్మకంతో ఉండాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు బాబా. నన్నెప్పుడూ ఒక తండ్రిలా చూసుకోండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2479.html?m=0

పుట్టినరోజునాడు బాబా తీర్చిన చిన్న కోరిక
USA నుండి సాయిభక్తురాలు శ్రీ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఒకరోజు నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో యథాలాపంగా ఒక ఫోన్ నెంబర్ నమోదు చేశాను. ఫలితం, "రేపు ఉదయం 11 గంటలకు ఏమి జరుగుతుందో చూడు!" అని మెసేజ్ వచ్చింది. నేను 'ఏమై ఉంటుందా?' అని కాస్త ఆలోచించినా, పెద్దగా దానిగురించి పట్టించుకోలేదు. మరుసటిరోజు గురువారం. ఆరోజు నా పుట్టినరోజు. ఆరోజు ఉదయం నేను స్నానం చేసి, ఇంట్లో పూజచేసుకుని బాబా మందిరానికి వెళ్ళాను. మందిరం చేరుకునేసరికి సరిగ్గా 11 గంటలైంది. బాబాను ప్రార్థించిన తరువాత ప్రసాదం తీసుకోవడానికి పూజారి వద్దకు వెళ్ళాను. అతను నాకొక అరటిపండు ఇచ్చాడు. కొన్ని కారణాలవల్ల అరటిపండును ప్రసాదంగా పొందినందుకు నేను చాలా ఆనందించాను. అయితే నా కొడుకుకి ప్రసాదంగా కమలాపండు వచ్చింది. తను కమలాపండును తినడానికి ఇష్టపడక నా చేతిలో ఉన్న అరటిపండు తనకి ఇవ్వమని అడిగాడు. చిన్నపిల్లాడు కదా అని నేను వెంటనే దాన్ని తనకి ఇచ్చేశాను. కానీ మనసులో నాకు అరటిపండు ఉండివుంటే బాగుండేదని అనుకున్నాను. 'సరేలే, కమలాపండు ఉంది కదా!' అని సరిపెట్టుకున్నాను. తరువాత అక్కడున్న ఇతర దేవతల దర్శనం చేసుకుని మందిరం నుండి బయలుదేరబోతుండగా అకస్మాత్తుగా ఒక వృద్ధుడు ప్రసాదం గిన్నె నుండి 3, 4 అరటిపండ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ మావద్దకు వచ్చి నాకు రెండు, నా ఇద్దరి పిల్లలకి చెరొక అరటిపండు ఇచ్చాడు. బాబా నా మనసులోని కోరికను ఇలా తీరుస్తున్నారని నేను చాలా సంతోషించాను. అతనితో, "అరటిపండు కావాలని ఆశపడ్డాను. కానీ నాకు కమలాపండు వచ్చింది" అని చెప్పాను. అతను బాబా విగ్రహాన్ని చూపిస్తూ, "ఊపర్ వాలా"(పైవాడు) అని చెప్పాడు. నేను అతనికి కృతజ్ఞతలు చెప్పి మందిరం నుండి బయలుదేరాను. పుట్టినరోజునాడు నా చిన్న కోరికను బాబా నెరవేర్చారు. బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు.
"థాంక్యూ సో మచ్ బాబా!"
Om sai sri sai Jaya Jaya sai, on sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, on sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete