1. అడుగడుగునా కాపాడుతున్న బాబా
2. సాయిమాత దయ
|
సాయి వచనం:-
|
|
|
1. అడుగడుగునా కాపాడుతున్న బాబా
2. సాయిమాత దయ
సాయి భక్తుడు పురుషోత్తం రఘునాథ్ అవస్థి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనారాయణ్ పురుషోత్తమ్ అలియాస్ నానాసాహెబ్ అవస్థి. ఇతను కూడా బాబాను సశరీరులుగా దర్శించి, వారి అనుగ్రహం పొందిన భాగ్యశాలి. అతను ఇలా చెప్పాడు: “ఎప్పుడైతే ధర్మం నశించి, ప్రజలలో అవినీతి, దురాచారం పెరుగుతుందో అప్పుడు భక్తోద్ధరణార్థం భగవంతుడు భువిపై అవతరిస్తాడు. నాకు కేవలం 4, 5 సంవత్సరాలు మాత్రమే సాయిబాబా ప్రత్యక్ష సాంగత్యంలో ఉండే అవకాశం లభించింది. కానీ ఆ కాలంలో నేను చూసిన, అనుభవించిన దాని ఆధారంగా బాబా గొప్ప అవతారపురుషులని నేను భావిస్తాను. సాయిబాబా జీవిత కార్యాన్ని చూసి, శ్రద్ధగా గమనించినట్లయితే వారు గొప్ప అవతారపురుషులన్న విశ్వాసం ఎవరికైనా కలగక మానదు. ఆ కాలంలో శిరిడీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. తపాలా లేదు, టెలిగ్రాఫ్ కార్యాలయం లేదు, మరేమీ లేదు. అయినప్పటికీ, బాబా నలుమూలల నుండి ప్రజలను ఆ గ్రామానికి ఆకర్షించారు(ఇది ఈనాటికీ నిజమే). ఆయన తప్పుడు మార్గంలో వెళుతున్న అసంఖ్యాక ప్రజలకు సరైన మార్గదర్శనం చేశారు. ఆయన ఎందరినో కష్టాల నుండి విడిపించి, అందరినీ భక్తి మార్గంలోకి మళ్లించడానికి ప్రయత్నించారు. ఆయన అత్యంత దయార్ధహృదయులు. కష్టంలో లేదా దుఃఖంలో ఉన్న ఎవరు తమ దగ్గరకు వచ్చినా, 'అల్లా తేరా భలా కరేగా(అల్లా నీకు మేలు చేస్తాడు)' అని ఆశీర్వదించేవారు, ఆ విధంగానే జరిగేది. భక్తుల హృదయాలలో భక్తి బీజాలు నాటి, వారికి శ్రేయస్సు చేకూర్చడానికి సత్పురుషులు అప్పుడప్పుడు చమత్కారాలు/అద్భుతాలు చేస్తారు. వారు మీ హృదయాలలో ఉన్న విషయాలను మీకు చెప్పి, మిమ్మల్ని భక్తి వైపు మళ్లిస్తారు. మా నాన్న మరియు నా జీవితంలో అలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. అవి మమ్మల్ని ఎన్నో కష్టాల నుండి విముక్తి చేశాయి”. ఇక అతని అనుభవాలు తెలుసుకుందాం.
ఒకసారి నానాసాహెబ్ అవస్థి, అతని తండ్రి పి.ఆర్.అవస్థి కలిసి శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు కోపర్గావ్ వద్ద గోదావరి నది నిండుగా ప్రవహిస్తోంది. కానీ టాంగా నడిపేవాడు రహదారిపై నీరు పెద్దగా ఉండదని భావించి టాంగాను వంతెన మీదుగా నడిపించాడు. టాంగా మధ్యలోకి వెళ్ళగానే టాంగాలో ఉన్నవాళ్ళు, అలాగే వంతెనకు ఇరువైపులా ఉన్న జనం ఆందోళన చెందారు. కానీ ఎలాగోలా వాళ్ళు ఆ ప్రవాహం నుండి బయటపడ్డారు. అందరూ ఆశ్చర్యపోయారు. నానాసాహెబ్ అవస్థికి, అతని తండ్రికి బాబా కృప అభినందనీయం అనిపించింది.
1916లో నానాసాహెబ్ అవస్థి పని మీద బొంబాయి వెళ్లినప్పుడు అతని తండ్రి పి.ఆర్.అవస్థి తమ స్నేహితుడు శ్రీబాలాసాహెబ్ రేగే ఇంటికి వెళ్లి అతన్ని, అతని కుటుంబాన్ని కలిసి రమ్మని చెప్పాడు. అందువల్ల నానాసాహెబ్ అవస్థి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతనికి రేగే తండ్రి ద్వారా బాలాసాహెబ్(రేగే) రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బాబా దర్శనార్థం శిరీడీ వెళ్లి, ఒక వారమైన రాలేదని తెలిసింది. ఆ కారణంగా కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ అతన్ని శిరిడీ వెళ్లి, బాలాసాహెబ్‌ని ప్రత్యేక్షంగా చూసి, తిరిగి తీసుకొని రమ్మని కోరారు. నిజానికి అతనికి కూడా శిరిడీ వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉంది. అందువల్ల వారి అభ్యర్థనను మన్నించి అతను సంతోషంగా శిరిడీ వెళ్ళడానికి అంగీకరించాడు. అతను బయలుదేరే ముందు, బాబా తమ అలవాటు ప్రకారం దక్షిణ అడుగుతారని, అందుకుగానూ ఆయన పేరున అతని జేబులో 10 రూపాయలు పెట్టుకొని రాత్రి రైలు ఎక్కి మరుసటిరోజు శిరిడీ చేరుకున్నాడు. తర్వాత అతను బాబా దర్శనం కోసం మసీదుకు బయలుదేరినప్పుడు, బాబా దర్శనానికి వెళ్తున్న కాకాసాహెబ్ దీక్షిత్ కలిశాడు. ఆయన మాటల ద్వారా బాబా అనుమతి లభించడంతో ముందురోజు రాత్రి రైలులో బాలాసాహెబ్ రేగే బొంబాయి వెళ్లారని అతనికి తెలిసింది. ఇంకా కాకాసాహెబు దీక్షిత్ అతనితో, "బాబా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నిన్న మీరు వస్తారని నాతో చెప్పార"ని అన్నారు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి మశీదుకి వెళ్ళారు. అతను భక్తిశ్రద్ధలతో బాబా చరణకమలాలపై తన తల ఉంచి వారికి ప్రణామాలర్పించాడు. బాబా అతన్ని చూసి నవ్వారు. అప్పుడు ఆరతి మొదలైంది. అది పూర్తైన తర్వాత బాబా అవస్థిని దక్షిణ అడిగారు. అతను సంతోషంగా ఇచ్చాడు. తర్వాత కూడా బాబా అతన్ని దక్షిణ అడుగుతూ ఉండటంలో ఒకటి, రెండు రోజుల్లో అతని దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. ఆ సాయంత్రం బాబా అతన్ని మళ్ళీ దక్షిణ అడిగారు. ఆసారి అతను కొన్ని నాణేలు తీసుకెళ్లి ఉన్నందున అవి మాత్రమే అతని వద్ద మిగిలి ఉన్నాయి. కానీ వాటిని బాబా తీసుకోరని భావించిన అతను, "మీకివ్వడానికి రూపాయలు నా వద్ద లేవు" అని అన్నాడు. అప్పుడు బాబా, "ఆరే! నీ జేబులో చూడు. సరిగా వెతుకు?" అని అన్నారు. అతను జేబులో చేయి పెట్టి నాణేలు తీసి లెక్కిస్తే, సరిగ్గా 10 రూపాయలు ఉన్నాయి. వాటిని అతను బాబా చేతికిస్తే, ఆయన నవ్వుతూ వాటిని తీసుకుని తమ జేబులో వేసుకొని పదేపదే "అల్లా నీకు మేలు చేస్తాడు" అని అన్నారు. ఆ తర్వాత అతను బొంబాయి తిరిగి వెళ్ళడానికి బయలుదేరి బాబా అనుమతి, ఆశీర్వాదాలకోసం వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ అతన్ని 10 రూపాయలు అడిగారు. అతను తన దగ్గర లేవన్నాడు. బాబా, "సరే, బొంబాయి వెళ్ళాక 10 రూపాయలు పంపించు" అని అతన్ని ఆశీర్వదించారు. నిజంగానే బొంబాయిలో ఉన్న అతని పెట్టెలో సరిగ్గా 10 రూపాయలు ఉన్నాయి. అతను, 'వాటి సంగతి బాబాకి ఎలా తెలుసు? ఏదేమైనా, వారి శక్తి వారికే ఎరుక' అని అనుకున్నాడు. తర్వాత అతను తన వద్ద డబ్బులు లేవు కాబట్టి, ఎవరినీ అడగకుండా నడిచి కోపర్గావ్ వెళ్లాలని తలచాడు. అతన్ని శ్రీకాకాసాహెబ్ దీక్షిత్, "డబ్బులు కావాలా?" అని అడిగాడు. కానీ అతను "చూద్దాం" అని సందిగ్ధంగా బదులిచ్చి ఊరుకున్నాడు. ఇంతలో అతనికి టాంగా శబ్దం వినిపించింది. అందులో వచ్చిన గృహస్థుడు అతనికి పరిచయస్తుడే. అతన్ని విచారించగా అతను పూణే నుండి బొంబాయి వెళ్తూ దారిలో బాబా దర్శనార్థం శిరిడీ వచ్చినట్లు తెలిసింది. అప్పుడు అవస్థి ఈ అనుకోని కలయికను ఏర్పాటు చేసింది తప్పకుండా సమర్థులే అని భావించి అతనితో పాటు బొంబాయి వెళ్లి, బాబా అడిగిన 10 రూపాయలు వారికి మనీ ఆర్డర్ చేసాడు.
తరువాయి భాగం వచ్చేవారం..
1. ఇతరుల శ్రేయస్సు కోరుకున్న సద్భావన ఫలితంగా వెంటనే అనుగ్రహాన్ని వర్షించిన సాయి
2. సాయి కృప
1. కాలినొప్పి నుండి ఉపశనం ప్రసాదించిన బాబా
2. సాయి దివ్యపూజలో చివరి గురువారంనాడు బాబా అనుగ్రహం
1916లో ఒకరోజు అవస్థి పూణేలోని తన ఇంట్లో పూజ పూర్తిచేసిన తర్వాత ఆ గదంతా గులాబీల పరిమళంతో నిండిపోయింది. అకస్మాత్తుగా ఆ పరిమళం ఎలా వచ్చిందో అతనికి అంతు చిక్కలేదు. అతను తన ఇంటి చుట్టూరా పరిశీలించినప్పటికీ అందుకు కారణం తెలుసుకోలేకపోయాడు. ఆ పరిమళం దాదాపు ఒక గంటసేపు అలాగే ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత రాధాకృష్ణమాయి కన్నుమూసినట్లు అతనికి శిరిడీ నుండి ఒక లేఖ వచ్చింది. తరచి చూస్తే, ఆయీ మరణించినరోజు, తన ఇంటి పూజగదిని గులాబీల పరిమళం ఆవరించినరోజు ఒకటేనని స్పష్టమైంది. కొన్ని నెలల తరువాత 1917లో అవస్తే తన భార్యతో కలిసి శిరిడీ సందర్శించాడు. ముందుగా అతను బాబా దర్శనం చేసుకొని, తరువాత వారి ఆదేశం మేరకు ఎప్పటిలాగే రాధాకృష్ణమాయి నివాసముండిన కుటీరంలో బసచేశాడు. అతని భార్య బాబా కోసం నైవేద్యం తయారుచేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే, బొగ్గులు తడిగా ఉన్నందున ఆమె ఎంత ప్రయత్నించినా అవి రాజుకోలేదు. అంతలో, ఆమె చూస్తుండగానే అకస్మాత్తుగా రాధాకృష్ణమాయి వచ్చి బొగ్గులపొయ్యిని వెలిగించడమే కాకుండా బాబాకు నైవేద్యం తయారుచేయడంలో ఆమెకు సహాయం చేసి వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం అవస్తే భార్య తమతోపాటు భోజనం చేయడానికి రాధాకృష్ణమాయి వస్తుందని ఎదురుచూసినప్పటికీ ఆయీ రాలేదు. బహుశా ఆమె ఏదైనా పనిలో నిమగ్నమై ఉండవచ్చని భావించిన అవస్తే భార్య ఆయీ కోసం వెతికింది. కానీ ఆయీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఆమె పొరుగువారిని విచారించగా, ఆయీ 1916లోనే మరణించినట్లు తెలిసి ఆమె నిర్ఘాంతపోయింది. నిజానికి ఆ విషయం ఆమెకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు రాధాకృష్ణమాయి ప్రత్యక్షంగా కనిపించేసరికి ఆమె ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయి ఆయీ బ్రతికే ఉందనే భావనలో ఉండిపోయింది.
ఒకసారి రేగే, అవస్థిలు ఒక రథాన్ని బాబాకు సమర్పించుకున్నారు. ఈ విషయం భక్తులెవరికీ తెలియదు. రాత్రికి రాత్రే వాళ్ళు ఆ రథాన్ని తీసుకొచ్చి మసీదులో ఉంచారు. మరుసటిరోజు ఉదయం దాసగణు బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు బాబా తమ సాధారణ ధోరణిలో ఆ రథాన్ని చూపిస్తూ, "ఆ తుర్బాత్ (తాజియా, అంటే సమాధి)ని చూడు! ప్రజలు ఏమి చేస్తున్నారో గమనించు! ఇది భక్తా?" అని అన్నారు. అలాంటివి అనుమతించినందుకు బాబాను నిందించి, ఆ భక్తులను కూడా తీవ్రంగా దూషించడం మొదలుపెట్టాడు దాసగణు. పది నిమిషాల తరువాత బాబా నవ్వుతూ, "గణూ, నువ్వేమైనా గ్రుడ్డివాడివా? నీ మతి పోయిందా? ఇది తుర్బాత్ కాదు. ఇది నా రథం. నేను దీనిలో ప్రపంచమంతటా విహరిస్తాను" అని అన్నారు. అయితే బాబా భౌతికంగా దానిని ఏనాడూ ఉపయోగించలేదు.
1918వ సంవత్సరం వేసవి సెలవుల్లో పి.ఆర్.అవస్థి తన కొడుకు నానాసాహెబ్ అవస్థికి పెళ్లి చేసేందుకు వెళ్తూ భార్య, కొడుకుతో కలిసి శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో అతను తన కుమారుడి దగ్గర రూ. 400, భార్య దగ్గర రూ. 300 ఉంచాడు. అతను బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, బాబా అతన్ని, "నాకు దక్షిణ ఇస్తావా?" అని అడిగారు. అందుకు అతను, "ఎంత బాబా?" అని అన్నాడు. బాబా: "30 రూపాయలు" అని బదులిచ్చారు. అతను ఆ డబ్బులు దక్షిణగా బాబాకి సమర్పించాడు. తర్వాత బాబా అతని కుమారుడిని, "నాకు రూ. 40/- ఇస్తావా?" అని అడగగా, అతను ఆ మొత్తాన్ని ఇచ్చాడు. అలా బాబా పదేపదే వాళ్ళని దక్షిణ అడుగుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నారు. చివరకు అవస్థి భార్య దగ్గర కేవలం రూ. 30/- మాత్రమే మిగిలాయి. అప్పుడు బాబా మళ్లీ అవస్థిని, "నాకు రూ. 30/- ఇస్తావా?" అని అడిగారు. అతను, "అవి కూడా ఇవ్వాలా, బాబా?" అని అడిగాడు. బాబా, "అవును" అన్నారు. దాంతో అతను అసంతృప్తిగానే తన భార్య దగ్గర మిగిలి ఉన్న ఆ రూ. 30/- తీసుకుని బాబాకు ఇచ్చాడు. ఆ తర్వాత బాబా అతన్ని ఇంకేమీ అడగలేదు. అతను కలత చెందిన మనసుతో బాబా దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు. అప్పటివరకు జరిగినదంతా గమనించిన బాబా పరమ భక్తుడు బాపుసాహెబ్ జోగ్ బాబా అతనిని పదేపదే దక్షిణ అడిగి, వారి దగ్గరున్న డబ్బంతా తీసుకోవడం చూసి ఎంతో సంతోషించి అవస్థిని అభినందిస్తూ అతని వీపుపై తట్టి, "మీరు అదృష్టవంతులు. బాబా తీసుకున్న డబ్బుకు పది రెట్లు తిరిగి ఇవ్వదలచుకుంటే తప్ప, మొత్తం డబ్బంతా దక్షిణగా తీసుకోర"ని అన్నాడు. అందుకు అవస్థి, "నాకు ఆ విషయం తెలియదుగానీ ప్రస్తుత నా స్థితి తెలుసు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. కొడుకు పెళ్లి జరిగే స్థలానికి ఎలా వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఉన్నాను నేను" అని చెప్పాడు. అప్పుడు జోగ్ అతనిని, "మీకు ఎంత డబ్బు అవసరం?" అని అడిగాడు. దానికి అతను తనకు “రూ. 100/- కావాల”ని చెప్పాడు. అప్పుడు జోగ్ ఇలా చెప్పాడు: "బొంబాయికి చెందిన ఒక వ్యాపారి తన సరుకు పోయిందన్న వార్త విని, అది అబద్ధమని తేలితే, తనకొచ్చే లాభంలో 25% బాబాకు సమర్పిస్తానని మొక్కుకున్నాడు; ఆ వార్త నిజంగానే అబద్ధమని తేలింది. ఆ వ్యాపారి బాబాకు 6,000 రూపాయల మొత్తాన్ని కానుకగా సమర్పించాడు. అందులో నుండి 3,000 రూపాయలు బాబా మూడు రోజుల్లో ఖర్చు చేశారు. మిగిలిన సొమ్ము నుండి 100 రూపాయలు మీకు ఇస్తే, బాబా దానికి అభ్యంతరం చెప్పారు, ఆ డబ్బు తిరిగి అడిగార"ని చెప్పాడు. తర్వాత జోగ్ 100 రూపాయలు అవస్థికి ఇచ్చి, "బాబా మీ దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు కాబట్టి, ఖచ్చితంగా మీకు పదోన్నతి లభించి, జీతం నెలకు 50 రూపాయలు పెరుగుతుంద"ని జోస్యం చెప్పాడు. జోగ్ మాటలకు అతను స్పందిస్తూ, "పదోన్నతి పొందడానికి నాకు ఆ శాఖలో 'గాడ్‌ఫాదర్'(సిఫార్సు చేసే పెద్ద మనిషి) ఎవరూ లేర"ని అన్నాడు. కానీ జోగ్ చెప్పినట్లే, ఆ సమయంలో అతనికి పదోన్నతి లభించి జీతం 50 రూపాయలు పెరిగింది; కోర్టు సెలవులు ముగిసిన తర్వాత అవస్తేకు ఈ విషయం తెలిసింది.
తరువాయి భాగంలో పి.ఆర్.అవస్థి కుమారుడు శ్రీనారాయణ్ పురుషోత్తమ్ అలియాస్ నానాసాహెబ్ అవస్థి అనుభవాలు.
1. ఎప్పుడూ తోడుగా ఉండి రక్షణనిచ్చే బాబా
2. బాబా దయ
ఎప్పుడూ తోడుగా ఉండి రక్షణనిచ్చే బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు మణిదీపిక. బాబా నా వెంటే ఉన్నారని చెప్పే చాలా సంఘటనలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నా జీవితంలోనే అతి పెద్ద బాబా ఆశీర్వాదం ఏంటి అంటే, నేను మొదటిసారి సహజంగా గర్భవతినవ్వడం. నాకు పెళ్ళై 4 సంవత్సరాలవుతున్నా నేను గర్భవతిని కాలేదు. నేను ఎన్నోసార్లు బాబా
నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పాను కదా! దానికి సంబంధించి నేను నా భర్తతో కలిసి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకి క్రమం తప్పకుండ వెళ్తుంటాను. నేను గర్భవతినని నిర్ధారణ అయ్యాక కూడా ఆ డాక్టర్ అప్పోయింట్మెంట్ ఉండటంతో గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళడానికన్నా ముందు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. చెప్పాలంటే, అది రొటీన్ చెకప్పే. కానీ ఆరోజు ఆ డాక్టర్ హఠాత్తుగా నా మెడ చూసి, థైరాయిడ్ గ్లాండ్ ఉండే చోట టచ్ చేసి, "కొంచెం వాపు ఉంది" అని చెప్పి, "అక్కడ వాపు ఒక్కోసారి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర నాడ్యూల్స్(తిత్తి) లాంటివి ఉంటే అలా కనిపిస్తుంది. ఒక్కోసారి అవి క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా అసలు అది నాడ్యూల్స్ అవునా, కాదా అని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ చేయాలి" అని చెప్పింది. మేము ఆమె దగ్గరకి దాదాపు 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము. కానీ ఆరోజు వరకు తను అలా ఎన్నడూ చెప్పలేదు. అలాంటిది మేము అస్సలు ఊహించని వార్త తను చెప్పేసరికి నాకు చాలా ఏడుపొచ్చింది. దానివల్ల నా ప్రగ్నెన్సీకి, కడుపులో బిడ్డకి ఏమైనా సమస్య ఉంటుందా అని భయపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత బాబా దగ్గర, "ఎందుకు నాకే ఇలా అవుతుంది?" అని చాలాసేపు ఏడ్చాను. మా అమ్మకి కాల్ చేసి కూడా ఏడ్చాను. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మ ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు చదువుతుంటే, ఒక లీల కనిపించిందట. అక్కడ ఒక భక్తురాలు డాక్టర్ చెకప్‌కి వెళ్తే, తన బ్రెస్ట్‌లో తిత్తి(నాడ్యూల్)లా ఉందని, అది క్యాన్సర్ కారకమయ్యే అవకాశం ఉంది కాబట్టి, బయాప్సీ చేయాలని అన్నారని, తను ఇంటికి వచ్చి బాబా దగ్గర ఏడ్చి, బాబా చరిత్ర సప్తాహం చేస్తానని సంకల్పించుకుని చదవడం మొదలుపెట్టారని, సప్తాహం పూర్తయ్యేలోపు బయాప్సీ రిపోర్ట్ నార్మల్ వచ్చిందని పంచుకున్నారట. మా అమ్మ ఆ లీల చదివి, నాకు షేర్ చేసి, "బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టి బాబా మీద నమ్మకముంచు. అంతా సెట్ అయిపోతుంది" అని చెప్పింది. నేను వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకుని బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. నేను సగం పారాయణ చేసేసరికి నా థైరాయిడ్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ 'అంతా నార్మల్‌గా ఉందని, ఎలాంటి నాడ్యూల్స్ లేవని' వచ్చింది. అప్పుడు నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆ బాబా నాతో ఎప్పుడూ ఉన్నానని, నన్ను రక్షిస్తున్నానని ఈ అనుభవం ద్వారా మరోసారి తెలియజేసారు.
ఒకరోజు హఠాత్తుగా నా ఎడమకాలు వెనకవైపు నరం లాగుతున్నట్లుగా నొప్పి మొదలైంది. నేను అది మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే నొప్పి ఏమో అనుకున్నాను. కానీ 2 వారాలు అయినా కూడా ఆ నొప్పి తగ్గలేదు. డాక్టర్ దగ్గరకి వెళ్తే, తను నా ఎడమకాలు పట్టుకుని చెక్ చేసి, 'ఏదైనా బ్లడ్ క్లాట్ ఉందేమో చూద్దామని' ఆమె కూడా లెగ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ వ్రాసి, "ఒకవేళ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంటే, బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి" అని చెప్పింది. అది వినగానే నేను షాకై, "ఏంటి బాబా, నాకు ఈ పరీక్షలు?" అని అనుకొని ఆయన మీద భారమేసి అల్ట్రాసౌండ్కి వెళ్లాను. రిపోర్ట్‌లో బ్లడ్ క్లాట్ ఏమీ లేదని వచ్చింది. అంతా బాబా దయ. బాబాని నమ్ముకుంటే ఎన్ని సమస్యలున్నా వాటినన్నింటినీ చిటికెలో తీసేస్తారు. ఇదంతా చూస్తుంటే, నా ఈ ప్రెగ్నెన్సీ కాలంలో బాబా నన్ను, నా బిడ్డని ఎన్ని సమస్యల నుంచి కాపాడుతున్నారో అనిపించి బాబాకి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి నా ఈ అనుభవం బాబాపట్ల నమ్మకాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
1. 'నేనున్నాను' అనే భరోసా ఇచ్చిన బాబా
2. పంట బాగా పండడానికి వర్షం రాకుండా సహాయం చేసిన బాబా
1914లో అవస్థి పండరీపురానికి వెళ్లాలని అనుకొని తన మహిళ గురువు(వృద్ధ మహాత్మురాలు) చెప్పిన మాట నెరవేరాలని పండరినాథుని ప్రార్థించాడు. ఆ సమయంలో అతను ఇండోర్ జిల్లా న్యాయమూర్తిగా ఉండగా రేగే అతని క్రింద సివిల్ న్యాయమూర్తిగా ఉండేవాడు. పండరీపురం వెళ్లాలన్న అవస్థి ఉద్దేశ్యం తెలుసుకున్న రేగే అతనితో, "ఇండోర్ నుండి పండరీపురం వెళ్లే దారిలో శిరిడీ వుంది. మీరు అక్కడ ఆగి వెళ్ళండి" అని సూచించాడు. అదివరకే శ్రీ హెచ్.ఎస్.దీక్షిత్ కూడా అతనితో "శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమ"ని చెప్పి ఉన్నాడు. కానీ అవస్థి తన చిన్నవయసులోనే ఒక స్త్రీని గురువుగా ఆశ్రయించి గురుమంత్రాన్ని స్వీకరించి ఉన్నందున ఆమె సజీవంగా ఉందో లేదో తనకి తెలియనప్పటికీ దీక్షిత్ చెప్పినట్లు బాబా దర్శనానికి వెళ్లడం గురుద్రోహంగా భావించాడు. అందువల్ల రేగేకు బాబాతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్న అవస్తే తన మనస్సులోని సందేహాన్ని రేగేతో చెప్పాడు. అప్పుడు రేగే అతనితో, "బాబా గొప్ప మహాత్ములు, దైవస్వరూపులు. గురువులందరిలో ఉన్న ఆత్మయే వారు. కాబట్టి, మీ గురువులోనూ బాబా ఉన్నారు. శిరిడీ వెళ్తే, బాబాలో మీ గురువు ఉన్నారని మీకు అనుభవమవుతుంది" అని చెప్పాడు. దానితో అతను శిరిడీ వెళ్ళడానికి అంగీకరించి, "1914 క్రిస్మస్ సెలవుల్లో తనను శిరిడీ తీసుకెళ్లమ"ని రేగేతో చెప్పాడు. అయితే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అవస్థి చాలా నెమ్మదస్తుడైనందున అతను పూర్తి చేయాల్సిన చాలా పనులు పూర్తికాకుండా ఉండిపోయాయి. అవి పూర్తి చేయకపోతే క్రిస్మస్ సెలవులను వినియోగించుకోరాదని అతనికి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. సెలవులు ఆరంభమవుతూనే అతడు ఆ పెండింగ్ పనులు మొదలుపెట్టాడు. అతను ఆశ్చర్యపోయేలా కొన్ని రోజులలోనే ఆ పనులు పూర్తి చేయగలిగాడు. అది బాబా సహాయానికి సాక్ష్యంగా అతనికి తోచింది.
తరువాత ఒక శుభదినాన రేగే, అవస్తేలు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఊహించని మరో అవాంతరం వచ్చి పడింది. ఆ సమయంలో యుద్ధం జరుగుతున్న కారణంగా రైళ్లన్నీ సైనికాధికారుల హస్తగతం చేయబడ్డాయి. ఇండోర్ నుండి మన్మాడ్ వెళ్లే మార్గంలో మహౌ కంటోన్మెంట్ స్టేషన్ దాటవలసి ఉంది. ఆ స్టేషన్‌లో సైనికాధికారి రైల్లోని ప్రయాణీకులను దింపి సైనికులను ఎక్కించసాగాడు. అందరితోపాటు రేగే, అవస్థిలు కూడా దిగవలసి వచ్చింది. ఇక శిరిడీయాత్ర ముందుకు సాగదని వారికి అనిపించింది. అయితే చిత్రంగా వాళ్ళు రైలు దిగబోతున్న సమయంలో సైనికాధికారి రైలులోకి వచ్చి, “ఈ బోగీ చిన్నదైనందున మాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఈ బోగీలో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు” అని చెప్పాడు. బాబా అనుగ్రహంతో అలా అనూహ్యరీతిన వారిద్దరికీ ప్రయాణం కొనసాగించే అవకాశం లభించింది. రేగే ఆ రాత్రంతా 'బాబా, బాబా' అంటూ బాబాను పిలుస్తూ భజన, నామజపం చేస్తూ గడిపాడు. వాళ్ళు శిరిడీ చేరగానే బాబా దర్శనార్థం మసీదుకు వెళ్లారు. ‘బాబాను మొదటిసారి కలిసినప్పుడే పి.ఆర్.అవస్థి భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయాడని, వారిపై అతనికి కలిగిన భక్తి ఎంత తీవ్రమైనదంటే దానిని మాటల్లో వర్ణించలేమని, అతనికి సాయిబాబా భగవంతునిలా అనిపించసాగారని, ఎక్కడ చూసినా సాయిబాబానే కనిపించసాగారని. అంతలా అతను బాబాతో మమేకమైపోయారని’ అవస్థి కొడుకు శ్రీనారాయణ్ పురుషోత్తమ్ అలియాస్ నానాసాహెబ్ అవస్థి తన స్మృతులలో చెప్పారు. అయితే బాబా పి.ఆర్.అవస్థిను ఉద్దేశిస్తూ రేగేను, "ఎవరీ పిచ్చివాడు?" అని అడిగారు. అది విని అవస్థి ఉద్రిక్తుడయ్యాడు. బాబా ఆంతర్యమేమిటో ఆ తరువాత భక్తులకు అర్థమైంది.
రేగే ఎప్పుడు శిరిడీ వెళ్లినా రాధాకృష్ణఆయీ ఇంట బస చేసేవాడు. అలాగే ఆసారి కూడా అతను అవస్థిను తీసుకొని రాధాకృష్ణమాయి ఇంట బస చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అవస్థికి రాధాకృష్ణఆయీ తన సద్గురువుగా(వృద్ధ మహాత్మురాలు) కనిపించింది. అంతేకాదు ఆమె అతనికి ఏళ్ళ క్రితం అతను వృద్ధ మహాత్మురాలితో కలిసి ఉన్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను గుర్తుచేసింది. దాంతో అతనికి ఆమె విలక్షణమైన వ్యక్తిగా తోచి ఆమెను తన గురుసోదరిగా భావించడానికి అంగీకరించాడు కానీ, తన గురువుకి ప్రత్యామ్నాయంగా అంగీకరించలేదు. అప్పుడు ఆయీ అతన్ని, "నేను చనిపోయినా సరే, నువ్వు అంగీకరించవా?" అని అడిగింది. దానికి అతను "అంగీకరించను" అని అన్నాడు. వెంటనే ఆయీ తాను చనిపోతున్నాని కేకవేసి, నిజంగానే చనిపోయినట్లుగా నేల మీద పడిపోయింది. వెంటనే అతనికి తను మొదటిసారి వృద్ధ మహాత్మురాలిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ సరిగ్గా ఇలాగే చేయడం గుర్తొచ్చి కలత చెంది, పరుగున ఆయీ దగ్గరకు వెళ్లి, ఆమె తలను తన ఒడిలో పెట్టుకొని కన్నీళ్లు కార్చాడు. ఆమెకు స్పృహ తెప్పించడం కోసం, తన గురువు బిగ్గరగా ఉచ్చరించకూడదని చెప్పినప్పటికీ, ఆవిడ తనకు నేర్పిన పంచాక్షరీ మంత్రాలను అతను బిగ్గరగా జపించడం మొదలుపెట్టాడు. ఆ పంచాక్షరీ మంత్రంలోని ఒక్కో అక్షరానికి అధిదేవతలుగా ఉన్న ఆయా దేవతలను, ఆమెను బతికించమని అతను వేడుకున్నాడు. ఆమె బతికితే, తాను 16 ఏళ్లుగా చేసిన ఆ మంత్ర జపం ద్వారా పొందిన పుణ్యమంతా ధారపోస్తానని కూడా అతను ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే ఆయీ మూర్చిల్లి మళ్ళీ స్పృహలోకి వచ్చినట్లుగా నెమ్మదిగా కళ్లు తెరిచి అతనితో, "నువ్వు వెళ్లి, నీ పని చూసుకో" అని చెప్పింది. అతను తన అవివేకం వల్ల కలిగిన పరిణామాన్ని సరిదిద్దగలిగినందుకు సంతోషించాడు కానీ, మంత్రాలను బిగ్గరగా ఉచ్చరించకూడదన్న తన గురువు ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు బాధపడ్డాడు. అతని మనస్సు ఎంతగానో కలత చెంది, మళ్లీ ఆ మంత్రాలను జపించడం మొదలుపెట్టాడు. అప్పుడు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనలో(పాతకాలపు సినిమా ప్రదర్శన) లాగా దేవతలు ఒక్కొక్కరుగా కిందికి దిగి రావడం అతనికి కనిపించసాగింది. మొదటి ఇద్దరు, ముగ్గురు దేవతలు కనిపించిన తర్వాత, ఆయీ అతనితో, "ఈ ప్రదర్శనంతా ఆపి, పడుకొని నిద్రపో!" అని అంది. అతను ఆమె చెప్పినట్లు విన్నాడు.
మరుసటిరోజు అర్థం లేని భయాలతో నలిగిపోతున్న అవస్థి మనసుకు సంకేతంగా రాధాకృష్ణమాయి నాలుగు మల్లెపువ్వులు ఒక దారానికి కట్టి, వాటిని రేగే చేతికిచ్చి, "వీటిని బాబా వద్దకు తీసుకొని వెళ్లి, విడదీయమని చెప్పు" అని చెప్పింది. అతను వాటిని బాబాకు ఇచ్చి ఆయీ చెప్పిన మాటను చెప్పగా బాబా వాటి వాసన చూసి, తిరిగి అతనికిస్తూ, "ఆ పని ఆమే చేయాలి" అని అన్నారు. తరువాత రేగే, అవస్థి కలిసి ఆయీ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో అవస్థికి ఒక ఆలోచన వచ్చింది. అందుకు తగ్గట్టే అతను ఎవరికీ తెలియకుండా బాబాకు సమర్పించబోయే నైవేద్యం పళ్ళెం నుండి ఒక అన్నం ముద్దను చేతిలోకి తీసుకొని, ‘దీన్ని గనుక పిండంగా బాబా స్వీకరిస్తే, తన గురువు ఇక సజీవంగా లేరనీ, బాబాను గురువుగా ఆశ్రయించడం గురుద్రోహం కాదనీ’ అనుకుని, ఆ నైవేద్యం పళ్లాన్ని, దానిక్రిందుగా చేతిలో అన్నం ముద్దను పట్టుకొని మసీదుకు వెళ్ళాడు. ఆ సమయంలో రేగే కూడా అతనితో ఉన్నాడు. బాబా అవస్థితో, "దాన్ని నాకివ్వు" అంటూ ఆ పిండాన్ని తీసుకొని, వాసన చూసి, "ఇది చేరాల్సిన చోటుకి చేరింది" అని అన్నారు. తరువాత అవస్థి, రేగే ఇద్దరూ ఆయీ ఇంటికి వెళ్ళారు. అవస్థి ద్వారం వద్ద నుండే పరుగున వెళ్లి ఆయీ పాదాలపై పడి, అప్రయత్నంగా అరగంటసేపు పాడుతూ బాహ్యస్మృతి లేని స్థితిలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయీ కూడా సమాధి స్థితిలో ఉంది. ఆ తరువాత అవస్థి రేగేతో, "రాధాకృష్ణమాయి స్థానంలో నేను నా మొదటి గురువును దర్శించాను" అని చెప్పాడు”.
అయితే అవస్థికి మొదటిరోజు కలిగినటువంటి అనుభవాలే తర్వాత రోజుల్లో కూడా కలిగాయి. చివరికి ఏకాదశి రోజున అతనికి గురువు సలహాకు విరుద్ధంగా శిరిడీ వచ్చినందుకు పశ్చాత్తాపం కలిగింది. సాధువులను దర్శించవద్దు, వారు తనని వేదిస్తారని ఎవరో చెప్పి ఉన్నందున అతను శిరిడీలో ఉండటం తనకు ప్రమాదమని, మంత్రాల జపం వల్ల తనకొచ్చిన శక్తి నశిస్తుందని భయపడ్డాడు. అటువంటి మానసిక స్థితిలో అతనికి నెమ్మదిగా, 'సాయి అనే ఒక మంత్రగాడు తనని, రాధాకృష్ణమాయిని తప్పుదారి పట్టించారని, ఆ ముసలి ఫకీరు ప్రజలను, 'ఆయీ'తో సహా ఎంతోమంది నిజాయితీపరులైన భక్తులను తనను తాను సాధువుగానూ, దేవుని అవతారంగానూ నమ్మేలా ప్రేరేపిస్తున్నడని’ అతను భావించడం మొదలుపెట్టాడు. తర్వాత అకస్మాత్తుగా అతనికి, ‘సాయి తన మంత్రతంత్రాలతో తనను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని’ అనిపించింది; దాంతో తనను తాను రక్షించుకోవాలని, ఆయన వశం నుండి బయటపడాలని అతను అనుకున్నాడు. అందుకోసం అతను 'శ్రీరామ్, శ్రీరామ్' అని బిగ్గరగా, వేగంగా అనడం మొదలుపెట్టి, చాలాసేపు ఆ నామజపం కొనసాగించాడు. అప్పుడు అవస్థిను ఆ చిత్తభ్రమ నుండి బయటపడేయడానికి ఆయీ, రేగే బాబా దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు. అవస్థి పరిస్థితి ఆ రాత్రంతా అలాగే గడిచింది. మరుసటిరోజు ఉదయం చావడిలో ఉన్న బాబా మధురమైన కంఠంతో 'అల్లా మాలిక్ హై' అని గంభీరంగా అనడం వినగానే ఆ స్థితి నుండి అతను బయటపడ్డాడు. అతను తన ఆలోచన, ప్రవర్తనలకు మనసులోనే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా కాకడ ఆరతి పూర్తవుతూనే రేగేను పిలిపించి, ‘అవస్థిను శిరిడీ నుండి తీసుకెళ్లామని’ ఆదేశించారు. వెంటనే ఒక టాంగా సిద్ధం చేసుకొని రేగే, అవస్థిలు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు గ్రామ ప్రవేశద్వారం వద్ద బాబాకు నమస్కరించి, తమ ప్రయాణానికి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అవస్థికు దారిలో ప్రతి మగ పక్షి, జంతువు బాబాలాగా, ఆడ పక్షులు, జంతువులు 'ఆయీ'లాగా కనిపించాయి. వారు లెండి వాగును చేరుకునే వరకు ఆ స్థితి అలాగే కొనసాగి అటు తర్వాత తొలగిపోయింది. అతను నెమ్మదిగా తన స్నేహితుడు రేగే ఒడిలో పడుకుని నిద్రపోయాడు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పండరీపురం వెళ్లాలన్న అవస్థి కోరిక శిరిడీ సందర్శనంతోనే తీరిపోయింది. ఎలాగంటే, బాబా అతనికి పండరీపురంలోని విఠలుని రూపంలో దర్శనమిచ్చారు. అటుపిమ్మట అతను బాబాకు పరమభక్తుడై తను జీవించి ఉన్నంతకాలం క్రమం తప్పకుండా బాబాను పూజించాడు. 1918లో బాబా మహాసమాధి చెందేవరకు అతను తన కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి సంవత్సరంలో రెండు, మూడు సార్లు శిరిడీ వెళ్లి బాబాను దర్శించి వారి సన్నిధిలో గడుపుతుండేవాడు. బాబాపై విశ్వాసం కుదిరింది అతని ఒక్కడికే కాదు, అతని కుటుంబంలోని చిన్న, పెద్ద అందరూ బాబా భక్తులే. వారిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అనుభవం ఉంది.
తరువాయి భాగం వచ్చేవారం..
1. బాబా చేసిన అద్భుతం
2. బాబా చేసిన చిన్న సహాయం
- బాబా దయతో క్షేత్ర దర్శనాలు