సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1865వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న బాబా
2. ఊదీతో కురుపులు, దురద మాయం
3. బాబా దయతో మంచి మార్కులు

విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న బాబా

నా పేరు కృష్ణవేణి. 2024, మే 20న నేను, మావారు పని మీద హైదరాబాద్ నుండి సామర్లకోట వెళ్ళాము. ఆ సమయంలో అనుకోకుండా వర్షాలు పడుతుండటం వల్ల, "ఎలాంటి ఆటంకం లేకుండా పనులు జరిగేలా చూడండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన వెళ్ళిన పని సక్రమంగా జరిగింది. మరుసటిరోజు మా తిరుగు ప్రయాణానికి ఉన్న టికెట్లు కన్ఫర్మ్  కాలేదు. అవి కన్ఫర్మ్ అయ్యేలా చూడమని బాబాని వేడుకున్నాను. బాబా దయవలన 2024, మే 21 మధ్యాహ్నం కన్ఫర్మ్ అయ్యాయి. ఆ సమస్య తీరిందనుకునేలోగా మరో పెద్ద సమస్య ఎదురైంది. అదేమిటంటే, మేము ఎక్కాల్సిన ట్రైను కాకినాడలో బయలుదేరుతుంది. మేము ఆ ట్రైన్ ఎక్కేందుకు సామర్లకోట రైల్వేస్టేషన్‌కి వెళ్లి, "ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీదకి వస్తుందని ఎంక్వయిరీలో అడగితే, ఆ ట్రైను సామర్లకోటలో ఆగదనే విషయం తెలిసి మేము షాక్ అయ్యాము. పోనీ, కాకినాడ వెళదామంటే అంత సమయం లేదు. మేము అక్కడికి వెళ్ళలోగా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో ఒకబ్బాయి, 'మీరు ఫలానా ట్రైన్‌లో వెళ్ళి రాజమండ్రిలో ఆ ట్రైన్ అందుకోవచ్చు' అని సలహా ఇచ్చాడు. సరేనని జనరల్ టికెట్ తీసుకుని సదరు ట్రైన్ ఎక్కుదామని చూస్తే, అందులో మనిషి కాదు కదా, కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. అందువల్ల ఆ ట్రైన్ ఎక్కలేకపోయాము. మాకు ఏం చేయాలో అస్సలు తెలీలేదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో బాబా తప్ప మనకెవరు తోడుంటారు? నేను ఆయన్ని, "మాకు ఆ ట్రైన్ అందేలా చేయమ"ని ప్రార్థించాను. ఇంకా, 'మేము హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్కాల్సిన ట్రైన్ మిస్సయితే 3,000 రూపాయలు పోయినట్లే! అదీగాక వేరే ట్రైన్‌లో టికెట్ దొరక్కపోతే ఆరోజు ఏదైనా హోటల్‌లో బస చేయాలి. దానికి ఒక ఖర్చు అయితే, మరోసటిరోజు ట్రైన్‌ లేదా బస్సుకు రిజర్వేషన్ చేయించుకుంటే అది ఇంకో ఖర్చు బాబా. ఇన్ని వేల రూపాయలు ఉత్తపుణ్యానికే ఖర్చు అవుతుంది' అని చాలా బాధపడ్డాను. కాసేపటికి ఇంకో ట్రైన్ వచ్చింది. అందులో కూడా మునపటి ట్రైన్‌లో లాగానే రద్దీ ఉన్నప్పటికీ ఎలాగో ఎక్కి, కాలు కూడా కదపలేని క్రిక్కిరిసిన జనం మధ్య నిల్చొని రాజమండ్రి చేరుకున్నాం. మా జీవితంలో అంతటి భయంకర ప్రయాణం చేస్తామని నేను కలలో కూడా ఊహించలేదు. 40 నిమిషాల ఆ ప్రయాణంలో బాబా నాకు చూపించిన జీవితసత్యాలు అనేకం!! బాబా చెప్పిన ఎన్నో వాక్కుల అనుభవాలసారం ఆ 40 నిమిషాల ప్రయాణం!! ఉన్న దానిని గౌరవించటం, జరుగుతున్నదంతా మన మంచికే, ఎన్ని లక్షలమంది ఎంత తక్కువ వనరులతో జీవనం సాగిస్తున్నారో వంటి విషయాలు ఆరోజు ప్రయాణం నాకు తెలియజేసింది. ఇకపోతే, మేము రాజమండ్రిలో దిగేసరికి మేము వెళ్ళాల్సిన ట్రైన్ అప్పటికే వచ్చి ఉంది. మేము ఉరుకులపరుగులతో వెళ్లి ఆ ట్రైన్ ఎక్కి, "ఇది నా జీవితంలో ఒక మైల్ స్టోన్ లాంటి అనుభవం బాబా" అని అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా. అందరినీ కాపాడండి. అందరికీ తోడుగా ఉండండి".

ఊదీతో కురుపులు, దురద మాయం


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తరాలిని. సాయిబాబానే నాకు అన్నీ. ఈ వేసవిలో(2024) మా బాబు వేళ్ళపైన చిన్న చిన్న కురుపుల్లా వచ్చి దురద పెడుతుండేవి. ఎందుకలా అవుతుందో తెలియక నాకు భయమేసింది.  హాస్పిటల్‌లో చూపించాలంటే నాకు భయం. అందువల్ల మా బాబు విషయంలో సాయి మీదే భారమేసి ఆ కురుపులు ఉన్న చోట ఊదీ రాసాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో అవి తగ్గిపోయాయి. దురద కూడా తగ్గింది. ఇలా చిన్న చిన్న సమస్యల్లో కూడా బాబా వెంటనే అద్భుతాలు చూపిస్తారు. "ధన్యవాదాలు బాబా. బాబు భారమంతా మీరే చూసుకుంటారన్న నమ్మకంతో ఉన్నాను తండ్రీ".


సర్వం సాయినాథ చరణారవిందర్పణ మస్తు.


బాబా దయతో మంచి మార్కులు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు స్వాతి. మా అక్కవాళ్ళ బాబు చదువులో కాస్త నెమ్మది. తను పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ వైజాగ్ శ్రీచైతన్య కాలేజీలో చేరాడు. మొదట్లో తను చాలా ఇబ్బందిపడేవాడు. సబ్జెక్టులు అర్థంకాక నేను వెనుకబడి పోతున్నానని నాతో ఫోన్‌లో చెప్పేవాడు. నేను తనతో, "నువ్వు కంగారుపడొద్దు. నెమ్మదిగా చదువు. నువ్వు చదవగలిగినంతవరకు చదువు" అని ధైర్యం చెప్పేదాన్ని. బాబా దయవల్ల తనకి మొదటి సంవత్సరం పరీక్షల్లో 360 మార్కులు వచ్చాయి. రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసేటప్పుడు తను చాలా భయపడ్డాడు. తను మాటల్లో పరీక్ష కేంద్రానికి దగ్గరలో బాబా మందిరం ఉందని చెప్పాడు. అప్పుడు నేను, "పరీక్షకు వెళ్లేటప్పుడు బాబాకి నీ భయాన్ని చెప్పుకో నాన్న. బాబా తప్పకుండా నీకు ధైర్యాన్ని ఇస్తారు. నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తార"ని చెప్పాను. అలాగే నేను తనకోసం సప్తహ పారాయణ చేశాను. బాబా ఎంతో దయమయుడు. బాబు ప్రతిరోజూ, "పిన్నీ! పరీక్ష బాగా వ్రాసాను" అని చెప్పాడు. బాబా దయతో తనకి 836 మార్కులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా".


16 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri

    ReplyDelete
  2. Jaisairam. Bless amma for her health and bless supraja for her health .supraja is suppering with diskbulges and kidneey infectuon. Bless her get her normal jaisairam.

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family 🙏🙏💐💐

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  8. Om sai ram, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, amma nannalani kshamam ga chudandi tandri pls valla badyata meede, ofce lo anta bagunde la chesi illu konali anna kala neravere la chudandi tandri pls

    ReplyDelete
  9. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  10. sai baba, maa sai madava bharam antha meede baba

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  12. ఓం సాయిరామ్

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. Baba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  15. ఓంసాయిశ్రీసాయి జయజయసాయి. ఓంసాయిరామ్ బాబా.. నీవే దిక్కని నమ్మిన మమ్ములను అనునిత్యం కాపాడు తున్న గొప్ప దేవా మీకివే మా సాష్టాంగ దండ ప్రణామములు..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo