ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాకి చెప్పుకుంటే తీరిన 9 నెలల సమస్య
2. పెనుప్రమాదంలో ప్రాణాలను కాపాడిన బాబా
3. దర్శనానికి ఆటంకం లేకుండా అనుగ్రహించిన బాబా
బాబాకి చెప్పుకుంటే తీరిన 9 నెలల సమస్య
నా పేరు మణిదీపిక. నేను యుఎస్‌లో ఉంటాను. మేము 2023, ఆగస్టులో వేరొక రాష్ట్రానికి మారాము. అక్కడ మేము ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాము. మేము ఆ ఫ్లాట్‌లోకి వచ్చినప్పటి నుండి క్లోత్స్ డ్రైయర్ మెషిన్ అస్సలు సరిగా పని చేయట్లేదు. మేము ఎప్పుడు మెయింటెయిన్స్ టీమ్‌కి రిక్వెస్ట్ పెట్టినా వాళ్ళు వచ్చి ఊరికే ఒకసారి పరీక్షించి హీట్ వస్తుంది, పని చేస్తుంది అని చెప్పి వెళ్లిపోతుండేవాళ్లు. అందువల్ల మేము ఎన్నిసార్లు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. 9 నెలలు డ్రైయర్ పనిచేయక, బయట బట్టలు ఆరబెట్టుకోలేక చాలా ఇబ్బందిపడ్డాము. ఒకరోజు చాలా విసుగొచ్చి మనసులో సాయిబాబాకి దణ్ణం పెట్టుకొని, "ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడమ"ని వేడుకున్నాను. 3 వారాలు తర్వాత ఇంకో మెయింటెయిన్స్ టీమ్‌వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు కూడా మునపటి టీమ్ వాళ్ళలానే చెప్పి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఎందుకు అలానే అయిందని అనుకున్నాను. అంతలో బాబా ఏం చేసారో తెలీదు కానీ, టీమ్వాళ్ళు వెళ్లిన 5 నిమషాల్లోనే తిరిగి వచ్చారు. వాళ్ళు తమతోపాటు కొత్త డ్రైయర్ మెషిన్ తెచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్లిపోయారు. ఇది ఖచ్చితంగా బాబా లీలే అని నా భావం. ఇలా బాబా అందర్నీ సదా కాపాడుతుంటారు. "ధన్యవాదాలు బాబా".
పెనుప్రమాదంలో ప్రాణాలను కాపాడిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు చైతన్య. నేను ఈ సంవత్సరం(2024) ఇంటర్మీడియేట్ పూర్తి చేశాను. ఒకరోజు నేను, మా నాన్న, నా స్నేహితుడు, వాళ్ళ నాన్న కలిసి చెన్నైలో ఒక యూనివర్సిటీ చూసొద్దామని విజయవాడ నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణమయ్యాము. 2024, మే 22 తెల్లవారుజామున 4 గంటలప్పుడు బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో నెల్లూరు జిల్లాలోని సున్నపుబట్టి అనే ఊరు హైవే మీద వున్న ఖాళీ కంటైనర్‌ని ఢీకొట్టాడు. ఆ దుర్ఘటనలో బస్సు 4 పల్టీలు కొట్టింది. బస్సులోని ప్రయాణికులందరం ఒక్కసారిగా భయకంపితులై పెద్దగా కేకలుపెట్టాము. అత్యవసర ద్వారం రోడ్డుకి ఆనుకొని ఉండటం వల్ల బస్సులో ఉన్న మేమెవరం బయటకు రాలేకపోయాము. అక్కడున్న ఒక లారీడ్రైవర్ పోలుగుతో బస్సు వెనక అద్దం పగలగొట్టడంతో అందరం బయటకు వచ్చాము. నాకు, నా స్నేహితునికి, వాళ్ళ నాన్నకి ఏమీ అవ్వలేదు కానీ, మా నాన్నకి బస్సు అడ్డం చాలా లోతుగా గీరుకుపోవడంతో రక్తం బాగా వచ్చింది. అది చూసి నేను పెద్దగా ఏడ్చేసాను. "బాబా! మమ్మల్ని కాపాడండి" అని ఏడుస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక ఆయన వచ్చి "నేను డాక్టర్ని" అని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేసి రెండు కుట్లు వేశారు. మేము డబ్బులు ఇస్తే, ఆయన తీసుకోలేదు. మా నాన్న చాలా రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన డబ్బులు వద్దంటే వద్దు అన్నారు. అప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పి మేము చెన్నై వెళ్ళొచ్చాము. "ధన్యవాదాలు బాబా".
దర్శనానికి ఆటంకం లేకుండా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. మా కుటుంబమంతా 35 మందిమి కలిసి తిరుపతి, కంచి, అరుణాచలం వెళ్లి, రావాలని మూడు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకున్నాము. తీరా మా ప్రయాణ సమయం దగ్గరపడేసరికి సరిగ్గా అది నాకు నెలసరి వచ్చే సమయం అయింది. నాకున్న ఆరోగ్య సమస్యల వల్ల కొన్నిసార్లు నెలసరి ఆగడానికి వేసే టాబ్లెట్లు పని చేయవు. అందువల్ల నేను చాలా టెన్షన్ పడ్డాను. చివరికి బాబా మీద భారమేసి ఆయన్ని తలుచుకుంటూ ఒక్కో గుడికి వెళ్లాను. బాబా దయతో దర్శనాలన్నీ సంతృప్తికరంగా జరిగాయి. చివరిరోజు అరుణాచలంలో ఉదయం నిద్ర లేవగానే కడుపునొప్పి, కాళ్లు లాగటంతో నెలసరి వస్తుందేమోనని నాకు చాలా భయమేసింది. భయభయంగా బాబాకి దండం పెట్టుకొని, "ప్రశాంతంగా దర్శనం చేసుకునే అదృష్టం ఇవ్వమ"ని వేడుకొని, ఆయన మీద భారమేసి దర్శనానికి వెళ్లాను. ఆశ్చర్యకరంగా దర్శనానికి లోపలికి వెళ్ళినప్పటినుంచి నాకున్న సమస్యలన్నీ తక్కువైపోయి మామూలై ప్రశాంతంగా శివుని దర్శనం చేసుకున్నాను. ఇదంతా బాబా అద్భుత లీలాకేలి. "ఇంతగా మీ దయ నాపై, నా భర్త, పిల్లలపై చూపిస్తున్న మీకు కోటి కోటి ధన్యవాదాలు బాబా. నేను చేసిన తప్పులు అన్నింటిని మన్నించు దేవా. ఎప్పటికీ నీ పాదాల దగ్గర శ్రద్ధ, సబూరితో ఉండే అదృష్టాన్ని ప్రసాదించు సాయీ".
ఓం సాయిరామ్
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalani kshamam ga chusukuni manchi arogyanni evvandi tandri vaalla badyata meede, vaallu prashantam ga unde la chudandi tandri pls
ReplyDeleteOmsai ram
ReplyDeletebaba madava eeroju school ki velladu . repu kuda elage school ki velletattu cheyandi baba
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me