సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1867వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం మాత్రమే!
2. బాబా మన మాటలు వింటున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది?

బాబా అనుగ్రహం మాత్రమే!

 

ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు విజయ. మాది కాకినాడ. నా చిన్నవయసులోనే సాయి నన్ను తమ వైపుకు ఆకర్షించారు. ఆయన ప్రతిక్షణం తమ ఉనికిని నాకు తెలియపరుస్తున్నారు. ఆయన నా కంటికి కనబడకపోయినా నాతోనే ఉన్నారని, నాలోనే ఉన్నారని, నన్ను నడిపిస్తున్నారనీ, నా ప్రతి మాట, చేత, వ్రాత ఆయన సంకల్పం ద్వారానే జరుగుతున్నాయిని నేను భావిస్తాను. మా అమ్మాయి పెళ్లి ఒక సివిల్ ఇంజనీ‌ర్‌తో జరిగింది. ఉద్యోగరీత్యా మా అల్లుడికి తరచూ బదిలీలు అవుతుంటాయి. ప్రాజెక్ట్ ఎంతకాలముంటే అంతకాలం ఆ ప్రదేశంలో ఉండి తర్వాత వేరే ప్రదేశానికి మారాల్సిన పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఎక్కడా పట్టుమని రెండు సంవత్సరాలు ఉన్నది లేదు. ఆ క్రమంలో మా అల్లుడువాళ్ళు వరుసగా హైదరాబాద్, కర్నూల్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తిరుగుతూ చిత్తూరు వచ్చారు. అక్కడ ఉండగా, తన సహోద్యోగులందరికీ అక్కడ ప్రాజెక్ట్ అయిపోయిందని, మళ్లీ బదిలీలు ఉంటాయని మా అల్లుడికి తెలిసింది. మా మనవడు చిన్నగా ఉన్నప్పుడు చదువు విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు. కానీ వాడు పెరిగే కొద్దీ ఊర్లు మారడం, భాష మారడం, వాతావరణం మారడం, అక్కడ పరిస్థితులకు అలవాటుపడేలోపే మళ్లీ ఊరు మారాల్సి రావడం ఇబ్బంది అయిపోతుంది. అదీకాక ఊరు మారినప్పుడల్లా.. సామాను తరలించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుండేది. ఇదంతా బాబాకు తెలిసినా కూడా అడగనిదే అమ్మయినా పెట్టదనే సామెత ఉండనే ఉంది కదా! అందుకని నేను బాబాను సంపూర్ణ సర్వస్య శరణాగతివేడి, 'ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని మార్చమనీ, అల్లుడి ఉద్యోగం అన్నివిధాలా అనుకూలమైన చోటుకి, పిల్లాడి చదువుకి ఇబ్బంది లేని చోటుకి, వారికి అన్ని రకాలుగా బాగుండే చోటుకి పంపి బదిలీలు లేకుండా స్థిరపరచమని' ఆర్తిగా వేడుకున్నాను. అంతలో మా అల్లుడి సహోద్యోగులలో కొంతమందిని ఉత్తరప్రదేశ్, గుజరాత్.. ఇలా ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అక్కడికి పంపించసాగారు. అయినా బాబా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం చెదరలేదు. అది తెలిసి నేను బాబాతో, "బాబా! దయచేసి మీరు మా అమ్మాయి, అల్లుడు, మనవడి మీద కృప చూపండి. మంచి, అనుకూలమైన ప్రదేశంలో వాళ్ళు స్థిరంగా ఉండేలా వాళ్ళని ఆశీర్వదించండి" అని బాబాకు మొరపెట్టుకుంటూ ఉండసాగాను. బాబా మీద నాకున్న భరోసాను బాబా నిలబెట్టారు. మా అల్లుడి పైఅధికారులు అతనికి ఫోన్ చేసి, "హైదరాబాద్‌లోని హెడ్ఆఫీసులో పని చేయడానికి వస్తావా?" అని అడిగారు. కానీ ఆఫీసులో పని చేస్తే జీతం తక్కువగా  వస్తుంది. అలాగని వచ్చిన అవకాశాన్ని తిరస్కరిస్తే, మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందన్న నమ్మకం లేదు. అందుకని కొంచెం జీతం తక్కువైనా బదిలీల బాధనుండి విముక్తి, బాబు చదువు ఒకేచోట సాగుతుంది, మా అమ్మాయి ఉద్యోగం చేయొచ్చు(మా అమ్మాయి బీటెక్ చదివి కూడా మా అల్లుడి బదిలీల కారణంగా బాబును చూసుకోవాలని ఇప్పటివరకు ఉద్యోగం చేయలేదు) అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని మా అల్లుడు పైఅధికారులకు తన సమ్మతి తెలియజేసారు. నిజానికి కొంచం వయసు పైబడినవాళ్లనే హెడ్ ఆఫీసులో పని చేయమని అడుగుతారు. అలాంటిది ఆ పైఅధికారుల మనసు మారి మా అల్లుడిని ఆ మాట అడిగారు. అది బాబా అనుగ్రహం మాత్రమే. ఆయన సంపూర్ణ అనుగ్రహం వలన మాత్రమే సాధ్యమైంది. అందుకు బాబాకు అనేకానేక కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. కానీ అది తక్కువే. కానీ అంతకంటే ఏమిచ్చి ఋణం  తీర్చుకోగలం? అసలు బాబాకు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? సర్వం బాబా ఇచ్చినదే! "ఓ సాయినాథా! మీ దయ మాపై ఎల్లప్పుడూ ప్రసరించనివ్వండి. అనుక్షణం మాతో ఉండండి. మాకు మేలు చేయండి. మా ఇహపరాలన్నీ మీరే చూసుకోండి. మాకు మార్గదర్శిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి".

 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి సద్గురుసాయి నమో నమః.


బాబా మన మాటలు వింటున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది?


అందరికి నమస్కారం. నా పేరు గౌతమీ. బాబా మన మీద ఎంత దయ చూపిస్తున్నారో ఈ బ్లాగ్ చూస్తే అర్ధమవుతుంది. నేను అమెజాన్లో ఒక డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెడితే 10 రోజుల్లో డెలివరీ అవుతుందని వచ్చింది. ఆలోపు మా పాత టేబుల్‌ని olxలో అమ్మేసి కొత్త టేబుల్ వచ్చాక పాత టేబుల్ ఇస్తానని చెప్పాను. అయితే 10 రోజులైనా కొత్త  టేబుల్ రాలేదు. అడిగితే, ఆలస్యమవుతుందన్నారు. ఈలోపు olxలో పాత టేబుల్ కొనుకున్నవాళ్ళు నన్ను కంగారుపెట్టడం మొదలుపెట్టారు. నాకు ఏం చేయాలో అర్థం కాక, "బాబా! దయ చూపండి. టేబుల్ డెలివరీ అయ్యేలా చూడండి" అని అనుకున్నాను. అంతే, ఇంకో వారం రోజులు పడుతుందన్న టేబుల్ ఆ మర్నాడే వచ్చింది. బాబా మన మాటలు వింటున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? "చాలా ధన్యవాదాలు బాబా".


నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాను. నేను చాలా రోజులుగా ఒక పరీక్ష వ్రాస్తున్నాను. అది పాసైతే మాకు ఉద్యోగంలో మార్కులు పెరుగుతాయి. కానీ నేను ప్రతిసారీ ఆ పరీక్ష ఫెయిల్ అవుతుండేదాన్ని. అందువల్ల ఈసారి పరీక్ష వ్రాసే ముందు బాబాని చాలా ఆర్తిగా, "బాబా! ఈసారి పాస్ అయ్యేలా చూడండి. పాస్ ఐతే నవ గురువారం వ్రతం చేసుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయతో ఈసారి నేను పరీక్ష క్వాలిఫై అయ్యాను. చాలా ఆనందంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా. ఈలాగే నా మీద మీ దయ ఉండాలి".


సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


8 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. sai baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete
  6. Baba, bless my children and fulfill their wishes in education. Baba , please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  7. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo