సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు అబాసాహెబ్ - యముడైనా బాబా ఆజ్ఞను శిరసావహిస్తాడు ...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
శ్రద్ధ  -  సబూరి

కృష్ణాజీబ్రహ్మ అలియాస్ అబాసాహెబ్ బాబాకి అంకిత భక్తుడు. అతడు అహ్మద్‌నగర్‌లో నివసిస్తుండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కొడుకు లక్ష్మణ్, కూతురు రుక్మిణి. అబాసాహెబ్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ అదృష్టవశాత్తు బాబాను అనేకసార్లు దర్శించుకునేవాడు. అతనే కాదు, అతని కుటుంబమంతా బాబాను ఆరాధిస్తూ తరచూ బాబా దర్శనానికి వెళ్తుండేవారు. బాబా వారికి ఊదీ పెట్టి ఆశీర్వదిస్తుండేవారు. అబాసాహెబ్ తన ఉద్యోగవిరమణ అనంతరం కొడుకు ‌‌లక్ష్మణ్‌తో కలిసి బాడ్‌గాఁవ్‌లో నివసించేవాడు. కూతురు రుక్మిణి పెళ్ళైన తరువాత భర్త మల్హారిబెంద్రేతో అమలనేరులో నివసిస్తుండేది. మల్హారి అక్కడి మునిసిపల్ కార్పోరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండేవాడు.

కొంతకాలం తరువాత లక్ష్మణ్‌కి అమలనేరుకు బదిలీ కావడంతో కొడుకుతోపాటు అబాసాహెబ్ తన కూతురి ఇంటికి దగ్గరలోనే నివసించనారంభించారు. అబాసాహెబ్ ప్రతిరోజు వేకువఝామునే లేచి, స్నానంచేసి, భక్తితో పూజ చేసుకునేవాడు. తరువాత టిఫిన్ చేసి గ్రంథాలయానికి వెళ్తూ దారిలో రుక్మిణి ఇంటికి వెళ్ళేవాడు. రెండునెలల తరువాత ఒకరోజు అతను రుక్మిణి ఇంటికి వెళ్ళలేదు. మరుసటిరోజు కూడా తన తండ్రి రాకపోవడంతో రుక్మిణి కంగారుపడి తండ్రిని కలవడానికి వెళ్ళింది.

ఆ సమయంలో అబాసాహెబ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని భార్య చల్లని గుడ్డతో అతని ఒళ్ళు తుడుస్తోంది. అబాసాహెబ్ తన కూతురివైపు ప్రేమగా చూస్తూ తన కళ్ళలో నీళ్ళు నిండిపోగా, "ఈ అనారోగ్యంనుండి తిరిగి కోలుకుంటానని నాకు నమ్మకం లేదు" అన్నాడు. రుక్మిణి తండ్రిని ఓదారుస్తూ, "నాన్నా! మీరేమీ దిగులుపడకండి. నా భర్త మంచి డాక్టరుని తీసుకొచ్చి మీకు వైద్యం చేయిస్తారు. మీరు త్వరలోనే కోలుకుంటారు" అని చెప్పింది. అంతలోనే వైద్యుడిని కూడా తీసుకొచ్చారు. వైద్యుడు అబాసాహెబ్‌ను పరీక్షించి ఇంజక్షన్ వేసి, ద్రవపదార్థాలు మాత్రమే సేవిస్తూ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. తీవ్రమైన జ్వరం ఎనిమిదిరోజులు కొనసాగింది. రోజూ వైద్యుడు ఇంజక్షన్ చేస్తున్నా జ్వరం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఆ జ్వరప్రభావం వల్ల అబాసాహెబ్ మాట కోల్పోయాడు. అతను మంచానపడినప్పటినుండి అతని కొడుకు, అల్లుడు అతని దగ్గరే కనిపెట్టుకుని ఉంటున్నారు.

9వ రోజున అబాసాహెబ్ పరిస్థితి మరింత విషమించింది. ఆరోజు అర్థరాత్రి సమయంలో ఉన్నట్టుండి అబాసాహెబ్ వింతగా, గట్టిగా అరిచాడు. అరగంట తరువాత మళ్ళీ అలాగే అరిచాడు. దానితో కుటుంబసభ్యులు అతనికి నిద్రమందు ఇచ్చారు. కానీ ఆ రాత్రంతా అతడు ప్రశాంతంగా నిద్రపోకుండా కలతగానే ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన రెండురోజుల తరువాత జ్వరం తగ్గడం మొదలుపెట్టి, సాధారణస్థితికి వచ్చింది. అబాసాహెబ్ సైగలు చేస్తూ తానేదో వ్రాయాలనుకుంటున్నట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేశాడు. అతని కొడుకు, అల్లుడు సహాయం చేసి అతన్ని కూర్చోబెట్టి, పలక, బలపం చేతికిచ్చారు. అప్పుడతను ఇలా వ్రాశాడు: "సాయిబాబా నా మంచం చివరన ఉండి, నన్ను కాపాడుతున్నారు. నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన నలుగురు భయంకరమైన వ్యక్తులను చూసి నేను ఆరోజు రాత్రి కేకలు వేశాను. వాళ్ళు బాబాతో, "మీరు మంచం దగ్గరనుంచి ప్రక్కకు తొలగితే, మేము అతన్ని తీసుకుని వెళ్తాము" అని చెప్పారు. అప్పుడు బాబా సట్కా ఊపుతూ వాళ్ళను బెదిరించారు. మరుక్షణం చాలా కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ నలుగురు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కణ్ణించి పారిపోయారు. తరువాత మృత్యుదేవత అయిన యముడు వచ్చాడు. అతడు తన అనుచరులకంటే అతిభయంకరంగా ఉన్నాడు. అతన్ని చూసి భయంతో నేను మళ్ళీ గట్టిగా అరిచాను. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతని కనులు ఎర్రని నిప్పుకణాల్లా ఉన్నాయి. ఎప్పుడైతే అతడు బాబాని చూశాడో, కాస్త శాంతించాడు. బాబా నన్ను చూపిస్తూ ఎంతో శాంతంగా, "ఇతను నా అంకిత భక్తుడు, నేను ఇతని గురువుని. అతన్ని ఇంకా కొంతకాలం ఉండనివ్వు. అతని ద్వారా నా పనిని ఇంకొంతకాలం కొనసాగించాలి" అని అన్నారు. అప్పుడు యముడు, "సరే, మీ ఆజ్ఞ! అతన్ని ఎప్పుడు తీసుకునిపోవాలనేది తెలియజేయండి. మీ అనుమతి కోసం వేచి, తదనుగుణంగా చేస్తాను" అని చెప్పి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు". అబాసాహెబ్ వ్రాసినదంతా చదివిన తరువాత, ఆరోజు అర్థరాత్రి అతనంత గట్టిగా ఎందుకు అరిచాడో అందరికీ అర్థమైంది. బాబా చూపిన కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ మనస్ఫూర్తిగా బాబాకు నమస్కరించుకున్నారు. ఆ తరువాత కొన్నిరోజులకు అబాసాహెబ్ పూర్తిగా కోలుకున్నాడు.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1993.

12 comments:

  1. ఓం శ్రీ సాయి సమర్థ,🙏🌹

    ReplyDelete
  2. ఓం సాయిరాం జై సాయిరాం మాస్టర్

    ReplyDelete
  3. Om Sairam Baba thandri Ma nanna ki kuda jabbu thaggi chala chala active ga ayyela chudandi baba.. Ma Anna pellilo kani ma intiki vachinappudu kani inka ekkadikellina ekkadunna ayana arogyamga active andaru mechukunela undali. Baba, ma nanna ala unte nenu thappaka ee blog lo aa naa anubhavanni pamchukuntanu ani manavi cheskuntunna..
    Om Sairam..
    Om Sree Sai Arogya Kshemadhaya Namaha..
    🕉🙏😊❤

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😊🙏🕉

    ReplyDelete
  5. Om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  6. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై 🙏🙏🙏

    ReplyDelete
  7. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై 🙏🙏🙏
    స్వామీ నాకు సంధ్య కి మరేజ్ అయెల చుడు తండ్రీ ఓం సాయి రామ్

    ReplyDelete
  8. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹 ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo