సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి లీలలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

రాజమండ్రి నుండి సాయిబంధువు వల్లంకొండ మహేశ్వరిగారు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

18 ఏళ్ళ క్రితం జరిగిన అనుభవమిది. మా వీధిలో పది ఇళ్ళు ఉంటాయి. అందులో నాలుగు ఇళ్ళున్న పోర్షన్‌లోని ఒక ఇంటిలో మేము అద్దెకు ఉంటున్నాము. ఒకరోజు నేను హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్నాను. నేను మా వీధి మొదట్లో అడుగుపెట్టే సమయానికి కాషాయవస్త్రాలతో సాధువు వేషధారణలో ఉన్న ఒకతను వీధి దాటిపోతూ ఉన్నారు. బహుశా నా చెప్పుల శబ్దానికి ఆయన వెనుకకు తిరిగారు. ఆయన్ని చూడగానే 'ఈయన అచ్చం సాయిబాబాలాగా ఉన్నారు' అని మనసులో అనుకున్నాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరకు వచ్చి ఆగారు. నేను దగ్గరగా వెళ్ళగానే, "మంచినీళ్లు కావాలమ్మా" అని అడిగారు. నేను ఇంటి లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చిస్తే ఆయన త్రాగారు. తరువాత నేను ఆయనకు పదిరూపాయలు ఇస్తే, "పదకొండు రూపాయలు ఇవ్వమ్మా! ఇలా సరిసంఖ్యలో ఇవ్వకూడదు, ఎప్పుడూ బేసిసంఖ్యలో ఇస్తూ ఉండమ్మా!" అని చెప్తూ, "నేను బాబాగారిని కాదు. నీకు ఆ బాబా కృప చాలా ఉంది" అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఈ వీధి చివర మనసులో అనుకున్న మాట ఆ చివరవున్న ఆయన ఎలా చెప్పగలిగారు? ఈయన నిజంగా బాబాయే అయుంటారని నాకనిపించింది. పైగా ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది. మాములు సాధువులలో ఆ తేజస్సు కనిపించదు. మళ్ళీ ఎప్పుడూ ఆయన కనిపించలేదు.

ఇప్పుడు మరో అనుభవం చెప్తాను. మా పాపకి నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుడిలో చాలీసా చదువుతూ ఉన్నారు. మా ఇంటిలో ఒక పుస్తకం ఉంటే తీసుకుని, పాపతో గుడికి వెళ్ళాను. అక్కడ అందరూ శ్రద్ధగా చదువుతూ ఉన్నారు. అప్పట్లో నాకు చాలీసా అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళు ఏమి చదువుతున్నారో అర్థంకాక నా దగ్గరున్న పుస్తకంలో అన్ని పేజీలు తిరగేస్తున్నాను. కానీ వాళ్ళు చదివేది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. అంతలో మా పాప నా చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని ఒక పేజీ తెరచి, "ఇదిగోనమ్మా, వాళ్ళు చదువుతుంది ఇదే!" అని నాకిచ్చింది. అప్పడు వాళ్లతో పాటు కలిసి చదివి, బాబాకి నమస్కరించుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక, "పాప చదివేది ఇంగ్లీష్ ఏ,బి,సి,డి లు. తనకి తెలుగు రాదు కదా! మరి ఆ పేజీ ఎలా తెరచి నాకిచ్చింది?" అని సందేహం వచ్చింది. వెంటనే పాపని పిలిచి, "అమ్మా! సరిగ్గా ఆ పేజీ తీసి ఇచ్చావు కదా, నీకెలా తెలిసింది?" అని అడిగితే, "నేనా! నేనెప్పుడు ఇచ్చానమ్మా?" అని అంది. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అలా బాబాయే నాచేత చాలీసా పారాయణ చేయించారు. ఇది బాబా నాకిచ్చిన రెండో అద్భుత నిదర్శనం.

3 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹 ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo