శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
1964వ సంవత్సరంలో నరహరి కదమ్ క్షయవ్యాధి బారినపడి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలామంది వైద్యులు అతనికి చికిత్స చేసారు కానీ, అతని పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సరికదా, రోజురోజుకీ ఆ వ్యాధి వృద్ధి చెందుతూ వచ్చింది. దానితో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆ బాధ భరించలేక అతడు ఒక రాత్రి, "బాబా! ఈ బాధనుండి కొంతైనా ఉపశమనం కలిగించండి. నా పాపకర్మల కారణంగా అలా కుదరక పోయినట్లైతే నాకు మరణాన్ని ప్రసాదించండి" అని బాబాను ప్రార్థించాడు.
మరుసటి ఉదయం అతని భార్య అతనితో, "రాత్రి నాకు బాబా కలలో దర్శనమిచ్చి, "నేను నీ భర్తకు నయంచేస్తాను. 'తనని చూసుకోవడానికి నేను ఇక్కడుండగా అతడెందుకు మరణాన్ని కోరుకుంటాడు?' అని అడిగానని నీ భర్తతో చెప్పు" అని చెప్పారు. తరువాత ఆయన దుప్పటినుండి ఒక ఉన్నిపోగు తీసి తమ బొటనవ్రేలికి కట్టి, 'అతడు ఖచ్చితంగా కోలుకుంటాడు' అని హామీ ఇచ్చారు. అంతటితో కల ముగిసింది" అని చెప్పింది. బాబా తన భక్తులను ప్రేమతో రక్షిస్తానని, పోషిస్తానని తాము చేసిన వాగ్దానాన్ని నిర్ధారించి చెప్పడానికి ఉన్నిదారంతో కంకణంలా కట్టుకున్నారు. బొటనవ్రేలు వద్దనుండి అన్ని నరములు ప్రారంభమై, మళ్ళీ అక్కడే అంతమవుతాయి. మొత్తం నరాల వ్యవస్థకు జీవనరేఖగా బొటనవ్రేలు ఉంటుంది.
అదేరోజు నరహరి ఒక స్నేహతుడిని కలుసుకున్నాడు. ఆ స్నేహితుడు అతనిని డాక్టర్ పాటిల్‌ని కలవమని, అతనితో వైద్యం చేయించుకోమని సూచించాడు. నరహరి అతని సలహా ప్రకారం డాక్టర్ పాటిల్‌ను సంప్రదించాడు. డాక్టర్ "మీ వ్యాధి చివరిదశలో ఉన్నప్పటికీ, ఉత్తమమైన మార్గంలో చికిత్స చేస్తాను" అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఒక వారంలోపల నరహరి పరిస్థితిలో మంచి మార్పు కనిపించింది. ఆరునెలలు పూర్తయ్యేసరికి అతనికి పూర్తిగా నయమయ్యింది. చాలామంది ప్రజలు, "ఇందులో అద్భుతమేముంది? ఈ రోజుల్లో క్షయవ్యాధి అంత ప్రాణాంతకమైన వ్యాధేమీకాదు. ప్రస్తుతం దానికి చికిత్స ఉంది" అన్నారు. వారికి నరహరి, "నిస్సందేహంగా మెడికల్ సైన్స్ విశేషమైన అభివృద్ధిని సాధించింది. అయితే నా విషయంలో నాకు, బాబాకు మధ్య ఉన్న సంబంధం అద్భుతమైనది. ఆయన నా రక్షకుడు. త్వరగా నాకు చికిత్సనందించి మృత్యువునుండి రక్షించిన ఆయనకు నేను ఋణపడివున్నాను. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి మాత్రమే తాను పడ్డ బాధ ఏమిటో తెలుస్తుంది" అని బదులిచ్చాడు.

సోర్స్: శ్రీసాయి సాగర్ జూలై - ఆగష్టు సంచిక 2005.
🕉 sai Ram
ReplyDelete