సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వై.శ్రీనివాసరావు. మాడు గుంటూరు. అది 1995-96 సంవత్సరం. అప్పటికి నాకు వివాహమై సుమారు 2 సంవత్సరాలై ఉంటుంది. మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఇబ్బందులను తొలగించమని బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను, నా భార్య మా అక్కగారింటికి గుంటూరు వెళ్ళాము. ఆరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను పెద్ద నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ నన్ను కాపాడమని పెద్దగా కేకలు వేస్తున్నాను. అప్పుడొక పండుముసలివ్యక్తి ఆ ప్రవాహంలో ఈదుకుంటూ నా వద్దకు వచ్చి, "నీకు నేనున్నాను. నీకు ఏమీ కాదు" అని నన్ను తన భుజాలపై మోస్తూ ఒడ్డుకు తీసుకునివచ్చాడు. అంతే, అక్కడితో కల ముగిసింది. నేను పెద్దగా కేకలుపెడుతూ మేలుకున్నాను. ఆరోజునుండి నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మా అప్పులు అన్నీ తీరిపోయి పొలము కూడా కొన్నాము. నా భార్యకు ఉద్యోగం కూడా వచ్చింది. అప్పటినుండి మా బాధలన్నీ తీరిపోయి కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంటున్నాము. ఇప్పుడు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒకరు ఇంజినీర్, ఒకరు డాక్టర్. నాకొచ్చిన కల ద్వారా కష్టాలకడలివంటి ఈ జీవితమనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను, నేను నమ్మిన బాబా కాపాడి, నా కష్టాలన్నీ తీర్చి, నా కుటుంబం సంతోషంగా ఉండటానికి సహాయం చేసారు. బాబా తనను నమ్మిన వారెవరూ ఎటువంటి బాధలు పడకుండా సంతోషంగా ఉండేటట్లు చూస్తారు. కనుక అందరం బాబాను నిత్యం స్మరించుకుందాం.
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
🕉 sai Ram
ReplyDeleteశిరిడి సాయినాధా శరణం
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
ReplyDeleteసమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete