శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
2018 డిసెంబర్ 22న ఒక సాయిబంధువు తన అనుభవాన్ని మెయిల్ ద్వారా ఇలా పంచుకున్నారు..
నేను 27 ఏళ్లగా బాబా భక్తురాలిని. 2018 జులైలో అనుకోకుండా మీ 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్‌బుక్ పేజీని చూశాను. అదే సమయంలో నా సహోద్యోగి ద్వారా శిరిడీనుండి బాబా ఫోటో కూడా వచ్చింది. మీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా సచ్చరిత్ర గురించి తెలుసుకుని చదవడం మొదలుపెట్టాను. సచ్చరిత్ర చదవడంవలన జులై నుండి నాకు బాబాతో అనుబంధం ఇంకా ఇంకా దృఢపడింది. ఆయనపట్ల భక్తి విశ్వాసాలు బాగా అభివృద్ధి చెందాయి. అందులోని ప్రతి వాక్యం సత్యమైనది. ఆ వాక్యాలు ప్రతి ఒక్కరికీ తమ దైనందిన జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సచ్చరిత్ర నా మనసుకెంతో ప్రశాంతత చేకూర్చింది.
గతవారం మా నాన్నగారి వెన్నెముకకి శస్త్రచికిత్స జరిగింది. దాని ప్రభావం వలన ఆయన కుడికాలి పాదానికి బలహీనత ఏర్పడింది. అందువలన ఆయన నడవడం కష్టమైన పని. దానితో కుటుంబంలో నేను తప్ప అందరూ ఏడవటం మొదలుపెట్టారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉంది, ఆయన నాన్నని ఈ సమస్యనుండి బయటపడేస్తారని. "నెలలోగా నాన్న కోలుకుంటారు. బాధపడకండ"ని అందరికీ ధైర్యం చెప్పాను. అదే సమయంలో మీ ఫేస్‌బుక్ పేజీలో ఆరోగ్యసమస్యలకు సంబంధించిన సాయిభక్తుల అనుభవాలు షేర్ చేసారు. అది నాకు బాబానుంచి వచ్చిన మంచిసంకేతంగా అనిపించింది. బాబాపై నాకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, మొన్న నాన్న ఒకరి సహాయంతో నడిచే ప్రయత్నం చేసారు. ఈరోజు స్వంతంగా కూడా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు మీకు". బాబాపై విశ్వాసం కలిగివుండండి. సచ్చరిత్రను చదువుతూ ఉండండి. అది ప్రశాంతతను చేకూర్చడమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్ది ఉన్నతస్థానంలో నిలుపుతుంది.

Om Sairam
ReplyDelete