శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నా పేరు సాయిస్వరూప్. మనం బాబా ఫోటోను చూస్తున్నామంటే, ఆయన ఫోటోని చూస్తున్నట్లు కాదు, సాక్షాత్తూ బాబాను చూస్తున్నట్లే! ఆయన తన ఫోటోలో జీవించే ఉంటారని నాకు క్రింది అనుభవం ద్వారా తెలియజేసారు.
నేను మైసూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో శిక్షణ పొందుతున్న సమయమది. ఒకరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మా ఇంట్లోని నా గదిలో ఉన్నాను. తరువాత నేను అక్కడున్న బాబా ఫోటోని చూసాను. అది పూర్తిగా దుమ్ముతో కప్పబడిపోయివుంది. అలా బాబా ఫోటోని చూసాక నాకు చాలా బాధగా అనిపించి, ఫోటో మీద దుమ్ము శుభ్రపరచకుండా వదిలేసినందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. వెంటనే పరుగున వెళ్లి, ఒక గుడ్డముక్క తీసుకొచ్చి బాబా ఫోటోను శుభ్రపరిచాను. అంతటితో కల ముగిసింది!
ఉదయం లేచాక ఆ కల గుర్తుకు తెచ్చుకున్నాను. అప్పుడు ఖచ్చితంగా చెప్పలేను కానీ, "అచ్చం కలలో నేను చూసిన బాబా ఫోటోలాంటి ఫోటో నా గదిలో వుండి ఉండాలి కదా!" అనిపించింది. వెంటనే నేను మా నాన్నకు ఫోన్ చేసి, నా కల సంగతి చెప్పకుండా, "నా గదిలో ఉన్న అలమరాలో ఫోటో ఏదైనా ఉందేమో చూడమ"ని చెప్పాను. నేను ముందుగా ఫోటో నిజంగా ఉందా లేదా అని నిర్ధారించుకుందామనుకున్నాను. నాన్న అంతా వెతికి, "బాబా ఫోటో ఒకటి పూర్తిగా దుమ్ముతో నిండి ఉంది" అని చెప్పారు. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. అప్పుడు నాన్నకి నా కల గురించి చెప్పాను. అది చెప్పాక, అక్కడ వాళ్ళకి దొరికిన బాబా ఫోటో అచ్చం నేను కలలో చూశానని చెప్తున్న ఫోటోలాగానే ఉందని నా తల్లిదండ్రులద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ ఫోటోని శుభ్రం చెయ్యమని వాళ్ళకి చెప్పాను. మా నాన్న దాన్ని శుభ్రపరిచి, బాబా నుదుటిపై చందనమద్ది, నా అలమరాలోని అదే స్థలంలో ఉంచారు. దీన్నిబట్టి, "నాకు నా ఫొటోకు భేదమేలేద"ని బాబా చెప్పిన వాక్యాలు ఎంత సత్యమో అర్థమయ్యింది.

🕉 sai Ram
ReplyDelete