శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
గుంటూరు నుండి వై.శ్రీనివాసరావుగారు తమ మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
2013 అక్టోబర్ నెల దసరా సెలవుల్లో నేను నా భార్య, మా అబ్బాయిలు మరియు అత్తమామలతో కలిసి మొదటిసారి శిరిడీ వెళ్ళాను. శిరిడీ చేరుకున్నాక, ఆరోజు సాయంత్రం మేము బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా మాకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ సమాధిమందిరం నుండి బయటకు వచ్చాక, మేము లక్ష్మీబాయిషిండే ఇల్లు, ఆమెకు బాబా ఇచ్చిన 9 నాణెములు, ఇంకా బాబా తిరిగిన ప్రదేశాలు చూడాలని అనుకున్నాము. అంతలో నా భార్య, అత్తమామలు ఏదో పనిమీద అలా ప్రక్కకు వెళ్లారు. ఆ సమయంలో ఒక ముసలాయన చేతిలో ఒక చిన్నకర్ర పట్టుకొని, దాన్ని అటు ఇటు ఊపుతూ మా వద్దకు వచ్చి, మరాఠీలో, "బాబా తిరిగిన ప్రదేశాలు చూపిస్తాను" అని చెప్పారు. మాకు మరాఠీ భాష రాకపోయినా ఆయనను చూస్తూ తన వెనకే నేను, మా అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్ళాము. ఆయన చేతిలోని కర్ర ఊపుతూ నడిచే తీరు అచ్చం బాబాలాగే ఉంది. చుట్టుప్రక్కల బాబా తిరిగిన ప్రదేశాలన్నీ ఆయన చూపించారు. తరువాత నేను ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టాను. ఆయన నావైపు చూస్తూ ఒక నవ్వు నవ్వారు. తరువాత ఆయన కొంచెం దూరంగా వెళ్ళి అదే చూపు, అదే నవ్వుతో నిలుచున్నారు. కొద్దిసేపటికి నా భార్య, అత్తమామలు వచ్చారు. జరిగిన విషయం వాళ్ళకి చెప్పగా, వాళ్ళు కూడా ఆయన్ని చూస్తామని అడిగారు. చూస్తే ఆయన ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనపడలేదు. అప్పుడు బాబా తానే స్వయంగా వచ్చి అక్కడి ప్రదేశాలు చూపించినట్లు నాకర్థమై ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. నా ఆనందానికి అవధుల్లేవు. కానీ, నేనెంత మూర్ఖుడినో, స్వార్థపరుడినో, లోభినో తలచుకుంటే నామీద నాకే అసహ్యం వేసింది. ఎందుకంటే, ఇంతకుముందు నా అనుభవంలో మీకు చెప్పినట్లు బాబా నా ఆర్థిక బాధలు తీర్చి, నా భార్యకు ఉద్యోగం ఇచ్చి, మా అబ్బాయిలలో ఒకరిని ఇంజనీరుగా, మరొకరిని డాక్టరు చదువుకునేలా చేసి, ఎప్పుడూ నాతో వుంటూ, నా బాధలు తీరుస్తూ, నాకెన్నో ఇచ్చిన బాబా చేతిలో కేవలం పదిరూపాయలు పెట్టి నా స్వార్థబుద్ధిని చూపించాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నామీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పటికీ ఆయన రూపం, ఆయన చూసిన చూపు, నవ్విన నవ్వు నా కళ్ళముందు కదలాడుతున్నాయి. కానీ, బాబా నా నుండి ఏమీ ఆశించకుండా ఇప్పటికీ నా బాధలు తీరుస్తూ, మా కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నారు. ఇది నా జీవితంలో మరచిపోలేని ఘటన.

No comments:
Post a Comment