సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 826వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కుటుంబాన్ని కాపాడిన బాబా
2. కరోనా నుండి రక్షించిన బాబా
3. బాబా కృపతో కోవిడ్ నెగిటివ్ - తగ్గిన జ్వరం

కుటుంబాన్ని కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు విద్యావతి. నేను ఇప్పుడు బాబా మా కుటుంబాన్ని కాపాడిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2016లో నా సోదరికి గర్భసంచి క్యాన్సర్ రావడంతో కీమోథెరపి రేడియేషన్ ఇచ్చి, శస్త్రచికిత్స చేశారు. బాబా దయవల్ల తను ఆరునెలల్లో కోలుకుంది. అప్పటినుండి తను ప్రతి మూడు నెలలకు ఒకసారి చెకప్‌కి వెళ్తుండేది. అలా 2020లో ఒకసారి వెళ్ళొచ్చాక హాస్పిటల్ నుండి, 'ట్యూమర్ మళ్లీ వచ్చింది. కాబట్టి మీరు మరోసారి చెకప్ కోసం హాస్పిటల్‌కి రావాలి' అని మెసేజ్ వచ్చింది. అది చూసి మేము చాలా భయపడిపోయాము. తనకేమవుతుందో ఏమిటోనని చాలా కంగారుపడి, "తనకు ఏమీ కాకూడదు" అని బాబాను వేడుకున్నాము. తరువాత తను చెకప్‌కి బెంగుళూరు వెళ్ళింది. బాబా అద్భుతం చేసి తనను కాపాడారు. హాస్పిటల్ వాళ్ళు, "రిపోర్టులు మారిపోయాయి. అదే పేరు ఉన్న వేరే పేషెంట్ రిపోర్టులు చూసి పొరపాటుపడ్డామ"ని చెప్పారు. అంతేకాదు, తనను మళ్లీ చెక్ చేసి, "మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఏ సమస్యా లేద"ని చెప్పారు. అంతా బాబా దయ. ఆయన కృపకు మేము చాలా ఆనందించాము. తను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను మన్నించండి".


2021, మే నెలలో మా బంధువులలో ఒకరు చనిపోయారు. వారి కుటుంబసభ్యులను అడిగితే, 'కరోనా వల్ల కాదు, వేరే ఆరోగ్య సమస్య వల్ల' అని చెప్పారు. తీరా మేము అక్కడికి వెళ్ళాక కరోనా కాదని కొందరు, కరోనా అని కొందరు మాట్లాడుకుంటున్నారు. అది విని నేను చాలా భయపడ్డాను. అక్కడినుండి ఇంటికి తిరిగి వచ్చాక నాకు, నా భర్తకు, పిల్లలకు, మా అమ్మానాన్నలకు అందరికీ దగ్గు, జలుబు మొదలయ్యాయి. అందరమూ చాలా భయపడిపోయాము. తరువాత నాకు, తమ్ముడికి రుచి, వాసన కూడా తెలియలేదు. దాంతో మాకు అనుమానం వచ్చి అందరమూ ఇంట్లోనే ఉంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు తెలిసిన ఒక నర్సు ఉంటే తనకు ఫోన్ చేసి మాకున్న లక్షణాలు చెప్పాము. తను 'టెస్ట్ ఏమీ వద్ద'ని చెప్పి, కొన్ని మందులు వాడమని సూచించింది. భయంతో బాబాకు చెప్పుకుని, భారం ఆయన మీదే వేసి 10 రోజులు మందులు వాడాము. ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగుతుండేవాళ్ళం. నేను, "బాబా! మా అందరికీ ఏ ఇబ్బందీ లేకుండా త్వరగా తగ్గిపోవాలి. అలాగే మంచి ఆరోగ్యం చేకూరాలి. మాకు నయం అయిన వెంటనే ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా మాపై దయచూపారు. ఒక్క వారంలోనే అందరమూ కోలుకున్నాము. ఇప్పుడు మేమంతా బాగున్నాము. "బాబా! మీకు అనేకానేక కృతజ్ఞతలు. ఎల్లవేళలా నన్ను, నా కుటుంబాన్ని ఇలాగే చల్లగా కాపాడు తండ్రీ. సదా మీ పాదాలనే అంటిపెట్టుకునివున్న నన్ను ఏ లోటూ లేకుండా కాపాడు తండ్రీ. నా బిడ్డ బాధ్యతలన్నీ నేను చక్కగా నెరవేర్చేవరకు నాకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ప్రసాదించు తండ్రీ. మీ కృపతో నా కొడుకు ఏ లోటూ లేకుండా సంతోషంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ. చివరిగా, ఈ ప్రాణాంతకమైన కరోనా నుండి మమ్మల్నందరినీ కాపాడండి బాబా".


కరోనా నుండి రక్షించిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ ద్వారా ఎందరో సాయిభక్తులు బాబాతో తమకున్న అనుబంధాన్ని అందరికీ పంచుతున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. బాబా అలనాడు హేమాడ్‌పంతుకు గిన్నెడు మజ్జిగను త్రాగమని ఇచ్చారు. అదేవిధంగా ఈనాడు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా బాబా తమ భక్తుల అనుభవాల రూపంలో తమ ప్రేమామృతాన్ని ధారాపాతంగా మనకు అందిస్తున్నారు. ఈ అమృతధారలను ప్రతిరోజూ ఆస్వాదిస్తూ సాయి దీవెనలను పొందుదాం. ఇకపోతే, నా పేరు మాధవి. నాకు బాబాతో ఉన్న అనుబంధాన్ని ఎంతని చెప్పను? ప్రతి విషయంలో బాబా నన్ను కాపాడుతూనే ఉంటున్నారు. ప్రతి విషయంలో నాకు అండదండగా ఉంటూ నన్ను రక్షించే తండ్రి, 'బాబా..' అని తలవగానే, 'ఓయ్...' అంటూ పలుకుతూ, 'నేనున్నాను' అని ధైర్యమిస్తూ, కష్టసుఖాలలో చెంతనే ఉండి అభయాన్ని ఇస్తున్న నా తండ్రికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.


2021, ఏప్రిల్ 17న మా పెద్దమ్మాయికి, అల్లుడికి, మనుమరాలికి కరోనా పాజిటివ్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే, మా మనుమరాలు మూడు సంవత్సరాల చిన్నపిల్ల. అందువలన నేను నా సాయితండ్రికి చెప్పుకుని ఏడ్చాను. "బాబా! మీరే వాళ్లను కాపాడాలి. వాళ్ల బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను" అని ప్రార్థించి, బాధ్యతను బాబాకు అప్పగించి గురువారంనాడు ‘శ్రీసాయిసచ్చరిత్ర’ సప్తాహపారాయణ మొదలుపెట్టాను. అదేరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో, ఒక నల్లటి పాము మా చెల్లెలి వాళ్లింట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద చుట్టుకుని పడుకుని ఉండటం నాకు కనిపించింది. నేను దానిని చూసి, "ఇది ఇక్కడ ఉందేమిటి? ఎలాగైనా దీనిని ఇక్కడి నుండి తీసివేయాలి" అనుకుని దానిమీద ఒక వస్త్రాన్ని వేసి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన తరువాత శ్రీమంజునాథుడు ఆ నల్లని పామును చేతితో పట్టుకుని, "నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? వెళ్ళిపో!" అంటూ దానిని బయటపడేశారు. నా సాయినాథుడే మంజునాథుని రూపంలో వచ్చి కరోనా మహమ్మారిని తరిమికొట్టి మా అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతున్నారని నాకు అనిపించింది. అదే నిజమైంది. బాబా ఆశీస్సులతో మా అమ్మాయి కుటుంబంలో అందరికీ కరోనా తగ్గింది. బాబా దయవలన ఇప్పుడు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా కృపతో కోవిడ్ నెగిటివ్ - తగ్గిన జ్వరం

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను గత 26 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మొదటిసారిగా మీతో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 7వ తేదీన మా పెద్దబ్బాయికి జ్వరం వచ్చింది. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నందున కరోనా ఏమోనని భయపడి బాబాను వేడుకుని, కొద్దిగా బాబా ఊదీని మా అబ్బాయి నోట్లో వేశాను. తరువాత తనను డాక్టరుకి చూపిస్తే, "అది వైరల్ ఫీవర్" అని చెప్పారు. ఆ తరువాత మావారికి, చిన్నబ్బాయికి కూడా జ్వరం వచ్చింది. కరోనా ఏమోనని భయపడ్డాను. బాబాను వేడుకుని డాక్టరుకి చూపిస్తే ఇద్దరికీ టైఫాయిడ్ అని తేలింది. మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గకపోయేసరికి భయపడి కరోనా పరీక్ష చేయించాము. అప్పుడు నేను బాబా మందిరానికి వెళ్లి, బాబా పాదాలు పట్టుకుని వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. ఆనందంగా బాబాకు నా నమస్కారాలు చెప్పుకున్నాను. బాబా కృపతో కొద్దిరోజుల్లో మావారికి, బాబుకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం సదా మాపై ఉండాలి".


9 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Kothakonda SrinivasJuly 5, 2021 at 1:10 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉🙏😊

    ReplyDelete
  4. Om sai baba i want to right no fear if you are there. We are humans thats why we fear for all things happening to us. Sai is there to take care of us. With this trust we must live. Om sai baba❤❤❤❤

    ReplyDelete
  5. Om Sree Sai Arogya Kshemadhaya Namaha ❤🕉🙏😊

    ReplyDelete
  6. Om sai ram baba amma problem tondarga tagginchu thandri pleaseeee nails infection kuda tagginchu thandri

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh life bagundali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo