సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 840వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎన్నెన్నో విధాల కాపాడే సాయినాథుడు
2. బాబా ఆశీర్వాదాలు
3. మనవరాలి ఆరోగ్యం విషయంలో బాబా చేసిన సహాయం

ఎన్నెన్నో విధాల కాపాడే సాయినాథుడు

 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు కుమార్. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సాయిలీలలు అంత మధురంగా ఉంటాయి మరి. నేను వృత్తిరీత్యా హైదరాబాదులో ఉంటున్నాను. నా తల్లిదండ్రులు మా స్వగ్రామంలో ఉంటారు. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలయ్యాక మా స్వగ్రామంలో మా ఇంటికి ఇరుగుపొరుగున ఉండే ఇళ్ళలో ఉన్నవాళ్లకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అది తెలిసి అమ్మానాన్నలు ఎంతో భయపడసాగారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను మా స్వగ్రామం వెళ్ళి అమ్మానాన్నలను నా దగ్గరకు తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాను. కానీ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. పైగా నేను మా స్వగ్రామం వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటి వేరే రాష్ట్రంలోకి వెళ్ళాలి. రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు ముమ్మరంగా ఉన్నాయనీ, అసలు ఎవ్వరినీ సరిహద్దులు దాటి వెళ్ళనివ్వడం లేదనీ విని మా స్వగ్రామానికి ఎలా వెళ్ళాలో తెలియక చాలా బాధపడ్డాను. బాబాకు నమస్కరించుకుని ఈ-పాస్ కొరకు దరఖాస్తు చేసి, అనుమతి కొరకు ఎదురుచూస్తూ, "బాబా! ఎలాగైనా పాస్ దొరికేలా చూడండి. అక్కడ నా తల్లిదండ్రులు ఒంటరిగా, భయంభయంగా నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మీరే ఎలాగైనా సహాయం చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవలన అదేరోజు సాయంత్రం పాస్ అనుమతించబడినట్లు నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మా స్వగ్రామం 350 కి.మీ.ల దూరంలో ఉంది. అంటే, రానుపోను 700 కి.మీ.లు ఒక్కరోజులో ప్రయాణం చేయాలి. అంతదూరం నేను ఒక్కడినే డ్రైవింగ్ చేయలేనని ఆందోళన చెంది బాబాకు నమస్కరించుకున్నాను. కొంతసేపటికి మా ప్రక్క అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వాళ్ళ అబ్బాయి (మంచి డ్రైవర్) నాతోపాటు వచ్చి డ్రైవింగ్ చేస్తానని ఒప్పుకున్నాడు. దాంతో ఇద్దరమూ మా స్వగ్రామం వెళ్ళి అమ్మానాన్నలను హైదరాబాదుకి తీసుకుని వచ్చాము. మొత్తం డ్రైవింగ్ ఆ అబ్బాయే చేశాడు. అంత సహాయం చేసిన తనకు డబ్బులివ్వబోతే, వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది బాబా లీల కాకపోతే మరేమిటి? ఈ కోవిడ్ సమయంలో ఎవరూ ఎవరికీ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అలాంటిది నేను ఒక్కసారి అడగగానే, అతను నాతో వస్తానని ఒప్పుకుని, వచ్చి అంత సహాయం చేసి, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు.


అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఆ మరుసటిరోజు నుంచి నాకు జ్వరం, విపరీతమైన ఒళ్ళునొప్పులు, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో నొప్పి, ముక్కు దిబ్బడ, చేతులు, కాళ్ళలోంచి వేడి ఆవిరులు. అసలే కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్న రోజులవి. ప్రతిరోజూ 2 లక్షల కోవిడ్ కేసులు, ఎన్నో మరణాలు. ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా భయం. అలాంటి సమయంలో నాకిలా అయ్యేసరికి నేను చాలా భయపడిపోయాను. నా పరిస్థితి చూసి ఇంట్లోవాళ్ళు కూడా భయపడిపోయారు. వెంటనే నా సాయిబాబా పటం దగ్గరకు వెళ్ళి, కన్నీళ్ళతో బాబాను ప్రార్థించి, "నాకున్న ఈ సమస్యలన్నీ తగ్గి నేను నార్మల్ అయితే, నాకు మీరు చేసిన సహాయాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని మ్రొక్కుకున్నాను. తరువాత ఊదీ కలిపిన నీటిని తీర్థంలా త్రాగుతూ, బాబా నామం చేసుకుంటూ ఉన్నాను. దాంతోపాటు మందులు కూడా వేసుకున్నాను. కేవలం బాబా దయవలన మూడవరోజు నుంచి ఛాతీలో నొప్పి తగ్గడం మొదలై, నెమ్మదిగా నాలుగురోజులలో పూర్తిగా తగ్గిపోయింది. సరిగ్గా వారంరోజుల్లో నేను పూర్తిగా నార్మల్ అయ్యాను. అటువంటి క్లిష్ట పరిస్థితులలో నేను ఏ హాస్పిటల్‌కీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రికవర్ అయ్యాను అంటే అది కేవలం నా సాయిబాబా దయవలన మాత్రమే. "బాబా! మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. మీరు మాకు చేసిన సహాయాలకు కృతజ్ఞతాభావంతో హృదయపూర్వకంగా అంగాంగ సర్వాంగ సాష్టాంగ నమస్కారములు తెలుపుకుంటున్నాను".


ఇంకొక అనుభవం:-  మా నాన్నగారు మా స్వగ్రామంలో ఉండగా ఒకరోజు బయటికి వెళ్ళి వచ్చారు. అప్పటినుంచి ఆయనకు జలుబు, దగ్గు, తుమ్ములు మొదలయ్యాయి. మా అమ్మ నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అది విని నేను చాలా భయపడిపోయాను. "అసలే కోవిడ్ సెకండ్ వేవ్ సమయమిది. ఈ సమయంలో బయటికి ఎందుకు వెళ్ళాలి?" అని ఫోన్లోనే నేను వాళ్ళను కొద్దిగా మందలించాను. ఆ తరువాత నేను బాబా పటం దగ్గరకు వెళ్ళి, నమస్కరించుకుని, "బాబా! నాన్నకి కోవిడ్ కాకుండా చూడండి. అలా అయితే గనక నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు నాన్నకి టెస్ట్ చేయిస్తే నెగిటివ్ అని వచ్చింది. ఈవిధంగా ఆ సాయినాథుడు నన్ను, మా కుటుంబాన్ని ఎన్నెన్నో విధాలుగా కాపాడుతున్నారు. "నాదొక విన్నపం బాబా! ఈ కోవిడ్ కారణంగా ఎన్నో జరగరాని అనర్థాలు జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారారు. ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతోంది. ఇంత పెద్ద సమస్య నుండి కేవలం మీరు మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడగలరు. రక్షించండి సాయినాథా! రక్షించండి బాబా!"


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఆశీర్వాదాలు


వ్యాక్సిన్ విషయంలో బాబా ఆశీర్వాదం:


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను సాయిభక్తురాలిని. మా నాన్నకి 60 సంవత్సరాలు. ఇటీవల మా అమ్మానాన్నలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అప్పుడు నేను, "వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఇచ్చిన పారాసిటమాల్ టాబ్లెట్లు అమ్మావాళ్ళు వేసుకున్నారు. ఇంజక్షన్ వేసిన చోట కొద్దిగా నొప్పి అనిపించడం తప్ప పెద్దగా ఏ ఇబ్బందీ వాళ్ళకు కలగలేదు. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన వాళ్ళు ఎటువంటి ఇబ్బందీ పడలేదు. సెకండ్ డోస్ కూడా ప్రాబ్లమేమీ లేకుండా అయ్యేలా చూడండి సాయీ. కానీ రెండు వారాలు ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మీకు తెలుసు కదా, ఈమధ్య నా జీవితంలో ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో, నన్ను ఎంతలా కృంగదీసిందో! నా బాధకు మీరే సాక్షిగా ఉన్నారు సాయీ. దయచేసి ఈ కరోనాని త్వరగా అంతమొందించండి".


ఇంటర్వ్యూ విషయంలో బాబా ఆశీర్వాదం:


2021, జూన్ 12న ఒక ఇంటర్వ్యూ తీసుకుంటుంటే, కాల్ జాయిన్ అవగానే లాప్‌టాప్ షట్‌డౌన్ అయిపోయింది. అలా మూడుసార్లు జరిగింది. అప్పుడు నేను, "ఎలాగైనా ఈ ఇంటర్వ్యూ పూర్తయితే, రేపు సాయి అష్టోత్తర శతనామావళి చదివి, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబా దయవలన నా మొబైల్‌లో ఇంటర్వ్యూ తీసుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చేలా చూడండి సాయీ. అలాగే, ప్రేమలో ఉండి పెళ్లికోసం ఎదురుచూస్తున్నవాళ్ళను దీవించి, వాళ్ళ ప్రేమ గెలిచేలా అనుగ్రహించండి". 


సర్వేజనాః సుఖినోభవంతు.


మనవరాలి ఆరోగ్యం విషయంలో బాబా చేసిన సహాయం


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులకు నమస్కారం. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి మా మనవరాలికి బాగా జ్వరం వచ్చింది. కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి అయినప్పటికీ పాపకి బాగా రాషెస్ రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితై మావాళ్ళు పాపని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టరు పాపని పరీక్షించి, "పల్స్ బాగా పడిపోయింది. హార్ట్ బీట్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేము" అని చెప్పారు. వెంటనే నేను బాబా ప్రేరణగా మా గురువుగారిని సంప్రదించాను. ఆయన, "పాపకి ఏమీ కాదు. నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది" అని అన్నారు. ఆయన అలా చెప్పిన వెంటనే అనూహ్యంగా పాప పల్స్ పెరగడం, హర్ట్ బీట్ తగ్గడం జరిగి పాప తొందరగానే కోలుకుంది. ఇప్పుడు పాప పూర్తి ఆరోగ్యంతో నార్మల్‌గా ఆడుకుంటోంది. ఈవిధంగా బాబా మమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. "ధన్యవాదాలు బాబా".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


9 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🙏🕉😀😊❤

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om sai ram i have to say that baba gave all things to us. There is no need to worry om sai ram❤❤❤

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri sainatha

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh ki day shifts ravali arogyam bagundali thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo