1. దివ్యపూజ ముగిసేలోపు లభించిన బాబా అనుగ్రహం
2. వ్యాక్సిన్ వేయించేందుకు బాబా ఇచ్చిన అనుమతి
3. సాయి కరుణకు అంతులేదు!
దివ్యపూజ ముగిసేలోపు లభించిన బాబా అనుగ్రహం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
నా పేరు మాధురి. ముందుగా సాయిబంధువులకు నా నమస్కారాలు. మాకు ఒక పాప. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలకు ముందు తను చాలా అనారోగ్యం పాలైంది. అదే సమయంలో తను ఎంసెట్‌కి కూడా ప్రిపేర్ అవుతుండేది. మేము డాక్టరుని సంప్రదిస్తే, "స్ట్రెయిన్ అవటం మంచిది కాదు, పరీక్షలు వ్రాయించొద్ద"ని చెప్పారు. అయినా మా పాప పరీక్షలు వ్రాసింది. బాబా దయవలన తనకు మంచి మార్కులు వచ్చాయి. ఎంసెట్ కూడా వ్రాసి, మేముండే ఊరిలోనే తను ఇంజనీరింగులో చేరింది. "ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత యు.ఎస్ వెళతాను, ఒక సంవత్సరం ఉద్యోగం చేస్తాను" అని చెప్పింది. అనుకున్నట్లే యు.ఎస్ వెళ్లేందుకు అక్కడి కాలేజీలలో దరఖాస్తు చేసుకుంది. అడ్మిషన్స్ కూడా వచ్చాయి. కానీ అంతలోనే కరోనా రావడంతో 2020వ సంవత్సరం యు.ఎస్ వెళ్ళలేదు. ఇంటర్ పరీక్షలకు ముందు అనారోగ్యం పాలవడం, కరోనా వలన యు.ఎస్ వెళ్ళలేకపోవడం వలన తను బాగా నిరాశకు లోనై, "నేను ఏమి అనుకున్నా అవేమీ జరగవు" అని అంటూ ఉండేది. తన మాటలకు నాకు చాలా బాధగా అనిపించేది. సరే, ఈ సంవత్సరం(2021)లో అయినా యు.ఎస్ వెళ్లాలని మళ్ళీ దరఖాస్తు చేసేసరికి సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. దాంతో, 'ఈసారైనా తను యు.ఎస్. వెళ్లడం, కుదురుతుందా, లేదా?' అని అనుకున్నాము. తను వీసా కోసం స్లాట్ బుక్ చేసుకుంటే, జూన్ నెలలో స్లాట్ ఇచ్చారు. అయితే జూన్ నెల మొదలయ్యే ముందే దాన్ని క్యాన్సిల్ చేశారు.
నేను మా పాపకోసం నవగురువారవ్రతం చేశాను. ఇంకా సాయి దివ్యపూజ కూడా మొదలుపెట్టాను. మొదటి గురువారం సంకల్పం చేసుకుని, ముడుపు కట్టాను. కానీ ఎందుకో నాకు తృప్తి అనిపించక రెండవ గురువారం మళ్లీ ముడుపు కట్టి, ఐదు గురువారాలు సంకల్పం చేసుకుని మళ్ళీ వ్రతం మొదలుపెట్టాను. తరువాత బయోమెట్రిక్ టెస్ట్ కోసం ఢిల్లీ రమ్మని పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా లాక్‌డౌన్. అందువలన ఢిల్లీ ఎలా వెళ్ళాలా అని మాకు భయమేసింది. అప్పుడు నేను, "పాప వాళ్ళు క్షేమంగా వెళ్లి, తిరిగి వచ్చేలా చూడమ"ని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. బాబా దయవలన సరిగ్గా బయోమెట్రిక్ టెస్ట్ రోజున లాక్‌డౌన్ తీసేశారు. పాప వాళ్ళు క్షేమంగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. తరువాత వీసా ఇంటర్వ్యూకి హైదరాబాదులో డేట్ ఇచ్చారు. ఆలోపు నాలుగు వారాల దివ్యపూజ పూర్తయి ఇంకొక గురువారం ఉంది. ఐదవ గురువారానికి రెండు రోజుల ముందు తన వీసా ఇంటర్వ్యూ జరిగి, తనకు వీసా వచ్చింది. ఐదవ గురువారం ఉద్యాపన సమయానికి బాబా నా టెన్షన్ అంతా తీసేశారు. నాకు చాలా చాలా ఆనందాన్ని ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. మీ ఋణం తీర్చుకోలేనిది. మీరు చెప్పిన విధంగా నడచుకోవటమే మేము మీకు ఇచ్చే ఆనందం. మీ దయ, కృప అందరిమీదా ఇలాగే ఉండాలనీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".
వ్యాక్సిన్ వేయించేందుకు బాబా ఇచ్చిన అనుమతి
ఓం శ్రీసాయి సర్వభయనివారణాయ నమః
అందరికీ నమస్కారం. మా అందరికీ బాబా ఇచ్చే ఆశీర్వాదాలను తోటి సాయిబంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారాలు. నేను ఇప్పుడు పంచుకోబోయే బాబా ఆశీర్వాదం మీ అందరితో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. ఇక నా అనుభవంలోకి వెళితే..
కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటినుంచి 'మా అమ్మకి వ్యాక్సిన్ వేయించాలా, వద్దా' అని నేను చాలా ఆలోచించాను. మా బంధువుల్లో చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అమ్మకంటే పెద్దవాళ్ళు కూడా వేయించుకున్నారు. అందరూ బాగున్నారు. ఆ ధైర్యంతో 'అమ్మకి వ్యాక్సిన్ వేయిద్దాం' అనిపించేది. కానీ కొంతమంది 'వద్దు' అని భయపెట్టారు. మన బ్లాగులో కూడా ఒక భక్తురాలు వ్యాక్సిన్ గురించి అడిగితే, బాబా 'వద్దు' అన్నారని పంచుకున్నారు. అది చదివాక నా భయం ఇంకా ఎక్కువైంది. మహాపారాయణ చేసే ఒక భక్తురాలు కూడా వ్యాక్సిన్ గురించి నెగిటివ్‌గా చెప్పారు. వీటివల్ల నాకు చాలా అయోమయంగా ఉండేది. అయినప్పటికీ 'వాక్సిన్ వేయించుకోవటం చాలా అవసరం కదా!' అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. ఇక బాబా పైనే భారం వేసి డేట్ ఫిక్స్ చేశాము. తరువాత నేను బాబాను ఇలా అడిగాను: "బాబా! అమ్మకి వ్యాక్సిన్ వేసేలోపు మీరు గ్రీన్ డ్రెస్ వేసుకుంటే, వ్యాక్సిన్ సేఫ్ అని భావిస్తాను" అని. అలా బాబాను అడిగిన తర్వాత మధ్యాహ్న, సంధ్య ఆరతుల్లో బాబా గ్రీన్ డ్రెస్ వేసుకోలేదు. దాంతో, 'బాబా వ్యాక్సిన్ వద్దు అంటున్నారా?' అని నాకు అనిపించింది. కాసేపటికి మావయ్య ఫోన్ చేసినప్పుడు మాటల్లో వ్యాక్సిన్ గురించి చెప్పగానే తను, "మా అక్కకి(మా అమ్మకి) ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ వద్దు" అని చెప్పారు. కారణం, తనకు తెలిసినవాళ్ళు వ్యాక్సిన్ వేశాక చనిపోయారట. దాంతో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. సరే, 'బాబాదే కదా తుది నిర్ణయం! వ్యాక్సిన్ వేసేలోపు ఇంకా రెండు ఆరతులు ఉన్నాయి కదా, ఆయన ఎప్పుడూ మనకి ఏది మంచిదో అదే చేస్తారు' అని బాబా నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కానీ జరిగేవి చూస్తుంటే, బాబా 'వద్దు' అంటున్నారని మనసుకి అనిపిస్తుండేది. ఇకపోతే, ఆరోజు శేజ్ ఆరతిలో నా సాయి గ్రీన్ డ్రెస్సులో దర్శనమిచ్చి నా సందేహాలన్నీ ఒక్కసారిగా తీసేశారు. 'అమ్మకి వ్యాక్సిన్ వేయించటం మంచిది కాబట్టే బాబా తమ అనుమతిని ఇచ్చారు' అని అనుకున్నాను. బాబా అనుమతి ఇవ్వటంతో మర్నాడు కొంచెం కూడా భయం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్నాక అమ్మకి ఏ ఇబ్బందీ రాలేదు. అయినా నా సాయితల్లి ఆశీర్వదించాక అసలు ఇబ్బంది ఎందుకు వస్తుంది? "థాంక్యూ సో మచ్ బాబా. ఈ ఆశీర్వాదాన్ని వెంటనే పంచుకోలేకపోయాను. దానికి కారణం మీకు తెలుసు కదా బాబా". చివరిగా, అందరినీ సాయి భగవానుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
సాయి కరుణకు అంతులేదు!
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. తల్లిదండ్రులు లేని నాకు బాబానే తల్లీ, తండ్రి. నాపై బాబా కరుణ చాలా ఉంది. ప్రతిక్షణం ఆయన నా వెంట ఉండి నన్ను కాపాడుతుంటారు. మనకు ఏ బాధ ఉన్నా తీవ్రంగా బాబాను ప్రార్థిస్తే ఖచ్చితంగా తీరుస్తారు. నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలోనుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మొదటిసారి 'అనుభవమాలిక'లో పంచుకుంటున్నాను. నాకు 12 సంవత్సరాల కూతురు ఉంది. తన కనురెప్పలపై రెండు కురుపులు వచ్చాయి. ఆ కురుపులు లేచి నాలుగు నెలలైనా తగ్గలేదు. డాక్టరుకి చూపిస్తే, ఒక క్రీమ్ ఇచ్చి కొన్ని రోజులు వాడమన్నారు. అలాగే వేడినీళ్ళతో కాపడం పెట్టమన్నారు. అప్పుడు నేను, "బాబా! 5,000 సార్లు నీ నామజపం చేస్తాను. ఐదురోజుల్లో పాపకున్న కురుపులు తగ్గాల"ని బాబాను వేడుకున్నాను. ఐదవరోజు ఒక కురుపు పగిలి కొంచెం రక్తం వచ్చింది. ఇంకొక కురుపు మాత్రం చాలా పెద్దగా అయింది. మళ్లీ డాక్టరుకి చూపించాం. ఈసారి డాక్టరు ఆపరేషన్ చేయాలన్నారు. నేను భయపడి మళ్ళీ బాబాకు మ్రొక్కుకుని, 5,000 సార్లు సాయినామజపం చేశాను. సచ్చరిత్ర సప్తాహపారాయణ కూడా చేసి, "ఆపరేషన్ వద్దు బాబా. పాప చిన్నది. ఈ వయస్సులో తనకు ఆపరేషన్ లేకుండా చూడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం ఇంజెక్షన్ ఇచ్చి ఆ కురుపులను తీసేశారు. కట్ చేయలేదు, కుట్లు పడలేదు. బాబా దయవల్ల ఆ కురుపులు తగ్గిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు, నా కుటుంబానికి మీ రక్ష ఎల్లవేళలా ఉండాలి, ఉంటుందని నా నమ్మకం బాబా".
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sri Sai Ram ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😊😀
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
799 days
ReplyDeletesairam
Om sai ram you are our Lord sai.devotees are praying to you. Om sai ram ❤��������
ReplyDelete🌼🌷🙏🙏🙏🌷🌼Om Sri SaiRam 🌟🌼🌷
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba amma nail infection taggipovali thandri
ReplyDeleteBaba amma gurupournami nataki ani arogya samasyalu teerchu thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh life bagundali thandri
ReplyDeleteBaba ee karthik thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete