సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 824వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహ వీచికలు
2. నమ్ముకున్నవారిని బాబా తప్పక అనుగ్రహిస్తారు
3. సదా బాబా రక్షణలో

బాబా అనుగ్రహ వీచికలు


నేను సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ముందుగా సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. నా సిస్టర్‌కి ఇద్దరు పిల్లలు. ఈమధ్య వాళ్ళ కుటుంబమంతా మా అమ్మావాళ్ళింటికి వెళ్లారు. ప్రస్తుతం కరోనా వలన పరిస్థితులు ఏమీ బాగోలేవు. అందువలన అందరూ కాస్త భయపడుతుంటే నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా రాలేదు. "థాంక్యూ బాబా".


రెండవ అనుభవం:


ఒకసారి నేను మాక్‌బుక్‌లో మూవీ చూస్తున్నాను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదుగానీ హఠాత్తుగా మాక్‌బుక్‌ క్రిందపడిపోయింది. అప్పటినుంచి దాని స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా అది పనిచేయలేదు. వెంటనే నేను దానికి బాబా ఊదీ రాసి ప్రయత్నించాను. అయినా అది పనిచేయలేదు. తరువాత నా భర్త కూడా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను చాలా బాధపడ్డాను. అది ఈమధ్యనే తీసుకున్నాము. దాని ధర కూడా ఎక్కువే. ‘ఏంటి బాబా, ఇది పనిచేయట్లేదు?’ అని అనుకుంటూ, ‘మాక్‌బుక్‌ పనిచేసేలా చేయమ’ని మనసులో బాబాను అడుగుతూనే ఉన్నాను. నా భర్త సాయంత్రం మరోసారి ప్రయత్నించారు. అద్భుతం! బాబా దయవల్ల మాక్‌బుక్‌ పనిచేసింది. నాకు ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".


మూడవ అనుభవం:


ఒకసారి మా బాబు మా ఇంట్లో ఉండే బాబా, వినాయకుడి ఫోటోలు తీసి, ఆడుకుని ఎక్కడో పడేశాడు. బాబు ఫోటోలు తీయడం నేను గమనించలేదు. తరువాత ఫోటోలు లేకపోవడం చూసి ఇల్లంతా వెతికాను. కానీ ఆ ఫోటోలు కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! ఆ ఫోటోలు దొరికితే ఆ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. రెండు రోజులు గడిచినా ఫోటోలు దొరకలేదు. మూడవ రోజున మా బాబే మళ్లీ ఆ ఫోటోలు బయటకి తీశాడు. వాటిని ఎక్కడనుండి తీశాడో నాకు అర్థం కాలేదు. రెండు రోజుల పాటు ఇల్లంతా వెతికినా దొరకనివాటిని మా బాబుకే దొరికేలా చేసి బాబా తమ ప్రేమను చాటారు. "థాంక్యూ బాబా".


నాల్గవ అనుభవం:


సంవత్సరం ఎనిమిది నెలల వయసున్నప్పుడు ఒకసారి మా బాబు ఆడుకుంటూ హఠాత్తుగా డైనింగ్ టేబుల్ మీద నుంచి క్రిందపడిపోయాడు. తనకు బాగా దెబ్బ తగిలి, వాచిపోయింది. బాబు బాధతో ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే బాబా ఊదీని గాయంపై రాసి, "ఈ గాయం తగ్గిన వెంటనే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన రెండు రోజుల్లో బాబుకి అయిన గాయం తగ్గింది. "థాంక్యూ బాబా".


ఐదవ అనుభవం:


ఈమధ్య మా అమ్మ, నాన్న ఇద్దరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వాళ్ళకు ఏవైనా సమస్యలు వస్తాయేమోనని నాకు భయం వేసి, "వాళ్ళిద్దరికీ ఎలాంటి సమస్యలూ రాకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అమ్మకి రెండు రోజులు జ్వరం, ఒళ్ళునొప్పులు ఉన్నప్పటికీ తరువాత తగ్గిపోయాయి. బాబా దయ, ఆశీస్సుల వలన ఇప్పుడు ఇద్దరూ బాగున్నారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఆరవ అనుభవం:


ఒకరోజు మావారు జలుబు, తీవ్రమైన దగ్గు వల్ల గొంతంతా నొప్పిగా ఉందని అన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల వల్ల నాకు చాలా భయం వేసి, "బాబా! మీ అనుగ్రహంతో మావారికి జలుబు, దగ్గు తగ్గితే ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో మావారి జలుబు, దగ్గు తగ్గిపోయాయి. ఆ మరుసటిరోజు మావారు తన కడుపంతా మంటగా ఉంది అన్నారు. నేను వెంటనే మజ్జిగలో పంచదార కలిపి ఇచ్చాను. కానీ చాలాసేపటివరకు తనకు తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు చెప్పుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజుకి మావారి ఆరోగ్యం నార్మల్ అయ్యింది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".


నమ్ముకున్నవారిని బాబా తప్పక అనుగ్రహిస్తారు


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తుడిని. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సాయినాథుడు నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాతోపాటు పనిచేస్తున్న ఒక సహోద్యోగి ఫిబ్రవరి మాసంలో ఒకరోజు నాతో, "నేను శిరిడీ వెళుతున్నాన"ని చెప్పాడు. నేను అతనితో, "శిరిడీ నుండి సాయి ఆశీస్సులు, ఊదీ కావాల"ని చెప్పాను. అందుకతను, "ఇప్పుడున్న పరిస్థితులలో ఊదీ ఇవ్వరు. అయినప్పటికీ నా వంతు ప్రయత్నిస్తాను" అన్నాడు. నేను, "లేదు, సాయి ఖచ్చితంగా నాకోసం ఊదీ పంపుతారు" అని గట్టి నమ్మకంతో చెప్పాను. సాయినాథుడు నా మొర ఆలకించారు, నా నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు. నేను అనుకున్నదానికంటే ఎక్కువ ఊదీ పంపారు. నిత్యం బాబా ఊదీని ధరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.


మరొక అనుభవం:

      

మేము ఒకసారి సాయినాథుని 5 గురువారాల వ్రతం చేసుకోవాలని అనుకుని అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రతి గురువారం బాబాకు నైవేద్యం పెట్టి భక్తితో సాయినాథుని పూజించాము. ఇలా నాలుగు వారాలు గడిచాయి. చివరి వారం పూజ చేసి సాయి వ్రత పుస్తకాలు పదిమందికైనా పంచాలని మా కోరిక. అయితే 5వ వారం దగ్గర పడుతున్నప్పటికీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియలేదు. అటువంటి స్థితిలో మేము ఆ సాయినాథునిపైనే భారం వేశాం. బాబా దయవల్ల తరువాత సాయి వ్రత పుస్తకాన్ని తిరగేస్తుంటే అనుకోకుండా అందులో ఆ పుస్తకాలకు సంబంధించిన చిరునామా, ఫోన్ నెంబర్ కనిపించాయి. వెంటనే ఫోన్ చేసి వారితో మాట్లాడాను. వారు మధ్యప్రదేశ్‌లోని ఇండోరు నుండి పుస్తకాలు పోస్టులో పంపారు. అనుకున్నరోజు కంటే ముందే ఆ పుస్తకాలను మా ఇంటికి చేర్చారు సాయినాథుడు. గురువారం యథావిథిగా బాబాకు పూజ చేసి పుస్తకాలను పంచిపెట్టాము. సాయిని నమ్మినవారికి సాయిరక్ష ఎప్పుడూ ఉంటుంది. సాయినాథుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ... జై సాయినాథ్!


సదా బాబా రక్షణలో


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. బాబా నాకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుంచి పరిచయం. చిన్నప్పుడు ప్రతి గురువారం సాయంత్రం 6.30కి జరిగే బాబా ఆరతికి వెళ్తుండేవాడిని. కానీ చిన్న వయస్సు అయినందున బాబా ప్రేమ గురించి గానీ, తత్త్వం గురించి గానీ ఏ మాత్రం తెలీదు. వయసు పెరిగే కొద్దీ నేను బాబా గుడికి వెళ్ళడం మానేశాను. 10 సంవత్సరాల నుంచి నాకు విపరీతమైన రోగాలు. వాటివల్ల చాలా బాధపడ్డాను. ప్రేమ విఫలమవ్వటం వలన టాపర్‌ని కాస్తా ఫెయిల్ అయ్యే స్థితికి దిగజారి రోజూ ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవాడిని. అలాంటి స్థితిలో 3 సంవత్సరాల క్రితం 'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం' అనే గ్రంథ రూపంలో బాబా నన్ను మళ్ళీ తమ దగ్గరకు లాక్కున్నారు. నేను విపరీతంగా ఏడ్చే సమయంలో బాబా నాకు ఒక సందేశం పంపారు. అప్పటినుంచి ఈ బ్లాగ్ రూపంలో, ఫేస్‌బుక్ రూపంలో అవసరమైన సమయంలో ఎన్నోసార్లు బాబా నాకు సహాయం చేశారు. నేను కోరుకున్న దర్శనాలు నాకు అనుగ్రహించారు. ఒకరోజు, నాకు మూడు మరణగండాలు ఉన్నాయనీ, తనను నమ్ముకుంటే కాపాడతానని బాబా చెప్పారు. చెప్పినట్టుగానే రెండుసార్లు కాపాడారు. మూడవ గండం ఒక వ్యక్తి రూపంలో వచ్చింది. ఆ వ్యక్తి నన్ను తీవ్రంగా భయపెడుతుండేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేక నాకు చచ్చిపోవాలని అనిపించేది, అసహాయుణ్ణి అయిపోయానని ఏడుపొచ్చేది. కానీ బాబా నన్ను కాపాడారు. ఇటీవల మా డాడీకి కోవిడ్ వచ్చింది. ఆయన్ని కాపాడమని, డాడీని కోవిడ్ నుంచి కాపాడితే గనక ఆ అనుభవం బ్లాగులో పంచుకుంటానని బాబాను ప్రార్థించాను. బాబా మా డాడీని రక్షించారు. కేవలం డాడీనే కాదు, నా భార్యతో సహా మా ఇంట్లో నలుగురు సభ్యులను కరోనా నుంచి బాబా కాపాడారు. "ఇలా కాపాడుతాను, సిద్ధంగా ఉండు, కరోనా వచ్చినప్పుడు భయపడకు, నేను ఉన్నాను" అని రెండు నెలల ముందు నుంచి బాబా వివిధ మెసేజీల రూపంలో నాకు తెలియచేశారు. అసలు విషయమేమిటంటే, నాకు రాబోయే ఇబ్బందులు, ప్రమాదాల గురించి బాబా నాకు కలలో ముందే చెప్పడం లేదా ఆ సంఘటనలను చూపించడం చాలాసార్లు జరిగింది. అలా బాబా నన్ను చాలా సందర్భాలలో కాపాడారు. కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాబా కలుగజేసుకుని మొత్తం సంఘటనని వేరే విధంగా మార్చి నాకు రక్షణ ఇచ్చారు, ఇస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాపై మీరు ఎంతో ప్రేమ చూపుతున్నారు. మీ అనుగ్రహం సదా నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


11 comments:

  1. Om Sairam �� sai pls bless to all

    ReplyDelete
  2. 🙏💐🙏ఓం సాయిరాం

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. Om sai baba when I am younger I went to satya sai baba bhajans.i sung many baba bhajans in that days. I went to Puttaparti 3 times to take darshan of swami. Near my house there is Shivam. When baba arrives there we used to take his darshan and bhajans are very nice to sing. His speeches are where nice, Afterwards I became Siridi sai devotee. I took darshan for 6 times but both are one I believe in God.om sai baba❤❤❤

    ReplyDelete
  5. Kothakonda SrinivasJuly 3, 2021 at 11:08 AM

    , ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh Carrier bagundali thandri putra santanam kalagali thandri

    ReplyDelete
  9. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  10. Baba ee rendu kutubalanu ellepudu rakshinchu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo