1. అది కదా మన బాబా అంటే!
2. అడుగడుగునా బాబా అందిస్తున్న సహాయం
3.ల్యాప్‌టాప్ సమస్యను పరిష్కరించడంలో బాబా అనుగ్రహం4. ఇలా అర్థిస్తే, అలా అనుగ్రహించిన బాబా
అది కదా మన బాబా అంటే!
అందరికీ నమస్తే. నా పేరు అరుణ. మరోసారి బాబా ప్రసాదించిన అనుభవాలు పంచుకుందామని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. సాయిబాబా ఆశీస్సులు ఎప్పటికీ మీ మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే... కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో మావారికి వ్యాక్సిన్ వేయించాలని చాలా ప్రయత్నించాము. కానీ వ్యాక్సిన్ ఎక్కడా దొరకలేదు. మా బంధువులందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిసి, 'మాకెందుకు వ్యాక్సిన్ దొరకడంలేదు?' అని నాకు చాలా బాధేసింది. ఆ విషయంగా నేను, మావారు గొడవ కూడా పడ్డాము. నేను మావారితో, "మీరు వ్యాక్సిన్ కోసం సరిగా ప్రయత్నించలేదు, అందుకే దొరకలేదు" అనేసరికి ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారు. ఆ తరువాత ఒకరోజు ఉదయం బాబా ప్రసాదించిన భక్తుల అనుభవాలు చదువుతూ, "రేపు మావారికి ఎలాగైనా వ్యాక్సిన్ అందేలా చూడండి" అని బాబాను ఆర్తిగా అడిగాను. అప్పుడు బాబా చమత్కారం చేశారు. మరుసటిరోజు మా మామయ్యగారికి తెలిసినవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, "మీ అబ్బాయిని పంపించండి, వ్యాక్సిన్ వేస్తాము" అని అన్నారు. వెంటనే మావారు వెళ్లి, వ్యాక్సిన్ వేయించుకుని నాకు ఫోన్ చేశారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. అది కదా మన బాబా అంటే.
మరో అనుభవం:
ఇటీవల మావారి బంధువులలో ఒకరి పెళ్లి జరిగింది. తప్పనిసరిగా వెళ్లాల్సిన పెళ్లి అయినప్పటికీ నేను మావారిని వెళ్లొద్దని చెప్పాను. అయినా మావారు వెళ్లకుండా ఉండలేకపోయారు. అప్పుడు నేను బాబాతో, "మావారు పెళ్ళికి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడు తండ్రీ" అని చెప్పుకుని, 'పెళ్ళికి వెళ్లొచ్చిన తరువాత ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మావారు పెళ్ళికి వెళ్లొచ్చి ఇప్పటికి పది రోజులు అయింది. బాబా దయవలన ఎవరికీ ఏ ఇబ్బందీ కలగలేదు. "థాంక్యూ బాబా. సదా మమ్మల్ని రక్షించు తండ్రీ. ఏమైనా పొరపాటు చేస్తే మన్నించండి బాబా".
అడుగడుగునా బాబా అందిస్తున్న సహాయం
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నా సాయి ఎప్పుడూ నాతో, నా కుటుంబంతో ఉంటూ అడుగడుగునా కాపాడుతున్నారు. నేను ఇప్పుడు నా జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇటీవల నేను బరువు తగ్గడానికి జాగ్రత్తలు తీసుకున్నాను. దానివల్ల నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. నేను బాబాతో, "ఈ సమస్యలను తగ్గించండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయతో నా సమస్యలు చాలావరకు తగ్గాయి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".
అంతేకాకుండా, కొన్ని కుటుంబ సమస్యల నుండి కూడా తలచుకున్నంతనే బాబా నన్ను రక్షించారు. బాబా లేకపోతే నేను ఏమైపోయేదాన్నో! "కృతజ్ఞతలు బాబా".
ఒకసారి నేను బయటికి వెళ్లి వచ్చాక నా మెడలోని గోల్డ్ చైన్ తీసి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. భోజనం చేసిన తర్వాత ఎంత వెతికినా ఆ చైన్ కనిపించలేదు. వెంటనే బాబాను తలచుకుని, "చైన్ దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వెతికితే నా చైన్ కనిపించింది.
నా బిజినెస్ విషయంలో కూడా బాబా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఒక కస్టమర్ చాలా రోజుల నుంచి నాకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బందిపెడుతుండేది. అప్పుడు నేను బాబాతో, "ఆమె మనసు మార్చి ఆ అమౌంట్ నాకు అందేలా చేయమ"ని వేడుకున్నాను. అంతలోనే నాకు ఒక బాబా మెసేజ్ వచ్చింది. (ఆ మెసేజ్ ఉన్న ఫోటో కింద ఇస్తాను.)
భావం: 'అర్థరాత్రి వేళ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నిరాశకు గురైనప్పుడు నా సచ్చరిత్ర చదువు. నేను అన్నీ చూస్తున్నాను. నేను నీ అప్పులన్నీ సరిచేస్తాను. ఈరోజు నుంచి ఒక నెలలోపు నీకు డబ్బు అందుతుంది. నాకు ధూపం సమర్పించు'.
మరుసటిరోజు ఆమె తన మనసు మార్చుకుని నాకు ఇవ్వవలసిన దానిలో 80% మొత్తాన్ని నాకు ఇచ్చేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలన్నీ నేను ఈ బ్లాగ్ ద్వారా మీ భక్తులతో పంచుకుంటానని మీతో చెప్పుకున్న విధంగా పంచుకున్నాను బాబా. ఎల్లప్పుడూ ఇలాగే అందరినీ కాపాడుతూ ఉండు తండ్రీ".
ల్యాప్‌టాప్ సమస్యను పరిష్కరించడంలో బాబా అనుగ్రహం
అందరికీ నమస్తే. నా పేరు హేమంత్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు నేను ఎప్పటిలాగే నా ఆఫీసు వర్క్ మొదలుపెట్టడానికి ఆఫీసు ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యే ప్రయత్నం చేశాను. కానీ, ఏ కారణం చేతనో నేను లాగిన్ కాలేకపోయాను. అత్యవసరంగా లాగిన్ అవ్వాల్సి ఉండటంతో నేను వెంటనే నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అవడానికి ప్రయత్నించాను. కానీ, దురదృష్టవశాత్తూ నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో కూడా నేను లాగిన్ కాలేకపోయాను. దాంతో వీలైనంత త్వరగా లాగిన్ కావాల్సి ఉన్న నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. అది నా పనిని ప్రభావితం చేయకూడదని బాబాను ప్రార్థిస్తూ లాగిన్ అవడం సమస్యగా ఉందని నా సహోద్యోగులకు తెలియజేశాను. అంతలో నా భార్య కొద్దిగా బాబా ఊదీని నా పర్సనల్ ల్యాప్‌టాప్‌కి పెట్టింది. అది ఒక దివ్యఔషధం వలే పనిచేసింది. ఎటువంటి సమస్యా లేకుండా నేను నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయి నా ఆఫీస్ వర్క్ చేసుకోగలిగాను. అప్పటినుండి నేను నా పర్సనల్ ల్యాప్‌టాప్‌ను ఆఫీస్ వర్క్ కోసం ఉపయోగిస్తున్నాను. ఇదంతా సాయిబాబా చేసిన అద్భుతం! ఆయనపట్ల మనకున్న నమ్మకం వల్ల ఆయన మనకు ఎల్లవేళలా రక్షణనిస్తారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. భవిష్యత్తులో మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. సాయిభక్తులందరికీ విజయం చేకూరాలని కోరుకుంటూ ...
ఇలా అర్థిస్తే, అలా అనుగ్రహించిన బాబా
నా పేరు ఉమాదేవి. 2021, జూన్ 13న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 2021, జూన్ 12న మా ఇంట్లో బంగారం పంపకాలు చేస్తూ న్యాయంగా మాకు రావాల్సింది మాకు ఇవ్వకుండా అన్యాయంగా పంపకం చేయదలిచారు. అడిగితే, 'ఏం చేసుకుంటారో చేసుకోండి' అని చాలా దారుణంగా మాట్లాడారు. మాకు ఎంతో బాధ కలిగింది. మరుసటిరోజు నిద్రలేస్తూనే నేను, "చూడండి సాయీ, ఎలా మాట్లాడుతున్నారో? దయచేసి నాకు సహాయం చేయండి సాయీ" అని మనస్ఫూర్తిగా వేడుకుని దణ్ణం పెట్టుకున్నాను. వెంటనే ఫోన్ వచ్చింది. వాళ్ళు, "ఏ పంపకాలూ జరగలేదు. మీరు ఎప్పుడు వస్తే అప్పుడే అందరం కలిసి మాట్లాడుకుని పంచుకుందాం" అని అన్నారు. ఇలా సహాయం చేయమని బాబాను ప్రార్థించాను, అలా ఫోన్ వచ్చింది. అదీ బాబా ప్రేమంటే!
Om Sri Sai Ram ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤😊
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always Be with me
801 days
ReplyDeletesairam
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri please
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteBaba santosh life chala bagundali thandri
ReplyDeleteBaba santosh ki day shifts ravali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete