సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 829వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సచ్చరిత్ర పారాయణ - బాబా అనుగ్రహం
2. ఎటువంటి ఆటంకాలు లేకుండా చెల్లిని, తన బిడ్డని కాపాడిన బాబా
3. ఫోను లారీ టైరు క్రింద పడకుండా కాపాడిన బాబా
4. అడిగిన వెంటనే అనుగ్రహించిన బాబా 

సచ్చరిత్ర పారాయణ - బాబా అనుగ్రహం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అనుపమ. మేము కృష్ణాజిల్లా పెడనలో ఉంటున్నాము. నేను ఈనాడు బ్రతికి ఉండటానికి కారణం బాబానే. 2015 ముందు వరకు బాబా గుడికి వెళ్ళడమే తప్ప బాబా గురించి నాకు ఇంకేమీ తెలియదు. 2015లో శ్రీసాయిసచ్చరిత్ర చదవడం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు నా జీవితంలో నాకు ఎదురైన ఎన్నో సమస్యల నుండి సాయిబాబా నన్ను గట్టెక్కించారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 


2015లో నాకు వివాహం జరిగింది. వివాహమైన తరువాత నా భర్త, నా అత్తింటివారి నుండి నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన శ్రీసాయిసచ్చరిత్ర ఒకసారి చదివాను. బాబా అనుగ్రహంతో నా సమస్య తీవ్రత తగ్గి నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళారు. ఇలా ఎన్నో అనుభవాలు నా జీవితంలో జరిగాయి. 


2016లో బాబా మాకు పండంటి మగబిడ్డను ప్రసాదించారు. తరువాత అనుకోని పరిస్థితుల్లో ఒక కోర్టు సమస్య వచ్చింది. దానినుండి కూడా బాబా మమ్మల్ని గట్టెక్కించారు. నేను ఈనాడు సాయిబాబా మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిగా ఉన్నాను. అలాగే ఒక నిత్యపారాయణ గ్రూపులో కూడా సభ్యురాలిగా ఉన్నాను. నిత్యపారాయణ గ్రూపులో సభ్యురాలిగా ప్రతిరోజూ సచ్చరిత్ర నుండి ఒక అధ్యాయం చదివే అవకాశాన్ని కల్పించినందుకు బాబాకు శతకోటి వందనాలు. “బాబా! మీ కృప అందరిపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను”.


ఎటువంటి ఆటంకాలు లేకుండా మా చెల్లిని, తన బిడ్డని కాపాడిన బాబా: 


మా చెల్లి విషయంలో బాబా చూపించిన ప్రేమను ఇప్పుడు పంచుకుంటున్నాను. మా చెల్లికి 2018లో వివాహం జరిగింది. 2019లో తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ కడుపులోని బిడ్డకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో 6వ నెలలో తప్పనిసరి పరిస్థితుల్లో తనకు అబార్షన్ చేశారు. ఆ తరవాత 2020లో మా చెల్లి మరలా ప్రెగ్నెంట్ అయింది. తనను పరీక్షించిన డాక్టర్లు, ‘ఈసారి కూడా డెలివరీ కష్టంగానే ఉంటుంది. తల్లి, బిడ్డ ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతార’ని చెప్పారు. మా చెల్లికి 8వ నెల వచ్చాక కరోనా పరిస్థితుల వల్ల తనను రెగ్యులర్ గా చెకప్ చేసే డాక్టరుగారు మా చెల్లిని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోమని చెప్పారు. మాకు చాలా భయం వేసింది. ఆ డాక్టర్ సూచించిన ప్రకారం మా చెల్లి విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ మా చెల్లిని వారంరోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, ‘తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నార’ని చెప్పి తనను ఇంటికి పంపించారు. మా చెల్లికి 9వ నెల వచ్చాక తల్లీబిడ్డల క్షేమం కోసం నేను బాబాను ప్రార్థించి 5 వారాలు గురువారవ్రతం చేయడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల నెలలు నిండి మా చెల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు 5 నెలలు ఉన్నప్పుడు మా చెల్లెలి అత్తింటివారు తనను కొంత ఇబ్బందిపెట్టారు. అప్పుడు మా చెల్లి సాయిసచ్చరిత్ర చదవటం మొదలుపెట్టింది. బాబా దయవల్ల సాయిసచ్చరిత్ర చదవడం పూర్తికాకముందే వాళ్ళు వచ్చి మా చెల్లిని కాపురానికి తీసుకెళ్ళారు. “శతకోటి వందనాలు సాయీ!”


నా ఫోనును లారీ టైరు క్రింద పడకుండా కాపాడిన బాబా:


2 నెలల క్రితం వరకు నేను మచిలీపట్నంలో ఉద్యోగం చేసేదాన్ని. కరోనా పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను ఉద్యోగాన్ని కోల్పోయాను. కానీ బాబా దయవల్ల త్వరలోనే ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది. 2 నెలల క్రితం బాబా చూపిన ప్రేమను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఉద్యోగరీత్యా నేను ప్రతిరోజూ మా ఊరు (పెడన) నుంచి మచిలీపట్నం వెళ్ళి వచ్చేదాన్ని. అందువల్ల ఇంటిలో సాయిసచ్చరిత్ర చదవటం కుదరక నేను ఫోనులో సచ్చరిత్ర డౌన్లోడ్ చేసుకుని, నిత్యపారాయణలో భాగంగా ప్రతిరోజూ ఒక అధ్యాయం, అలాగే మహాపారాయణలో భాగంగా ప్రతి గురువారం రెండు అధ్యాయాలు చదువుతున్నాను. అలాగే, టెలిగ్రామ్‌లో సాయిభక్తుల అనుభవాలు గ్రూపు ఫాలో అవుతున్నాను. ఒకసారి నేను ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆరోజు బంద్ కారణంగా బస్సు దొరక్క ఆటో ఎక్కాను. వచ్చేదారిలో నా చేతిలో నుండి ఫోన్ జారి రోడ్డు మీద పడిపోయింది. ఒక నిమిషం నేను ఫోన్ పడిపోవడం చూసుకోకపోవడం వల్ల ఆటో ముందుకు వెళ్ళిపోయింది. మరలా ఫోన్ కోసం ఆటో వెనక్కి త్రిప్పి వచ్చేటప్పటికి ఫోన్ రోడ్డుమీద కనిపించింది, కానీ వేరేవైపు నుండి లారీ వస్తుండటం వల్ల వెంటనే ఫోన్ తీసుకోవడం కుదరలేదు. లారీ టైరు సరిగ్గా ఫోన్ ప్రక్కనుండి వెళ్ళడం వల్ల రోడ్డు మీద పడినందువల్ల తగిలిన దెబ్బ తప్ప ఫోనుకి ఏమీ కాలేదు. బాబా దయవల్ల ఎటువంటి రిపేర్ అవసరం లేకుండా ఫోన్ బాగానే పనిచేస్తోంది. ఆ ఫోన్ ద్వారానే ఇప్పుడు నేను బాబా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. “బాబా! మాకు ఎప్పుడు ఏమి కావాలో, ఎప్పుడు ఏమి ప్రసాదించాలో అన్నీ మీకు తెలుసు బాబా. మీ ఆజ్ఞ లేనిదే మేము మీ భక్తులం కాలేము. మీరు నాపై, నా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమకు శతకోటి వందనాలు సాయీ”. త్వరలోనే మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.


ఓం సద్గురు సాయినాథాయ నమః.

శుభం భవతు.


అడిగిన వెంటనే అనుగ్రహించిన బాబా


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు నళిని. నేను సాయిభక్తురాలిని. నాకు బాధ కలిగినా, సంతోషం వచ్చినా బాబాతో పంచుకుంటాను. నాకు ఏ చిన్న కష్టం కలిగినా "బాబా! నాకు కష్టం కలిగించొద్దు" అని బాబాను అడుగుతాను. అలా అడిగిన వెంటనే బాబా ఎన్నో బాధలు తీర్చారు. 2021, మే 29న నేను కాస్త జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డాను. కోవిడ్ ఏమోనని నేను భయపడ్డాను. రాత్రి నిద్రించే సమయంలో దగ్గు ఎక్కువగా వచ్చింది. ఆ కారణంగా ఇంట్లో అందరి నిద్రకు భంగం కలిగింది. అసలే ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నందున నేను కంగారుపడ్డాను. వెంటనే బాబాను తలచుకుని, "బాబా! ఈ దగ్గు తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. ఆశ్చర్యంగా దగ్గు వెంటనే తగ్గిపోయింది. తరువాత మళ్లీ రాలేదు. "ధన్యవాదాలు బాబా. మీ ఋణం ఎలా తీర్చుకోవాలి? నా మనసులో ఉన్న కోరిక మీకు తెలుసు. అది త్వరగా నెరవేరేలా చూడండి బాబా. అది నెరవేరితే, ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో తప్పకుండా పంచుకుంటాను బాబా".


మరో అనుభవం:


ఇటీవల హఠాత్తుగా నా నిశ్చితార్థాన్ని పెద్దలు నిర్ణయించారు. అకస్మాత్తుగా నిశ్చయించినందువల్ల నాకు షాపింగ్ చేసే సమయం లేకుండా పోయింది. పైగా వానాకాలం అయినందున ఫంక్షన్ ఎలా జరుగుతుందోనని భయం వేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "అంతా ప్రశాంతంగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా నాకు తోడుగా ఉండి అంతా బాగా జరిగేలా చూసుకున్నారు. నాకు తెలుసు, బాబా ఎప్పుడూ నాతో ఉంటారని. "ఇలానే నా పెళ్లి కూడా బాగా జరిగేలా దీవించండి బాబా. మీకు చాలా చాలా ఋణపడివుంటాను". ఏ చిన్న ఆపద వచ్చినా నన్ను కాపాడుతున్న బాబాకు సాష్టాంగ నమస్కారాలు. బాధలో ఎప్పుడైనా ఏదైనా అన్నా బాబా మాత్రం ఎప్పుడూ మన మీద ప్రేమను చూపిస్తారు. మనకేది మంచిదో అది చేస్తారు.


10 comments:

  1. ఓంకార రూపం సా౦ుు బాబా నమస్కారము తండ్రి. ఈ రోజు మీ రోజు నాకు సంతోషముగ వుంది,సోనీ టి వి లో వచ్చుచున్న మేరే సా౦ుు సీరియల్ చాలా బాగా వుంది అందరు చూడాలి.సా౦ుు నీ రూపం, నీ మాటలు మాకు ఆచరణీయ. ఓం సా౦ుు బాబా నమస్కారము చేసి నా ప్రాణము నీ వని తెలుపుతున్నాను. ❤❤❤��

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🙏🕉😊

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri nai infection taggipovali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh life bagundali thandri putra santanam kalagali thandri

    ReplyDelete
  8. Baba karthik thyroid taggipovali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo