సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 825వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా సహయం అందిస్తున్న బాబా
2. కంటి ఇన్ఫెక్షన్‌ని నయం చేసిన బాబా

అడుగడుగునా సహాయం అందిస్తున్న బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు మౌనిక. ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నాకు ఈ క్షణాన ఎలా అనిపిస్తోందో ముందుగా మీతో చెప్తాను. నాడు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు భక్తులు తమ కోరికలను బాబాతో విన్నవించుకోవాలన్నా, ఏదైనా విషయంలో బాబా అభిప్రాయం తెలుసుకోవాలన్నా షామా(మాధవరావు దేశ్‌పాండే) సహాయం తీసుకునేవారు, ఎక్కడో దూరప్రాంతాన ఉన్న భక్తులు ఉత్తరాల ద్వారా బాబా సన్నిధిని చేరుకునేవారు. అలా మనమిప్పుడు బాబాను ఏదైనా కోరుకోవాలంటే, “సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మా అనుభవాలను పంచుకుంటాము" అని బాబాను ప్రార్థిస్తున్నాము. అలా అందరం బాబా సన్నిధికి చేరుకుంటున్నాము. అంటే, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఎలా అయితే భక్తులకు, బాబాకు మధ్యన షామా, ఉత్తరాలు వారధిగా ఉన్నాయో అలా ఇప్పుడు బాబాకు, మనకు మధ్య ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్’ వారధిలా ఉంది. ఈవిధంగా నాకీరోజు ఈ బ్లాగ్ విలువ తెలిసింది. ఈ గౌరవం నాలో ఎప్పటికీ ఉండిపోతుంది. “సాయి అన్నా! మీకు చాలా ధన్యవాదాలు”. మేము ఇబ్బందుల్లో ఉన్నపుడు బాబా మాకు ఎంతో విలువైన సహాయం చేశారు. ఆ అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


ముందుగా సాయిదేవుణ్ణి క్షమాపణ కోరుకుంటున్నాను. శ్రీసాయి చరిత్రలో ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన బంధువుని కోపర్గాఁవ్‌లోని దత్తదేవుని దర్శనానికి వెళ్లనివ్వకుండా నేరుగా శిరిడీకి తీసుకుని వెళ్ళినపుడు బాబా అతనిని, “నా సహవాసం ఇన్నిరోజుల నుంచి చేసి నీవు నేర్చుకుంది ఇదేనా?” అని అడుగుతారు. “అలా నేను మీ భక్తుణ్ణి గుడికి తీసుకువెళ్లకుండా చేసినందుకు నన్ను క్షమించండి బాబా”. తను మ్రొక్కుతీర్చటం ఆలస్యం చేశారని కోపం వచ్చి గుడిదాకా వచ్చికూడా, ‘నేను తనతో వెళ్ళను, నేను ఒక్కదాన్నే వేరేచోట ఉన్న బాబా గుడికి వెళ్తాను’ అని అలిగాను. అయితే, ఆ కాలంలో చందోర్కర్‌కి గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు కాలిలో ముళ్ళు గుచ్చుకుని ప్రాయశ్చిత్తం జరిగినట్లు, ఈనాడు నాకు బాబా గుడికి వెళ్ళటానికి ఒక్క ఆటో కూడా దొరకక చాలాసేపు ఇబ్బందిపడ్డాను. “నాకు ఇప్పుడు అర్థమవుతోంది బాబా, మీ భక్తుణ్ణి మీ వద్దకు రానివ్వనందుకే మీ దర్శనానికి రావడానికి నాకు ఇంత ఇబ్బంది వచ్చింది. నన్ను క్షమించండి బాబా. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటాను”.


ఇక నా మొదటి అనుభవానికి వస్తే... ఇది 2 నెలల క్రితం జరిగింది. మాకు పెళ్లి జరిగే సమయంలో అత్యవసరమై వేరేవాళ్ల దగ్గరనుంచి కొంత డబ్బు తీసుకున్నాం. అయితే, వాళ్ళు డబ్బు వెంటనే తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయటంతో ఏం చేయాలో పాలుపోక మేము చాలా ఇబ్బందిపడ్డాము. ఆ సమయంలో నేను బాబాను ప్రార్థించి మాకు మార్గం చూపమని వేడుకున్నాను. ఆ తరువాత వచ్చిన గురువారంనాడు బాబాకు శ్రద్ధగా పూజ చేసుకున్నాను. వెంటనే బాబా దయవల్ల మాకు కావలసిన మొత్తం సర్దుబాటు అయింది. అలా ఆ సమస్య నుండి బాబా మమ్మల్ని కాపాడారు. “ధన్యవాదాలు దేవా!”


రెండవ అనుభవం:


ఈమధ్య బాబా నాకు చాలా చక్కని అనుభవాలను ప్రసాదించారు. కానీ ఎందుకనో నేను ఏవీ కూడా  ఎవరితోనూ పంచుకోలేదు. కానీ మన సాయి ఊరుకుంటారా! తాము ప్రసాదించిన అనుభవాలను ఇలా ఈ బ్లాగు ద్వారా పంచుకునేలా అనుగ్రహించారు. ఈ కరోనా పరిస్థితులలో మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. మందులు వాడుతూనే ఉన్నప్పటికీ ఎంతకీ అనారోగ్యం తగ్గలేదు సరికదా, ఒకరోజు అమ్మమ్మ తీవ్రమైన ఇబ్బందికి గురయ్యారు. ఆరోజే ఈ బ్లాగులో, “ ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామం జపిస్తే ఆరోగ్యం కుదుటపడింది” అంటూ సాయిభక్తులు పంచుకున్న అనుభవాలు కొన్ని చదివాను. అయినప్పటికీ, ‘నేనెందుకులే ఆ నామాన్ని జపించడం, నాకు బాగానే ఉంది కదా’ అని అనుకున్నాను. కానీ ఆ మరుసటిరోజే అమ్మమ్మ ఆరోగ్యం పాడైంది. బహుశా అందుకే కాబోలు బాబా ఆ నామం గురించి నాకు తెలియచేశారు అనుకుని, అమ్మమ్మ ఆరోగ్యం కోసం ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని జపించాను. అప్పుడు అమ్మమ్మ పరిస్థితి కాస్త మెరుగుపడింది. బాబాకు అన్నీ తెలుసు. ఎల్లప్పుడూ ఆయన మనకు దారి చూపిస్తూ ఉంటారు. కానీ ఒక వారంరోజుల తరువాత హఠాత్తుగా మా పెద్దమ్మ ఫోన్ చేసి, “అమ్మమ్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతోంది, అందుకే తనను హాస్పిటల్లో అడ్మిట్ చేశాము” అని చెప్పింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడి తను క్షేమంగా ఇంటికి వస్తే ఈ అనుభవాన్ని మన సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత హాస్పిటల్‌కి వెళ్లి అమ్మమ్మ దిండు కింద బాబా ఫొటో, ఊదీ పెట్టి వచ్చాను. సాధారణంగా నేను ఎవరికీ బాబా ఫోటోలు ఇవ్వను. నా బాబా నా సాయి. ఇది నా స్వార్థం. ఇది తప్పో కాదో నాకు తెలియదు. నాకు ఎన్ని బాబా ఫోటోలు ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ నేను మాత్రం ఎవ్వరికీ బాబా ఫోటోలు ఇవ్వను. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో బాబా గుడి కనిపిస్తే బాబాను దర్శించుకుని, “నీవే దిక్కు సాయీ. నువ్వు రక్షిస్తావని నిన్ను (ఫోటో రూపంలో) అమ్మమ్మ దగ్గర పెట్టి వచ్చాను. అమ్మమ్మ ఆరోగ్యంగా ఇంటికి వచ్చేలా చూడు” అని ప్రార్థించాను. అంతేకాదు, నేను చేస్తున్న దివ్యపూజ ఆఖరివారం పూర్తయ్యేలోపు అమ్మమ్మ కోలుకోవాలని మనసులోనే బాబాను వేడుకునేదాన్ని. ఆ ఆలోచన కూడా నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే, ‘నా బాబా నన్ను ఎన్నడూ విడువరు’ అని గర్వం. మే 26 ప్రొద్దున్నే మా పెద్దమ్మ ఫోన్ చేసి, “అమ్మమ్మకి ఆరోగ్యం మెరుగైంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. రెండు రోజుల్లో అమ్మమ్మను ఇంటికి తీసుకెళ్తున్నాము” అని చెప్పింది. ఆ మాట వినగానే ఎంతో సంతోషంతో, “బాబా! మీ మీద ఉన్న నమ్మకం నిజమైంది. రేపే నేను చేస్తున్న దివ్యపూజ ఆఖరివారం. దివ్యపూజ పూర్తయ్యేలోపే అమ్మమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించావు. చాలా ధన్యవాదాలు సాయీ” అంటూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


మూడవ అనుభవం:


కొద్ది రోజుల నుండి మా జీవితంలో ఏం జరుగుతోందో మాకు అర్థం కావట్లేదు. మావారు తాను కొబ్బరికాయలు కొడతానని బాబాకు మ్రొక్కుకున్నారు. కానీ ఆ మ్రొక్కును పూర్తిగా తీర్చలేదు. మ్రొక్కు తీర్చడానికి బద్ధకించేవారు. మే 23, ఆదివారంనాడు కూడా మ్రొక్కు తీర్చుకోవడానికి బయలుదేరే సమయానికి ‘ఇంకోరోజు వెళదాం’ అన్నారు. నేను తనకు అడ్డుచెప్పలేకపోయాను. తరువాత బాబా గ్రూపులో మెసేజెస్ చూస్తుంటే, "మ్రొక్కులు తీర్చకుంటే కష్టాలు వస్తాయి" అనే సాయి వచనం కనిపించింది. అది చూడగానే అనుకున్నాను, ‘బాబా హెచ్చరిక చేస్తున్నారు’ అని. బాబా చెప్పినట్లు కష్టాలు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ మరుసటిరోజు ఉదయాన్నే మావారి ఆఫీస్ హెడ్ 63000/- తీసుకుని తిరిగి డిపాజిట్ చెయ్యకుండా ఆ తప్పును మావారి మీద వేశాడు. ప్రస్తుతం వాళ్ళ హెడ్ చెన్నైలో ఉన్నాడు. కానీ మావారి గురించి చెడుగా చెప్పి నన్ను కూడా ఇబ్బందిపడేలా చేశాడు. ఇప్పటికిప్పుడు అంత మొత్తం కట్టాలంటే మా వల్ల కాలేదు. దాంతో నేను బాబాను ప్రార్థించి, “ఈ ఇబ్బంది తొలగిపోతే సాటి సాయిబంధువులతో ఈ అనుభవాన్ని పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ పెద్ద మొత్తం సర్దుబాటు అయింది. వెంటనే ఆ డబ్బును డిపాజిట్ చేసి మా భారం తీర్చుకున్నాము. “బాబా! ఇది నిజంగా కేవలం మీ ఆశీర్వాదమే. లేకుంటే ఇలాంటి పరిస్థితులలో అంత పెద్దమొత్తాన్ని మేము సర్దుబాటు చేయలేము. అవసరమైన సమయాలలో మీ సహాయాన్ని ఎంత చక్కగా అందిస్తావు తండ్రీ! మీకు శతకోటి ధన్యవాదాలు సాయీ! ఇకముందైనా నా భర్తని ఇలాంటివాళ్ళకి దూరంగా ఉంచి తన ఉద్యోగం జాగ్రత్తగా చేసుకునేలా కాపాడు తండ్రీ! మీ ఆశీర్వాదంతో దివ్యపూజ మూడుసార్లు పూర్తవుతున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్యూ సాయీ. అజ్ఞానంతో ‘నేను నిన్ను పూజించను’ అని ఏవేవో మాట్లాడాను. నన్ను క్షమించు తండ్రీ. మేము ఎప్పటికీ మీ బిడ్డలమే. మిమ్మల్ని నేను వదలలేను. నన్ను వదలకుండా కాపాడుకో స్వామీ!”


కంటి ఇన్ఫెక్షన్‌ని నయం చేసిన బాబా


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు విజయలక్ష్మి. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతూ బాబా ప్రేమను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 2021, మే 17, సోమవారం నాకు కంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. కరోనా సమయం అయినందువల్ల నేను చాలా భయపడి, "బాబా! మీ అనుగ్రహంతో నా కంటి ఇన్ఫెక్షన్ తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఆయన దయవలన నా కంటి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


6 comments:

  1. Baba please slove my icing problem. I am suffering from one year.you are only hope for me.please take care of my family. Om sai baba❤❤❤

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sainath Maharaj Ki Jai.. Bharadwaj Maharaj Ki Jai.. Sarath Babuji Ki Jai ❤😊🙏🕉

    ReplyDelete
  4. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  5. Baba karthik ki thyroid taggipovali thandri kapadu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo