సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 822వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్నివేళలా నాకు తోడుంటానని నిదర్శనమిచ్చిన బాబా
2. బాబాపై నమ్మకముంచితే చాలు, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి
3. బాబా అనుగ్రహ లీలలు

అన్నివేళలా నాకు తోడుంటానని నిదర్శనమిచ్చిన బాబా


అందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నా పేరు దివ్య. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను బాబానే కొలుస్తున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా నేను బాబానే తలచుకుంటాను. ప్రతిసారీ బాబా నన్ను కాపాడుతూనే ఉన్నారు. ఈ బ్లాగులో వచ్చే సాయిభక్తుల అనుభవాలు నేను చదువుతూ ఉంటాను. కానీ ఏదో ఒకరోజు నేను కూడా నా అనుభవాన్ని వ్రాస్తానని అస్సలు అనుకోలేదు. బహుశా బాబా నా చేత వ్రాయించాలని అనుకున్నారు. అందుకే నేను మొదటిసారి నా జీవితంలో జరిగిన రెండు సంఘటనలను గురించి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.


2013లో నేను గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. ఆ సంవత్సరం నవంబరు నెలలో నాకు ఉద్యోగం రావాలన్న సంకల్పంతో సాయిబాబా సచ్చరిత్ర పారాయణ ప్రారంభించి వారంరోజుల్లో పూర్తిచేశాను. ఆ వారంరోజులూ నేను ఏది చేసినా బాబానే తలచుకుంటూ పూర్తిగా బాబా ధ్యాసలోనే ఉన్నాను. అదే సమయంలో నేను నా కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్ళాను. దైవదర్శనమయ్యాక అందరం బయటికి వచ్చి కూర్చున్నాము. నా కుటుంబసభ్యులు, బంధువులు అంతా ఒక దగ్గర కూర్చున్నారు. నేను మాత్రం వేరుగా కూర్చున్నాను. అందుకు ప్రత్యేకించి కారణమేమీ లేదు, ఊరికే అలా కూర్చున్నాను, అంతే. అప్పుడు ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన మామూలుగా, "దర్శనం బాగా జరిగిందా? బాగా ప్రార్థించావా? శివునికి బిల్వపత్రం సమర్పించావా?" అని అడిగారు. నేను, "అంతా బాగా జరిగింది" అని చెప్పాను. తర్వాత ఆయన నేను ఆరోజు ఏమి తిన్నానో చెప్పారు. అంతేకాదు, మాకు రెండు ఇండ్లు ఉన్నాయని చెప్పి, మా ఇంటి విషయాలన్నీ తనకు తెలిసినట్టు చాలా ఖచ్చితంగా చెప్పారు. అది విని నేను నిర్ఘాంతపోయాను. ఆ తరువాత, నేను నా ఉద్యోగం గురించి ఏమీ అనకముందే ఆయన నాతో, "నీకు ఉద్యోగం రావాలంటే 5 ఎర్రగాజులు కొనుక్కుని వేసుకో! త్వరలో ఉద్యోగం వస్తుంది" అని చెప్పి, "5 గాజులు మాత్రమే కొను, పది రూపాయలకి ఇస్తారు" అని చెప్పారు. నేను మా అక్కని పిలిచి జరిగినదంతా వివరంగా చెప్పాను. తరువాత అక్కడే ఉన్న చిన్న షాపుకి వెళ్ళి, 5 గాజులు ఇమ్మని అడిగాము. ఆ షాపువాళ్ళు, ‘ఆరు గాజులైతే ఇస్తాము’ అన్నారు. తరువాత మరో రెండు షాపులకి వెళ్ళాము. వాళ్ళు కూడా, ‘ఆరు గాజులైతే ఇస్తాము, ఐదు గాజులు ఇవ్వము’ అన్నారు. నాలుగో షాపులో ఉన్న ఆమె కూడా, ‘ఆరు గాజులైతేనే ఇస్తాం’ అంది. ఏం చేయాలో తెలియక ఆరు గాజులు తీసుకుందామనుకున్నాను. కానీ అంతలోనే ఆమె, "పది రూపాయలకి ఐదు గాజులు తీసుకో!" అంది. ఎంతో సంతోషంతో ఆ గాజులు తీసుకుని, ఆ తాతతో మాట్లాడుదామని చూసేసరికి ఆయన కనిపించలేదు. తరువాత తిరుగు ప్రయాణంలో ఆయన గురించే ఆలోచిస్తూ, 'ఎవరాయన?' అని అనుకుంటూ ఆటోలోంచి బయటికి చూశాను. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద సాయిబాబా విగ్రహానికి హారతి ఇవ్వడం నాకు కనిపించింది. ఇక నా ఆనందానికి అంతులేదు. ‘నాతో మాట్లాడింది బాబానే!’ అని అప్పుడు అర్థమైంది. బాబా మాటలు నిజమయ్యాయి. 2014, ఫిబ్రవరి 9న నాకు ఉద్యోగం వచ్చింది. ఈ అనుభవం ద్వారా ‘బాబా అన్నివేళలా నాకు తోడుంటారు’ అనిపించింది.


బాబాపై నమ్మకముంచితే చాలు, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి:


మా ఇంట్లో ఏడుగురు సభ్యులం ఉంటాము. లాక్‌డౌన్ వల్ల అందరమూ ఒకే ఇంటిలో ఉండి వర్క్ చేస్తున్నాం. హఠాత్తుగా 2021, మే 19, బుధవారం మా డాడీకి దగ్గు మొదలైంది. కాస్త అనుమానం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టెస్టుకి శాంపిల్ ఇచ్చి వచ్చాము. రిపోర్టు రావడానికి 24 గంటలు పడుతుందన్నారు. డాడీకి దగ్గు కొద్దిగానే ఉన్నందువల్ల ‘రిపోర్టు నెగిటివ్ అనే వస్తుంది’ అని మేమనుకున్నాం. మరుసటిరోజు గురువారం మధ్యాహ్నానికి నా భర్తకి కూడా తేలికపాటి దగ్గు మొదలైంది. మేము పెద్దగా పట్టించుకోలేదు. అదేరోజు సాయంత్రానికి డాడీ రిపోర్ట్ 'పాజిటివ్' అని వచ్చింది. దాంతో మేము చాలా భయపడిపోయాము. ఇక ఆలస్యం చేయక శుక్రవారం నేను, నా భర్త, మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి కోవిడ్ టెస్టుకి శాంపిల్స్ ఇచ్చాము. రిపోర్టులు తెలియడానికి మళ్లీ 24 గంటలు పడుతుంది. అయితే శాంపిల్ ఇచ్చి వచ్చాక నా భర్తకి 99 డిగ్రీల జ్వరం మొదలైంది. దాంతో రిపోర్టులు వచ్చేదాకా 24 గంటలు వేచి ఉండలేక, వెంటనే అంటే అదేరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అందరమూ టెస్ట్ చేయించుకున్నాము. నా భర్తకి 'పాజిటివ్' వచ్చి, మిగతా అందరికీ బాబా దయవల్ల నెగిటివ్ వచ్చింది. ఇంట్లో అందరమూ చాలా ఏడ్చాము. వెంటనే బాబా ఊదీని నీళ్లలో కలిపి త్రాగమని డాడీకి, నా భర్తకి ఇచ్చాము. ఇద్దరూ క్వారంటైన్‌లోకి వెళ్లారు. నేను శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏడుస్తూ, "బాబా! పరిస్థితి విషమించకుండా మీరే కాపాడాలి" అని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా దయచూపారు. శుక్రవారం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన శాంపిల్స్ తాలూకు రిపోర్టులు శనివారం సాయంత్రం 'నెగిటివ్' అని వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అయితే ఇప్పుడు మరో సమస్య ఏంటంటే, 'మందులు వాడటం కొనసాగించాలా లేక ఆపెయ్యాలా?' అని. నా భర్తకి మొదటిరోజు కనిపించిన జ్వరం తప్ప మరే లక్షణాలూ లేవు. అందువలన ఆదివారం హెచ్.ఆర్.సి.టి స్కాన్ టెస్ట్ చేయించాలని అనుకున్నాము. స్కానింగుకి వెళ్లేముందు నా భర్తకి ఊదీ నీళ్లు ఇచ్చి, బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా దయవలన ఆ టెస్టులో కూడా నా భర్తకి నెగిటివ్ వచ్చింది. డాక్టర్ కోవిడ్ నెగిటివ్ అని ఖచ్చితంగా చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


ఇకపోతే, కోవిడ్ చికిత్సలో భాగంగా డాడీ పది రోజుల పాటు మందులు వాడారు. మందులతో పాటు మేము ప్రతిరోజూ ఆయనకి బాబా ఊదీని కలిపిన నీళ్లు ఇస్తూ ఉండేవాళ్ళం. అప్పటివరకు ఆయనకి కొద్దిగా దగ్గు తప్ప మరే కోవిడ్ లక్షణాలూ లేవు. అయితే దురదృష్టం కొద్దీ పదిరోజుల కోర్స్ పూర్తవుతునే ఆయనకి జ్వరం రాసాగింది. అయినప్పటికీ ఆయన చురుకుగానే ఉన్నారు. అయినా సరే ఎందుకైనా మంచిదని ఆరోజు రాత్రి స్కాన్ చేయించాము. రిపోర్టు చూసిన డాక్టరు, "ఊపిరితిత్తులకు 50 శాతం ఇన్ఫెక్షన్ అయింది, కండిషన్ సీరియస్‌గా ఉంది, వెంటనే హాస్పిటల్లో చేరాల"ని చెప్పారు. అది విన్న మేము చాలా భయపడ్డాము. వెంటనే డాడీని హాస్పిటల్లో చేర్చాము. అప్పటినుండి 'డాడీకి త్వరగా తగ్గిపోవాల'ని సాయిని ప్రార్థించని క్షణం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా ఊదీని నీళ్లలో కలిపి డాడీకి ఇస్తుండేవాళ్ళం. ఆ అవకాశం లేనప్పుడు నేనే ఊదీనీళ్లు త్రాగి, "డాడీకి త్వరగా నయం అవ్వాల"ని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా దయవలన డాక్టర్స్ ప్రతిరోజూ డాడీకి ఇంజెక్షన్స్ వేస్తూ చాలా బాగా చికిత్స చేశారు. వారం తరువాత స్కానింగ్ చేస్తే, ఇన్ఫెక్షన్ లేదని వచ్చింది. దాంతో కోవిడ్ టెస్ట్ చేశారు. బాబా దయవలన రిపోర్టు నెగిటివ్ అని వచ్చింది. సాయి ఆశీస్సులతో పెద్దగా ఏ సమస్యా కాలేదు. డాడీ త్వరగా కోలుకున్నారు. 2021, జూన్ 9న ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. ఒక ముఖ్యవిషయం ఏమిటంటే, డాడీకి పాజిటివ్ వచ్చినరోజే, "నేను నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే, నువ్వు నా భక్తురాలివి" అన్న బాబా సందేశమొకటి నా కంటపడింది. ఇంతకుమించిన వాగ్దానం ఇంకెవరు ఇస్తారు? సచ్చరిత్రలో ప్రతి లీలా సమస్యతో మొదలైనదే! నా జీవితంలో కూడా అలాగే జరిగింది. బాబాపై నమ్మకముంచితే చాలు, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. బాబా ఆశీస్సులు ఇలాగే ఎల్లప్పుడూ అందరిమీదా ఉండాలి. బాబా అనుకుంటే జరగనిది ఏదీ లేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా అనుగ్రహ లీలలు


అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, మే నాల్గవ వారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. హఠాత్తుగా ఒకరోజు నాకు జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. కరోనా సమయం కావడం వలన మేము చాలా భయపడి బాబాకు ఎన్ని దండాలు పెట్టుకున్నామో లెక్కలేదు. "బాబా తండ్రీ! నువ్వే తగ్గించాలి. ఇది కరోనా కాకూడదు. ఇది కరోనా కాకపోతే నా ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. ల్యాబ్ వాళ్ళను ఇంటికి వచ్చి టెస్ట్ చేయమంటే, "ఈరోజు ఆదివారం, ల్యాబ్ ఉండదు" అన్నారు. దాంతో ప్రొద్దున పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నాను, జ్వరం తగ్గింది. కానీ మళ్ళీ సాయంత్రానికి వచ్చింది. వెంటనే మా దగ్గర బంధువులలో ఒక డాక్టర్ ఉంటే, తనను సంప్రదించి మందులు వేసుకున్నాను. వెంటనే జ్వరం తగ్గింది. మరుసటిరోజు కరోనా టెస్ట్ చేయించాము. బాబా దయవలన ర్యాపిడ్ మరియు ఆర్.టి.పి.సి.ఆర్ రెండు టెస్టుల్లోనూ నెగిటివ్ వచ్చింది. చాలా ఉపశమనంగా అనుభూతి చెందాము. "వేడిచేసినందువల్లే ఇలా అయింది, నీళ్లు ఎక్కువగా త్రాగాలి" అని చెప్పారు డాక్టర్. "బాబా! థాంక్యూ సో మచ్. త్వరగా కరోనాను నిర్మూలించి అందరినీ కాపాడండి బాబా. నువ్వే మా అందరికీ దిక్కు తండ్రీ".


మరో అనుభవం:


మేము మా తల్లిదండ్రులకి కరోనా వ్యాక్సిన్ వేయించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ దొరికేది కాదు. తెలిసిన వాళ్ళు, తెలిసిన డాక్టర్స్, హాస్పిటల్స్ ఇలా అన్నివిధాలా ప్రయత్నించాము. కానీ ప్రయోజనం లేకపోయింది. మా బంధువుల్లో పెద్దవాళ్ళందరూ వేయించుకున్నా మాకు వ్యాక్సిన్ దొరక్కపోవడంతో నాకు చాలా బాధగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఎందుకు మాకే ఇలా జరుగుతోంది? ఎంత ప్రయత్నించినా వ్యాక్సిన్ దొరకట్లేదు. నా తల్లిదండ్రులు 60 సంవత్సరాలు పైబడినవాళ్ళు. బయట కరోనా చాలా తీవ్రంగా ఉంది. నువ్వే ఎలా అయినా వాళ్ళకి స్లాట్ దొరికేలా చేసి, వ్యాక్సిన్ వేయించాలి బాబా. అదే జరిగితే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆరోజు గురువారం, అనుకోకుండా నా నోటినుంచి "డాడీ! స్లాట్స్ ఉన్నాయేమో ఒకసారి చూడండి" అని అన్నాను. డాడీ చెక్ చేస్తే, ఒక ప్రసిద్ధ ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ ఉన్నట్లు కనిపించింది. వెంటనే బుక్ చేసుకుని, అదేరోజు వాళ్ళు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. నేను ఏదో యథాలాపంగా అనడం, స్లాట్ దొరకడం, వెంటనే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని రావడం అన్నీ అప్పటికప్పుడే చకచకా అయిపోవడం నాకు ఏదో మాయలా అనిపించి సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం మర్చిపోయాను. అనుకోకుండా ఒకరోజు ఈ బ్లాగు తెరిచి ఒక భక్తుని అనుభవం చదివాను. ఆ అనుభవంలో ఆ భక్తుడు బాబా దయవల్ల వాళ్ళకు వ్యాక్సిన్ ఎలా దొరికిందో పంచుకున్నారు. అది చదివిన వెంటనే నాకు నా మ్రొక్కు సంగతి గుర్తొచ్చి, "అయ్యో, నా అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోయాన"ని అనుకున్నాను. వెంటనే నేను నా అనుభవాన్ని వ్రాశాను. ఇది కూడా బాబా లీలే. "ఈ విధంగా గుర్తు చేసినందుకు థాంక్యూ బాబా".


12 comments:

  1. Om sai ram today is your day. Please bless my family.you are our Lord sai baba.udi is the medicine to everyone. Baba blesses all. Om sai baba❤❤❤❤

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  4. Omsairam 🙏
    Ma mother ki old age pension vachedi sudden ga father ration card lo expire iyyaka undatam valla apesaru.baba gari dayavalla today revoke inadi pension icharandi.anduke meetho share chesukuntunnanu omsairam 🙏

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Babavee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba naku manchi arogyani prasadinchu thandri

    ReplyDelete
  8. Baba santosh Carrier ani vidaluga bagundali thandri

    ReplyDelete
  9. 🌼🌺🙏Om Sri SaiRam 🙏🙏🌺🌼

    ReplyDelete
  10. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ��������❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo