సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రామచంద్ర మాదయే బువా


మహారాష్ట్ర రాష్ట్రంలోని సిధ్దుర్గ్ జిల్లాలోని కుడల్ రైల్వే స్టేషనుకు  పశ్చిమాన అరమైలు దూరంలో  "కవిల్కెట్" గ్రామం ఉంది. ఆ గ్రామంలో, సాయినగర్ లో శ్రీ సాయిబాబా యొక్క ఒక అందమైన ఆలయం ఉంది. అక్కడి సాయిబాబా యొక్క సుందరమైన విగ్రహం భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. అక్కడి ఆహ్లాదకరమైన పరిసరాలు భక్తులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఈ దేవాలయ నిర్మాణం శ్రీసాయి అనుగ్రహానికి నిలువెత్తు సాక్ష్యం. 

కవిల్కేట్ నివాసి కీ.శే. రామచంద్ర మాదయే ఒక గొప్ప దత్త భక్తుడు. ఈ దత్తాత్రేయుని దాసుడు ఎల్లప్పుడూ ‘శ్రీ గురుదేవా దత్తా’ అని జపం చేస్తూ ఉండేవాడు. అందువలన ఇతనిని దత్తాదాస్ మాదయే బువా అని కూడా అనేవారు. ఒకరోజు అతనికి దత్తాత్రేయుడు సాయిబాబా రూపంలో షిర్డీలో ఉన్నట్లుగా దృష్టాంతం వచ్చింది. ఆ దృష్టాంతం తర్వాత అతడు షిర్డీ వెళ్లాడు. శ్రీ సాయిని మొదటిసారిగా దర్శించుకున్నప్పుడు ఆయన దాదాపుగా స్పృహ కోల్పోయారు. దత్తాత్రేయుడినే దర్శించినంత ఆనందం అతనికి కలిగింది. సాయిబాబా అతనికి ఒక రూపాయి నాణెం ఇచ్చారు. అతను దాన్ని చాలా అముల్యమైనదిగా భద్రపరిచారు. ఆ తరువాత అతను షిర్డీకి అతనితో పాటు అనేక మంది కూడల్ పౌరులను తీసుకువెళ్లి, వారికి సాయి దర్శనభాగ్యాన్ని కల్పించారు.

1918లో, సాయిబాబా 15 అక్టోబర్, విజయదశమి రోజున మహాసమాధి చెందారు. 1919లో, బాబా మొదటి పుణ్యతిథి, షిర్డీతో పాటు కూడల్ లో కూడా మాదయే బువా చేతుల మీదుగా బహిరంగంగా నిర్వహించబడింది. బాబా ఇచ్చిన ఒక రూపాయిని అతను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించారు. ఆ తరువాత, 1922లో సాయిబాబా యొక్క నాల్గవ పుణ్యతిథి రోజున,  మాదయే బువా ఒక సాయి మందిరం నిర్మించాడు. శ్రీ బాబురావు సారంగ్ చేత తయారు చేయబడిన సాయిబాబా యొక్క ఆరు అడుగుల విగ్రహాన్ని ఆయన ఆ మందిరంలో స్థాపించారు. 

బాబా యొక్క మహాసమాధి తర్వాత బాబా కోరిక ప్రకారం - ఆయన పార్థివదేహన్ని బూటీ వాడలో ఉంచి, దానిపై ఒక సమాధి  నిర్మించి దానిపై సాయిబాబా ఫోటో ఉంచబడింది. 36 సంవత్సరాల తరువాత, 1954లో, శ్రీ "బాలాజీ వసంత తాలిమ్" రూపొందించిన ఐదున్నర అడుగుల విగ్రహం సాయి సమాధి మందిరంలో స్థాపించబడింది. కీ.శే. శ్రీ నాగేష్ అత్మరామ్ సావంత్ విగ్రహం యొక్క సంస్థాపనలో చురుకుగా పాల్గొన్నారు. అతను సుదీర్ఘకాలం పాటు సాయి సంస్థాన్ యొక్క మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్నారు. ఆయన రాసిన ఒక వ్యాసంలో (శ్రీ సాయిలీల 7వ సంవత్సరం వాల్యూమ్స్ 5-6-7 లో ప్రచురించబడినది) అతను కుడాల్ లోని మాదయే బువా నిర్మించిన సాయి మందిరం గురించి ఇలా పేర్కొన్నారు. 

“డిసెంబర్ 1922లో, నేను సెలవులో కొంకణ్ కు వెళ్ళాను. నేను మాదయే బువాను ఆయన స్థాపించిన శ్రీ సాయి దర్బార్ లో కలిశాను. చూడగానే భక్తి భావం ఉట్టిపడేలా నిలువెత్తు బాబా విగ్రహం అక్కడ స్థాపించబడి ఉంది. అంతటి మనోహరమైన బాబా రూపాన్ని చూసాక ఎవరికి ఆధ్యాత్మిక పారవశ్యం కలుగకుండా ఉంటుంది! నా ఆనందానికి అవధులు లేవు. అక్కడ ఉన్నప్పుడే 'శ్రీ సాయిలీల' పత్రిక తాజా సంచికను అందుకున్నాక నా ఆనందం ద్విగుణీకృతమై, దానిని అక్కడే ఎంతో ఆసక్తిగా చదివాను.”

దత్తాదాస్ మాదయే బువా నిర్మించిన ఆ మందిరం 1983 సంవత్సరంలో పునరుద్ధరించబడింది.  శ్రీ బాబురావు సారంగ్ గారి కుమారుడు శ్రీ శ్యాం సారంగ్ చే తయారుచేయబడిన ఏడున్నర అడుగుల నూతన బాబా విగ్రహం కూడా స్థాపించబడింది. ఆ మందిరం 1922 నుండి 1946 వరకు శ్రీ దత్తాదాస్ మాదయే బువా ద్వారా, తర్వాత 1946 నుండి 1999 వరకు వారి కుమారుడు శ్రీ శ్రీపాద మాదయే ద్వారా  నిర్వహించబడింది. ఆ తర్వాత వారి మనవడు శ్రీ రాజన్ మాదయే ద్వారా నిర్వహింపబడుతున్నది.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo