వివాహాలలో సాయిబాబా సహాయం గురించి శ్రీ బి.వి.నరసింహస్వామి గారు చెప్పిన కొన్ని లీలలు
వివాహ విషయమై ఒక అబ్బాయికి సరైన అమ్మాయిని లేదా ఒక అమ్మాయికి సరైన అబ్బాయిని వెతకడం ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన కొన్ని లీలలు.
1. కోలాబా (ముంబై)కి చెందిన జి.డి. పండిట్ తన కుమార్తెకు తగిన వరుడి కోసం ఎంతగానో వెతికాడు గాని, ఒక మంచి పెళ్ళికొడుకుని గుర్తించలేక పోయాడు. పదిహేను రోజులలో తగిన వరుడు దొరికితే షిర్డీ వస్తానని అతను మ్రోక్కుకున్నాడు. తరువాత హైదరాబాద్ నుండి, పండిట్ ఇంటికి ఒక యువకుడు స్వయంగా వచ్చి, అతని కుమార్తెను పదిహేను రోజులలోనే వివాహం చేసుకున్నాడు.
2. బాబా భక్తుడైన గణేష్ కేశవ్ రేగే(జి. కె. రేగే)కు అనేకమంది కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లి విషయంలో విజయం సాధించాడు. కానీ నాల్గవ కుమార్తె విషయంలో ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ సరియైన అబ్బాయిని కనుగొనలేకపోయాడు. కొన్నిసార్లు అంతా అనుకూలంగా కనిపించినప్పటికీ, విధి కీలకమైన సమయంలో తన ఆశలను చెదరగొట్టేది. చివరికి అతను నిరాశతో బాబా పటం ముందు కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అకస్మాత్తుగా, "జైరాపూర్ వెళ్ళు" అని అతనికి స్పష్టంగా, గట్టిగా మాటలు వినిపించాయి. కానీ వాటిని పలికిన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. అది అతనికి బాబా ఆశీర్వాదంగా అనిపించింది. అందువలన తనకు ప్రయోజనం కలుగుతుందని భావించాడు. కానీ జైరాపూర్ లో ఎవరూ తెలియదు, అక్కడకు ఎలా వెళ్ళాలి అని అతను గందరగోళంలో పడ్డాడు. ఇటువంటి సందిగ్ధతలో అతను ఉండగా, జైరాపూర్ కి బదిలీ చేయబడినట్లు ప్రభుత్వం అతనికి ఉత్తర్వు పంపింది. ఇది అతనికి బాబా ఇచ్చిన బహుమతి. వెంటనే అతను వెళ్లి జైరాపూర్ లో ఉద్యోగ విధులకు హాజరయ్యాడు. ఆ కొత్త స్థలంలో తన కుమార్తెకు తగిన వరుడికై అతను విచారణ చేయగా, త్వరలోనే అన్నివిధాలా అర్హుడైన వరుడు దొరికి ఒక నెల లోపల అతని కుమార్తె వివాహ సమస్య పరిష్కరించబడింది.
3. గణేష్ వైద్యకు పెళ్లీడుకొచ్చిన ఒక కుమార్తె ఉంది. తగిన వరునికై అతను పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో అతను చాలా భయపడిపోయాడు. ఒకరోజు బాబా అతని కలలో కనిపించి, "మీరు ఎందుకు ఆత్రుతగా ఉన్నారు? కేశవ్ దీక్షిత్ కు కుమారుడు ఉన్నాడు" అని చెప్పి, ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలుకువ వచ్చింది. అతను ఎప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు, కలలో బాబా చూపించిన అబ్బాయిని కూడా ఎప్పుడూ చూడలేదు. తరువాత తన కుమారునికి ఈ కల గురించి చెప్పినప్పుడు, అతడు తన కార్యాలయంలో ఆయన చెప్పిన లక్షణాలను కలిగిన దీక్షిత్ అనే అతను ఉన్నాడని, అతని తండ్రి పేరు కేశవ్ అని చెప్పాడు. తరువాత వారు పూర్తి విచారణ చేసి, వెంటనే అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆవిధంగా బాబా అతని కుమార్తె పెళ్లి సమస్య పరిష్కరించారు.
మహాసమాధి తర్వాత బాబా సహాయం:
4. ఒక పేద అనాధ అమ్మాయి తన పెళ్లి విషయంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంది. 'సాయి సచ్చరిత్ర' పారాయణ చేయమని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె బాబా ఫోటో ముందు కూర్చుని సచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించింది. మరుసటి రోజే ఎవరో వ్యక్తి వచ్చి, పారాయణ చేస్తున్న ఆమెను చూసి ఆసక్తి కలిగి, అవసరమైన విచారణ చేసి, ఒక వారం లోపల ఆమెను వివాహం చేసుకున్నాడు.
5. మద్రాస్ లో ఆల్ ఇండియా సాయి సమాజ్ వెనుక ఎతిరాజమ్మల్ అనే ఆమె నివసిస్తుండేవారు. పెళ్లీడుకు వచ్చిన ఆమె కుమార్తె కోసం తగిన వరుడిని వెతకడం చాలా కష్టం అయ్యింది. ఆమె బాబాను ప్రార్థించింది. అదృష్టవశాత్తూ ఒక అబ్బాయి ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అంతేకాకుండా సాయి సమాజ్ ను సందర్శించే ఒక కాంట్రాక్టర్ రూ. 1700 / - సహాయం అందిస్తానని మాటిచ్చాడు. పెళ్లి ముహుర్తం నిర్ణయించబడింది. కాని ముహుర్తానికి కొన్ని రోజుల ముందు హఠాత్తుగా ఆ కాంట్రాక్టర్ తన వాగ్దానం ఉపసంహరించుకున్నాడు. పూర్తిగా విసుగు చెంది, ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఆల్ ఇండియా సాయి సమాజ్ కు వచ్చింది. ఆరోజు గురువారపు భజన జరుగుతుంది. ఆమె బాధాతప్త హృదయముతో బాగా తెలిసిన తమిళ భజన పాట, "ఏమిటి బాబా, మీరు ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా?" పాడింది. మరుసటి రోజు ఉదయం మరొక కాంట్రాక్టర్ సాయి సమాజ్ కి వచ్చి, ఆమె కష్టం గురించి తెలుసుకొని, వెంటనే రూ. 2000 /- చెక్ వ్రాసి, ఆ అమ్మాయికి అందజేయమని నా(శ్రీ బి.వి.నరసింహ స్వామిజీ) చేతిలో ఉంచారు. అనుకున్న ముహుర్తానికి అమ్మాయి వివాహం సాయి మందిరంలో జరిగింది.
6. గోపాల్ గణేష్ శ్రేయాన్ కుమార్తెకు 1924లో ఒక వరునితో వివాహం నిశ్చయమయింది. తాంబూలాలు పుచ్చుకున్నారు కూడా. అయితే వివాహం వరుని చదువు పూర్తయిన తర్వాత అని అనుకున్నారు. చదువు పూర్తయింది. వరుని తండ్రికి ఆశ పుట్టింది. కట్నం తెచ్చే సంబంధం కోసం అతను వెతుకుతున్నాడని గోపాల్ శ్రేయాన్ కు తెలిసింది. సాయిబాబాను ప్రార్ధించటం కన్నా ఆయన ఏమీ చేయలేకపోయాడు. సాయి స్వప్నంలో అతనికి కనిపించి, “భయంలేదులే, రెండేళ్ళలో అదే వరునితో వివాహం అవుతుంది" అన్నారు. సాయి మాట చాలు. గోపాల్ శ్రేయాన్ కు ధైర్యం వచ్చింది. ఓపికగానే వేచియున్నాడు. ఈలోగా ఆ వరునికి అనేక సంబంధాలు కుదిరినట్లు కన్పిస్తున్నాయి, కానీ ఏ ఒక్కటీ కుదరడంలేదు. రెండేళ్ళ తరువాత (సాయి చెప్పినట్లుగానే) గోపాల్ శ్రేయాన్ తో మాట్లాడి, అదే సంబంధం చేసుకోక తప్పలేదు వరుని తండ్రికి. సత్పురుషులను విశ్వసించడమే భక్తుల కర్తవ్యం!
7. 1923 సంవత్సరంలో మోరేశ్వర్ చౌహాన్ సోదరిని వివాహం చేసుకుంటానని ఒక వ్యక్తి తనకు తానుగా అభిప్రాయం వ్యక్తపరిచాడు. అందుకు సంబంధించి వాగ్దానం చేస్తూ ఆమోదయోగ్యమైన ఒక అగ్రిమెంట్ వ్రాసుకున్నారు. కానీ, ఆరు నెలలు గడిచిన తర్వాత కూడా అతడు రాలేదు. చౌహాన్ తల్లి వికలమైన మనస్సుతో, "బాబా నీవు అద్భుతమైన అనుభవాలను ఎందరికో ఇచ్చావు. మరి మాకు ఎందుకు ఇవ్వవు? నా కుమార్తె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీకు శక్తి ఉంటే, ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సంబంధం నిశ్చయం కావాలి" అని ప్రార్ధించింది. 24 గంటలలో ఈ విషయమై బాబా శక్తిని నిరుపించుకోమని ఆమె బాబాకే సవాలు విసిరింది. ఆరాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో, మరుసటి రోజు ఉదయం ఆమె తన కుమారుని ప్రక్కన కూర్చుని ఉండగా పోస్టుమేన్ వచ్చి ఒక ఉత్తరం ఇచ్చినట్లుగా, ఆ లేఖలో పెళ్ళికొడుకు తరఫు నుండి పెళ్ళికి తమ తుది ఆమోదాన్ని తెలియజేస్తున్నట్లుగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆమె తన కొడుకు ప్రక్కన కూర్చుని తనకి వచ్చిన కలను వర్ణించటం మొదలుపెట్టింది. అదే సమయంలో పోస్టుమేన్ వచ్చి ఒక లేఖను ఇచ్చాడు. పెళ్లికొడుకు వాళ్ళు వివాహానికి తమ సమ్మతి తెలుపుతూ పంపిన లేఖ అది. బాబా తమ శక్తిని చాటుకున్నారు.
బాబా నన్ను కూడా ఆశీర్వదించండి...మీ సన్నిధిలోకి నన్ను అనుమతించండి..నా భయంకరమైన ఈ కష్టాలను తొలగించి నన్ను ఉద్ధరించండి...మీరు తప్ప ఈ లోకంలో నన్నెవరూ కాపాడలేరు..పాహిమాం సాయీ పాహిమాం....
ReplyDeleteఓం సాయీ శ్రీ సాయీ జయ జయ సాయీ
Suresh garu meeru saisacharitra parayanam cheyandi.saibaba vari krupa tappakunda untundi...om sairam
ReplyDeleteOm sai ram Baba na samasya tondarga tirali tirina tarvata na anubavam blog lo panchukuntanu thandri
ReplyDeleteOm Sai ram,, baba naku 33 years ,aadapillanu, ayina inka pelli kaaledhu, yekkada sambandhaalu kudharadam ledhu,,naku bayanga vundhi, yeduposthundhi, , nuvve dhikku baba,, naku twaralo manchi sambandham kudhiri pelli kaavaalani vedukuntunnaanu baba,,
ReplyDeleteసాయి దివ్యపూజ చేయండి సిస్టర్
Deleteలేదా నవ గురువార వ్రతం
Thank you for everything Shiridi Sai ...
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me