సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శివ స్వరూపంలో నా సాయీశ్వరుడు


శ్రీసాయినాథా చరణామృత పూర్ణచిత్తా స్తత్పాద సేవ నరలా స్సతతంచ భక్త్యా 
సంసార జన్య దురితాఘ వినిర్గతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి.

ఎల్లప్పుడూ కల్పవృక్షం కింద కుర్చుని వారి ఇష్ట ప్రకారం సేవలు చేసే మనుషులకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే సాయీశ్వర నీకు నమస్కారం. సాయి బంధువులందరికి సాయిరాం.

నా పేరు "రాధాకృష్ణ". బాబా గారి భక్తురాలిని అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక చిన్నలీల ద్వారా బాబా గారు తాను "శివ స్వరూపం" అని ఒక స్వప్నం ద్వారా నాకు తెలియచేసారు. అది నేను మీకు వివరిస్తున్నాను.

స్వప్నంలో బాబా గారు నింబ వృక్షం కింద కూర్చుని ఉన్నారు. నేను మరియు నా స్నేహితురాలు అభిషేకం చేయడం కోసం లైన్ లో నిలబడి ఉన్నాం. నా స్నేహితురాలు ముస్లిం తాను బాబాకి అభిషేకం చేయడం కొరకు నీటిని పట్టుకుని నా ముందు నిలబడి ఉంది. కానీ నేను మాత్రం శివుడికి అభిషేకం చేయడం కోసం అని లైన్ లో నిలబడ్డాను. తన వంతు అయిపోయింది బాబాకు అభిషేకం చేసి పక్కకు జరిగింది. కానీ నేను మాత్రం శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లు మనసులో లింగాష్టకం చదువుకుంటూ నా స్నేహితురాలు చేయగానే నేను బాబా గారికి అభిషేకం చేసి పక్కకు వచ్చాను. కానీ నా స్నేహితురాలు అంటుంది. అబ్బా బాబాకు చక్కగా అభిషేకం చేశాను చాలా ఆనందంగా ఉంది అని, అదేంటి చేసింది శివలింగం కి కదా! బాబా అంటావేంటి అని అడిగా నువ్వు ఏం ఆలోచిస్తూ అభిషేకం చేసావో ఏంటో కానీ నువ్వు చేసింది బాబాకి అని నాతో వాదనకి దిగింది. నేను అస్సలు తగ్గట్లేదు. శివాష్టకం చదువుతూ శివునికి చేసానని మొండిగా చెప్పా. అయితే నేను ఒకటి చెపుతాను శ్రద్దగా విను  అని నన్ను ఒక వేప చెట్టు కింద కుర్చోపెట్టింది.

 నేను స్నేహితురాలిని కదా అని అడిగింది. అవును అన్నాను. మరి ముస్లిం కదా! అంది, అవును అన్నాను. మాములుగా ముస్లిం లు అల్లాను, సాయిబాబాను కొలుస్తారు. మీరు హిందువులు అన్ని దేవుళ్ళని కొలుస్తారు, అయితే నేను అభిషేకం శివునికి చేయలేదు బాబాకే చేస్తాను కదా అంది.

అప్పుడు అర్థమైంది బాబా శివస్వరూపంగా నేను మనసులో అనుకోని చేసిన బాబాకే చెందుతుంది నా పూజ. అంతలో నా పక్కన బాబా గారు ప్రత్యక్షం అయ్యారు. ఇంకా నీ కళ్ళు తెరుచుకోలేదా! శివుడు వేరు నేను వేరేనా! నేను శివ స్వరూపం ను కదా! అని మాయం అయిపోయారు.

నా కళ్ళ నుండి నీరు కారుతున్నాయి. బాబా నన్ను క్షమించు. నువ్వే నా శివుడివి. నువ్వే నా సాయివి. నాకున్న అజ్ఞానాంధకారంను ఒక స్వప్నం ద్వారా తొలిగించారు. సబ్ క మాలిక్ ఏక్ అని నిరూపించుకున్నారు. సాయిబాబా సాయీశ్వరుడు అయ్యారు. నా ప్రాణనాథుడు అయ్యారు. 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo