సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

చిదంబర్ కేశవ్ గాడ్గిల్


చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అలియాస్ అన్నాసాహెబ్ గాడ్గిల్ శ్రీసాయిబాబాకు గొప్ప భక్తుడు. అతను అహ్మద్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో చాలాకాలం చిట్నిస్(అసిస్టెంట్)గా పనిచేశాడు. శిరిడీ అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్నందున అవకాశం వచ్చిన ప్రతిసారీ అతను శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునేవాడు. తరువాత అతను పదోన్నతిపై మామల్తదారుగా సిన్నర్‌లో పనిచేశాడు. అక్కడినుండి శిరిడీ కేవలం 60 మైళ్ళ దూరంలో ఉన్నందున తరచూ శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవడానికి అతనికి అనువుగా ఉండేది.

తరువాత కొంతకాలానికి గాడ్గిల్‌ని సుదూర ప్రాంతానికి బదిలీ చేస్తూ, వెంటనే అక్కడ ఉద్యోగ విధులలో హాజరవ్వాలని ఉత్తర్వులు వచ్చాయి. ఇక తరచూ బాబా దర్శనం చేసుకునే అవకాశం తనకు లేదన్న ఆలోచనతో అతను చాలా బాధపడ్డాడు. కనీసం అక్కడకు వెళ్లేముందైనా ఒకసారి బాబా దర్శనం చేసుకుందామంటే అది కూడా వీలుకాక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కానీ చేసేదేమీలేక భారమైన హృదయంతో అతను కోపర్‌గాఁవ్ మీదుగా వెళ్ళే రైలెక్కాడు. కొంతసేపటికి రైలు కోపర్‌గాఁవ్ స్టేషన్లో ఆగింది. "నేను ఎంతటి దురదృష్టవంతుడిని, శిరిడీకి ఇంత దగ్గరగా వచ్చి కూడా బాబా దర్శనం చేసుకోలేకపోతున్నాను" అని కృంగిపోయాడు గాడ్గిల్. రైలు కదులుతుండగా బాబా దర్శనం కోసం తపించిపోతున్న అతని హృదయం ద్రవించి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. అంతలో కిటికీ గుండా ఒక చిన్న కాగితపు పొట్లం అతని ఒడిలో వచ్చి పడింది. 'ఎవరు విసిరారా!' అని బయటకు చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. తరువాత అతను ప్యాకెట్ తెరచి, అందులో ఉన్న బాబా ఊదీని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్యాకెట్టును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. తరువాత కొంతకాలానికి అతనికి శిరిడీ సందర్శించే అవకాశం వచ్చింది. అప్పుడు బాబా అతనితో, "నువ్వు రాలేదు కదా! అందువల్ల నేనే నీకు ఊదీ పంపించాను. నీకు అందింది కదా?" (తు ఆలా నహిస్, మ్హణూన్ మీ తులా ఊదీ పటావిలీ, నీ పోహోఁచలి నా?) అని అన్నారు. ఆ మాటలు వింటూనే, తనపై బాబాకున్న ప్రేమకు గాడ్గిల్ మనస్సు ఆనందంతో నిండిపోగా కన్నీళ్ళతో బాబా పాదాలకు ప్రణమిల్లాడు. ఆ ఊదీని అతనొక తాయెత్తులో పెట్టి, ఎప్పుడూ తనతో పాటు ఉంచుకునేవాడు.

చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గణేశ ఉపాసకుడు. గణేశునికి సంబంధించి గ్రంథాలలో చెప్పబడిన అన్ని ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తుండేవాడు. తన ఇంట ఉన్న బాబా ఫోటోను కూడా ఆ ఆచారాలతో పూజిస్తుండేవాడు. ఒకసారి అతడు శిరిడీ వచ్చినప్పుడు కొంతమంది భక్తులతో బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. గాడ్గిల్ వైపు చూపిస్తూ అక్కడి భక్తులతో, "ఈ ముసలాడిని బయటకు నెట్టండి. అతడు నా గద్దె క్రింద ఎలుక ఉందని అంటున్నాడు" అని అన్నారు బాబా. ఆ మాటలు వింటూనే బాబా తన పూజను స్వీకరిస్తున్నారని ఆనందంలో మునిగిపోయాడు గాడ్గిల్.

 మూలం : శ్రీ సాయిలీలా మ్యాగజైన్ - 1923, Baba's Vaani by Vinni Chitluri

6 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Sadhguru sainadh maharaj ki jai 🙏🙏👏👏👏👏👏

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺😀🌸🤗🌹🌼

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sai ram om sai sri sai ja ja sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo