సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 319వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సహాయం చేయడానికి బాబా ఎల్లప్పుడూ ఉన్నారు
  2. బాబా ఊదీతో మచ్చ మాయం

సహాయం చేయడానికి బాబా ఎల్లప్పుడూ ఉన్నారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయినాథ్ మహరాజ్ కీ జై! నేను సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో ఏ ఇబ్బందులు ఎదురైనా నాకు సహాయం చేయడానికి బాబా ఎల్లప్పుడూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నా కుటుంబం నా నుండి చాలా దూరంలో ఉంది. శస్త్రచికిత్స చిన్నదే అయినప్పటికీ అది నా శరీరంలోని ముఖ్యమైన అవయవానికి సంబంధించినది. శస్త్రచికిత్స జరిగే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా అది నా జీవితాన్ని దయనీయంగా మార్చేస్తుంది. ఆ స్థితిలో నేను కొన్నిరోజులపాటు, "నన్ను కాపాడండి బాబా" అని బాబాను ప్రార్థిస్తూ గడిపాను. బాబా నా ప్రార్థనలు విన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది.

తరువాత నా తల్లిదండ్రులు నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. రెండు సంవత్సరాలు ఎంత వెతికినా నాకు తగిన సంబంధం దొరకలేదు. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నేను, "సరైన భాగస్వామిని చూపించమ"ని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థనలు విన్నారు. నాకు సరైన వ్యక్తిని చూపించారు. ఇప్పుడు నాకు పెళ్ళై సంతోషంగా ఉన్నాను. ఇదంతా బాబా ఆశీర్వాదం వల్లనే అని నా నమ్మకం.

నా సోదరికి వివాహం జరిగి 3 సంవత్సరాలయింది. కానీ తనకి పిల్లలు లేరు. ఆ కారణంగా తను తన అత్తమామల నుండే కాక, ఇతరుల నుండి కూడా నిందలు ఎదుర్కొంటుంది. అసలే తను మొదటినుండి తన అత్తగారితో మాటలు పడుతుంది. తన వైపునుండి గాని, మా కుటుంబం వైపునుండి గాని ఏది జరిగినా తన అత్తగారు తప్పులు పడుతూ హింసిస్తుండేది. ఆ ఇంట్లో మాట్లాడటానికి కూడా తనకి స్వేచ్ఛ లేదు. దానికి తోడు పిల్లలు పుట్టకపోవడంతో తన పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారింది. ఈ విషయంగా మా కుటుంబమంతా ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళం. ఏ పిల్లల్ని చూసినా నా సోదరి గుర్తుకు వచ్చేది. సాయిబాబా తనని ఎందుకు పట్టించుకోవడం లేదని మేము బాధపడుతూ, "బాబా! నా సోదరికి ఒక బిడ్డని ప్రసాదించండి" అని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. చివరికి బాబా మా ప్రార్థనలను విన్నారు. ఆయన ఆశీస్సులతో గత ఏడాది నా సోదరి గర్భం దాల్చింది. ఈ వార్తతో మేమంతా సంతోషించాము. అయితే, ఐదవ నెలలో నా సోదరికి కొన్ని సమస్యలు వచ్చాయి. వైద్యులు స్కాన్ చేసి, బిడ్డ మూత్రపిండాల పనితీరులో కొంత సమస్య ఉండొచ్చునని పేర్కొన్నారు. మేము బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెంది, రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. బాబా మా ప్రార్థనలు విన్నారు. నా సోదరి ఇటీవలే ఒక బిడ్డను ప్రసవించింది. బాబా దయవల్ల బిడ్డకి ఎటువంటి సమస్యలు లేవని, బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. ఇకనైనా నా సోదరి విషయంలో ఆమె అత్తమామల ప్రవర్తనలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. వాళ్లలో మార్పు వచ్చి నా సోదరిని బాగా చూసుకోవాలని నేను సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. బాబా ఖచ్చితంగా తన భక్తులకు సహాయం చేస్తారు. మనల్ని రక్షించడానికి బాబా ఉన్నారని నా నమ్మకం. "బాబా! మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. సదా మాకు రక్షణనిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2557.html?m=0

బాబా ఊదీతో మచ్చ మాయం

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తుడు మిథున్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా పేరు మిథున్. నేను యు.ఎస్.ఏ.లో నివసిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నా మోచేతి దగ్గర ఒక తెల్లటి మచ్చ వచ్చింది. నేను ఇండియాకి వెళ్లినప్పుడు డాక్టర్‌కి చూపించుకున్నాను. డాక్టర్ పరీక్షించి, అది 'బొల్లి'(vitilgo) అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. నాకు చాలా భయమేసింది. ఈ మచ్చను ఎలాగైనా తగ్గించమని బాబాను ప్రార్థించాను. ఆ సమయంలో నాకు శిరిడీ వెళ్ళే అవకాశం వచ్చింది. శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని ఆ మచ్చను తగ్గించమని మనసారా వేడుకున్నాను. తరువాత బాబాను ప్రార్థించి సచ్చరిత్ర తెరచి చూసినప్పుడు అందులో ఒక భక్తుని రోగాన్ని బాబా నయంచేసిన లీల వచ్చింది. అది నాకు బాబా ఇచ్చిన భరోసాగా అనిపించి చాలా సంతోషించాను. డాక్టర్ ఇచ్చిన మందులు వాడటం మొదలుపెట్టాను. అంతేకాకుండా ప్రతిరోజూ బాబాను ప్రార్థించి బాబా ఊదీని ఆ మచ్చ మీద రాసుకుంటూ ఉండేవాడిని. కొద్దిరోజులకి మచ్చ పూర్తిగా మాయమైపోయింది. ఆ మచ్చ కేవలం బాబా అనుగ్రహం వల్లనే మాయమైందని నా నమ్మకం. ఎంతో సంతోషంతో మనసారా బాబాకు  కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


4 comments:

  1. om sairam
    baba always be with me.

    ReplyDelete
  2. సాయినాథ్ మహరాజ్ కీ జై! 🌹🌹🌹🙏🙏

    ReplyDelete
  3. సాయినాథ్ మహరాజ్ కీ జై! 🌹🙏🌹

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo