సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 328వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను చెన్నైలో నివాసముంటున్న ఒక ఐటి ప్రొఫెషనల్‌ని. సద్గురుసాయి తన భక్తులపై చూపే ప్రేమను సాటివారితో పంచుకునే అవకాశాన్నిచ్చిన ఈ వేదిక నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. సద్గురుసాయి ఆశీస్సులతో సాయిభక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను సాయికి ఒక చిన్న భక్తుడిని. బాబా ఆశీస్సులతో నా జీవితంలో చాలా అనుభవాలున్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కవగా నేను నా బాబాను ప్రేమిస్తాను. నా రోజు బాబాతో మొదలై, బాబాతోనే ముగుస్తుంది. నా జీవితంలో నేను చాలా కఠినమైన సమయాలను ఎదుర్కొన్నాను. అలాంటి ప్రతి సందర్భంలో నేను బాబా ఉనికిని అనుభవించాను. బాబా లేకుండా నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు తెలియదు. నేనిప్పుడు వివరించే అనుభవాలు నా వృత్తి జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలకు, నేను ఎదుర్కొంటున్న చర్మ సమస్యకు సంబంధించినవి.

నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. కొన్ని కారణాలరీత్యా చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల నేను సంతోషంగా లేను. అందువలన నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి విడుదల చేయమని అడిగాను. కానీ నా మేనేజర్ ఏవో కారణాలు చెప్పి వాయిదా వేస్తూ ఉండేది. ఆమెకు సంతోషంగా లేనప్పటికీ నా పనికోసం నేను ఆమెతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఇలా కాలం గడుస్తుండగా ఒక మంచిరోజు ఉదయాన నేను ఆఫీసుకి చేరుకున్న తరువాత సాయిభక్తుల అనుభవాలకు సంబంధించిన ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ తెరిచాను. ఆశ్చర్యమేమిటంటే, నేను చదివిన మొదటి అనుభవం నా సమస్యను పోలినదే! బాబా ఆశీస్సులతో ఆ భక్తుని సమస్య పరిష్కరించబడింది. దాంతో మళ్ళీ నా మేనేజరుని అడగడానికి ఇది సరైన సమయమని బాబా సూచిస్తున్నట్లుగా భావించి, వెంటనే నేను నా ప్రయత్నం చేశాను. ఆశ్చర్యం! వెంటనే నా ప్రాజెక్టు మేనేజర్ నన్ను ప్రాజెక్టు నుండి విడుదల చేయడానికి అంగీకరించింది. "బాబా! మీ సహాయానికి ధన్యవాదాలు".

తరువాత నేను ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది. అందులో చేరుదామని నేను అనుకున్నాను. కానీ అందుకు బాబా తమ సమ్మతి తెలుపడానికి సుముఖంగా లేనట్లు నాకు అనిపించింది. క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగినప్పుడు నాకు ప్రతికూలమైన సమాధానాలు వచ్చాయి. దాంతో నేను ఆ ప్రాజెక్టులో చేరలేదు. కొన్నిరోజులు గడిచాక ఒక ఉదయాన నేను ప్రాజెక్టు కోసం ఆలోచిస్తూ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ తెరిచాను. అక్కడ చీర కొనడానికి సంబంధించిన ఒక భక్తురాలి అనుభవాన్ని చూశాను. ఆ అనుభవంలో ఆమె చీర ఆర్డర్‌ చేస్తే, బాబా ఆ ఆర్డర్ రద్దు అయ్యేలా చేసారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆమె బాబా ఆశీస్సులతో చీర తీసుకోగలిగింది. అదేరకమైన సమస్య నా ప్రాజెక్టు విషయంలో నడుస్తున్నందున ఆ అనుభవం నా మనసును బాగా తాకింది. నేను అనుకుంటున్న ప్రాజెక్టులో చేరడానికి అదే సరైన సమయమని బాబా సూచిస్తున్నట్లుగా నాకు భావన కలిగింది. వెంటనే నేను ప్రాజెక్టులో చేరడానికి అంగీకారం తెలిపాను. కొన్నిరోజులు శిక్షణ పొందిన తర్వాత నాకు, ప్రాజెక్ట్ మేనేజరుకు మధ్య క్లుప్తమైన చర్చ జరిగింది. తరువాత నాకంటూ ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించనందున అతను తాత్కాలికంగా నన్ను ఒక సీట్లో కూర్చోమని చెప్పారు. ఆ సీటు దగ్గర బాబా ఫోటో ఉంది. అది కేవలం యాదృచ్ఛిక సంఘటన అని నేను అపోహపడ్డాను. ఎందుకంటే బాబా ఫోటోలు చెన్నైలో సాధారణం, మనం ప్రతిచోటా చూడవచ్చు. నా సందేహాన్ని తీర్చుకోవడానికి నేను ఆఫీసు మొత్తం వెతికాను. ఆశ్చర్యం! నా సీటు వద్ద తప్ప మరెక్కడా బాబా ఫోటో కనిపించలేదు. గతజన్మ కర్మల వల్ల నేను బాధపడుతున్నప్పటికీ బాబా నాకు తోడుగా అక్కడ ఉన్నారని అర్థం చేసుకున్నాను. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నేను ఏమి అనుభవిస్తున్నానో మీకు తెలుసు. నా జీవితంలో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. నేను నా దైవమైన మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరే నా జీవితం. మీకు నా కోటి ప్రణామాలు. లవ్ యు బాబా!"

నాకు స్కిన్ అలెర్జీ ఉంది. ఇది నా జీవితాన్ని భయంకరంగా మారుస్తున్న పెద్ద సమస్య. ఈ సమస్య నాకు వచ్చి సంవత్సరం పైన అయ్యింది. దానిని ఎలాగైనా నయం చేయమని నేను బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. కానీ నా కర్మ ప్రభావంవలన నా ప్రార్థన బాబాను చేరడానికి కూడా ఆలస్యం అవుతున్నట్టుంది. అయితే ఇందుకు సంబంధించి బాబా ఇచ్చిన కాస్త ఉపశమనాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నేను ఈ చర్మ సమస్యతో చాలా బాధపడి, బాబాను ప్రార్థిస్తూ క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగాను. “నీళ్లు దానం చేయి, వెంటనే నీవు లాభం పొందుతావు” అని వచ్చింది. వెంటనే నేను భోజనానికి కూర్చున్న నా భార్యకు మంచినీళ్ళు అందించాను. తరువాతి నిమిషంలో నా దురద ఆగిపోయింది. తరువాత రెండు రోజులు గడిచేవరకు ఆ సమస్య మళ్ళీ కనపడలేదు. "బాబా! ఈ సమస్య నుండి నాకు పూర్తి ఉపశమనం ఇవ్వండి. మీ దివ్య పాదకమలాలకు నా శతకోటి ప్రణామాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించండి".

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2547.html


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo