సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 991వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్న వారికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి
2. సాయి నామ లిఖిత యజ్ఞంతో స్వగృహ ప్రాప్తి
3. చేయి నొప్పి తగ్గించిన బాబా

నమ్ముకున్న వారికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి


శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ఇప్పుడు నేను బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 35 సంవత్సరాల కిందట ఒకరోజు నాకు విపరీతంగా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా చిరాగ్గా ఉంది. అదేరోజు సాయంకాలం తమ ఇంట్లో ఉన్న 'బాబా పూజ'కు రమ్మని ఒక స్నేహితురాలు ఆహ్వానించింది. నేను ఉన్న స్థితిలో పూజకు ఎలా వెళ్ళగలనని పూజకి వెళ్ళకుండా డాక్టరు దగ్గరకి వెళదామనుకుని, "పూజకు రాన"ని చెప్పాను. అయితే, మధ్యాహ్నం ఉన్నట్టుండి పెద్ద విరోచనమై అప్పటినుండి ఇన్ఫెక్షన్ తగ్గడం మొదలుపెట్టింది. దాంతో సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళకుండా బాబా పూజకు వెళ్ళాను. ఇది బాబా చేసిన అద్భుతం కాదంటారా! అప్పటినుండి నాకు బాబానే దైవం. ఆ తర్వాత నాకు బాబా చాలా చాలా అనుభవాలు చూపించారు. నాకు దేనికీ లోటు లేకుండా చూసుకుంటున్నారు.


కిందటి సంవత్సరం అమెరికాలో ఉన్న మా పాప తన క్లాస్మేట్, "పాత ఇల్లు కొని దానికి మరమ్మత్తులు చేయించి, మంచి లాభానికి అమ్ముకుందామ"ని చెప్తే నమ్మి ఒక ఇల్లు తీసుకుంది. అది కొన్న దగ్గర నుండి మరమ్మత్తులకు అనుకున్న దానికంటే ఎన్నోరెట్లు ఖర్చై మనఃశాంతి లేకుండా అయిపోయింది. అయినప్పటికీ తన క్లాస్మెట్, "ఇంకా రిపేరు చేస్తే, మంచి ధర వచ్చి బాగా లాభమొస్తుంద"ని చెప్పారు. అప్పుడు, "తక్కువ ధరకైనా సరే అమ్ముడు పోయేలా చేసి మనశ్శాంతిగా ఉండేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకుని బేరం పెడితే నెల రోజులకే ఇల్లు అమ్ముడైపోయింది. బాబా దయవల్లే చాలా తొందరగా అమ్ముడైందని మేము చాలా ఆనందించాము.


మా మనవరాలు అమెరికాలో మెడిసిన్ చదువుతుంది. ఇటీవల రెండు రోజుల్లో ఒక పరీక్ష ఉందనగా తనకు విపరీతంగా గొంతునొప్పి, జ్వరం వచ్చాయి. ఆ విషయం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. వాళ్ళ అమ్మ, "వెంటనే ఎమర్జెన్సీకి వెళ్లి కొవిడ్ మరియు ఫ్లూ(జ్వరం) టెస్టులు చేయించుకోమ"ని చెప్తే తను టెస్టుకు ఇచ్చి వచ్చింది. అప్పటినుండి రిపోర్టులు ఎలా వస్తాయోనని చాలా టెన్షన్ పడ్డాము. ఆ రాత్రి నేను, "బాబా! నా మనవరాలికి నెగిటివ్ రిపోర్ట్ వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కాను. తరువాత 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సైటులో బాబాను అడిగితే, 'శ్రీసాయిబాబా ఆశీస్సులు మీకు ఉన్నాయ'ని వచ్చింది. కొన్ని గంటల తర్వాత మా మనవరాలు ఫోన్ చేసి, "రిపోర్ట్ నెగిటివ్ వచ్చింద"ని చెప్పింది. బాబాను నమ్ముకున్న వారికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ఎప్పుడూ మీ నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి".


సాయి నామ లిఖిత యజ్ఞంతో స్వగృహ ప్రాప్తి


ప్రియమైన సాయిభక్తులకు నమస్కారం. నా పేరు అనిత. మాది విశాఖపట్నం. ఇదివరకు నా అనుభవమొకటి మీ అందరితో పంచుకున్న నేను ఇప్పుడు మరో అనుభవాన్ని  పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు మా పక్కింటావిడ శ్రీసాయి కోటి నామ లిఖిత యజ్ఞం అనే బాబా పుస్తకాన్ని నాకు ఇచ్చి, "మీరు వ్రాస్తారా?" అని అడిగారు. సరేనని నేను వ్రాయడం మొదలుపెట్టి కొన్ని పేజీలు వ్రాసాక ఆపేసాను. ఆ పుస్తకం కూడా కనబడలేదు. తర్వాత ఒకసారి పుస్తకాలు సర్దుతుంటే ఆ పుస్తకం కనబడింది. దాంతో మళ్ళీ వ్రాయడం మొదలుపెట్టి, కొన్ని పేజీలు వ్రాసాక మళ్ళీ ఆపేసాను. కొన్ని నెలల తర్వాత ఆ పుస్తకం మళ్లీ దొరికింది. అప్పుడు, 'ఇలా కాదు, ఈసారి ఎలాగైనా ఈ పుస్తకం పూర్తి చేయాలి' అని అనుకుని, "బాబా! ఈ పుస్తకం పూర్తిగా వ్రాసేలోపు మాకు ఒక సొంత ఇంటిని ప్రాప్తింప జేయి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అదే విషయాన్ని నా భర్తతో, మా ఇద్దరు కొడుకులతో చెప్పి, "ఈ గురువారం నాటికి పూర్తి చేద్దాం" అని చెప్పాను. నలుగురం కలిసి ఐదురోజుల్లో వచ్చిన గురువారానికి(2020, డిసెంబర్ 3) ఆ పుస్తకం పూర్తి చేస్తాం. మరుసటి గురువారం అంటే 2020, డిసెంబర్ 10న బిల్డర్ అయిన మావారు స్నేహితుడు మా ఇంటికి రావడం, కొత్తగా తానొక అపార్ట్మెంట్ కడుతున్నానని చెప్పడం జరిగింది. అందులో మాకు ఒక ఫ్లాట్ కావాలని అడిగాం. ఆ ఏరియాలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ బాబా దయవల్ల అందరికంటే మాకు ఒక పదివేల రూపాయలు తగ్గించి ఇచ్చారు. బాబా ఎంత అద్భుతం చేశారో అనుకున్నాం. ఇది నిజమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే, నా జన్మలో ఇల్లు కొనలేము అనుకున్నాను. బాబా మన తోడుగా ఉంటే, మనం అనుకున్నవి అన్నీ జరుగుతాయి, బాబా నెరవేరుస్తారు. జన్మజన్మలకు నేను బాబాకు ఋణపడి ఉంటాను. ఇంకొక అనుభవంతో మళ్లీ కలుద్దాం. 


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!


చేయి నొప్పి తగ్గించిన బాబా


నేను ఒక సాయిభక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. అనుకోకుండా ఒకరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు నా చేయి బాగా నొప్పి పెట్టింది. వెంటనే నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కాస్త ఆలస్యమైనా బాబా దయవలన నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటున్నాను తండ్రి".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



10 comments:

  1. Please bless my family. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Please anybody say what is question and answers site

    ReplyDelete
    Replies
    1. Saibaba answers ani type chesthe okasite open avuthadi andulo manam 1to720 number lo oka number korukovali..mana manasulo korki korukuni..omesairam

      Delete
  3. Jaisairam.bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness. Jaisairam

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌺🥰🌼🤗🌸😃🌹👪💕

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo