1. సాయినాథుని స్మరణతో తప్పక లభించు బాబా అనుగ్రహం
2. బాబా నెరవేర్చిన చిన్నచిన్న కోరికలు
3. బాబాకు మన మీద ఉండే ప్రేమ అపారం
సాయినాథుని స్మరణతో తప్పక లభించు బాబా అనుగ్రహం
ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నాపేరు సాహిత్య. నేను ఇంతకు ముందు ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరోసారి నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చినందుకు ఆ సాయినాథునికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గత అనుభవంలో నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు 2021, నవంబర్ 23వ తేదీన డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు. కానీ నవంబర్ 6వ తేదీ, అర్థ్రరాత్రి 2గంటల 45 నిమిషాలకు ఉమ్మనీరు లీకవ్వడం మొదలయింది, నొప్పులు మాత్రం లేవు. అప్పుడు నేను 'సాయిబాబా సాయిబాబా' అని బాబాను తలుచుకుంటూ, సాయిబాబా కష్టనివారణ స్తోత్రం కూడా పఠిస్తూ మా కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళాను. నన్ను వెంటనే లేబర్ రూములో ఉంచారు. నాకు చాలా భయంగా అనిపించి సాయిబాబా కష్టనివారణ స్తోత్రం ఆపకుండా పఠిస్తూనే ఉన్నాను. నా పక్క బెడ్ మీద ఒకామె నార్మల్ డెలివరీ కోసం పురిటినొప్పులు పడుతూ పెద్దగా ఏడుస్తుంది. అది చూసి నాకు చాలా చాలా భయమేసి, "నాకు నార్మల్ డెలివరీ వద్దు, సి-సెక్షన్ చేయించుకుంటాన"ని మా అమ్మతో, ఇంకా అక్కడున్న సిస్టర్స్‌తో చెప్పాను. కానీ మా అమ్మ, "నార్మల్ డెలివరీయే మంచిదమ్మ" అని నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. నాకు మాత్రం భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఇంకా లో-బిపి వచ్చేసింది. దాంతో మా అమ్మ కూడా భయపడి, "సి-సెక్షనే చేపిద్దాములే" అని అంది. నేను కష్టనివారణ స్తోత్రం పఠిస్తూ, "బాబా! నాకు సి-సెక్షన్ చేసినట్లైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. మావారు కూడా అదే కోరుకున్నారు. చివరికి బాబా ఆశీస్సులతో మేము కోరుకున్నట్లు నాకు సి-సెక్షన్ జరిగి నేను ఒక చక్కటి ఆరోగ్యవంతమైన ఆడపిల్లకి జన్మనిచ్చాను. తరువాత హాస్పిటల్లో ఉన్న ఐదు రోజులు నాకు సెలైన్లు ఎక్కిస్తుండేవారు, కుట్లు కాస్త ఇబ్బందిగా ఉండి నొప్పిగా ఉంటుండేది. అప్పుడు నేను, "బాబా! ఈ నొప్పులు, సెలైన్లు లేకుండా నేను ఆరోగ్యంగా ఉంటే, 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవలన నిదానంగా నా పరిస్థితి మెరుగై కాస్త ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఇంటికి వచ్చి బాగున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఇదంతా మీ దయ".
ఇంకో చిన్న అనుభవం పంచుకుంటాను. మా అమ్మ మొబైల్ కనపడకుండా పోయి ఎంత వెతికినా సుమారు ఒక వారం వరకు దొరకలేదు. చివరికి 'ఓం శ్రీసాయి సుక్ష్మాయ నమః' అని జపిస్తూ, "మొబైల్ దొరికితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవలన 2021, నవంబర్ 15న ఆ మొబైల్ దొరికింది. బాబాను ప్రార్థించినందువల్లే మొబైల్ దొరికింది. "థాంక్యూ బాబా". ఎన్ని కష్టాలెదురైనా ఆపకుండా సాయినాథుని స్మరణలో పరిపూర్ణంగా గడపండి. మన సాయినాథుడు తప్పకుండా మనకి ఒక మార్గం చూపిస్తారు.
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
బాబా నెరవేర్చిన చిన్నచిన్న కోరికలు
నా పేరు శ్రేయ. సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. అసంభవమైన నా చిన్నచిన్న కోరికలను సాయి మహరాజ్ ఎలా జయప్రదం చేసారో మీ అందరితో పంచుకుంటున్నాను.
నాకు జేఈఈ మెయిన్స్ లో 87% మార్కులు వచ్చాయి. కానీ నేను జేఈఈ క్వాలిఫై కానేమో అనుకున్నాను. ఎందుకంటే, 90% మార్కులనే ఆ పరీక్షకు ఎప్పుడూ క్వాలిఫై మార్కుగా నిర్ణయిస్తారు. కానీ బాబా నాపై అపారమైన దయ చూపారు. ఆయన దయవల్ల ఈసారి 86% మార్కులకే జేఈఈ మెయిన్స్ కి అర్హత మార్కుగా నిర్ణయించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఒకసారి నా బంగారు లాకెట్ కనపడకుండా పోతే, అన్ని చోట్ల వెతికాను కానీ, దొరకలేదు. అప్పుడు నేను బాబాను తలచుకుని, "లాకెట్ దొరికితే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకుంటూ మళ్ళీ వెతకడం ప్రారంభించాను. బాబా దయవలన వెంటనే నా దిండు దగ్గర లాకెట్ కనబడింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మా నాన్నగారు రిటైర్ అయిన తరువాత మరో ఉద్యోగం కోసం వెతకటం మొదలుపెట్టారు. అప్పుడు నేను బాబాకు చెప్పుకున్నాను. వెంటనే బాబా నాన్నకి ఒక ఉద్యోగాన్ని ప్రసాదించారు. నాన్న 2021, నవంబర్ 15న కొత్త ఉద్యోగంలో చేరారు. "బాబా! మీ దయవలన కొత్త ఉద్యోగం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను".
నేను బాబా దయవలన వి.ఐ.టిలో జాయిన్ అయ్యాను. "మొదటి మిడ్ పరీక్షలలో మంచి మార్కులు వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను"అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన నాకు మంచి మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబాకు మన మీద ఉండే ప్రేమ అపారం
సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను చిన్నతనం నుంచి సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు మంచి మార్కులు వచ్చాయని మానాన్న నాకొక బంగారు బాబా ఉంగరం కానుకగా ఇచ్చారు. ఇంటర్ పూర్తయి నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ ఉంగరం నా చేతి వేళ్ళకు బాగా టైట్ అయిపోయింది. దాంతో ఆ ఉంగరం తీసేయాల్సి వచ్చింది. అది నా లక్కీ ఉంగరం అయినందున నేను చాలా బాధపడ్డాను. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత నా స్నేహితరాలి ద్వారా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు పరిచయమైంది. అప్పుడొక రోజు అప్పటి బాబా ఉంగరం తీసుకుని, "బాబా! ఇన్ని సంవత్సరాల తరువాత ఈ ఉంగరం పెట్టుకుంటున్నాను. ఇది నా వేలికి సరిపోతే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యంగా ఆ ఉంగరం నా చేతికి సరిపోయింది. ఇది చిన్న విషయమే కావొచ్చు. కానీ బాబాకు మన మీద ఉండే ప్రేమ అపారం. "ధన్యవాదాలు సాయీ".
ఈమధ్య ఒకరోజు నేను ఇంటర్వ్యూ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ మరుసటిరోజు ఉదయానికి తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం మొదలయ్యాయి. నాలుగు రోజులైనా జలుబు, దగ్గు తగ్గలేదు. పైగా ఒకరోజు రాత్రి తీవ్రమైన జలుబు, దగ్గు వలన నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడు నేను బాబా ఊదీ పెట్టుకుని, "బాబా! నాకొచ్చిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. కాసేపటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గి హాయిగా నిద్రపట్టింది. "మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీరు లేనిదే మేము లేము. మమ్మల్ని ఇలానే ఎల్లవేళలా కాపాడుతూ మాకు మంచి జీవితాన్ని ప్రసాదించండి బాబా. మీకు శతకోటి ధన్యవాదాలు బాబా".
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm sai ram please bless my family be with us.,om sai ram
ReplyDeleteI started sai Divya pooja.with out desire.Tomoro is 2nd week.om sai ram
ReplyDeleteఓమ్ సాయిరాం నీ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. మమ్మలిని కాపాడు తండ్రి. ❤❤❤❤
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness. Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteBaba Sal advance Repatikalla credit ayyetattu chudu baba
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete