సంధ్య (ధూప్) ఆరతి
*(సూర్యాస్తమయ సమయంలో ఒక వత్తితో హారతి యివ్వాలి)*
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
*(1)*
*1. ఆరతీ సాయిబాబాl సౌఖ్యదాతార జీవాl*
*చరణ రజరాలిl ద్యావా దాసావిసావ, భక్తావిసావాl
భక్తావిసావా* ఆరతీ సాయిబాబాl
భావం:- *సాయిబాబా, మీకు ఆరతి. మీరు జీవులకు సౌఖ్యదాతలు.*
*మీ దాసులు, భక్తులూ అయిన మాకు మీ పాదధూళిలో స్థానం ప్రసాదించండి.*
*మీ దాసులు, భక్తులూ అయిన మాకు మీ పాదధూళిలో స్థానం ప్రసాదించండి.*
*2. జూళూనియా అనంగl స్వ స్వరూపీరాహే దంగl*
*ముముక్ష జన దావీl నిజడోళా శ్రీరంగ llడోళా శ్రీరంగ ll ఆరతీ సాయిబాబాll*
*ముముక్ష జన దావీl నిజడోళా శ్రీరంగ llడోళా శ్రీరంగ ll ఆరతీ సాయిబాబాll*
భావం:- *మీరు కాముని దహించి వేసారు; స్వస్వరూపం (ఆత్మస్థితి) లో నిలచారు.*
*ముముక్షు జనులకు మీరు దర్శన మిస్తారు. (ఆరతి...)*
*3. జయా మనీ జైసా బావl తయా తైసా అనుభవl*
*దావిసి దయాఘనాl ఐసీ తుఝీ హీ మావ ll తుఝీ హీ మావ l ఆరతీ సాయిబాబాl l*
*దావిసి దయాఘనాl ఐసీ తుఝీ హీ మావ ll తుఝీ హీ మావ l ఆరతీ సాయిబాబాl l*
భావం:- *మీరు ఎవరి భావమెలావుంటే వారికలా అనుభవమిస్తున్నారు.*
*దయాఘనా, యిదే మీ విధానము; (యిదే...ఆరతి).*
*దయాఘనా, యిదే మీ విధానము; (యిదే...ఆరతి).*
*4. తుమచే నామ ధ్యాతాl హరే సంసృతి వ్యథాl*
*అగాధ తవ కరణీl మార్గ దావిసీ అనాథా l దావిసీ అనాథా lll ఆరతీ సాయిబాబాl ll*
*అగాధ తవ కరణీl మార్గ దావిసీ అనాథా l దావిసీ అనాథా lll ఆరతీ సాయిబాబాl ll*
భావం:- *మీ నామాన్ని ధ్యానిస్తే యీ సంసార వ్యధ నశిస్తుంది.*
*మీ చేతులు అగాధములు; మీరు అనాధలకు మార్గం చూపుతారు.*
*మీ చేతులు అగాధములు; మీరు అనాధలకు మార్గం చూపుతారు.*
*5. కలియుగీ అవతారl సగుణ బ్రహ్మ సచారl*
*అవతీర్ణ ఝాలాసేl స్వామీ దత్త దిగంబర ll దత్త దిగంబరll ఆరతీ సాయిబాబాl ll*
*అవతీర్ణ ఝాలాసేl స్వామీ దత్త దిగంబర ll దత్త దిగంబరll ఆరతీ సాయిబాబాl ll*
భావం:- *మీరు సాక్షాత్తూ యీ కలియుగంలో అవతరించిన సగుణ బ్రహ్మము.*
*దత్తదిగంబరుడే మీరుగ అవతరించారు.*
*దత్తదిగంబరుడే మీరుగ అవతరించారు.*
*6. ఆఠాదివసా గురువారీl భక్త కరీతి వారీl*
*ప్రభుపద పహావయాl భవభయ నివారీ ll భవభయ నివారీll ఆరతీ సాయిబాబాl ll*
*ప్రభుపద పహావయాl భవభయ నివారీ ll భవభయ నివారీll ఆరతీ సాయిబాబాl ll*
భావం:- *ప్రతి 8 వ రోజైన గురువారం, భవ భయాన్ని నివారించే మీ పాదాల దర్శనానికై భక్తులు నియమంగా వస్తున్నారు.*
*7. మాఝా నిజద్రవ్యఠేవl తవ చరణరజ సేవాl*
*మాగణే హేచి ఆతాl తుహ్మా దేవాధి దేవా ll దేవాధి దేవా ll ఆరతీ సాయిబాబాl ll*
*మాగణే హేచి ఆతాl తుహ్మా దేవాధి దేవా ll దేవాధి దేవా ll ఆరతీ సాయిబాబాl ll*
భావం:- *మీ చరణరజమే నా నిజమైన పెన్నిధి.*
*దేవాధిదేవా! మేమిపుడు మీకు చేసే విన్నపమిదే.*
*దేవాధిదేవా! మేమిపుడు మీకు చేసే విన్నపమిదే.*
*8. ఇచ్ఛితా దీనచాతకl నిర్మలతోయ నిజసూఖl*
*పాజావే మాధవాయl సంభాళ అపులీభాక అపులీభాక, ఆరతీ సాయిబాబాl *
*పాజావే మాధవాయl సంభాళ అపులీభాక అపులీభాక, ఆరతీ సాయిబాబాl *
భావం:- *మాధవుడనే యీ చాతకం కోరుతున్న యీ ఆత్మ సుఖమనే నిర్మలమైన నీరు త్రాగించి మీ మాట నిలుపుకొండి! (ఆరతి...)*
*ఆరతీ సాయిబాబాl సౌఖ్యదాతార జీవాl*
*చరణ రజరాలిl ద్యావా దాసావిసావ, భక్తావిసావాl భక్తావిసావా, ఆరతీ సాయిబాబాl *
*చరణ రజరాలిl ద్యావా దాసావిసావ, భక్తావిసావాl భక్తావిసావా, ఆరతీ సాయిబాబాl *
*(2)* అభంగ్
*1. శిరిడీ మాఝే పండరపుర--సాయిబాబా రమావర,*
*బాబా రమావర--సాయిబాబా రమావర.*
భావం:- *శిరిడీయే నాకు పండరిపురము; సాయి బాబాయే (నాకు) రమావరుడు (విఠలుడు).*
*2. శుద్ధ భక్తి చంద్రభాగా--భావ పుండలీక జాగా,*
*పుండలీక జాగా--భావ పుండలీక జాగా.*
భావం:- *శుద్ధమైన భక్తియే చంద్రభాగానది; భక్తియే పుండలీకుని నివాసము.*
*3. యాహో యాహో అవఘే జన--కరూబాబాంసీ వందన,*
*సాయీసీ వందన కరూ--బాబాంసీ వందన*
*3. యాహో యాహో అవఘే జన--కరూబాబాంసీ వందన,*
*సాయీసీ వందన కరూ--బాబాంసీ వందన*
భావం:- *రండి, అందరూ రండి! బాబాకు వందనము చేయండి.*
*4. గణూహ్మణే బాబా సాయీ--దావపావ మాఝే ఆఈ,*
*పావమాఝే ఆఈ--దావపావ మాఝే ఆయీ.*
భావం:- *గణూ చెబుతున్నాడు--'సాయిబాబా, నా తల్లీ! నన్ను కాపాడగ పరుగున రావయ్యా!' అని.*
*1. ఘాలీన లోటాంగణ, వందీన చరణ,*డోల్యాని పాహీన రూప తుఝే,*ప్రేమే ఆలింగన, ఆనందే పూజీన్,*భావే ఓ వాళిన హ్మణే నామా ll*
భావం:- *'మీకు సాష్టాంగ నమస్కారము; మీ చరణాలకు వందనం చేస్తాను.* *మీ రూపాన్నే కన్నులారా చూస్తాను.* *ప్రేమతో ఆలింగనము, ఆనందంగా పూజ చేస్తాను.* *భక్యితో ఆరతి చేస్తాను' అని నామదేవుడంటున్నాడు.*
*2. త్వమేవ మాతా చ పితా త్వమేవ,*
*త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ l*
*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ*
*త్వమేవ సర్వం మమ దేవదేవ ll*
*త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ l*
*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ*
*త్వమేవ సర్వం మమ దేవదేవ ll*
భావం:- *నీవే తల్లి, తండ్రి, బంధువు, సఖుడవు; నీవే విద్య, నీవే ధనము.*
*3. కాయేన వాచా మనసేంద్రియైర్వా*
*బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ ll*
*కరోమి యద్యత్సకలం పరస్మై*
*నారాయణాయేతి సమర్పయామి ll*
*బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ ll*
*కరోమి యద్యత్సకలం పరస్మై*
*నారాయణాయేతి సమర్పయామి ll*
భావం:- *శరీరము, వాక్కు, మనస్సు, యింద్రియాలతో గాని, బుద్ధి---ఆత్మలతోగాని, ప్రకృతి సిద్ధమైన స్వభావం వలన గాని ఏమేమి చేస్తానో అదంతా పరమాత్మయైన నారాయణునికే సమర్పిస్తున్నాను.*
*4. అచ్యుతం కేశవం రామనారాయణం,*
*కృష్ణ దామోదరం వాసుదేవం హరిం,*
*శ్రీధరం మాధవం గోపికా వల్లభం,*
*జానకీనాయకం రామచంద్రం భజే ll*
*కృష్ణ దామోదరం వాసుదేవం హరిం,*
*శ్రీధరం మాధవం గోపికా వల్లభం,*
*జానకీనాయకం రామచంద్రం భజే ll*
భావం:- *'అచ్యుతం' మొదలైన నామాలు గల పరమాత్ముడైన మిమ్ము భజిస్తున్నాను.*
*(4)* నామ స్మరణం
*హరేరామ హరేరామ రామరామ హరేహరేl*
*హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేll*
*🌹
హరిఃఓం గురుదేవదత్త 🌹”
*(5)* నమస్కారాష్టకం
*1. అనంతా తులాతే కసేరే స్తవావే*
*అనంతా తులాతే కసేరే నమావే*
*అనంతా ముఖాచా శిణే శేషగాతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *ఓ అనంతా, మిమ్ము నేనెలా స్తుతించ గలను, ఎలా నమస్కరించగలను? అనంతుడే అన్ని ముఖాలతో గానం చేసి అలసిపోయాడు. శ్రీ సాయినాథా! మీకు సాష్టాంగ నమస్కారము.*
*2. స్మరావే మనీ త్వత్పదా నిత్యభావే*
*ఉరావే తరీ భక్తి సాఠీ స్వభావే*
*తరావే జగా తారునీ మాయతాతా*
*ఉరావే తరీ భక్తి సాఠీ స్వభావే*
*తరావే జగా తారునీ మాయతాతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *నిత్యమూ భక్తితో మీ పాదాలు ధ్యానిస్తాను. అపుడు నా మనసులో భక్తి స్థిరమవుతుంది. అపుడు మాయనుండి, సంసారం నుండి తరిస్తాను.*
*3. వసే జో సదా దావయా సంతలీలా*
*దిసే ఆజ్ఞ లోకా పరీ జో జనాలా*
*పరీ అంతరీ జ్ఞాన కైవల్యదాతా*
*దిసే ఆజ్ఞ లోకా పరీ జో జనాలా*
*పరీ అంతరీ జ్ఞాన కైవల్యదాతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *సత్పురుషులకు లీలలు చూపుతూ ఆజ్ఞులైన లౌకికులకు ఆజ్ఞునిలా కనిపిస్తున్నా, నిజానికి జ్ఞాన-కైవల్య దాతలైన శ్రీసాయి నాథా, మీకు సాష్టాంగ నమస్కారము.*
*4. భరాలాధలా జన్మ హా మానవాచా*
*నరాసార్థకా సాదనీభూత సాచా*
*ధరూ సాయి ప్రేమాగళయా అహంతా*
*నరాసార్థకా సాదనీభూత సాచా*
*ధరూ సాయి ప్రేమాగళయా అహంతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *ఈ మానవజన్మ లభించడం మంచిది. నిజానికి మానవులే జన్మసార్థక్యతను సాధించగలరు. సాయిపై ప్రేమ వహించి అహంకారం నిర్మూలించుకోవచ్చు.*
*5. ధరావే కరీ సాన అల్పజ్ఞ బాలా*
*కరావే అహ్మాధన్య చుంబో నిగాలా*
*ముఖీ ఘాల ప్రేమే ఖరా గ్రాస ఆతా*
*కరావే అహ్మాధన్య చుంబో నిగాలా*
*ముఖీ ఘాల ప్రేమే ఖరా గ్రాస ఆతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *అల్పజ్ఞులము, బాలురమూ అయిన మా చేతులు పట్టుకోండి. మా చెక్కిళ్ళు ముద్దాడి మమ్మల్ని ధన్యులు చేయండి; మీ ప్రేమ రసాన్ని మానోట త్రాగించండి.*
*6. సురాదీక జ్యాంచ్యా పదా వందితాతీ*
*సురాదీక జాతే సమానత్వ దేతీ*
*ప్రయాగాది తీర్థే పదీ నంర హోతా*
*సురాదీక జాతే సమానత్వ దేతీ*
*ప్రయాగాది తీర్థే పదీ నంర హోతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *ఎవరిపాదాలకు దేవాదులు నమస్కరిస్తారో, ప్రయాగాది తీర్థాలు ఎవరిపాదాలకు నమస్కరిస్తాయో అటువంటి శ్రీ సాయినాథా.*
*7. తుఝ్యా జ్యా పదా పాహతా గోపబాలీ*
*సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ*
*కరీ రాసక్రీడా సవే కృష్ణనాథా*
*సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ*
*కరీ రాసక్రీడా సవే కృష్ణనాథా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *ఏ పాదాలను చూచి గోపికలు మనసులో ధ్యానించి, ఏ కృష్ణునితో కలసి రాసక్రీడ చేసి ఆ చిత్స్వరూపంలో కలసి పోయారో, అట్టి కృష్ణనాథుడైన సాయినాథా! మీకు సాష్టాంగ నమస్కారము.*
*8. తులామాగతో మాగణే ఏక్ థ్యావే*
*కరాజోడితో దీన అత్యంత భావే*
*భవీ మోహనీరాజ హా తారి ఆతా*
*కరాజోడితో దీన అత్యంత భావే*
*భవీ మోహనీరాజ హా తారి ఆతా*
*నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా*
భావం:- *'మోహింపచేసే యీ భవసాగరాన్ని యిప్పుడే దాటించు, ఓ రాజా!' అని అత్యంత దీనభావంతో చేతులు జోడించి శ్రీసాయినాథునికి నమస్కరిస్తున్నాను.*
*(6)* ప్రార్థన
*1. ఐసా యేయీబా! సాయిదిగంబరా!*
*అక్షయరూప అవతారా! సర్వహి వ్యాపక తూ !*
భావం:- *సాయి దిగంబరా, అక్షయరూపా, అవతారా! ఇటురావయ్యా! నీవే సర్వ వ్యాపివి.*
*2. శృతిసారా--అనసూయా త్రికుమారా! మహారాజేఈబా llఐసాll*
భావం:- *శృతి (వేద) సారము, అత్రి-అనసూయల కుమారుడవూ అయిన ఓ మహారాజా! ఇటు రావయ్యా!*
*3. కాశీస్నానజప ప్రతిదివసీ! కొల్హాపుర భిక్షేసీ నిర్మల నదితుంగా!
జలప్రాసీ! నిద్రామాహుర దేశీ! llఐసాll*
భావం:- *నిత్యము కాశీలో స్నానజపాలు, నిర్మలమైన తుంగ (నది)లో నీరుత్రాగడము,*
*మాహుర పురంలో నిద్ర చేస్తావు, అటువంటి సాయి యిటు రండి.*
*4. ఝోళీలోంబతసే వామకరీ--త్రిశూలఢమరూధారీ!*
*భక్తావరద సదా సుఖకారీ--దేశిల ముక్తీచారీ llఐll*
*భక్తావరద సదా సుఖకారీ--దేశిల ముక్తీచారీ llఐll*
భావం:- *ఎడమచేతికి జోలె, త్రిశూలము, డమరకము ధరించి భక్తులకు వరాలు, ఎల్లప్పుడూ సుఖమూ యిచ్చి ముక్తిని ముందుగా చాటుతావు.*
*5. పాయీపాదుకా జపమాలా! కమండలూ మృగఛాలా*
*ధారణకరశీబా! నాగజటా--ముగుట శోభతోమాధా llఐll*
భావం:- *కాళ్ళకు పాదుకలు, జపమాల, కమండలము, మృగ చర్మమూ ధరిస్తారు. మీ తలపై ముకుటంగా నాగజటయే శోభిస్తుంది.*
*6. తత్పర తుఝ్యాయా--జేధ్యానీ! అక్షయత్యాంచేసదనీ*
*లక్ష్మీవానకరీ! దినరజనీ--రక్షసిసంకట వారుని llఐll*
భావం:- *తత్పరతతో మిమ్మెవరు ధ్యానిస్తారో వారి యింట అక్షయమైన లక్ష్మి అగర్నిశలూ వాసం చేస్తుంది; మీరు వారి సంకటాలు హరిస్తారు.*
*7. యాపరిధ్యాన తుఝే--గురురాయా! దృశ్యకరీ నయనాయా*
*పూర్ణానంద సుఖే--హీ కాయా! లావిసి హరిగుణగాయా*
*ఐసా యేఈబా!! సాయిదిగంబరా.... మహారాజేఈబా!!*
*పూర్ణానంద సుఖే--హీ కాయా! లావిసి హరిగుణగాయా*
*ఐసా యేఈబా!! సాయిదిగంబరా.... మహారాజేఈబా!!*
భావం:- *గురురాజా మిమ్ము ధ్యానంలో కళ్ళారా చూడగల వారిని హరిగుణ గానం ద్వారా పూర్ణానంద సుఖంలో వారి శరీరాలు (గూడ) నిమగ్నమయ్యేలా మీరు చేస్తారు.*
7. సాయి మహిమా స్తోత్రం
*1. సదాసత్స్వరూపం చిదానందకందం*
*జగత్సంభవస్థానసంహార హేతుం !*
*స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం,*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *సచ్చిదానంద స్వరూపుడవు, జగదుత్పత్తిస్థితి సంహార హేతువవు, భక్తుల కోరికననుసరించి మానవ రూపంలో కనిపించువాడవు. అట్టి ఈశ్వరుడు, సద్గురువు అయిన శ్రీసాయినాథునకు నమస్కరించు చున్నాను.*
*2. భవద్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం*
*మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యమ్!*
*జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం!*
*మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యమ్!*
*జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *అజ్ఞానాంధకారమును నశింప జేయు సూర్యుడు; మనోవాక్కుల కతీతుడు; మునులకు ధ్యానమున పొందదగినవాడు, జగద్వ్యాపకుడు, నిర్మలుడు, నిర్గుణుడు, ఈశ్వరుడు, సద్గురువూ అయిన శ్రీ సాయి నాథునకు నమస్కరించుచున్నాను.*
*3. భవాంబోధి మగ్నార్థితానాం జనానాం*
*స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం!*
*సముద్ధారణార్థం కలౌ సంభవంతం!*
*స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం!*
*సముద్ధారణార్థం కలౌ సంభవంతం!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *అజ్ఞాన సాగరములో మునుగు తున్న జనులను, తన పాదాలను భక్తి ప్రీతులతో ఆశ్రయించిన వారినీ ఉద్ధరించుటకు కలిలో అవతరించిన ఈశ్వరునకు నమస్కరించు చున్నాను.*
*4. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్*
*సుథాస్రావిణం తిక్తమప్య ప్రియంతం!*
*తరుం కల్పవృక్షాధికం సాధయంతం!*
*సుథాస్రావిణం తిక్తమప్య ప్రియంతం!*
*తరుం కల్పవృక్షాధికం సాధయంతం!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *సదా చేదు రసమును స్రవించు వేపచెట్టు మూలంలో నివసించి, దానిని కల్పవృక్షమునకంటే అధికమైన దానినిగా చేసిన ఈశ్వరునకు నమస్కరించు చున్నాను.*
*5. సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే*
*భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవామ్!*
*నృణాంకుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం!*
*భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవామ్!*
*నృణాంకుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *ఎల్లప్పుడూ అట్టి కల్పవృక్ష మూలమున (లేక సృష్టిమూలమున) నిలచి, స్వమాయ చేత నరరూపముదాల్చి, సపర్యాది సేవలను చేయు నరులకు భక్తి, ముక్తులను ప్రసాదించు ఈశ్వరునికి నమస్కరించు చున్నాను.*
*6. అనేకాశృతాతర్క్య లీలావిలాసైః*
*సమావిష్కౄతేశాన భాస్వత్ప్రభావమ్!*
*అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్!*
*సమావిష్కౄతేశాన భాస్వత్ప్రభావమ్!*
*అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *ఎక్కడా విననట్టి, తర్కించ వీలుకానట్టి లీలావిలాసములతో అవతరించి, ప్రభావమున భాసించిననూ అహంభావ రహితుడై, కేవలం ఆత్మభావమున ప్రసన్నుడుగా నుండు ఈశ్వరునకు నమస్కరించుచున్నాను.*
*7. సతాం విశ్రమారామమేవాభిరామం,*
*సదా సజ్జనైస్సంస్తుతం సన్నమద్భిః!*
*జనామోదదం భక్త భద్రప్రదంతం!*
*సదా సజ్జనైస్సంస్తుతం సన్నమద్భిః!*
*జనామోదదం భక్త భద్రప్రదంతం!*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *మహాత్ములకు విశ్రాంతిస్థానమై, సజ్జనుల స్తుతి నమస్కారములందు కొనుచు, జనులకు సంతోషమును కూర్చుచు, భక్తులకు అభయ మిచ్చుచున్న ఈశ్వరునకు నమస్కరించుచున్నాను.*
*8. అజన్మాద్యమేకం పరం బ్రహ్మసాక్షాత్*
*స్వయం సంభవం రామమేవావతీర్ణమ్!*
*భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం*
*స్వయం సంభవం రామమేవావతీర్ణమ్!*
*భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్!!*
భావం:- *జన్మాదులు లేనివాడు, అద్వితీయుడు, రామునివలె తనయిచ్ఛచేతనే అవతరించిన సాక్షాత్పర బ్రహ్మమగు మీ దర్శనము చేతనే పవిత్రుడనైతిని, ప్రభూ! అట్టి ఈశ్వరుడగు సాయినాథునికి నమస్కరించుచున్నాను.*
*9. శ్రీసాయీశ కృపానిధే ఖిలనృణాం సర్వార్థ సిద్దిప్రద,*
*యుష్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపి వక్తా క్షమః !*
*సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుట స్సంప్రాపితో స్మిప్రభో*
*శ్రీమత్సాయి పరేశ పాదకమలా నాన్యచ్ఛరణం మమ !!*
భావం:- *శ్రీ సాయీశా! కృపానిధీ! సర్వజనులకు చతుర్విధ పురుషార్థములను ప్రాప్తింప జేయుము. మీ పాద ధూళియొక్క ప్రభావమును సృష్టికర్త గూడ వర్ణించలేడు. నేను సద్భక్తితో నమస్కరించి శరణు పొందితిని ప్రభూ! నాకు శ్రీసాయి యనే పరేశుని పాదకమలములు తప్ప వేరు శరణులేదు.*
*10. సాయిరూపధర రాఘవోత్తమం*
*భక్తకామ విభుధద్రుమం ప్రభుం*
*మాయయోపహత చిత్తశుద్దయే*
*చింతయామ్యహమహర్నిశం ముదా*
*భక్తకామ విభుధద్రుమం ప్రభుం*
*మాయయోపహత చిత్తశుద్దయే*
*చింతయామ్యహమహర్నిశం ముదా*
భావం:- *శ్రీసాయి రూపమును ధరించిన శ్రీరాముని భక్తుల కోరికలను తీర్చుటలో కల్పవృక్షమైన వానిని, మాయకలిత చిత్తమును శుద్ధి పొందించుకొనుటకు అహర్నిశలూ సంతోషముతో ధ్యానించెదను.*
*11. శరత్సుధాంశు ప్రతిమం ప్రకాశం*
*కృపాతపత్రం తవసాయినాథా*
*త్వదీయ పాదాబ్ద సమాశ్రితానాం*
*స్వచ్ఛాయయా తాపమపాకరోతు*
భావం:- *శరత్ చంద్రునివంటి ప్రకాశముగల ఓ సాయినాథా! మీ పాదముల నాశ్రయించిన వారికి కృపతో ఆత్మానందము అను గొడుగును పట్టి, సర్వవిధములైన పాపములనూ నివారించండి.*
*12. ఉపాసనా దైవత సాయినాథ*
*స్తవైర్మయోపాసనినాస్తుతస్త్వమ్*
*రమేన్మనోమే తవపాదయుగ్మే*
*భృంగో యదాబ్జే మకరంద లుబ్ధః*
భావం:- *ఓ ఉపాసనా దైవమా! సాయినాథా! ఉపాసనినైన లేక ఉపాసకుడైన నాచే మీరు స్తుతింపబడితిరి. మకరందమునందు ప్రీతి గల తుమ్మెద కమలమునందు నిలచినట్లు, నా మనస్సు సదా మీ పాదద్వయమందు రమించుగాక.*
*13. అనేకజన్మార్జిత పాప సంక్షయో*
*భవేద్భవత్పాద సరోజ దర్శనాత్*
*క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్*
*ప్రసీద సాయీశ సద్గురో దయానిదే*
భావం:- *ఓ సాయీశా, గురూ, దయానిధీ! మీ పాదకమల దర్శనము చేత అనేక జన్మముల నుండి ఆర్జింపబడిన పాపములు క్షయమగు నట్లు కరుణింతురు గాక.*
*14. శ్రీ సాయినాథ చరణామృత పూర్ణచిత్తా*
*స్త్వత్పాద సేవ నరతా స్సతతంచ భక్త్యా*
*సంసార జన్యదురితౌఘ వినిర్గతాస్తే*
*కైవల్యధామ పరమం సమవాప్నువంతి*
*స్త్వత్పాద సేవ నరతా స్సతతంచ భక్త్యా*
*సంసార జన్యదురితౌఘ వినిర్గతాస్తే*
*కైవల్యధామ పరమం సమవాప్నువంతి*
భావం:- *ఓ సాయినాథా! సతతము భక్తితో మిమ్ము సేవించి, మీ చరణామృతము చేత పవిత్రమైన చిత్తము గలవారు సంసార మందుద్భవించిన పాపముల నుండి విడివడి పరమ కైవల్యస్థితిని పొందెదరు.*
*15. స్తోత్రమేతత్పఠేద్భక్త్యా యోనర స్తన్మనాస్సదా*
*సద్గురో స్సాయినాథస్య కృపాపాత్రం భవేద్ధృవం*
*సద్గురో స్సాయినాథస్య కృపాపాత్రం భవేద్ధృవం*
భావం:- *ఏ నరులు సదా భక్తితో యీ స్తోత్రమును పఠింతురో, వారి మనస్సు నిశ్చయముగ సద్గురు సాయినాథుని కృపకు పాత్రమగును.*
*(8)*
*1. రుసో మమ ప్రియాంబికా, మజవరీ పితాహీ రుసో*
*రుసో మమ ప్రియాంగనా, ప్రియసుతాత్మ జాహీ రుసో*
*రుసో భగిని బంధుహీ, శ్వశుర సాసుబాయీ రుసో*
*న దత్తగురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
*రుసో మమ ప్రియాంగనా, ప్రియసుతాత్మ జాహీ రుసో*
*రుసో భగిని బంధుహీ, శ్వశుర సాసుబాయీ రుసో*
*న దత్తగురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
భావం:- *నా తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు నాపై
అలిగిన అలుగుగాక! ఓ సాయినాథా,
దత్తగురూ, మీరు మాత్రము నాపై
అలుగవద్దు.*
*2. పుసో న సునబాయి త్యా, మజ న భ్రాతృజాయా పుసో*
*పుసో న ప్రియ సోయరే, ప్రియ సగే న జ్ఞాతీ పుసో*
*పుసో సుహృద నా సఖా, స్వజన నాప్తబంధూ పుసో*
*పరీ న గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
*పుసో న ప్రియ సోయరే, ప్రియ సగే న జ్ఞాతీ పుసో*
*పుసో సుహృద నా సఖా, స్వజన నాప్తబంధూ పుసో*
*పరీ న గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
భావం:- *నా కోడలు, వదిన, ప్రియబంధువులు, స్వజనులు, సఖులు, మిత్రులు, ఆప్తులు నా గురించి
ఆలోచింపక పోయిననూ సరే! ఓ సాయినాథా, దత్తగురూ, మీరు మాత్రము నాపై
అలుగవద్దు.*
*3. పుసో న అబలా ములే,
తరుణ వృద్ధహీ నా పుసో*
*పుసో న గురు ధాకుటే, మజ న థోర సానే పుసో*
*పుసో నచ భలేబురే, సుజన సాధుహీ నా పుసో*
*పరీ న గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
*పుసో న గురు ధాకుటే, మజ న థోర సానే పుసో*
*పుసో నచ భలేబురే, సుజన సాధుహీ నా పుసో*
*పరీ న గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
భావం:- *స్త్రీలు, బాలకులు, తరుణులు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు, మంచివారు, చెడ్డవారు, సజ్జనులు మరియు
సాధువులు నా గురించి ఆలోచించకపోయిననూ, ఓ సాయినాథా, దత్తగురూ, మీరు మాత్రము నాపై
అలుగ వద్దు.*
*4. రుసో చతుర తత్త్వవిత్, విబుధ ప్రాజ్ఞ జ్ఞానీ రుసో*
*రుసోహి విదుషీ స్త్రియా, కుశల పండితాహీ రుసో*
*రుసో మహిపతీ యతీ, భజక తాపసీహీ రుసో*
*న దత్త గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
*రుసోహి విదుషీ స్త్రియా, కుశల పండితాహీ రుసో*
*రుసో మహిపతీ యతీ, భజక తాపసీహీ రుసో*
*న దత్త గురు సాయి మా, మజవరీ కధీహీ రుసో*
భావం:- *చతురులైన తత్వవేత్తలు, పండితులు, బుద్ధిమంతులు, జ్ఞానులు, విదుషీమణులు, కుశలులైన పండితులు, రాజులు, సన్యాసులు, భక్తులైన తపన్ వులు, నాపై అలిగినను, ఓ సాయినాథా, దత్తగురూ! మీరు
మాత్రం నాపై అలుగకుడు.*
*5. రుసో కవి ఋషీ మునీ అనఘ సిద్ధ యోగీ రుసో*
*రుసో హి గృహదేవతా ని కులగ్రామదేవీ రుసో*
*రుసో ఖల పిశాచ్చహీ మలిన ఢాకినీ హీ రుసో*
*న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో*
భావం:- *కవులు, ఋషులు, మునులు నిష్పాపులైన సిద్ధులు, యోగులు, గృహ, కుల, గ్రామ, దేవతలు, దుష్టభూతములు, పిశాచములు, క్షుద్రములైన
ఢాకినిలు నాపై అలిగిననూ, కన్నతల్లివంటి ఓ సాయినాథా, దత్తగురూ! మీరు మాత్రము నాపై
అలుగకుడు.*
*6. రుసో మృగ ఖగ కృమీ అఖిల జీవజంతూ రుసో*
*రుసో విటప ప్రస్తరా, అచల ఆపగాబ్దీ రుసో*
*రుసో ఖ పవనాగ్ని వార్, అవని వంచతత్త్వే రుసో*
*న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో*
*రుసో విటప ప్రస్తరా, అచల ఆపగాబ్దీ రుసో*
*రుసో ఖ పవనాగ్ని వార్, అవని వంచతత్త్వే రుసో*
*న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో*
భావం:- *పశు, పక్షి, కీటకాది జంతువులు, వృక్షములు, పాషాణ--పర్వతములు, నదులు, సముద్రములు, పంచభూతములు నాపై
అలిగినను, ఓ సాయినాథా, దత్తగురూ! మీరు మాత్రము నాపై అలుగకుడు.*
*7. రుసో విమల కిన్నరా, అమల యక్షిణీహీ రుసో*
*రుసో శశి ఖగాదిహీ, గగని తారకాహీ రుసో*
*రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో*
*న దత్తగురు సాయిమా మజవరీ కధీహీ రుసో*
*రుసో శశి ఖగాదిహీ, గగని తారకాహీ రుసో*
*రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో*
*న దత్తగురు సాయిమా మజవరీ కధీహీ రుసో*
భావం:- *పరిశుద్ధులైన యక్ష
కిన్నరులు, చంద్ర సూర్యాది నవగ్రహములు, తారకలు, దేవేంద్రుడు నిర్దయుడైన యమధర్మరాజు
నాపై అలిగినను, ఓ సాయినాథా, దత్తగురూ! మీరు మాత్రము నాపై అలుగకము.*
*8. రుసో మన సరస్వతీ, చపలచిత్త తేహీ రుసో*
*రుసో వపు దిశాఖిలా, కఠిన కాల తోహి రుసో*
*రుసో సకల విశ్వహీ మయి తను బ్రహ్మగోలం రుసో*
*న దత్తగురు సాయిమా మజవరీ కధీహీ రుసో*
భా వ ము:- *మనస్సు, వాక్కు, చపలమైన చిత్తము, శరీరము, సమస్త దిక్కులు, కఠినమైన కాలము, సమస్త ప్రపంచము, ముల్లోకములు నాపై
అలిగినను, ఓ సాయినాథా, దత్తగురూ! మీరు మాత్రము నాపై అలుగకుడు.*
*9. విమూఢ హ్మణునీ హసో, మజన మత్సరాహీ ఢసో*
*సదాభిరుచి ఉల్హసో, జనన కర్ధమీ నా ఫసో*
*నా దుర్గ ధృతిచా ధసో అశివభావ మాగే ఖసో*
*ప్రపంచి మన హే రుసో దృఢ విరక్తి చిత్తీ ఠసో*
భావం:-
*నేను మూర్ఖుడనని అందరూ నవ్వినను, మత్సరమను సర్పము
నన్ను కాటు వేసినను, గురుపాదముల యందు ప్రీతి నా కెల్లప్పుడు ఉండుగాక! సంసారమను బురదలో
నేను చిక్కకుందునుగాక! నా ధైర్యమను కోట అభేద్యముగా నుండును గాక, అశుభ తలంపులు నాకు
కలగకుండు గాక! ప్రాపంచిక విషయములందు నా మనస్సు చిక్కుకొనక, ధృఢ విరక్తియందు
నిలుచుగాక!*
*10.
కుణాచిహి ఘృణా నసో న చస్పృహా కశాచీ
అసో*
*సదైవ హృదయీ వసో, మనసి ధ్యాని సాయి వసో*
*పదీ ప్రయణ వోరసో, నిఖిల దృశ్య బాబా దిసో*
*న దత్తగురు సాయిమా, ఉపరి యాచనేలా రుసో*
*సదైవ హృదయీ వసో, మనసి ధ్యాని సాయి వసో*
*పదీ ప్రయణ వోరసో, నిఖిల దృశ్య బాబా దిసో*
*న దత్తగురు సాయిమా, ఉపరి యాచనేలా రుసో*
భావం:- *ఎవ్వరి యెడలా
ద్వేషము, దేని యందూ కోరికలేని నా హృదయమందు
సాయినాథుని ధ్యానము జరుగుగాక! గురు పాదములపై భక్తి స్థిరముగా నుండుగాక! జగమంతయు
శ్రీ సాయి రూపముగా గోచరించుగాక! ఓ దత్తగురు, సాయిమాతా! నాపై
అలుగక ఇట్టి భిక్ష పెట్టుడు.*
*(9)* మంత్ర పుష్పం
హరి ఓం యఙ్ఞేన యఙ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ | తేహనాకం మహిమాన:స్సచంత
యత్రపూర్వే సాధ్యా స్సంతి దేవా:|ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం వై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్
తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:
పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి
*(10)*
*కరచరణకృతం వాక్కాయజం కర్మజంవా*
*శ్రవణ నయనజం వా మానసం వా పరాధమ్*
*విదితమవిదితం వా సర్వమేతత్ క్షమస్వ*
*జయజయ కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ*
*శ్రవణ నయనజం వా మానసం వా పరాధమ్*
*విదితమవిదితం వా సర్వమేతత్ క్షమస్వ*
*జయజయ కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ*
భావం:- *జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవాక్కులతో తెలిసియు, తెలియకయు నాచే చేయబడిన సర్వ అపరాధములనూ క్షమించవలసింది. కరుణాసముద్రుడవైన ఓ సాయినాథ ప్రభో! నీకు జయము జయము.*
*శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై*
*(సంధ్య (ధూప్) ఆరతి సమాప్తము.)*
*(సంధ్య (ధూప్) ఆరతి సమాప్తము.)*
No comments:
Post a Comment