సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఎంత అదృష్టం చేసుకొని ఉన్నామో కానీ బాబా ఇంతటి లీలలను చూపారు


ఒక సాయిభక్తుడు తన భార్యకు బాబా చూపిన అద్భుత లీలలను ఇలా తెలియజేస్తున్నారు:

2005వ సంవత్సరంలో మే నెల 2వ తేదీన నాగపూర్‌లో నా భార్య సుచిత్ర ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. తన కుడిభుజంకాలివేళ్లు అన్నీ బాగా విరిగిపోయి, తన చర్మంపై అంతా మచ్చలు పడ్డాయి. నాగపూర్‌లోని డాక్టర్ తన విరిగిన భుజానికి, మెడకి కలిపి కట్టు కట్టడం వల్ల తన చెయ్యి వంకరగా మారింది. ఈ గాయాలు తగ్గే క్రమంలో నా భార్య బాబాపై దృఢమైన భక్తివిశ్వాసాలు పెంచుకుంది. బాబాని ప్రతిక్షణం తలచుకుంటూ, 'తన గాయాల బాధ తగ్గించమ'ని బాబాను ఆర్తిగా వేడుకునేది.

మే 25వ తేదీన సమయం రాత్రి 1.55 అయినప్పటికీ నా భార్యకు నిద్రపట్టక ఇబ్బందిపడుతూ మంచం మీద పడుకుని ఉండగా... ఒక్కసారిగా సాక్షాత్తూ శ్రీసాయినాథుడు ప్రత్యక్షమై నా భార్య ముందు నిల్చొని ఉన్నారు. అలా బాబాను కళ్ళెదురుగా చూసి తను చాలా సంతోషపడింది. సాయిబాబా నా భార్యని "పైకి లేవమ"ని చెప్పారు. కానీ తను, "నా కాలుచెయ్యి సహకరించట్లేదు. నేను ఎలా లేవగలను బాబా?" అన్నది. తనకి ఎక్కడ దెబ్బలు తగిలాయో చూపమన్నారు బాబా. కానీ తను చీర కాస్త పైకి జరిపి తన కాలిపై ఉన్న గాయాలను చూపడానికి ఇబ్బందిపడుతూ ఉంటే అందుకు బాబా, "నేను నీ తల్లినితండ్రినిసోదరిని. నా ముందు నువ్వు ఇబ్బందిపడనవసరం లేదు. ఏదీ, చూపించు" అని అన్నారు.

తరువాత బాబా తన చేతులతో నా భార్య చేతులను స్పృశించి అటు ఇటు తిప్పారు. తరువాత తన చేతివేళ్ళతో ఆమె గాయాలపై ఉన్న అన్ని బ్యాండేజీలను తాకారు. వెంటనే బ్యాండేజీలన్నీ కింద పడిపోయాయి. తరువాత బాబా నా భార్య పక్కన కూర్చుని, ఆమె చేతిని తిన్నగా ముందుకి చాపమన్నారు. బాబానే స్వయంగా ఆమె చేయి పట్టుకొని తిన్నగా పెట్టారు. తరువాత చేతిని వెనక్కి మడిచి పెట్టమన్నారు. తను అలాగే మడిచి పెట్టింది. అప్పుడు బాబా "నీ చెయ్యి మునపటివలే మాములుగా అయిపోయింది" అని నా భార్యకు అభయం ఇచ్చారు. తరువాత బాబా నిల్చొని నా భార్యను ఆశీర్వదించారు. ఆమె బాబాను టీ తాగమని అడిగితే, బాబా ఒక చిరునవ్వు  నవ్వారు.

తను వెంటనే లేచి నన్ను లేపింది బాబాని చూపించడానికికానీ నేను లేచేసరికి బాబా అక్కడ లేరు. కానీ నా భార్య చేతులు బాగుకావడం గమనించాను. మందులు, కట్లు కిందపడివున్నాయి. నా భార్య తన చేతిని మడిచి పెట్టి ఉన్నది. నేను ఆమె చేతిని తిన్నగా చాపమన్నాను. ఆమె తన చేతిని తిన్నగా పెట్టేసరికి ఆమె చేతిలో బాబా ఊదీ ప్యాకెట్ ఉంది. బాబా స్వయంగా తన చేతులతో ఆ ఊదీ ప్యాకెట్‌ని నా భార్య చేతిలో పెట్టారు. మేము ఎంత అదృష్టం చేసుకొని ఉన్నామో బాబా ఇంతటి లీలను మాపై చూపారు. నిజానికి నా భార్య ముందెన్నడూ శిరిడీ దర్శించలేదు. తను ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండే గుడికి మాత్రమే వెళ్లేది. అయినా బాబా మాపై ఇంత కరుణ చూపారు.

ఆ తరువాత మేమంతా శిరిడీకి వెళ్లి బాబా దివ్యదర్శనం చేసుకొని మనసారా  ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆ తర్వాత భోజనం చేయడానికి ప్రసాదాలయానికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ బాబా మరో లీల చూపారు. నా భార్య భోజనం చేస్తూవుండగా భోజనం మధ్యలో తన చేతికి బాబా లాకెట్ తగిలింది. అది చూసి మేమంతా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాము. అక్కడ భోజనశాలలో అందరినీ ప్రశ్నిస్తే, వారు కూడా ఏమీ చెప్పలేక ఆశ్చర్యచకితులయ్యారు. మా సంతోషానికి ఇంక అవధులు లేవు. ఇంత అద్భుతమైన రెండు లీలలను బాబా మాపై చూపించారు.

           సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo