1980వ సంవత్సరంలో, తిరుపతిలో ఉన్న శ్రీమతి నాయుడు తన పూజ గదిలో భక్తిపూర్వకంగా పూజలో నిమగ్నమై ఉండగా తల మీద పెద్ద జడలు కలిగి ఉన్న ఒక సత్పురుషుడు ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు. "నీకు నన్ను చూస్తే భయం వేయడం లేదా?" అని ఆయన అడిగాడు. అందుకు ఆమె, "లేదు భగవాన్, మీరు ఎవరు?" అని అడిగింది. అంతే! ఆయన తన కడుపులో నుండి ప్రేగులు బయటకి తీసి, మళ్ళీ మ్రింగేసాడు. తరువాత తన ఖాళీ చేతులలో నుండి తీర్ధాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. తరువాత ఆమెను, "దక్షిణ ఏమైనా ఇస్తావా?" అని అడిగాడు. ఆమె దక్షిణ కోసం డబ్బులు వెతుకుతూ ఉండగా, ఆ సత్పురుషుడు "ఆ అల్మారా లో చిల్లర పెట్టావు, తీసి ఇవ్వు" అన్నారు. "ధోతీ ధరించి, దక్షిణ అడిగిన ఆ సత్పురుషుడు సాయిబాబా కాక ఇంకెవరై ఉంటారు?" అని ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది.
అంతకన్నా ఆశ్చర్యం చదవండి:
అదేసమయంలో నెల్లూరులో ఉంటున్న ఆమె అన్న శ్రీ వెంకటనాయుడు, కాఫీ త్రాగడానికి తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ కి వెళ్ళాడు. అక్కడ అందరు దేవి, దేవతల చిత్రపటాల మధ్యలో, ఒక శిల మీద కూర్చొని, ఆశీర్వాదముద్రలో, తలకు బట్ట చుట్టుకొని, అశేష కృపాదృష్టితో చూస్తూ ఉన్న సాయిబాబా ఫోటో కూడా ఉంది. నాయుడు గారి దృష్టి అన్ని చిత్రపటాల మధ్య ఉన్న సాయిబాబా వారి మీద పడింది. అలా చూస్తూ ఉండగా అతని మనస్సు ఏకాగ్రం అయింది. స్నేహితులందరూ కాఫీ త్రాగి వెళ్ళిపోయారు. నాయుడు మాత్రం అలా బాబాను చూస్తూ అక్కడ కూర్చున్నాడు. "ఈయన ఏ ధర్మానికి చెందినవాడు? ముస్లింలాగా కనపడుతున్నాడు, కానీ ముఖంలో ఆ పరబ్రహ్మ స్వరూపం కొట్టొచ్చినట్లు ఉంది. ఎవరు ఈయన?" అని మనసులో అనుకుంటూ మదినిండా ఆయన స్వరూపాన్ని నింపుకొని వెళ్తున్నాడు. మనసంతా ఆయన మీద లగ్నం అయి ఉంది కానీ, మనసులో, 'ఎవరు ఈయన?' అని ఒకటే వేదన. అంతలో సాయంత్రం వాళ్ళ స్నేహితుడిని బజారులో కలిసాడు. అతను, "రా! మా ఇంటికి వెళ్దాం" అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.
అతని స్నేహితుని భార్య, "మేము మొన్న షిర్డీ వెళ్లి వచ్చాము.ఇదిగోండి బాబా ప్రసాదం" అంటూ, ప్రసాదంతోపాటు బాబా ఫోటో ఒకటి నాయుడు గారి చేతికి ఇచ్చింది. ఆ ఫోటోను చూడగానే ఆనందంతో అతని కళ్ళలో నీరు ఆగలేదు. "ఓహో! ఈరోజు పొద్దున నుండి నన్ను వెంటాడుతున్న ఈ సంత్ మహారాజ్ షిరిడీ సాయినాథుడా!" అనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి గురువారం ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకొని, అప్పటినుండి రోజూ సాయి సచ్చరిత్ర పారాయణ, భజన, సత్సంగం చేసుకుంటూ ఉన్నారు.
"ఆరోజు కలలో సాయినాథుని సమాధి చూసాను. మొత్తం సమాధి అగరుబత్తి సువాసనలతో నిండి ఉంది. తరువాత గురువారం సాయిబాబానే కలలో వచ్చారు. నన్ను శిరిడీకి రమ్మన్నారు. నా ఇష్టదైవం శ్రీరామచంద్రుడు. ఒకరోజు కలలో శ్రీ రామచంద్రుడిని చూసాను. వెంటనే ఆ స్థానంలో సాయినాథుడు కనిపించారు. తరువాత నా కుటుంబంతో షిర్డీ వెళ్ళాను. అబ్దుల్ బాబా కుటీరంలో నాకు సాయినాథుడు స్వయంగా దర్శనం ఇచ్చి, సమాధి మందిరానికి తీసుకెళ్ళారు. "ఇంక నీ జీవితం మొత్తం నీకు సహాయంగా ఉంటాను" అన్నారు. ఇలా నాకు అన్నివేళలా సహాయకంగా ఉండి, నా బాగోగులు చూస్తున్నారు. నాకు వున్న సంసారిక బంధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చివరి ఉపిరి ఉన్నంత వరకు ఆయన స్మరణ, ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, అంతే!
అసలు విషయం చెప్పలేదు కదూ! మా చెల్లికి ఎప్పుడైతే వాళ్ళ బాబా ఇంట్లో కనపడ్డారో, అప్పుడే హోటల్ లో నన్ను తన వైపుకు లాక్కున్నారు. తరువాత రెండు రోజులకు మేము కలిసినప్పుడు మా అనుభవాలను పంచుకొని ఆశ్చర్యచకితులయినాము."
- వెంకటనాయుడు
నెల్లూరు.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.
Adbhuthamaina baba gaari leela.edhi.sai..U only blessed devoti.sai.
ReplyDeleteOm sai Ram
ReplyDelete