సాయిబంధువులందరికీ నమస్కారములు. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం. నా జీవితంలో ఇటీవల బాబా చేసిన ఒక అద్భుతం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తాను తన భక్తులపాలిట ఆపద్బాంధవుడనని ఈ సంఘటన ద్వారా బాబా నిరూపించారు.
కొంతకాలం క్రిందట ఒకరోజు సాయంత్రం నేను, నా భార్య పనిమీద బజారుకి బయలుదేరాము. నేను ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ పర్సన్‌ని. నాకు ఒక tricycle(మూడు చక్రాలు ఉన్న స్కూటర్) వుంది. మేము దానిమీద బయలుదేరాము. మా వీధి నుండి ప్రధానవీధికి మలుపు తిరగ్గానే వెనుకనుండి తెలిసినవాళ్ళు మమ్మల్ని పిలిచారు. మేము స్కూటర్ ఆపి వెనక్కి తిరిగాము. కానీ వాళ్ళు పిలిచింది, మాకు ముందునుండి రాబోతున్న పెద్ద ప్రమాదం గురించి హెచ్చరించడానికి. అది మేము గుర్తించేలోపు
మాకు ఎదురుగా 15 బర్రెలు బెదిరిపోయి పరిగెడుతూ మా పైకి వస్తున్నాయి. వాటి వెనుక ఒక ఒంటెద్దుబండి (ఆ ఎద్దు కూడా బెదిరిపోయివుంది) వీటిని తరుముతున్నది. ఇక మాకు తప్పించుకునే అవకాశం లేదు. నేను ఫిజికల్లీ హ్యాండీకేప్డ్ వ్యక్తిని అయినందున పక్కకి పరిగెత్తలేను. మా ఆవిడ కూడా నన్ను వదిలి వెళ్ళలేదు. ఇక ఇద్దరం
మా అంతర్యామి అయిన బాబానే శరణం అనుకొని ఆయననే స్మరిస్తూ ఉండిపోయాము. మా పక్కవారందరూ ఏమి చేయాలో
తోచక చూస్తూ ఉండిపోయారు. మాకు సహాయం చేసేవాళ్ళే లేరు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఎవరో ఆదేశించినట్లుగా ఆ బర్రెల గుంపు రెండు పాయలుగా విడిపోయి మా పక్కనుంచి వెళ్లిపోయాయి. కానీ ఒంటెద్దుబండి మాత్రం
నా పైకి వస్తున్నది. నేను, "బాబా! నువ్వే నాకు రక్ష" అని అనుకున్నాను. బండి నా పైకి వచ్చి సరిగ్గా బండి కాడిమాను, అంటే ఎద్దు మెడపై వుండే పెద్ద కొయ్య నా మెడకి కేవలం ఒక అంగుళం దూరంలో పక్కనుంచి
వెళ్ళిపోయింది. నాకు, మా ఆవిడకు ఏమీ జరగలేదు. పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బాబా నా ముందు నిలుచుని
నాకు కనిపించారు. ఇంతటి కరుణని చూపిన ఆ దయాళువుకి శతకోటి వందనాలు చెప్పుకున్నాను.
సాయి శరణం.
Om Sairam
ReplyDeleteSai always be with me