ఇప్పుడు మీరు చదవబోయే అద్భుత సాయి లీల సాయిశరణానంద గుజరాతీలో రచించిన శ్రీ సాయిబాబా పుస్తకం నుండి సంగ్రహించబడింది. చదివి ఆనందించండి.
1913వ సంవత్సరంలో సాయిభక్తుడు ఆత్మారామ్ హరిభావు చౌబల్ సాయిబాబా దర్శనార్థం శిరిడీ వెళ్ళాడు. అతడు తనతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పాదుకలను కూడా తీసుకుని వెళ్ళాడు. ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనంతో అతడు ఆనందభరితుడయ్యాడు. తరువాత వెండి పాదుకలను బాబాకు చూపించగా, బాబా వాటిని తమ చేతుల్లోకి తీసుకుని, "ఎంత అందంగా ఉన్నాయి!" అన్నారు. తరువాత తమ కాలి వేళ్ళను పాదుకాల్లోకి చొప్పించి, "ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి!" అని, "వీటిని తీసుకుని వెళ్లి, మీ పూజ మందిరంలో ఉంచి పూజించుకో" అని అన్నారు. చౌబల్ పట్టలేని ఆనందంతో వాటిని తీసుకుని వెళ్లి తన ఇంటి పూజామందిరంలో ఒక చిన్న చెక్క స్టూల్ పై ప్రతిష్టించుకున్నాడు. అప్పటినుండి ఆ పాదుకలను అతడెంతో శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం ఆరాధిస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచాక 1930వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం(అక్టోబర్-నవంబర్), కృష్ణ పక్షం, 13వ రోజు అంటే త్రయోదశినాడు అతడు ఉదయాన్నే లేచి పాదుకల దర్శనార్ధం పూజగదికి వెళ్లగా రెండు పాదుకలలో ఒకటి కనిపించలేదు. చెక్కస్టూల్ క్రిందగాని, ఆ దరిదాపుల్లోగాని పాదుక కనిపించలేదు. మిగతా అన్నిచోట్లా వెతికారుగాని, వారి ప్రయత్నమంతా నిష్ప్రయోజనమైంది. బాబా స్పర్శతో పావనమైన పాదుకలలో ఒకటి కనిపించకపోవడంతో చౌబల్ చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ అతడు తన రోజువారీ పాదుక పూజను మిగిలి ఉన్న ఒక్క పాదుకకు చేస్తూ ఉండేవాడు. రెండునెలల తరువాత ఒక ఉదయాన ఉన్న ఆ ఒకపాదుక కూడా కనపడలేదు. ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. దానితో అతను, అతని కుటుంబీకులు బాబా యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యామని అనుకుని ఎంతో బాధపడ్డారు. తరువాత అతడు బాగా ఆలోచించుకుని కొత్త పాదుకలను కొని తెచ్చుకుందామనే ఉద్దేశ్యంతో బొంబాయికి వెళ్ళాడు. అతను వెళ్లిన రోజున తయారు చేయబడి ఉన్న పాదుకలు అందుబాటులో లేవు. దాంతో అతను చాలా నిరాశతో తిరిగి ఇల్లు చేరాడు. పాదుకలు లేవు గనక బాబా పటానికే తన రోజువారీ పూజను కొనసాగిస్తూ ఉండేవాడు. అలా తొమ్మిదినెలల గడిచిపోయాయి. దయార్ధహృదయుడైన సాయిబాబా తన భక్తుడిని తొమ్మిదినెలలు పరీక్షించి ఉండాలి. ఆ కాలంలో ఎప్పుడూ తన భక్తుడు పాదుకలను మరచిపోలేదని ఆయన మనసు కరుణతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అద్భుతమైన లీల చూపించారు బాబా. ఒకరోజు చెక్కస్టూల్ క్రింద రెండు పాదుకలు చక్కగా ఉంచబడ్డాయి. వాటిని చూసిన చౌబల్ కుటుంబీకుల మనసులకు గొప్ప ఉపశమనం లభించింది. వాళ్ళు పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.

source: Sri Saibaba written by sai sharanananda.
om sri sairam
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOm Sairam..
ReplyDeleteEppudu manchini gurinche alochinchali
Ellappudu manchi panule cheyyali.
Eppudu manchiga positive mind tho undali
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉🙏😊
Om sai ram
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteశ్రీ సద్గురు సాయి నాధ్ మహా రాజ్ కి జై
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete