సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 83వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 83వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -146

శ్రీ కృష్ణారావ్ పారుళ్ కర్ గారి ఇంకొక అనుభవం

శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి పుత్రుడు చిరంజీవి బాబు యొక్క వివాహం ఖండ్వాలో జరిగింది. లగ్నం యొక్క తిథి షష్టి లేదా అష్టమి అనుకుంటాను. వివాహానికి ఇక్కడ అందరికీ ఆహ్వానం అందింది. కాని, ఆ రోజులలోనే శ్రీ సదాశివరావు ఘండీరాజ్ నాయక్ గారి తల్లిగారు తీవ్రంగా అస్వస్థులై ఉన్నారు. ఆమె ఏ క్షణంలో పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. వివాహానికి హాజరు కావాల్సిన వారిలో నాయిక్ కుటుంబం ఉంది. వివాహానికి 4-5 రోజులే ఉంది. ఒకరోజు సాయంకాలం మేమందరం కూర్చొని ఉండగా, శ్రీ కృష్ణారావు లక్ష్మణ్ నాయిక్ “కాకాసాహెబ్ గారి ఇంట్లో వివాహానికి వెళ్లాలని  చాలా కోరికగా ఉంది. కానీ సాధూభయ్యా, మీ తల్లిగారి విషయం అడ్డు వస్తుందేమోనని చాలా భయంగా ఉంది” అని అన్నారు. అప్పుడు సాధూభయ్యా “ఆమె పరిస్థితి చూస్తే అలాగే ఉంది” అని అన్నారు. తరువాత తెల్లవారుఝామున బాబా వచ్చి నా ముందు నిలబడ్డారు (దృష్టాంతం). ఆ సమయంలో నేను సగం మేల్కొనే ఉన్నాను. అప్పుడు బాబా నాతో “సాధుతో చెప్పు, తన తల్లిగారి విషయం కాకా ఇంట్లో వివాహానికి అడ్డురాదు. తాను ఏకాదశి నాడు పోతుంది” అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను ఆ కలను సాధూభయ్యా ఇత్యాది మండలికి చెప్పాను. బాబాపై విశ్వాసముంచి అందరం వివాహానికి వెళ్ళాము. చమత్కారమేమిటంటే, వివాహ సమారంభం పూర్తయ్యాక, శ్రీ సాయి సమర్థులు చెప్పిన విధంగానే, సాధూభయ్యా గారి తల్లిగారు ఏకాదశి రోజు 12 గంటలకు నిర్యాణం చెందారు.

శ్రీ హరి సీతారాం దీక్షితకు వచ్చిన అనుభవం

ఒకసారి నేను బాబా వద్ద కూర్చొని ఉండగా బాబా విపరీతమైన దగ్గుతో బాధపడసాగారు. బాబా పడుతున్న అవస్థ చూసి నేను మనసులో ఒకటే ఆందోళన పడసాగాను. చివరకు నేను బాబాతో “బాబా, మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము మీకు ఏ విధంగాను ఉపయోగపడలేకపోతున్నాము” అని అన్నాను. అప్పుడు బాబా “నేను నీకు బాగా ఉపయోగపడతాను” అని మాత్రమే అన్నారు. మరుసటిరోజు నేను ముంబాయికి వెళ్ళడానికి ఆజ్ఞ లభించడంతో నేను ముంబాయికి వచ్చాను. నేను ముంబాయికి వచ్చేటప్పటికి నా జ్యేష్ఠ సోదరుడు అనారోగ్యానికి గురయ్యారని నాగపూర్ నుండి ఉత్తరం వచ్చింది. తనను చూడటానికి నేను నాగపూర్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక బాబా మాటలలోని అర్థం బోధపడింది. ఆ విషయమంతా నేను నాగపూర్ నుండి ఒక స్నేహితునికి వ్రాసిన ఉత్తరం ద్వారా పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుందని ఆ ఉత్తర సారాంశాన్ని క్రింద ఇస్తున్నాను. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారు ఒక స్నేహితునికి వ్రాసిన ఉత్తరంలోని సారాంశం వ్రాయడానికి చాలా ఆనందంగా ఉంది. నిన్నటి నుండి భాయీజీ (కాకాసాహెబ్ గారి జ్యేష్ఠసోదరుడు) గారి ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుటపడసాగింది. ఆదివారం రోజు భాయిజీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. నాకు టెలిగ్రాం ఇవ్వమని భాయీజీ చెప్పారు. కాని ఆ రోజు డాక్టర్ త్వరగా వచ్చి ఇంతలోనే టెలిగ్రాం ఇవ్వద్దని చెప్పారు. ఇంతలో పరమదయాళువు అయిన బాబా దర్శనం ఇచ్చారు. అదేరోజు రాత్రి భాయీజీ స్నేహితునికి ఒకరికి అదే అర్థంతో దృష్టాంతం ప్రసాదించారు. “నేను నీకు చాలా ఉపయోగపడతాను” అని ఏ రోజయితే నాతో అన్నారో, ఆయన దృష్టాంతం ప్రసాదించింది కూడా ఆ రోజే! ఎంతటి కరుణ, ఎంతటి అగాథ శక్తి. "అనంతా ముఖాఛ శిణే శేషగాత” అనేది ఏమీ అబద్దం కాదు. మనలాంటి మూఢజీవులకు ఆయన దగ్గుతో బాధపడుతూ కనపడతారు. కానీ అదే సమయంలో ఆయన ఎక్కడ ఏమి చేస్తారో ఆయనకే ఎరుక. ఆయన చరణాల వద్ద ఆశ్రయం లభించడమే నాకు కలిగిన పరమభాగ్యం. జన్మజన్మలకు ఆ పరమభాగ్యం దూరం కాకూడదని నా ప్రార్థన. నా జ్యేష్ఠ సోదరునికి ఇంట్లో తిరగడానికి ఇంకో ఐదు, ఆరు రోజులు పడుతుంది. నేను ఇంకా ఇక్కడ ఎనిమిది రోజులు ఉంటాను అని అనుకుంటున్నాను.

సమాప్తం.

గమనిక: ఈరోజుతో దీక్షిత్ డైరీ ముగిస్తున్నాము. అయితే విజయ్ కిషోర్ గారి దీక్షిత్ డైరీ పుస్తకం నందు ఇంకా చాలా సమాచారం ఉంది. ఆయన వ్రాసిన బుక్స్ క్రింద ఇవ్వబడిన అడ్రస్సు నందు లభ్యమవుతాయి.


పి. విజయ్ కిషోర్.
ప్లాట్ నెంబర్: 202, ప్లాట్ నెంబర్: 97,
ధనుంజయ నెస్ట్,
హైదరాబాద్ -500045.
ఫోన్ నెంబర్: 040 - 23831510.


శిరిడీలో ద్వారకామాయికి ఎదురుగా ఉన్న ద్వారకామాయి ఎంపోరియంలో కూడా బుక్స్ లభిస్తాయి.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo