సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 124వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. నా కల నెరవేర్చిన సాయి
  2. ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు బాబా

నా కల నెరవేర్చిన సాయి

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను విదేశాల్లో ఉద్యోగం కోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. నా జీవితంలో ముఖ్యమైన ఈ కల నెరవేరే మార్గం కనపడక నేను బాధతో చాలా ఏడ్చాను. నా భార్య నన్ను ఓదార్చి 'సాయిసచ్చరిత్ర' నాకిచ్చి, పూర్తి విశ్వాసంతో చదవమని చెప్పింది. అప్పటికి సాయిపై నాకు ఏమాత్రం నమ్మకం ఉండేదికాదు. కానీ సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాక నా అనుభవం వేరేలా ఉంది. చదువుతూ ఉంటే నా చెంపలపైనుంచి జలజలా కన్నీళ్లు జారిపోతూ ఉండేవి. బాబా నన్ను గమనిస్తూ ఉన్నారనే అనుభూతి కలగసాగింది. అప్పటినుండి నా జీవితంలో బాబా మిరాకిల్స్ మొదలయ్యాయి.

మొదటి అనుభవం:

మేము శిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. అయితే మా తిరుగు ప్రయాణం టిక్కెట్లు కన్ఫర్మ్ కాలేదు. అయినప్పటికీ నేను నా కుటుంబంతో శిరిడీ వెళ్ళాను. తిరిగి రావడానికి కావాల్సిన టిక్కెట్లను బాబా అనూహ్యరీతిన ఏర్పాటు చేసారు. ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని ఉన్నప్పుడు సచ్చరిత్రలోని, "నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్న వాక్యం గుర్తుకు వచ్చి నాకు కన్నీళ్లు వచ్చేసాయి. "థాంక్యూ సో మచ్ బాబా!"

రెండవ అనుభవం:

శిరిడీనుండి వచ్చిన నెల తరువాత ఒకరోజు నేను ఏజెంటుని కలవడానికి వెళ్తుంటే దారిలో ఒక స్నేహితుడు కలిసాడు. మాటల్లో ఏజెంట్ ప్రస్తావన రాగా తను, "ఆ ఏజెంట్ నా స్నేహితుడే" అని చెప్పాడు. మేము చాలాకాలంగా స్నేహితులమైనప్పటికీ మా మధ్య ఎప్పుడూ ఏజెంటుకి సంబంధించిన ప్రస్తావన రాలేదు. అలా నా స్నేహితుడి ద్వారా ఉద్యోగానికి సంబంధించిన నా కల నెరవేరింది.

అక్కడితో సాయి చేసే అద్భుతాలు ఆగలేదు. ఉద్యోగం వచ్చిన తరువాత కేవలం రెండు సంవత్సరాలలో ఆరు ప్రమోషన్లతో నన్ను ఆశీర్వదించారు బాబా. అదీ నా సాయి అంటే! ఆయన ఏదైనా చేయగలరు. "లవ్ యూ సాయీ! దయచేసి అందరికీ మీ సహాయాన్ని అందించండి. అన్నిటికీ మీకు నా కృతజ్ఞతలు బాబా!"

ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను నా చిన్ననాటినుండి సాయిబాబా భక్తురాలిని. పరిస్థితులు ఎంత కఠినమైనవైనా నేను ఆయనపైనే ఆధారపడి ఉంటాను. నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలో ఒకటి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పూణేలో ఉద్యోగం చేస్తున్నాను. నేను చాలా చాలా సన్నగా ఉంటాను. నాకు ప్రతినెలా నెలసరి రాక చాలా ఇబ్బందిపడుతున్నాను. చాలా సంవత్సరాలుగా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. ఈ విషయమై పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్లంతా 'సరైన ఆహారం తీసుకుంటే అంతా సరైపోతుంది' అని చెప్తుండేవారు. ఇటీవల మళ్ళీ ఒకసారి ఈ సమస్య మూడునెలలపాటు నన్ను కలవరపెట్టింది. దానివలన నేను ఆఫీసులో పనిచేయలేక చాలా అలసిపోతుండేదాన్ని. డాక్టరు దగ్గరకు వెళితే, అతను నాకు టాబ్లెట్లు ఇచ్చి, "రోజుకు మూడుపూటల చొప్పున మూడునెలలపాటు వాటిని వాడమ"ని సూచించారు. నేను మరుసటిరోజు నుండి ఆ టాబ్లెట్లను వాడటం మొదలు పెడదామని అనుకున్నాను. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబా ముందు దీపాలు వెలిగించి, ఆయనను ప్రార్థించడం నాకు అలవాటు. అంతేకాదు, బాబాకు పెట్టిన నైవేద్యాన్ని స్నేహితులతో పంచుకొని తినడం కూడా అలవాటు. ప్రతిరోజులాగే ఆరోజు సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చి, ఫ్రెషప్ అయ్యి బాబా పూజ మొదలుపెట్టాను. "బాబా! నా సమస్యను పరిష్కరించండి. నా నెలసరి సక్రమంగా వచ్చేటట్లు చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించి, ఉదయం బాబాకు పెట్టిన ఆపిల్ తీసుకుని, ఎవరికీ పంచిపెట్టకుండా మొత్తం నేనే తిన్నాను. నేను ఆశ్చర్యపోయేలా ఉదయం నిద్రలేవగానే బాబా నా సమస్యను పరిష్కరించేసారు. కనీసం ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు. పట్టలేని ఆనందంతో బాబా ముందు ఏడ్చేశాను. భక్తులకు అత్యవసరమైనప్పుడు రక్షణనివ్వడానికి బాబా పరుగున వస్తారు.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo