“నా మనుష్యుడు ఎంత దూరాన ఉన్నప్పటికీ, వేయి క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చునట్లు అతనిని శిరిడీకి లాగెదను” అని తాము చెప్పినట్లుగా ఆనందరావ్ త్రయంబక్ కార్నిక్ అనే ఈ పెద్ద పిచ్చుకను 1911వ సంవత్సరంలో శిరిడీకి లాగారు బాబా. ఇతని ప్రస్తావన ఖపర్డే శిరిడీ డైరీలోని 26వ పేజీలో ఉంది.
ఆనందరావ్ త్రయంబక్ కార్నిక్, నానాచందోర్కర్ లు ఇరువురు కుటుంబస్నేహితులే కాకుండా కల్యాణ్ లో పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. చిన్ననాటినుండి మంచి స్నేహితులు, ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అటుపిమ్మట కొంతకాలానికి నానా పైచదువులు, ఉద్యోగప్రయత్నాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అలా వారి మధ్య కొంత అంతరం ఏర్పడింది. 1911వ సంవత్సరంలో ఆ పాత స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి కార్నిక్ ఇంటికి వెళ్లాడు నానా. ఎవరిని కలిసినా బాబా కీర్తి గురించి వాళ్లతో పంచుకుంటూ మురిసిపోయే నానా, మాటల్లో కార్నిక్ తో బాబా యొక్క దైవత్వాన్ని, ఆయన లీలలను గొప్పగా వర్ణించి చెప్పాడు. ఆవిధంగా కార్నిక్ మనసులో బాబాపట్ల మొదటి బీజం పడింది. తరచు నానా తనతో దాసగణును వెంటబెట్టుకుని వచ్చి తన గృహంలో భజనలు నిర్వహిస్తుండేవాడు. రామమారుతి ఆ భజన కార్యక్రమాలకు హాజరవుతూ ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తుండేవాడు. ఈ రామమారుతికి, కార్నిక్ కి చాలాకాలంగా పరిచయం ఉంది. ఆ భజన కార్యక్రమాలకు కార్నిక్, అతని కొడుకులు కూడా వెళ్తుండేవారు.
1911వ సంవత్సరం చివరిలో ఒక సాయంకాల సమయాన నానా తన ఇంట భజన ఏర్పాటు చేసాడు. అదే సమయానికి కార్నిక్ ప్రదోషకాల ఉపవాసవ్రత ఉద్యాపనను పూర్తి చేసి, ఆత్రుతగా భజన జరుగుతున్న స్థలానికి వెళ్లి, రామమారుతితో, "నన్ను అనుగ్రహించి మంత్రోపదేశం చేయమ"ని అడిగాడు. రామమారుతి ఏమాత్రం తడుముకోకుండా బాబా చిత్రపటం వైపు చూపుతూ, "ఆయన పాదాలకి శరణాగతి చెందు" అని చెప్పాడు. వాస్తవానికి ఇదంతా జరగడానికి కొద్దిరోజులముందే కార్నిక్ పెద్దకొడుకు శిరిడీ వెళ్ళాలన్న తన కోరికని తండ్రికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు రామమారుతి బాబాను ఆశ్రయించమని సలహా ఇవ్వడంతో, కొడుకుతోపాటు తాను కూడా శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు కార్నిక్. ఆవిధంగా కార్నిక్ శిరిడీ దర్శనానికి నానా చందోర్కర్, రామమారుతి మిషలయ్యారు.
అయితే కల్యాణ్ నుండి బయలుదేరేముందు కార్నిక్ తన మనసులో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటిది బాబాకి 'సవా రూపాయి'(రూపాయి పావలా) దక్షిణగా సమర్పించాలని. అది శ్రీసత్యనారాయస్వామి మహాపూజలో స్వామికి సమర్పించే దక్షిణ అని అతని దృఢ విశ్వాసం. రెండవది, బాబా తనంతట తానుగా దక్షిణ అడగాలి, లేకుంటే శిరిడీ నుండి తిరిగి కల్యాణ్ వచ్చేయాలని. అలా నిశ్చయించుకున్న తరువాత తండ్రీకొడుకులిద్దరూ శిరిడీకి ప్రయాణమయ్యారు. సౌకర్యవంతంగా తమ ప్రయాణం సాగించి కోపర్గాఁవ్ చేరుకున్నారు. అక్కడ తన శిష్యపరివారంతో శిరిడీ వెళ్తున్న రామమారుతిని కలుసుకున్నారు. అక్కడ ఉన్న ఒకే ఒక్క ఎద్దులబండిని రామమారుతి బృందం అద్దెకు మాట్లాడుకుని శిరిడీకి బయలుదేరిపోగా, కార్నిక్, అతని కొడుకు మాత్రం శిరిడీ వెళ్ళడానికి బండ్లు ఏవీ లేక, ఏమిచేయాలో అర్థం కాని స్థితిలో ఆలోచనలో పడ్డారు. అయితే వారివురూ ఏదేమైనాసరే శిరిడీ వెళ్లి తీరాలని దృఢసంకల్పం చేసుకున్నారు. కొంతసేపటికి ఒక టాంగా వచ్చింది. టాంగావాడు, "మిమ్మల్ని శిరిడీ తీసుకునిపోతాను. బండి ఎక్కి కూర్చోండి" అని తనంతతానుగా ఆహ్వానించాడు. తండ్రీకొడుకులిద్దరూ ఆశ్చర్యపోతూ వెంటనే టాంగా ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపట్లో క్షేమంగా శిరిడీ చేరుకున్నాక టాంగావాడు సరసమైన ధర అడగడంతో కార్నిక్ ఆనందంగా అతనికి పైకం చెల్లించాడు. తరువాత తండ్రీకొడుకులిద్దరూ ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని ఎంతో ఆనందం పొందారు. తరువాత రెట్టింపు ఉత్సాహంతో ఆరతిలో కూడా పాల్గొన్నారు.
బాబా అతని కుమారుడిని దగ్గరకి పిలిచి దక్షిణ, నైవేద్యం అడిగి తీసుకున్నారు. ఆ నైవేద్యాన్ని బాబా స్వీకరించాలనే ఆశతో కార్నిక్ భార్య ఎంతో భక్తి, ప్రేమలతో తయారుచేసి పంపింది. ప్రేమతో భక్తులు పంపిన వాటిని బాబా అడిగిమరీ స్వీకరిస్తారు. కార్నిక్ బాబా పాదసేవ చేసుకున్నాడు కానీ, బాబా అతనివైపు ఒక్కసారి కూడా చూడలేదు. బాబా కార్నిక్ కొడుకుని మాత్రం ఆశీర్వదిస్తూ పదేపదే అతని నుదుటిపై ఊదీ పెట్టి, అందరినీ, "వాడాకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోమ"ని చెప్పారు. బాబా తనని దక్షిణ అడగకపోవడంతో 'తాను తిరిగి కల్యాణ్ వెళ్ళాపోవాలా? లేక శిరిడీలోనే ఉండాలా?' అన్న సందిగ్ధంలో పడ్డాడు కార్నిక్. అప్పుడు బాబా నేరుగా కార్నిక్ వైపు చూస్తూ, “నా అనుమతి లేకుండా శిరిడీ విడిచిపెట్టవద్దు. ఇప్పుడు వాడాకి వెళ్ళు” అని చెప్పారు. ఇప్పుడు కార్నిక్ నిజంగా పెద్ద అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే తన కొడుకు మరుసటిరోజు ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉండటంతో అదేరోజు వాళ్ళు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది.
కొద్దిసేపటి తరువాత తండ్రీకొడుకులిద్దరూ మళ్ళీ బాబాని కలవడానికి వెళ్లారు. కానీ, బాబా అక్కడ లేరు. మళ్ళీ మూడవసారి వెళ్ళినప్పుడు బాబా ఉన్నారు. కానీ బాబా అతని కొడుకుని తమ వద్దకు రమ్మని, కార్నిక్ ని మాత్రం సభామండపంలోనే వేచి ఉండమన్నారు. అప్పటికి చాలాకాలం ముందునుండి అనుభవిస్తున్న దీర్ఘవ్యాధి కారణంగా కార్నిక్ పెద్దకొడుకు చాలా బలహీనపడిపోయి ఉన్నాడు. అతడిని చూస్తూనే బాబా ఆగ్రహావేశాలతో, “కష్టాలు ఎవరినీ వదలవు, ప్రతి ఒక్కరూ అనుభవించవలసిందే!(‘భోక్రుత్వ కొనస్ చుత్కాస్ నాహి, తే భోగ్తెల్చ్ పహిజే’)" అని, "ఎన్నోరోజులుగా అందరి చీవాట్లనే ఆహారంగా స్వీకరించావు. ఏదైతే జరగాలని వ్రాసిపెట్టి ఉందో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించిన పిమ్మటకానీ సమస్యల నుండి విముక్తులు కాలేరు. అందుకోసమే నేను అతనికి పలుమార్లు మురికి బట్టలు ఉతుక్కోమని చెప్పాను. కానీ అతను నిరాకరించాడు. తన బట్టలకు పట్టిన మురికిని(కర్మని) తనే తొలగించుకోవాలి కదా! ఇప్పుడు చూడు, ప్రజలు చోద్యం చూస్తున్నారు.(‘సిన్చాలయ ఇతక దివస్ ఖయాయ్ల ఘాట్లే ఆని మల్కాట్ కపడే దోనాస్ మలా సాన్గిట్లే, తర నహే మ్హన్తో మాజ్హ మాల తే దుట్లేచ్ పయజే, పరంతు లూకంచి మజ పాహ’)” అని అన్నారు.
అటుపిమ్మట బాబా కార్నిక్ వైపు దృష్టి సారించి దగ్గరకి రమ్మని పిలిచారు. ఆత్రంగా కార్నిక్ బాబా దగ్గరకు వెళ్ళి ఆయన చరణాలను ఆలింగనం చేసుకుని, ముద్దులతో ముంచెత్తాడు. అంతలో బాబా "దక్షిణ ఇస్తావా?" అని అడిగారు. వెంటనే కార్నిక్ తన కొడుకువైపు చూసాడు. అతడు రూపాయి పావలా(సవా రూపాయి) ఇవ్వగా, కార్నిక్ దానిని బాబా చేతిలో పెట్టాడు. బాబా దక్షిణ పుచ్చుకుని, ”ఇతడు నాకు రూపాయి పావలా ఇచ్చాడు. చూడండి, రూపాయి పావలా ఇతనిచ్చాడు" అని పాడుతూ ప్రేమోత్సాహంతో నృత్యం చేసారు. తరువాత కార్నిక్ తో, ”ఇది నీ సొంత ఇల్లు, నేను మాత్రమే ఇక్కడ ఉంటాను. తరచుగా ఇక్కడికి వస్తూ ఉండు. సరేనా!” అని అన్నారు. కార్నిక్ ఆనందానికి అవధుల్లేవు. ఆ మధురమైన బాబా వాక్కులు ఎప్పటికీ గుర్తుండాలనే ఉద్దేశ్యంతో కార్నిక్ పదేపదే మననం చేసుకున్నాడు. తరువాత బాబా వద్దనుండి తిరిగి తన ఊరు వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాక బాబా మాటలను తానే స్వయంగా వ్రాసిపెట్టుకున్నాడు. దారిలో కూడా బాబా మాటలను తలచుకుంటూ, "నేను పేదవాడిని కాబట్టి తరచూ శిరిడీ వెళ్లడం కుదరని పని. మరి బాబా మాటలలోని ఆంతర్యం ఏమై ఉంటుంది?" అని ఆలోచిస్తూ ప్రయాణం సాగించాడు. చివరికి, 'తమకి, నానాకి భేదం లేదని, తనని నానా వద్దకు వెళ్ళమ'ని బాబా ఉద్దేశ్యంగా గుర్తించాడు. కళ్యాణ్ చేరుకోగానే నేరుగా నానా ఇంటికి వెళ్లి శిరిడీలో జరిగిన విషయాలన్నీ తెలియజేశాడు. నానా అంతా విని(అతను చెప్పిన వివరణకు సమ్మతించి), 'రామరక్షాస్తోత్రం' నేర్చుకోమని కార్నిక్ కి చెప్పాడు. ఇక అప్పటినుండి కార్నిక్ చందోర్కర్ ఇంట జరిగే సత్సంగానికి ప్రతిరోజూ వెళ్తూ ఉండేవాడు.
ఒక నెల తరువాత కార్నిక్ తన రెండవ కొడుకుతో మళ్ళీ శిరిడీ వెళ్ళాడు. ఆరతి సమయంలో కార్నిక్, అతని కొడుకు, రామమారుతి ముగ్గురు ఒకే చోట నిల్చుని ఉండగా బాబా కార్నిక్ వైపు చూసి, “మనకి 2000 సంవత్సరాలుగా చాలా దగ్గర సంబంధముంది. మొదట్లో నువ్వు హాస్యాన్ని బాగా ఇష్టపడేవాడివి” అని అన్నారు. ఆరతి ముగిసాక అందరూ బాబా దర్శనానికి వెళ్లగా కార్నిక్ మాత్రం బాబాకు కొంచెం దూరంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా ప్రేమగా కార్నిక్ తో, “నా చిరకాల స్నేహితుడవై ఉండి కూడా ఎందుకు ఈ దూరం?” అని అంటూ అతన్ని తమ దగ్గరకి రమ్మని పిలిచారు. కార్నిక్ బాబా వద్దకు వెళ్లగా, తల్లిలా అతన్ని ఆలింగనం చేసుకున్నారు బాబా. తరువాత బాబా అతని నుదుటిపై ఊదీపెట్టి, తమ దివ్యహస్తాన్ని అతని తలపై ఉంచి, ”6 రూపాయల దక్షిణివ్వు” అని అడిగారు. కార్నిక్ తన కొడుకుని ఆ మొత్తాన్నిమ్మని చెప్పగా, అతడు ఆ మొత్తాన్ని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు బాబా, “ఏ బిడ్డయితే అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చాడో, తనని అల్లా తప్పక ఆశీర్వదిస్తాడు" అని అన్నారు. తరువాత బాబా కార్నిక్ వైపు తిరిగి, “నీకేది అవసరమైనా నన్ను అడగటానికి సంశయించకు" అని అన్నారు. అప్పుడు కార్నిక్ తన కొడుకుతో, "మన దగ్గర ఉన్న సొమ్మంతా బాబాకి దక్షిణగా ఇవ్వమ"ని అడిగాడు. ఆ సమయంలో ఒక న్యాయవాది బాబా దర్శనానికి వచ్చాడు. అతడు కార్నిక్ ని చూసి, "వయసులో పెద్దవాడైన అతని తండ్రిని ఆశీర్వదించండి బాబా" అని కోరాడు. “నా అనుగ్రహం ఎన్నడూ పక్షపాతంగా ఉండదు. అది సదా అందరిపై సమానంగా ఉంటుంది. నా ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు” అని అన్నారు బాబా. కార్నిక్ ఆ మాటలు విని, వాటిని బాబా తొలిపాఠంలా భావించాడు. కల్యాణ్ చేరిన వెంటనే తన అనుభవాలను నానాకు వివరించాడు. అప్పుడు నానా అతనికి ఈశావాస్యోపనిషత్ వివరించి చెప్పాడు.

Source : Baba's Rinanubandh
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం జై సాయి మాస్టర్ 🙏
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha ❤😊🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteఓం శ్రీ సాయి రాజారాం🌺🙏🙏🙏🌺
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalani kshamam ga chusukondi vaalla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, ofce lo anta bagundi illu konali anna na korika neravere la chayandi tandri, na manasulo anukunnadi jarige la chayandri tandri pls.
ReplyDelete