సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 193వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబాపైనే నమ్మకం పెట్టుకున్నాను
  2. బాబా టీవీ ద్వారా నాకు చేసిన హెచ్చరిక

బాబాపైనే నమ్మకం పెట్టుకున్నాను

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిరాం! నేను ఒక సామాన్య సాయిభక్తురాలిని. ముందుగా ఈబ్లాగ్ నిర్వహిస్తున్న అందరికీ నా ప్రణామాలు. సుమారు 20 ఏళ్లక్రితం బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. నేను పీజీ చదువుతున్నప్పుడు ప్రసాద్ అనే ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. కానీ, అతనికి నేనంటే అలాంటి అభిప్రాయం లేదని చెప్పాడు. అప్పటికే నేను సాయిభక్తురాలిని. అప్పుడప్పుడు బాబా గుడికి వెళ్లి వస్తుండేదాన్ని. ఆ అబ్బాయి నేనంటే ఇష్టం లేదని చెప్పినప్పుడు నేను బాబా మందిరానికి వెళ్ళి, ఎలాగైనా ఆ అబ్బాయితో నాపెళ్లి జరిపించమని బాబాకు మొరపెట్టుకున్నాను. ఎప్పటికైనా బాబా ఆ అబ్బాయితో నా పెళ్ళి జరిపిస్తారని అనుకునేదాన్ని. నా పీజీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాదుకి వెళ్లాను. ఒకరోజు సాయంత్రం నేను ఒక బాబా గుడికి వెళ్లాను. ఆరోజు బాబా నాకు ఒక చక్కని అనుభవాన్ని ప్రసాదించారు. బాబాకు స్వయంగా నా చేతులతో అభిషేకం చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడినుండి ఇంటికి వచ్చేసరికి మా చెల్లెలు, “అక్కా, నీ కోసం ఎవరో ప్రసాద్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు” అని చెప్పింది. నా ఆశ్చర్యానికి అంతులేదు. ఈమధ్యకాలంలో నేను అతనితో మాట్లాడిందే లేదు. అలాంటిది అతనే ఫోన్ చేసాడంటే బాబా మాత్రం నా గురించి ఆలోచిస్తున్నారని, ఈవిధంగా నాకోసం ఒక సందేశం కూడా పంపించారని అనిపించింది. ఆ తరువాత నేను మా ఊరికి వెళ్ళిపోయాను. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ అబ్బాయి గుర్తొస్తే చాలు, నేను చాలా ఏడ్చేదాన్ని. అతనిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటూ ఉండేదాన్ని. బాబా మళ్ళీ తన మిరాకిల్ ని చూపించారు. 2004లో నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు నా స్నేహితుడికి ఫోన్ చేస్తే, ఆ కాల్ ను ఆ అబ్బాయి రిసీవ్ చేసుకున్నాడు. తను నాతో మాట్లాడతాడని నేనస్సలు అనుకోలేదు. అలాంటిది చాలారోజుల తర్వాత తనే మాట్లాడుతుంటే నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. తను కాసేపు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. అదేరోజు రాత్రి తను మళ్లీ నాకు ఫోన్ చేసి దగ్గరదగ్గరగా మూడు, నాలుగు గంటలసేపు మాట్లాడాడు. ఆ మాటల్లో నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని చెప్పాడు. సరేనని తనని కలవడానికి వెళ్ళాను. అలా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అతను, "నన్ను పెళ్లి చేసుకుంటాన"ని చెప్పాడు. ఆ మాటకోసమే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నేను నా అంగీకారం తెలిపాను. మొత్తానికి బాబా దయతో, ఆశీస్సులతో మా పెళ్లి 2005, ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది. చిన్నచిన్న విభేదాలున్నప్పటికీ మా సంసారం 14 ఏళ్లు ఆనందంగా గడిచింది. కానీ, 2017 నుంచి నాభర్త నాతో మాట్లాడటం మానేశాడు. పైగా తనకు నానుంచి విడాకులు కావాలని అడుగుతున్నాడు. కనీసం ఇంట్లో భోజనం కూడా చేయట్లేదు. నాకు, అతనికి సంబంధం లేదని, తనకు నేను అవసరంలేదని చెబుతున్నాడు. నాకు అసలేం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో నాకు బాబా గుర్తొచ్చారు. నేను కన్నీళ్ళతో, “బాబా! నిన్ను తలచుకోలేదని నాకు ఎంత పెద్దశిక్ష వేశావయ్యా? నన్ను క్షమించు సాయీ! నేను చేసిన తప్పును క్షమించి, నా సంసారాన్ని  నిలబెట్టి, మళ్లీ ప్రేమానురాగాలతో నా భర్తను నాకు దగ్గర చేయవయ్యా! నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించు సాయీ! నా భర్తను మళ్ళీ నాకు ప్రసాదించు సాయీ! పాహిమాం సాయీ!” అని బాబాను ప్రార్థించాను. ఆ తరువాత నా భర్తకు నాపై కాస్తైనా ప్రేమ ఉందో లేదో నాకు తెలియజేయమని బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ బాబా ఊదీని నా భర్త త్రాగే మంచినీళ్ళలో కలిపేదాన్ని. తనకు నాపై ప్రేమ ఉందని తెలిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. కొన్నిరోజుల తరువాత అతని గురించి నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది(దానిని ఇక్కడ పంచుకోలేను). కానీ, త్వరలోనే నా భర్త ప్రేమని నాకు తిరిగి ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను. బాబా దయవల్ల నేను మహాపారాయణ గ్రూపులో భాగస్వామినై, సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. "ఈ సంవత్సరం మహాపారాయణ పూర్తయ్యేలోపు నా భర్త ప్రేమను నాకు తిరిగి ప్రసాదించమ"ని భక్తివిశ్వాసాలతో బాబాను ప్రార్థిస్తున్నాను. నేను ఇష్టపడ్డ అబ్బాయితో నాపెళ్లి జరిపించిన బాబా, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని తీసేసి మమ్మల్ని కలుపుతారని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను.

బాబా టీవీ ద్వారా నాకు చేసిన హెచ్చరిక

సాయిభక్తుడు నిమిత్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 2009 నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుని మరియు బాబా భక్తుడిని. నా సాయి చెప్పే ప్రతి మాటలో నిగూఢమైన అర్థం ఉంటుంది. బాబా నాతో ఎలా సంభాషించారో, రాబోయే సంఘటన గురించి నన్ను ఎలా హెచ్చరించారో తెలియజేసే ఒక అనుభవాన్ని నేనిప్పుడు సాయిభక్తులందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

2019, జనవరి 9న నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చి నా కొడుకుని ఎత్తుకుని గదిలో అటు ఇటు నడుస్తున్నాను. ఆ సమయంలో 'మేరే సాయి' సీరియల్ టీవీలో వస్తోంది. నా కొడుకును ఆడిస్తూ యధాలాపంగా టీవీ వైపు చూసాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులకు బాబా ఏదో వివరిస్తున్న దృశ్యం నడుస్తోంది. అకస్మాత్తుగా బాబా నేరుగా నావైపు చూస్తూ, "ఒకవేళ నీ విషయంలో ఏదైనా సవ్యంగా జరగడంలేదని, చెడు జరుగుతుందని నీకనిపిస్తే  భయపడవద్దు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానని గుర్తుచేసుకో! అంతా బాగుంటుంది" అని చెప్పారు. ఒక్క క్షణం అలాగే నేను ఉన్నచోటనే స్తబ్దంగా నిలబడిపోయాను. 'బాబా నిజంగా నాతో మాట్లాడుతున్నారా!?' అని అనిపించింది. ఆయన నాకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆలోచనలో పడ్డాను. ఆ మరుసటిరోజు ఆఫీసులో ఒక సహోద్యోగి నాకు సంబంధంలేని విషయంలో నన్ను బాధ్యుడిని చేస్తూ చాలామందికి ఇ-మెయిల్ పంపాడు. మొదట ఏమి జరుగుతోందో నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రయత్నించాను. హఠాత్తుగా సీరియల్ ద్వారా బాబా చేసిన హెచ్చరికను జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు ఈ పరిస్థితి గురించే బాబా నన్ను హెచ్చరించారని అర్థమైంది. దానితో ఆయనే నాకు సరైన మార్గనిర్దేశం చేసి సమస్యనుండి బయటపడేస్తారని నమ్మకం కలిగింది. నా నమ్మకం వమ్ముకాలేదు. కొద్దిరోజుల్లో బాబా దయవలన ఆ పరిస్థితి చక్కబడింది. ఆ సంఘటనతో బాబా మనతో ఎలా సంభాషిస్తారో అర్థమై నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడైనా నా మనస్సులో ఆందోళన ఉన్నప్పుడు నేను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచి చూస్తే, అప్పటి నా పరిస్థితిని నేరుగా ప్రస్తావిస్తూ ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నారని చెప్పే సందేశం వస్తూ ఉంటుంది. సదా నాకు అండగా ఉంటున్న బాబాకు నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ నా కుటుంబానికి అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. "లవ్ యూ బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2436.html

4 comments:

  1. I just couldn't depart your site before suggesting that I extremely enjoyed the usual info a
    person supply on your visitors? Is going to be again frequently to check
    up on new posts

    ReplyDelete
  2. Omsai sadguru sainath maharajuki jai

    ReplyDelete
  3. Omsai sadguru sainath maharajuki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo