సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 188వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. పెద్ద యాక్సిడెంటుకి గురైన భక్తురాలిని బాబా కాపాడారు. 
  2. 5 రోజుల సాయిపూజ - వచ్చిన EAD కార్డు

పెద్ద యాక్సిడెంటుకి గురైన భక్తురాలిని బాబా కాపాడారు. 

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్తే! నేను సాయిభక్తురాలిని. నాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

అది 2013వ సంవత్సరం. నేను ఢిల్లీలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రీసెర్చ్ చేస్తున్నాను. నా కాలేజీ నుండి ఇంటికి వెళ్ళడానికి గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది. మార్చి 13న నేను నా స్నేహితుడితో కలిసి తన బైక్ మీద ఇంటికి వెళ్తున్నాను. అకస్మాత్తుగా తను తన బైక్ మీద అదుపు కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న మరో బైక్ ని మా బైక్ ఢీకొట్టింది. దాంతో ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో మేము పడిపోయాము. నా స్నేహితుడు, ఎదురు బైక్ మీద ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నందువలన వాళ్ళు పెద్దగా గాయపడలేదు. కానీ నా తల వెనుకభాగం రోడ్డుని ఢీకొంది. నా చేతులు, కాళ్ళు బైక్ క్రింద ఇరుక్కున్నాయి. నేను దాదాపు అపస్మారకస్థితిలోకి జారుకుంటున్న సమయంలో సాయిబాబాను తలచుకున్నాను. అకస్మాత్తుగా బైక్ క్రింద వున్న నన్ను ఏదో అదృశ్యశక్తి  బయటికి తీసుకువచ్చి, రోడ్డు ప్రక్కకు తీసుకునివెళ్లి నన్ను కూర్చోబెట్టింది. అలా నన్ను బయటకు తీసుకొచ్చింది ఏ వ్యక్తి మాత్రం కాదని నాకు తెలుస్తోంది. తరువాత అక్కడ ప్రజలు గుమిగూడారు. నా తల పగిలిపోయినట్లు నాకు చాలా బాధగా ఉంది. భరించలేని నొప్పి కారణంగా ఏ క్షణమైనా నా ప్రాణం పోతుందని నాకనిపిస్తోంది. ఆ స్థితిలో నేను, "సాయిబాబా! నాకు ఏమి జరిగింది? నన్ను ఎవరైనా ఆసుపత్రిలో చేరుస్తారా? నేను బ్రతుకుతానా? నాకు ఏదైనా జరిగితే నా తల్లిదండ్రుల సంగతేంటి? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు నాకేదైనా జరిగితే నా చికిత్సకోసం నా తండ్రి డబ్బు వృథా చేసుకోవడం నాకిష్టంలేదు" అని అనుకుంటూ నేలపై కుప్పకూలిపోతున్నాను.

అంతలో అకస్మాత్తుగా సుమారు 40, 50 సంవత్సరాల వయస్సున్న ఒక మహిళ నా వద్దకు పరుగున వచ్చి నా తలని తన ఒడిలో పెట్టుకుంది. నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను, లోలోపల ఏడుస్తున్నాను. కానీ నా కళ్ళనుండి కన్నీళ్ళు రావడం లేదు. ఆ మహిళ నన్ను కౌగిలించుకున్నట్లుగా బాగా దగ్గరకు తీసుకుంది. తరువాత నా తలను మృదువుగా నిమురుతూ, “నీకు ఏమీ జరగదు. నువ్వు చింతించకు, నేను నీకు ఏమీ జరగనివ్వను" అని నాతో చెప్పి, చుట్టూ ఉన్న వాళ్లతో ఆమె, “బహుత్ బహదూర్ బచ్చా హై యే మేరా(నా బిడ్డ చాలా ధైర్యవంతురాలు)" అని చెప్పింది. ఆమె చేతులలో ఏదో తెలియని అదృశ్యశక్తి ఉంది, అది నా హృదయాన్ని ఓదార్చింది. నా తలపై ఆమె చేతులు నిమురుతూ ఉంటే, నా నొప్పి నెమ్మదిగా మాయమవుతూ నేను చాలా ఉపశమనం పొందుతున్నాను. ఆమె ఒడిలో నేను తల్లిఒడి వెచ్చదనాన్ని అనుభవిస్తున్నాను. అంతకుముందెన్నడూ అనుభవించని ఆ సుఖాన్ని అనుభవిస్తూ తన ఒడిలో అలాగే ఉండాలని నాకనిపిస్తూ ఉంది. ఆ స్థితిలో నేను ఏడుపుగొంతుతో తడబడుతూ, “థాంక్యూ ఆంటీ” అన్నాను. ఆమె నన్ను కూర్చోబెట్టి నా ముందుకు వచ్చింది. అప్పడు నేను ఆమె ముఖాన్ని చూశాను. ఆమె “కోయీ బాత్ నహీ బేటా!(పర్వాలేదు బిడ్డా!) నువ్వు నిజంగా ధైర్యంగల సాహసోపేతమైన నా బిడ్డవి. నేను నిన్ను ఏడవనివ్వను. నీకు ఏమీ జరగనివ్వను” అని చెప్పింది. తరువాత నేను లేచి నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నాకు ఏమీ జరగనట్లుగా నాకనిపిస్తూ ఉంది. అయినప్పటికీ నేను హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఇంతలో ఆమె ఏమైందో ఎక్కడా కనపడలేదు

తరువాత నేను హాస్పిటల్ కి వెళ్లి డాక్టరుని కలిసి జరిగినదంతా చెప్పాను. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తరువాత నాకు ఏమీ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని డాక్టర్ అన్నారు. నేను పూర్తిగా అపస్మారకస్థితిలోకి వెళ్లనందున, పైగా వాంతులు కూడా చేసుకోనందున ఎక్స్-రే, సిటి-స్కాన్ వంటివేమీ అవసరం లేదన్నారు. కేవలం నొప్పులు తగ్గడానికి మందులిచ్చి నన్ను పంపేశారు. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ నా తొడలు ఎర్రగా కమిలిపోవడం, కాస్త వాచిపోవడం తప్ప ఒక్క చుక్క రక్తం కూడా రాలేదు. ఈరోజు నేను అదంతా గుర్తుచేసుకుంటుంటే, నన్ను రక్షించింది సాయేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తన బిడ్డలు బాధపడుతుంటే చూడలేరు. ఎంతో దుర్భరమైన పరిస్థితిలో నాకు సహాయం చేయడానికి వచ్చారు. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు సాయిని పిలిస్తే ఆయన పరుగెత్తుకుని మన వద్దకు వస్తారని నేను ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాను. "సాయిబాబా! నన్ను రక్షించినట్లు అందరినీ రక్షించండి. మీరు నాపై చూపిన కృపకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

5 రోజుల సాయిపూజ - వచ్చిన EAD కార్డు

యు.ఎస్. నుండి అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను ఎప్పుడూ సాయిబాబా భక్తుడిని. బాబా దయవల్ల జీవితంలో చాలా సమస్యలను అధిగమించాను. ఆయన కృపతోనే యు.ఎస్. లో మాస్టర్స్ పూర్తయి నాకు ఉద్యోగం లభించింది. అయితే యు.ఎస్‌.లో పనిచేయడానికి EAD(ఉపాధి) కార్డు తప్పనిసరి. సాధారణంగా 90 రోజుల్లోపు కార్డు వస్తుంది. కానీ నా విషయంలో 90 రోజులు దాటినా కార్డు రాలేదు. అది నా జీవితానికి, ఉద్యోగానికి సంబంధించినది కావడంతో నేను చాలా ఆందోళనపడ్డాను. కార్డు ఆమోదించబడుతుందన్న ఆశతో ఇండియా వచ్చాను. ఇక కార్డు లేకుండా నేను తిరిగి వెళ్ళలేని పరిస్థితి. నాకెటువంటి ఆశా కనపడకున్నా నాకున్న నమ్మకమంతా బాబానే, 'ఆయనే నాకు సహాయం చేస్తార'ని. ఆ స్థితిలో నేను EAD కీవర్డ్‌తో ఇంటర్నెట్ లో అనుభవాల కోసం వెతికాను.  సైట్ లో EAD కార్డును పోగొట్టుకున్న ఒక వ్యక్తి అనుభవం నా కంటపడింది. ఆ వ్యక్తి  5 రోజులు సాయిబాబా పూజ చేయడంతో తను ఆ కార్డును తిరిగి పొందాడు. వెంటనే నేను, "బాబా! నేను కూడా ఆ పూజ చేస్తాను, నా కార్డు ఆమోదం పొందేలా చేయండి" అని ప్రార్థించాను. నేను శనివారం పూజను ప్రారంభించి ఏరోజుకారోజు నా కార్డు ఆమోదించబడుతుందని ఆశతో ఎదురుచూశాను. కానీ నాలుగురోజులు గడిచినా ఏమీ జరగలేదు. దానితో నాకు సాయిబాబాపై కోపం వచ్చింది. కానీ నేను ఆశ్చర్యపోయేలా ఐదవరోజు బాబా ఆశీర్వాదం లభించింది, నా కార్డు ఆమోదించబడింది. నా ఆనందానికి అవధుల్లేవు. నేను 'కృతజ్ఞతలు' అన్న చిన్నమాట సాయికి చెప్పుకోలేను. ఆయన నా మార్గదర్శకుడు. వారి దయతో, సహాయంతో నేను జీవితంలో ఏదైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగివున్నాను. బాబాపై నమ్మకముంచండి. ఆయన మిమ్మల్ని తప్పక రక్షిస్తారు. 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo