ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీస్సులతో దొరికిన మంచి కాంట్రాక్టు
- మొదటిసారి బాబా నాకు చూపిన మహిమ
బాబా ఆశీస్సులతో దొరికిన మంచి కాంట్రాక్టు
ఖమ్మం జిల్లా నుండి చంద్రశేఖర్ గారు తన అన్నయ్యకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నమస్తే! నా పేరు చంద్రశేఖర్. 2019, సెప్టెంబర్ 27న నేను మా అన్నయ్యతో(మా పెద్దమ్మ కొడుకు), ‘బాబా నన్ను శిరిడీకి రమ్మని పిలిచార’ని చెప్పి, తనను కూడా నాతో పాటు శిరిడీ రమ్మని అడిగాను. తన దగ్గర శిరిడీకి రావడానికి సరిపడా డబ్బు లేదని అన్నయ్య అన్నాడు. దానికి నేను, “డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను, నీ దగ్గర వున్నప్పుడే ఇవ్వు” అని చెప్పాను. తను దానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత బాబా ఆశీస్సులతో నేను, అన్నయ్య కలసి ఒక శుక్రవారంనాడు బయలుదేరి శనివారం ఉదయానికి శిరిడీ చేరుకొన్నాము. ఆనందంగా బాబాని దర్శించుకున్నాము. తరువాత మా అన్నయ్య సోమవారంనాడు తన కాంట్రాక్ట్ పనిపై పనివారిని వెంటబెట్టుకుని నాగపూర్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తనకు ఆ కాంట్రాక్టులో కేవలం ఇరవైవేల రూపాయలు మాత్రమే లాభం వస్తుందని అనుకుని వెళ్ళాడు. కానీ, అక్కడకు వెళ్ళాక ఒక కాంట్రాక్టులో భాగస్వామ్యం దొరికి, మూడేళ్ళకు సరిపోయే పని వచ్చి, నెలకు 62,000 రూపాయలు సంపాదించే అవకాశం దొరికింది. అంతేకాదు, 10,000 రూపాయలు విలువ చేసే సామగ్రిని కేవలం 5,500 రూపాయలకే కొనగలిగాడు. వెంటనే నాకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి, ఇదంతా బాబా ఆశీస్సులతోనే జరిగిందని తన సంతోషాన్ని నాతో పంచుకున్నాడు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

మొదటిసారి బాబా నాకు చూపిన మహిమ
సాయిభక్తుడు బుసిరెడ్డి రఘునాథరెడ్డిగారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా పేరు రఘు. నేను బాబా భక్తుడిని. నా చిన్నప్పటినుండి నేను బాబాను పూజిస్తున్నాను. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మేము 2019, జులైలో శిరిడీ వెళ్ళడానికి ప్రణాళిక చేసుకొని, ట్రైన్ రిజర్వేషన్స్, శిరిడీలో వుండటానికి హోటల్ రూము బుక్ చేసుకున్నాము. ఎప్పుడైనా శిరిడీ వెళ్ళినప్పుడు బాబా హుండీలో వేయడానికని నా భార్య గత అయిదు సంవత్సరాలుగా చిల్లర డబ్బులు ప్రోగుచేస్తోంది. ఆ చిల్లర డబ్బులున్న హుండీని మనతో పాటు తీసుకువెళదామని నా భార్య అన్నది. కానీ నేను, “ఈ హుండీ చాలా బరువుగా వుంది. ఇంత చిల్లరతో వున్న హుండీని తీసుకునివెళ్ళడం కంటే, హుండీని పగులగొట్టి, అందులోని చిల్లరను లెక్కగట్టి, ఆ మొత్తానికి సరిపోయే నోట్లను బాబా హుండీలో వేద్దాం” అని అన్నాను. కానీ నా భార్య మాత్రం ఆ చిల్లర వున్న హుండీనే తీసుకొని వెళదామన్నది. నేను దానికి ఒప్పుకోక, ఏదైనా ఒకటే కదా అని చెప్పి, హుండీ పగులగొట్టి, అందులో వున్న చిల్లరని లెక్కించి, దానికి సమానమైన నోట్లు తనకి ఇచ్చాను. నా భార్య అయిష్టంగానే అందుకు ఒప్పుకుంది.
మేము సామానులన్నీ సర్దుకొని ట్రైన్ ఎక్కి శిరిడీ వెళ్ళాము. నాగర్ సోల్ లో ట్రైన్ దిగి క్యాబ్ ఎక్కి శిరీడికి బయలుదేరాము. ప్రయాణం చేసిన అలసటలో అందరం నిద్రపోయాము. క్యాబ్ మమ్మల్ని ‘సాయి ఆశ్రమం’లో దింపి వేగంగా వెళ్ళిపోయింది. అందరం మంచినిద్రలో ఉండి దిగటం వల్ల ఒక బ్యాగును క్యాబ్ లోనే మర్చిపోయాము. బాబా మహత్యం చూడండి. మేము హుండీలో వేద్దామనుకొన్న డబ్బులు పెట్టుకున్న పర్సు ఆ బ్యాగులోనే వుంది. వెంటనే నేను క్యాబ్ కోసం వెతుకుతూ వెళ్ళాను. కానీ, నాకు క్యాబ్ ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. వెంటనే, “మేము తప్పుచేశాము, మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి బాబా!” అని బాబాను ప్రార్థించాము .
తరువాత మేము రూముకి వెళ్లి రెడీ అయ్యి బాబా దర్శనానికి వెళ్ళాము. కానీ మనసులో అపరాధభావం అలాగే ఉంది. బాబా దర్శనం బాగా అయింది. దర్శనం చేసుకొనేటప్పుడు నేను బాబాకి క్షమాపణలు చెప్పి, “ఇంటి దగ్గరున్న హుండీలోని డబ్బులని ఎలాగైనా శిరిడీకి చేరుస్తాను” అని బాబాకి మాట ఇచ్చి, మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించాను. తరువాతరోజు మేము నాసిక్ యాత్రకి వెళ్ళాము. బయలుదేరేముందు నా భార్య సాయి ఆశ్రమం ఎంట్రన్సులో ఉన్న సెక్యూరిటీ గార్డుతో, “మా బ్యాగ్ పోయింది, ఎవరైనా వచ్చి మా బ్యాగు ఇస్తే ఈ నెంబరుకి కాల్ చేయండి” అని చెప్పి, తన ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ఇక్కడ చూడండి బాబా మహిమ!
మేము నాసిక్ యాత్రలో ఉన్నపుడు మాకు సెక్యూరిటీ గార్డునుంచి ఫోన్ కాల్ వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ ఏమి చెప్పాడంటే, “క్యాబ్ డ్రైవర్ స్నేహితుడు వచ్చి, డబ్బులున్న పర్సు మరియు కార్డులు అన్నీ తిరిగిచ్చాడు” అని. మేము నమ్మలేకపోయాము. డ్రైవర్ స్నేహితుడు వచ్చి అన్నిటినీ తిరిగిచ్చాడట, ఇది నిజంగా బాబా మహిమే! లేకపోతే, ఈ రోజుల్లో ఎవరైనా ఇలా చేస్తారా? నేను చేసిన తప్పుని బాబా క్షమించారని తలచి ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఇది బాబా నాకు చూపిన మహిమ. నేను బాబా మహిమని మొదటిసారి చవిచూసాను. "ఈ మహిమని బ్లాగులో వ్రాయటానికి టైం తీసుకున్నాను. ఆలస్యం జరిగినందుకు నా క్షమాపణలు. మమ్మల్ని దీవించండి బాబా!”
సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
Om sairam
ReplyDeleteOm sairam
ReplyDeleteSainath maharajuki jai
ReplyDelete🕉 sai Ram
ReplyDelete