సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 202వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు: 
  1. మానసికంగా కృంగిపోయి ఉన్న దశలో బాబా ప్రవేశం - సమస్య పరిష్కారం
  2. శిరిడీ దర్శనం - బాబా నెరవేర్చిన కోరికలు

మానసికంగా కృంగిపోయి ఉన్న దశలో బాబా ప్రవేశం - సమస్య పరిష్కారం

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 30 సంవత్సరాల వయస్సు పైబడిన స్త్రీని. 9 సంవత్సరాల క్రితం మా అత్త, అమ్మమ్మ నాకు బాబాను పరిచయం చేశారు. అప్పటినుండి బాబా ఆశీస్సులతో నా జీవితం సాగుతోంది. నేను ఆయనను చాలా చాలా ప్రేమిస్తున్నాను.

2010 వరకు నన్నందరూ హ్యాపీగర్ల్, లక్కీగర్ల్ అంటూ అభివర్ణించేవారు. అప్పటివరకు సమస్యలంటే నాకు తెలీదు. ఆనందాన్ని అందరికీ పంచుతూ, అందరినీ ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరితో ప్రేమించబడుతూ నా జీవితం ఎంతో సంతోషంగా సాగుతుండేది. హఠాత్తుగా నా స్నేహితులలో ఒకరు నన్ను ఇష్టపడుతున్నానని చెప్పారు. అలాంటివి నా జీవితంలో జరిగే పని కాదని తెలిసి నేను తిరస్కరించాను. కానీ, నా తిరస్కరణను అతను స్వీకరించలేకపోయాడు. తను మానసికంగా బాగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళాడు. ఇవన్నీ నాకు తెలిసేలోపే నేను అతని మానసిక అస్థిరతలో చిక్కుకున్నాను. దానితో నాకు కూడా మానసిక ప్రశాంతత లేకుండాపోయింది. నా వల్ల తనేమీ చేసుకోకూడదని చాలా బాధపడి, తనతో కఠినంగా మాట్లాడకుండా శాంతంగా వివరించే ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. అయితే అతనెప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. నాకెంతో ఇబ్బందిగా, కష్టంగా ఉండేది. అదేసమయంలో మా సిస్టర్ పెళ్లి ఉండటంతో నా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడానికి నేను ఇష్టపడలేదు. నేను నా స్నేహితులలో కొద్దిమందికి మాత్రమే ఆ విషయం గురించి చెప్పాను. నేను ఆ ఆలోచనలతో చాలా క్రుంగిపోయి ఉన్నప్పుడు మా అత్త ద్వారా మొదటిసారి బాబా గురించి విన్నాను. ఆమె నాకు బాబా గురించి చెప్పి, బాబాతో తన అనుభవాలను వ్రాసుకున్న తన డైరీని నాకిచ్చి చదవమని చెప్పింది. అదేసమయంలో మా అమ్మమ్మ 'నవగురువారవ్రతం' చేయమని నాతో చెప్పింది. నిజానికి వాళ్ళిద్దరికి నా సమస్య గురించి ఏమీ తెలియదు. అందువలన అదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదని నాకనిపించి, నవగురువారవ్రతాన్ని ప్రారంభించి, అదేసమయంలో సచ్చరిత్ర పారాయణలు కూడా చేశాను. పారాయణ చివరిరోజున అతను, "నేను నీ చుట్టూ ఇకపై తిరగను, నిన్నింక ఇబ్బందిపెట్టను" అని చెప్పి వెళ్లిపోయాడు. బాబా చూపిన కృపను నేను అస్సలు నమ్మలేకపోయాను. అప్పటినుండి ఆయనతో నాకు విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతిరోజూ లెక్కలేనన్ని అనుభవాలతో నా జీవితం సాగిపోతోంది. ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు దాటినా నేను అవివాహితగానే ఉన్నాను. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు. ఆయన లేకుండా నా జీవితాన్ని నేను ఊహించలేను. ప్రతి అనుభవం ద్వారా ఆయన నాకు ఏమి నేర్పిస్తున్నారో, నా నుండి ఏమి కోరుకుంటున్నారో నేను అర్థం చేసుకుంటున్నాను. మనస్సులో ఉన్న అంధకారాన్ని ఎదుర్కోవటానికి ఆయన నాకు సహాయం చేస్తున్నారు. మానసికంగా కృంగిపోయి ఉన్నప్పటికీ, తోటివారితో మంచిగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన నాకు నేర్పించారు. మన వ్యక్తిగత విషయాల వలన మనం ఒకరిపట్ల అసూయపడేలాగాని, ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించే విధంగాగాని ఉండకూడదు. మనం శ్రద్ధ, సబూరీలతో జీవితంలోని ప్రతి సమస్యను దాటాలి.

శిరిడీ దర్శనం - బాబా నెరవేర్చిన కోరికలు

సాయిభక్తురాలు స్మిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

"నా అనుమతి లేనిదే ఎవరూ శిరిడీకి రాలేరు" అని బాబా చెప్పారు. నేను సుమారు ఏడేళ్లుగా బాబాను ఆరాధిస్తున్నాను. కానీ ఎప్పుడు నేను శిరిడీ వెళ్లాలనుకున్నా అది నెరవేరలేదు. చివరికి ఏడేళ్ల తర్వాత బాబా పిలుపుతో నా పుట్టినరోజునాడు శిరిడీ సందర్శించే సువర్ణావకాశం నాకు లభించింది. నేను 3 ఆరతులకి టికెట్లు బుక్ చేసుకున్నాను. నాకున్న కొన్ని కోరికలను బాబా ఒక్కొక్కటిగా నెరవేర్చారు. ముందుగా మధ్యాహ్న ఆరతికి వెళ్ళినప్పుడు బాబాను చూడగానే పట్టలేని ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యాను. తరువాత ధూప్ ఆరతి సమయంలో నేను బాబానుండి బహుమతి లభిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. ఆరతి అయిన తరువాత పూజారి పూలగుచ్ఛాన్ని నాకు అందజేశారు. అలా బాబా నా కోరిక నెరవేర్చి నన్ను ఆనందంలో ముంచేశారు. ఆ తరువాత రాత్రి ఆరతి సమయంలో నేను, "బాబా! ఇది చివరి దర్శనం. నేను మీనుండి కొన్ని వేపాకులు కోరుకుంటున్నాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరతి పూర్తయిన తరువాత నేను వేపచెట్టు దగ్గరకు రాగానే అకస్మాత్తుగా కేవలం 5 సెకన్లపాటు గాలి వీచింది. దానితో క్రింద రాలిన కొన్ని వేపాకులను నేను సేకరించుకోగలిగాను. అలా అడుగడుగునా బాబా నాపై చూపిన ప్రేమను పూర్తిగా అనుభవించాను. ఆయన నాకు చాలా చక్కటి దర్శనాలను ప్రసాదించి మనసునిండా ఆనందంతో ఇంటికి తిరిగి పంపారు. "నన్ను శిరిడీకి ఆహ్వానించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 

source: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2439.html

3 comments:

  1. Anantakoti brahmandanayaka rajadiraja Yogi Raja parahbrahma Sri sachchidananda samartha sadguru sainath maharajuki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo