సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1914వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పెద్ద బాధ నుండి బయటపడేసిన బాబా
2. బాబా దయతో ఆటంకం లేకుండా తిరుమల దర్శనం - తగ్గిన జ్వరం
3. ఊదీ మహిమ

పెద్ద బాధ నుండి బయటపడేసిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా  అనూష. నాకు గురువు, తండ్రి, అన్న అయిన నా సాయికి శతకోటి ప్రమాణాలు. సాయి భక్తులందరికీ నమస్కారం. సాయి నన్ను ఒక పెద్ద కష్టం, బాధ నుండి బయటపడేసారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2024, జూలై నెలలో ఒక మంగళవారంనాడు నేను పని చేస్తున్న స్కూలులో పాఠ్యప్రణాళిక చూద్దామని లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు అనుకోకుండా స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఓపెన్ అయింది. అది పోలేదు, మినిమైజ్ కూడా కాలేదు. అక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటే, దానిపై నేను చాలాసార్లు క్లిక్ చేశాను. చేసినప్పుడల్లా ఏదో డిలీట్ అయినట్లు సౌండ్ వచ్చింది కానీ, ఆ ఇమేజ్ మాత్రం పోలేదు. ఇంకా నేను ఆ ఇమేజ్ పక్కకి జరిపి ఫోల్డర్‌లోని పాఠ్యప్రణాళిక చూద్దామని చూస్తే, అక్కడ పాఠ్యప్రణాళిక లేదు. పూర్తిగా డిలీట్ అయిపోయింది. ఒక్క సెకనుపాటు నాకు అంతా శూన్యమైపోయింది. చాలా భయమేసి లాప్టాప్ షట్‌డౌన్ చేసి, వెంటనే మళ్ళీ ఓపెన్ చేసాను. ఆ ఇమేజ్ స్క్రీన్ మీద అలానే ఉంది. ఫోల్డర్‌లోని పాఠ్యాంశం లేదు. నేను భయంతో మళ్ళీ షట్‌డౌన్ చేసేసాను. విషయం ఎవరికీ చెప్పకుండా, "బాబా! ఏంటి ఇలా జరిగింది. నాకు చాలా భయంగా ఉంది. అది స్కూల్ పాఠ్యప్రణాళిక. దయచేసి ఏదో ఒకటి చేయండి బాబా" అని బాబాని వేడుకున్నాను. మర్నాడు బుధవారం పండుగ కారణంగా సెలవు వచ్చింది. నా మదిలో అదే దిగులు వెంటాడుతున్నందువల్ల ఆ రోజంతా నేను బాబాని, "మీరే ఏదో ఒకటి చేసి రేపు నేను స్కూలుకి వెళ్లి ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ముందు ఎలా ఉండేదో అలాగే ఉండేలా చేయండి. మీరు ఏమైనా చేయగలరు బాబా. ఆ సమస్యను తొలగించి నన్ను కాపాడండి బాబా. ప్లీజ్ బాబా" అని వేడుకుంటూ గడిపాను. తర్వాత రోజు అంటే గురువారం నేను తొందరగా స్కూలుకి వెళ్లి ల్యాప్‌టాప్ ఓపెన్ చేశాను. ఈసారి ఆ ఇమేజ్ లేదు. ఫోల్డర్ ఓపెన్ చేస్తే, ఏదో అద్భుతం జరిగినట్లు ముందు ఎలా ఉండిందో అలాగే పాఠ్యప్రణాళిక ఉంది. ఆ క్షణం నేను ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా నా బాధ అంతా మాయమైపోయింది. తర్వాత గురువారం గుడికి వెళ్లి, బాబాకి శిరా నివేదించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అనుక్షణం మమ్ము కాపాడుతున్నందుకు మీకు శతకోటి ప్రమాణాలు సాయితండ్రీ":.

బాబా దయతో ఆటంకం లేకుండా తిరుమల దర్శనం - తగ్గిన జ్వరం

నా పేరు షాలిని. నాకు బాబాతో పరిచయం 2022, మేలో జరిగింది. తక్కువ కాలమే అయినా బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు అనేకం. 2024, జూలై 8, 9 తేదీల్లో మేము తిరుమల వెళ్ళాము. అది మా అక్క నెలసరి సమయం కావడం వలన బాబాకి, వెంకటేశ్వరస్వామికి ప్రయాణంలో, అలాగే దర్శనానికి నెలసరి ఆటంకం కాకుండా ఉండాలని కోరుకున్నాము. అయితే అలిపిరి దగ్గరకి వెళ్లేసరికి అక్కకి నెలసరి వచ్చిన అనుభూతి కలిగింది. కానీ నిజానికి కాలేదు. అయినా కూడా మాకు భయం పట్టుకుంది. అందువల్ల సాయి నామస్మరణ, గోవింద నామస్మరణ చేసుకుంటూ కొండా ఎక్కసాగాము. అక్కకి కొంచం ఆరోగ్య సమస్యలు ఉన్నందువలన తను ఎక్కగలదో, లేదో అనుకున్నాము కానీ బాబా, వెంకటేశ్వరస్వామి దయవల్ల ఎక్కగలిగింది. తిరుమల చేరుకున్నాక నేను ఎక్కడైనా బాబా దర్శనం ఆవుతుందేమోనని చూశాను. కానీ బాబా ఎక్కడా కనిపించలేదు. కొంతసేపటి తర్వాత స్వామి దర్శనానికి వెళ్లేముందు ఒక ఫోటో రూపంలో, అలాగే క్యూలైన్లోకి వెళ్లినప్పుడు ఒక కారు వెనుక వైపు బాబా దర్శనం మాకు అయింది. బాబా దయవల్ల స్వామి దర్శనం చాలా బాగా జరిగి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.

2021, ఆగస్టు నెలాఖరులో వరుసగా నాలుగు రాత్రులు మా అక్కకి జ్వరం వస్తుండేది. ఆగస్టు 28న మరీ ఎక్కువగా వచ్చింది. దాంతో అక్కని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. డాక్టర్ ఇంజక్షన్ వేసి టాబ్లెట్లు ఇవ్వకుండా "నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తుంది కాబట్టి ఇంజక్షన్‌కి తగ్గకుంటే బ్లడ్ టెస్ట్ చేయాలి" అన్నారు. నేను వెంటనే, "బాబా! రేపు సాయంత్రానికి అక్కకి జ్వరం తగ్గేలా దయ చూపండి" అని బాబాని వేడుకున్నాను. విచిత్రంగా మధ్యాహ్నం వరకు ఉన్న జ్వరం సాయంత్రం అవుతూనే తగ్గిపోయింది. అంతా బాబా దయ. ఆయన అనుకుంటే కానిది ఏముంది?

ఒకసారి మా అక్క నాలుకపై గుల్లలు వచ్చి చాలా ఇబ్బందిపడింది. బికాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకున్నా పూర్తిగా తగ్గలేదు. రెండు రోజులు తగ్గడం మళ్ళీ రావడం జరుగుతూ నాలుక అంతా ఎర్రగా అయిపొయింది. నేను అక్కతో, "బాబా ఉన్నారుగా తగ్గిపోతుంది" అని చెప్పాను. అప్పుడు అక్క బాబాను వేడుకోగా అయన దయతో ఆ గుల్లలు తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా". 

ఊదీ మహిమ
 
సాయి బందువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను, మావారు, నా అత్తమామలు కలిసి ఉంటున్నాము. మా అత్తమామలు చాలా వయస్సు పైబడినవాళ్ళు. వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఏమీ చేసుకోలేరు. ఒకరోజు నాకు, మావారికి ఒకేసారి నడుము పట్టేసింది. మాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. నేను 'ఎలారా భగవంతుడా?' అని అనుకుంటూ చిటికెడు ఊదీ నీళ్ళలో కలుపుకొని, బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ నీళ్ళు తాగేసాను. మావారికి కూడా ఇచ్చాను. బాబా దయవల్ల నాకు వెంటనే తగ్గిపోయింది. మావారికి మాత్రం తగ్గడానికి 2 రోజులు పట్టినప్పటికీ బాబా దయవల్ల ఎవ్వరికీ ఇబ్బంది కాలేదు. ఇలా బాబా నన్ను కాపాడుతున్నారు. బాబా లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. నేను కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఆ విషయంలో బాబా నాకు రోజూ 'అన్ని సర్దుకుంటాయి' అని మెసేజ్ ఇస్తున్నారు. "నన్ను తొందరగా ఆ సమస్యల నుండి కాపాడండి బాబా".

14 comments:

  1. Om Sai Ram.please bless my son's family.Be with them and give blessings to them.They are going to Singapore and Malaysia.

    ReplyDelete
  2. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki ippinchsndi

    ReplyDelete
  3. Om sai ram, 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  7. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. Om Sai Sri Sai jaya jaya sai

    ReplyDelete
  10. sai madava ki chaduvu patla concentrate prasadinchandi baba.

    ReplyDelete
  11. Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha

    ReplyDelete
  12. Samarth sadguru Sai nath Maharaj ki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo