సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1919వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. శ్రీసాయి అనుగ్రహం

బాబా దయ

సాయి మహారాజ్‌కి పాదాభివందనాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు రేవతి. నేను టీచరుగా పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు మా టీచర్లకి పని సర్దుబాటు జరిగుతుంది. అంటే ఎక్కువ టీచర్లు ఉన్న స్కూల్ నుండి కొంతమందిని తక్కువ టీచర్లు ఉన్న స్కూలుకి డెప్యూటేషన్ వేస్తారు. చివరి పనిదినం నాడు వాళ్ళు వాళ్ళ స్కూలుకి తిరిగి వచ్చేయాలి. ఈ క్రమంలో 2024లో డిప్యూటేషన్ ప్రభావం మా స్కూలులో నాపై పడింది. నాకు వేరే స్కూలుకి వెళ్ళటం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పని పరిస్థితి అయింది. మా మండలంలో ఆఫీసు వర్క్ చాలా బాగా చేసే ఒక టీచర్, యూనియన్ లీడర్ కూడా, అతను నాకు ఫోన్ చేసి, వాళ్ళ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉందని, మీరు మా స్కూల్ కోరితే బాగుంటుందని అన్నారు. నేను బాగా చెప్తానని అతని నమ్మకం. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఆ స్కూలుకి వెళ్ళటం ఇష్టం లేదు. బాబా దయవల్ల నా ముందు ఉండే ఆమె ఆ స్కూలు కోరింది. కానీ అంతలో పని సర్దుబాటు వాయిదా పడింది. తీరా ఆ సమయం వచ్చేసరికి ఆమె మనసు మారి వేరే స్కూల్ కోరుకుంది. దాంతో నేను ఆ స్కూల్ తప్పక కోరాల్సిన పరిస్థితి నాకొచ్చి కౌన్సిలింగ్ ముందురోజు నుంచి నాకు భయం పట్టుకుంది. అప్పుడు నేను, "బాబా! ఏం చేయాలి? నాకు ఆ స్కూలుకి వెళ్లడం ఇష్టం లేదు. నేను ఆ స్కూల్ కోరుకోకపోతే యూనియన్ లీడర్ నాపై కోపం పెట్టుకుంటాడు, నిజానికి అతను సర్వీస్ విషయంలో చాలా సహాయం చేస్తాడు. కానీ వాళ్ల స్టాఫ్ అంటే నాకు భయం. అందుకే వాళ్ల స్కూలుకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు" అని బాబాతో చెప్పుకున్నాను. ఇక కౌన్సిలింగ్ రోజున ఆ యూనియన్ లీడర్ కమ్ టీచర్ ఫోన్‌లో  కౌన్సిలింగ్ చేసి కొన్ని ప్లేస్‌లు చెప్పి కోరుకోమన్నాడు. నేను వేరే లేడీ స్టాఫ్ ఉన్న స్కూల్ కోరుకున్నాను. ఫోన్‌లోనే అతని వాయిస్ మారింది. ఆ క్షణం నేను 'అతను ఎంత ఫీల్ అయ్యారో, నన్ను ఏమైనా ఇబ్బందిపెడతారో' అని ఎంత టెన్షన్ పడ్డానో బాబాకే తెలుసు. నేను బాబాని, 'నా నిర్ణయం కరెక్టేనా, కాదా' అని అడిగితే, 'కరెక్ట్' అని బదులిచ్చారు. అప్పుడు నా మనసు కుదుటపడింది. రెండు రోజుల తర్వాత అతనికి ఫోన్ చేసి నేను వాళ్ల స్కూల్ కోరకపోవటానికి కారణం చెపితే, అతను అర్థం చేసుకున్నారు. ఎప్పుడూ మొహమాటంతో సమస్యలు తెచ్చుకునే నేను బాబా దయవల్ల మొదటిసారి మొహమాటపడకుండా నిర్ణయం తీసుకున్నాను. బాబా ఏం చేసిన మన మంచికే.

వినాయకచవితినాడు మావారికి, పాపకి జ్వరం వచ్చింది. పాపకైతే మరీ ఎక్కువగా రావడంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, అది డెంగ్యూ సీజన్. అందువల్ల "బాబా! పాపకి బ్లడ్ టెస్ట్ అవసరం లేకుండానే జ్వరం తగ్గాల"ని ప్రార్థించాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే బ్లడ్ టెస్టు అవసరం లేదని 5 రోజులకి మందులిచ్చారు. బాబా దయవల్ల రెండు రోజుల్లో పాపకి జ్వరం తగ్గింది. మావారికి కూడా తగ్గింది. "ధన్యవాదాలు బాబా. చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo